న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో ఏఐసీసీ అధ్యక్షురాలు అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టుకు హాజరుకానున్న నేపథ్యంలో ఆ కోర్టు చుట్టూ భారీ భద్రతను ఏర్పాటుచేశారు. ఆ ప్రాంతాన్ని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.
సుమారు 700 మంది సెక్యూరిటీ సిబ్బందిని మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. చుట్టుపక్కల ప్రదేశాలను పరిశీలించేందుకు సీసీటీవీ కెమెరాలను, ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేశారు.
కాగా బీజేపీ నేత సుబ్రమణ్యం స్వామి దాఖలు చేసిన నేషనల్ హెరాల్డ్ కేసు జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కూడా దీనిపై దుమారం కొనసాగుతోంది.