కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఊహించని షాక్ తగిలింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) సోనియాకు మరోసారి సమన్లు పంపించింది. ఈ సందర్భంగా జూలై 21న విచారణకు హాజరుకావాల్సిందిగా ఆ నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి సోనియాను ఈడీ గత నెలలోనే విచారించాల్సి ఉండగా.. సోనియా కరోనా వైరస్ బారినపడటంతో విచారణ వాయిదా పడింది. అనారోగ్యం కారణంగా ఆమె విచారణకు హాజరుకాలేదు. విచారణకు హాజరుకాలేనని, మరెప్పుడైనా వస్తానంటూ ఈడీని సోనియా గాంధీ కోరారు. ఆ అభ్యర్థనకు స్పందించిన ఈడీ.. విచారణను వాయిదా వేసింది. ఈ క్రమంలో సోమవారం మళ్లీ సమన్లు పంపింది. జూలై 21న విచారణకు హాజరు కావాలని అధికారులు తెలిపారు. ఇక, ఈ కేసు విచారణలో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని సైతం ఈడీ పలుమార్లు విచారించిన విషయం తెలిసిందే.
ED summons Congress interim President Sonia Gandhi to join investigation in the National Herald Case on July 21: Official sources
— ANI (@ANI) July 11, 2022
(File pic) pic.twitter.com/MlUWVdzLbO
ఇది కూడా చదవండి: ఎమ్మెల్యేలకు భారీ ఆఫర్.. కాషాయ తీర్థం పుచ్చుకుంటే రూ. 50 కోట్లు!
Comments
Please login to add a commentAdd a comment