
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాకు ఊరట!
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ పత్రిక నిధుల దుర్వినియోగం కేసులో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీలకు ఊరట లభించనుంది. దుర్వినియోగానికి బలమైన సాక్ష్యాలు లేని కారణంగా కేసు మూసేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) భావిస్తోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
‘నేషనల్ హెరాల్డ్’ ఆంగ్ల దినపత్రిక నష్టాలతో 2008లో మూతపడింది. పత్రికకు చెందిన రూ.2,000 కోట్లను దుర్వినియోగం చేశారంటూ సోనియా, రాహుల్‌లపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి కేసు వేశారు. దీనిపై సోనియా హైకోర్టుకు వెళ్లడంతో ఆగస్టులో ఈడీ సమన్లపై కోర్టు స్టే విధించింది.