
సోనియా రాహుల్ హాజిర్ హో
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇద్దరూ నేషనల్ హెరాల్డ్ ఆస్తుల అమ్మకం కేసులో తొలిసారి కోర్టు మెట్లు ఎక్కబోతున్నారు. దీనిపై దేశవ్యాప్తంగా అన్ని వర్గాల్లో ఆసక్తి నెలకొంది. సోషల్ మీడియాలో కూడా దీనిపై ఇప్పటికే వేలాది కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ట్విట్టర్ ట్రెండింగ్ టాపిక్స్‌లో 'సోనియా రాహుల్ హాజిర్ హో' అనేది టాప్ ట్రెండింగ్ టాపిక్ అయ్యింది.
సుబ్రమణ్యం స్వామిని అడ్డం పెట్టుకుని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తమ మీద కక్ష సాధించాలని చూస్తోందని కాంగ్రెస్ నేతలు మండి పడుతుండగా, తాను కేవలం అవినీతిని అడ్డుకోడానికే కేసు వేశాను తప్ప.. ఇందులో బీజేపీకి ఎలాంటి ప్రమేయం లేదని స్వామి చెబుతున్నారు. అయినా కాంగ్రెస్ పార్టీలో బాగా ఖరీదైన ఐదుగురు న్యాయవాదులు ఉండగా వాళ్లకు భయం ఎందుకని ఆయన ప్రశ్నించారు. సోషల్ మీడియాలో రెండు పార్టీలకు అనుకూలంగా, వ్యతిరేకంగా కామెంట్లు విపరీతంగా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే 'సోనియా రాహుల్ హాజిర్ హో' హ్యాష్ ట్యాగ్ టాప్ ట్రెండ్‌గా నిలిచింది.