
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు మరోసారి తాత్కాలిక ఊరట లభించింది. నేషనల్ హెరాల్డ్ కేసు తిరిగి విచారణ ప్రారంభించిన పటియాలా కోర్టు తదుపరి వాదనలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
శనివారం కేసు విచారణకు బెంచ్ ముందుకు రాగా, నంబర్ 18వ తేదీకి వాయిదాస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, మరికొందరు 2012లో దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా నేషనల్ హెరాల్డ్ స్కాం వెలుగులోకి వచ్చింది. సంచలనం రేపిన ఈ స్కాంలో సోనియా, రాహల్‌తోపాటు మరో నలుగురు కాంగ్రెస్ కీలక నేతలపై కూడా విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు జూలై 1న నిందితులను వివరణ కోరగా.. 22న సోనియా, రాహుల్‌లు సమాధానం ఇచ్చిన విషయం తెలిసిందే.
యూపీఏ ప్రభుత్వ హయాంలో అప్పటి అధికార పక్షం దాదాపు 90 కోట్ల రుణాన్ని ది నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేపర్ యాజమాన్య సంస్థ అసోషియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌కు అప్పనంగా కట్టబెట్టిందంటూ సుబ్రహ్మణ్య స్వామి ఆరోపిస్తూ వస్తున్నారు. నిందితులుగా సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ కోశాధికారి మోతీలాల్ వోరా, పార్టీ నేతలు ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దూబె, శామ్ పిట్రోడాల పేర్లను స్వామి పేర్కొన్నారు.