
అహ్మదాబాద్: అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేషనల్ హెరాల్డ్ పత్రికపై రూ.5,000 కోట్ల పరువునష్టం దావాను దాఖలు చేసింది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం విషయంలో నేషనల్ హెరాల్డ్‌లో ప్రచురితమైన ఓ కథనం తమ కంపెనీపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా, చైర్మన్ అనిల్ అంబానీ పరువుకు నష్టం కలిగించేలా ఉందని చెప్పింది. అలాగే రాఫెల్ ఫైటర్ జెట్ల కొనుగోలు విషయంలో అసత్య ఆరోపణలు చేశారంటూ గుజరాత్ కాంగ్రెస్ నేత శక్తిసిన్హ్ గోహిల్‌పై మరో రూ.5,000 కోట్ల పరువునష్టం దావాను రిలయన్స్ గ్రూప్ వేసింది. ఈ సందర్భంగా కోర్టులో రిలయన్స్ న్యాయవాది మాట్లాడుతూ.. ‘రాఫెల్ ఒప్పందం ప్రకటించడానికి 10 రోజులకు ముందు అనిల్ కంపెనీ పెట్టారు’ అంటూ నేషనల్ హెరాల్డ్‌లో తప్పుడు, అసత్య కథనం రాశారని తెలిపారు. గోహిల్ కూడా పలుమార్లు తామేదో అక్రమంగా లాభపడినట్లు విమర్శలు చేశారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment