Tihar
-
తీహార్ జైలులో ఖైదీల ఘర్షణ.. ఇద్దరికి గాయాలు
ఢిల్లీలోని తీహార్ జైలులో మరోమారు గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఖైదీల మధ్య మరోసారి ఘర్షణ చెలరేగింది. ఈ ఘటనలో ఇద్దరు ఖైదీలు గాయపడ్డారు. జైలులోని ఫోన్ రూమ్‌లో ఈ గొడవ జరిగింది. లవ్లీ, లావిష్ అనే ఇద్దరు ఖైదీలు గాయపడ్డారు.వివరాల్లోకి వెళితే లోకేష్ అనే ఖైదీ ఈ దాడికి పాల్పడ్డాడని సమాచారం. లోకేష్ సోదరుని హత్య కేసులో లవ్లీ, లావిష్ జైలులో ఉన్నారు. జైలులోనే దాడికి ప్లాన్ చేసిన లోకేష్ తన సహచరులు హిమాన్ష్, అభిషేక్‌ల సాయం తీసుకున్నాడు. అవకాశం చూసుకున్న లోకేష్, అతని సహచరులు కలసి లవ్లీ, లావిష్‌లపై దాడి చేశారు. గాయపడిన ఖైదీలిద్దరినీ జైలు అధికారులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఒక ఖైదీని ఆస్పత్రి నుంచి తిరిగి జైలుకు తీసుకువచ్చారు. మరొక ఖైదీ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తీహార్ జైలులో గతంలోనూ ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. -
ఒకసారి మంత్రి కుమారుడు, మరోసారి మనుమడు.. మధ్యలో తారలకు లేఖలు.. బ్లఫ్ మాస్టర్ స్టోరీ!
అతను మోసపూరితంగా రూ. 200 కోట్లు కొల్లగొట్టాడు. తీహార్ జైలులో ఉంటూ కూడా తన హవాను చాటుతున్నాడు. పలువులు హీరోయిన్లను తన వలలో బంధించాడు. లంచాలిచ్చి ప్రభుత్వ ఉద్యోగులను కొనేస్తాడనే ఆరోపణలున్నాయి. వీటిపై కించిత్తు కూడా స్పందించనట్టు కనిపిస్తాడు. ఈ రోజుకీ జైలు గోడల మధ్య ఉంటూనే తన ప్రియురాలికి ఉత్తరం రాశాడు.. అతను మరెవరో కాదు.. దేశంలో అతిపెద్ద మోసగాని(బ్లఫ్ మాస్టర్)గా పేరున్న సుఖేష్ చంద్రశేఖర్. ఇప్పుడు సుఖేష్ బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు రాసిన ప్రేమలేఖ చర్చనీయాంశంగా మారింది. నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌పై అమితమైన ప్రేమ హిందీ బాషలో రాసిన ఈ ఉత్తరంలో సుఖేష్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌పై తనకున్న ప్రేమను వ్యక్తం చేశాడు. ‘జీవితంలోకి ఎందరో వస్తుంటారు. అయితే కొందరు మాత్రమే మనసులో నిలిచిపోతుంటారు. వారిలో మీరొకరు’ అని ఆ ఉత్తరంలో రాశాడు. దీనికి ముందు సుఖేష్ మరో నటి నోరా ఫతేహీపై కూడా ఇదేవిధంగా తన ప్రేమను వ్యక్తం చేశాడు. 2015లో నటి లీనా మారియాను వివాహం చేసుకున్న సుఖేష్ చంద్రశేఖర్ భార్యతో కలసి మోసాలకు పాల్పడేవాడు. రాజకీయ నేత కుమారుడినని నమ్మబలికి.. సుఖేష్ చంద్రశేఖర్ బెంగళూరు వాస్తవ్యుడు. తన 17 ఏళ్ల వయసు నుంచే మోసాలకు పాల్పడుతూ వస్తున్నాడు. సుఖేష్ బెంగళూరులోని బిషప్ కాటన్ బాయిస్ స్కూలులో ప్రాథమిక విద్యను పూర్తిచేశాడు. అనంతరం మధురై యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్ చేశాడు. ఆ తరువాతి నుంచి మోసాల్లో మునిగితేలాడు. బెంగళూరుకు చెందిన ఒక కుటుంబం నుంచి సుఖేష్ కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు. తాను ఒక పెద్ద రాజకీయ నేత కుమారుడినని చెప్పి, వారికి కావలిసిన పనులు చేయిస్తానని నమ్మబలికి, వారి నుంచి డబ్బులు లూటీ చేశాడు. ఈ ఘటనలో పోలీసులు అతనిని అరెస్టు చేశారు. అయినా సుఖేష్ తన తీరు మార్చుకోకుండా మోసాలు కొనసాగిస్తూ వచ్చాడు. మంత్రి మనుమడినని నమ్మించి.. ఈ ఉదంతం అనంతరం సుఖేష్ తాను ఒక మంత్రి మనుమడినని చెప్పి, కొంతమంది దగ్గర వారి పనులు చేయిస్తానని చెప్పి వారి నుంచి డబ్బులు వసూలు చేశాడు. చిన్నప్పటి నుంచి ధనవంతుడిని కావాలని తాపత్రయపడే సుఖేష్ లగ్జరీ లైఫ్ కోసం మోసపూరిత సామ్రాజ్యాన్ని ఏర్పరుచుకున్నాడు. ఈ నేపధ్యంలోనే 2017లో సుఖేష్ మరోమారు అరెస్టయ్యాడు. పార్టీ ఎన్నికల గుర్తు కేటాయిస్తానని చెబుతూ కొందరు నేతలను మోసగించాడు. ఈ కేసులో పోలీసులు అతనిని ఒక ఫైవ్‌స్టార్ హోటల్లో అరెస్టు చేశారు. అతనిని జైలు నుంచి విడిపిస్తానని.. ఆ తరువాత కూడా సుఖేష్ చంద్రశేఖర్ మోసాలు కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. బెయిలుపై బయటకు వచ్చిన సుఖేష్ ఫార్టీస్ హెల్త్‌కేర్‌కు చెందిన ప్రొఫెసర్ శివిందర్ మోహన్ సింగ్ భార్య అదితి సింగ్‌ను మోసగించాడు. ఆ సమయంలో ఏదో కేసులో శివిందర్ సింగ్ జైలులో ఉన్నాడు. అతనిని జైలు నుంచి విడిపిస్తానని చెప్పి అదితి సింగ్ నుంచి రూ. 200 కోట్లు కొల్లగొట్టాడు. ఈ కేసులో సుఖేష్ చంద్రశేఖర్‌ను పోలీసులు మరోమారు అరెస్టు చేశారు. తీహార్ జైలులో ఊచలు లెక్కబెడుతూ.. ఎన్నోసార్లు అరెస్టయినా సుఖేష్ చంద్రశేఖర్ తన తీరుతెన్నులను మార్చుకోలేదు. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ అక్కడ కూడా విలావంతమైన జీవితాన్ని గడుపుతున్నాడనే ఆరోపణలున్నాయి. ఇటీవలే బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఆమె పుట్టినరోజు సందర్భంగా ప్రేమ లేఖ రాశాడు. దీనికిముందు ఈస్టర్ రోజున కూడా జాక్వెలిన్‌కు లవ్ లెటర్ పంపాడు. ఇది కూడా చదవండి: అందం.. నేర సామ్రాజ్యంలోకి అడుగిడితే.. లేడీ డాన్ లవ్ స్టోరీస్! -
జైల్లో ఉన్నా.. ఆ డాన్‌ను లేపేస్తామంటున్నారు?
న్యూఢిల్లీ: గత ఏడాది అక్టోబర్‌లో ఇండోనేషియాలో పట్టుబడ్డ అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ ప్రస్తుతం తీహార్ జైలులో అత్యంత భద్రత మధ్య ఉన్నాడు. అయినా అతడికి చావు బెదిరింపులు ఆగడం లేదు. ఛోటా రాజన్‌ను చంపేస్తామంటూ తాజాగా దావూద్ ఇబ్రహీం నమ్మిన బంటు, గ్యాంగ్‌స్టర్ ఛోటా షకీల్ తీహార్ జైలు సీనియర్ అధికారికి ఎస్సెమ్మెస్ చేశాడు. ఈ బెదిరింపు మెసేజ్ నేరుగా ఛోటా షకీల్ మొబైల్ ఫోన్ నుంచే వచ్చినట్టు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజన్‌కు మంరిత అదనపు భద్రత కల్పించాలని జైలు అధికారులు నిర్ణయించారు. 971504265138 సెల్ నంబర్ నుంచి తీహార్ జైలు లా అధికారి సునీల్ గుప్తాకు ఇటీవల ఓ ఎస్సెమ్మెస్ వచ్చింది. ఛోటా రాజన్‌ను అతిత్వరలోనే అంతం చేస్తామని ఆ ఎస్సెమ్మెస్ బెదిరించింది. ఆ వెంటనే తీహార్ జైలు ల్యాండ్‌లైన్ నంబర్ ఓ కాల్ కూడా వచ్చింది. అందులోనూ రాజన్ ను చంపేస్తామని బెదిరించారు. ఈ నేపథ్యంలో రాజన్‌కు మరింత భద్రత పెంచిన జైలు సిబ్బంది.. ఈ బెదిరింపుల గురించి పోలీసులకు సమాచారమిచ్చారు. -
జైల్లో గ్యాంగ్‌వార్: ఖైదీ మృతి
న్యూఢిల్లీ: తీహార్ సెంట్రల్ జైల్లో గ్యాంగ్‌వార్ మరోసారి బహిర్గతమైంది. బుధవారం రాత్రి ఖైదీల ఘర్షణలో ఒక ఖైదీ హతమయ్యాడు. పోలీసుల సమాచారం ప్రకారం జైలు నం. 1 లో రెండు గ్రూపుల మధ్య తగదాలో తీవ్రంగా గాయపడిన రవీంద్ర అనే ఖైదీ డీడీయూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. వినోద్, రిహాజ్, అజయ్, సుశీల్, కిరణ్ అనే అయిదుగురు ఖైదీలో రవీంద్రపై దాడికి దిగి, పదునైన స్పూన్‌తో ఎటాక్ చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో జైలు ఆవరణలో ఉద్రిక్తత నెలకొంది. భయోత్సాతం సృష్టించిన ఈ ఘటనపై తీహార్ జైలు అధికారులు విచారణకు ఆదేశించారు. -
తాటకిని ఎందుకు తీహార్ జైలుకు పంపించరూ!
తాటకిని ఎందుకు తీహార్ జైలుకు ఎందుకు పంపించరూ అంటూ బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి ఓ కోడ్ ను ఉపయోగించి ట్విటర్ లో ఓ సందేశాన్ని ట్వీట్ చేశారు. తాటకి అంటూ పరోక్షంగా సుబ్రమణ్యం స్వామి కోడ్ భాషలో సోనియాగాంధీని ఉద్దేశించి ట్విట్ చేశారు. ఎలాంటి పదవిలో లేకుండానే నేషనల్ హెరాల్డ్ కేసులో చాలా చేస్తున్నాను. అధికారంలో ఉండి టీడీకే (తాటకి)ని తీహార్ జైలుకు ఎందుకు పంపించరూ అంటే ట్వీట్ చేశారు. భారత మొట్టమొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ప్రారంభించిన నేషనల్ హెరాల్డ్ పత్రిక సంబంధించిన నిధుల దుర్వినియోగం చేశారంటూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై సుబ్రమణ్యస్వామి కేసు నమోదు చేశారు. ఈకేసులో గురువారం సోనియాగాంధీ, రాహుల్ లకు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సోనియా గాంధీపై సుబ్రమణ్యం పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కోర్టుకు హాజరైతే సోనియా, రాహుల్ లు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని.. అలాగే వారి పాస్ పోర్టులను కోర్టుకు దాఖలు చేయాల్సి ఉంటుందని మరో ట్వీట్ లో వెల్లడించారు. If I can do this in NH case without power of office why can't those with power prosecute TDK and send her to Tihar? — Subramanian Swamy (@Swamy39) June 26, 2014 Once they appear they will have to take bail and deposit passport — Subramanian Swamy (@Swamy39) June 26, 2014 TDK and son summoned as Accused on August 7th to face trial — Subramanian Swamy (@Swamy39) June 26, 2014 Follow @sakshinews -
తీహార్ జైలుకు ఖైదీలను తరలించేందుకు చర్యలు
యానాం టౌన్, న్యూస్‌లైన్ : యానాం ప్రత్యేక సబ్‌జైలు, పుదుచ్చేరి కాలాపేట సెంట్రల్ జైల్లో ఉన్న కరడుగట్టిన ఖైదీలను తమిళనాడులోని తిరుచ్చి జైలుకు లేదా తీహార్ జైలుకు పంపేందుకు పుదుచ్చేరి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తమిళనాడు ప్రభుత్వంతో పుదుచ్చేరి ఉన్నతాధికారులు దీనిపై సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. తిరుచ్చి జైలుకు తరలించేందుకు వీలులేని పక్షంలో తీహార్ జైలుకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పుదుచ్చేరిలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం ఖైదీల తరలింపుకు చర్యలు చేపట్టింది. ఆగస్ట్ 29న యానాం ప్రత్యేక సబ్ జైలులోకి కొందరు దుండగులు ఒక జీవిత ఖైదీని హతమార్చే ఉద్దేశంతో చొరబడిన విషయం విదితమే. పోలీసులు చాకచక్యంగా కొన్ని గంటలలోనే 13 మందిని పట్టుకున్నారు. వీరిని పుదుచ్చేరి కాలాపేట కేంద్ర కారాగారానికి తరలించారు. దాడికి సూత్రధారిగా భావిస్తున్న మరో వ్యక్తిని కర్ణాటకలో పట్టుకున్నారు. యానాం సబ్‌జైల్‌పై దాడి నేపథ్యంలో ఈ జైలులో ఉన్న కరడుగట్టిన ముగ్గురు జీవిత ఖైదీలను వేరే ప్రాంతానికి తరలించాలని యానాం ప్రజలు కోరారు. వీరు ఇక్కడే ఉంటే యానాం ప్రశాంతవాతావరణానికి భంగం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేసారు. యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు దీనిపై పుదుచ్చేరి ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడంతో నెలాఖరులోగా వీరిని తరలిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. పుదుచ్చేరిలో శాంతి భద్రతలు దిగజారడంపై లెఫ్టినెంట్ గవర్నర్ వీరేంద్ర కటారియా ప్రభుత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఆయన స్వయంగా కాలాపేట కేంద్రకారాగారాన్ని తనిఖీ చేశారు. ఖైదీల వద్ద సెల్ఫోన్లు ఉండటాన్ని గుర్తించిన ఆయన భద్రత కట్టుదిట్టం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ జైల్లోని కొందరు ఖైదీల ఆగడాలు మితిమీరుతున్నందున వీరిని తీహార్ జైలుకు తరలించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వీరితో పాటు యానాం సబ్జైల్లో ఉన్న ఇద్దరు జీవిత ఖైదీలను కూడా తరలించడానికి నిర్ణయించింది.