
సాక్షి, న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో టీకాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో భాగంగా షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డికి నోటీసులు అందినట్టు సమాచారం. ఈ నోటీసులు కాంగ్రెస్ నేతలను అక్టోబర్ 10న విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
కాగా, ఈ కేసులో ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీని ఈడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. మరోవైపు.. నోటీసులపై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ స్పందించారు. శుక్రవారం షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడుతూ.. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదు. నోటీసులు వస్తే మాత్రం విచారణకు హాజరవుతాను అని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment