'సోనియా, రాహుల్ జైలుకెళ్లడం ఖాయం' | I will win this case.This is an open and shut case.Sonia,Rahul will be sent to prison | Sakshi
Sakshi News home page

'సోనియా, రాహుల్ జైలుకెళ్లడం ఖాయం'

Published Sat, Dec 19 2015 4:20 PM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

'సోనియా, రాహుల్ జైలుకెళ్లడం ఖాయం' - Sakshi

'సోనియా, రాహుల్ జైలుకెళ్లడం ఖాయం'

న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసులో విజయం తనదేనని బీజేపీ నేత సుబ్రమణ్యం స్వామి వ్యాఖ్యానించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన శనివారమిక్కడ అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్కు బెయిల్ మంజూరు అనంతరం సుబ్రమణ్యస్వామి మీడియాతో మాట్లాడారు.

 

అవినీతిపై తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కేసు గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఎప్పుడూ చర్చించలేదని సుబ్రమణ్యంస్వామి తెలిపారు. కేసుకు సంబంధించి ఎలాంటి కక్ష సాధింపు చర్య లేదని ఆయన అన్నారు. కాగా కోర్టు సోనియా, రాహుల్కు బెయిల్ మంజూరు చేయటాన్ని సుబ్రమణ్యం స్వామి వ్యతిరేకించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement