అనంతపురం ఎడ్యుకేషన్ : పదో తరగతి విద్యార్థులకు సంబంధించి హాల్ టికెట్లలో విద్యార్థి పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ తదితర వాటిల్లో తప్పులను సరిదిద్దుకునేందకు చివరి అవకాశం కల్పించినట్లు డీఈఓ లక్ష్మీనారాయణ, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. బోర్డు నుంచి వచ్చిన కంప్యూటర్ ఎన్‌ఆర్‌లో తప్పులు సరిచేసి సంబంధిత పాఠశాల హెచ్‌ఎం సంతకం చేయించి వాటిని ఈ నెల 28లోగా ఎస్. వరలక్ష్మి, డైరెక్టర్ ఆఫ్ ప్రభుత్వ పరీక్షలు, చాపెల్‌రోడ్డు, నాంపల్లి, హైదరాబాద్ చిరునామాకు పంపాలని సూచించారు. ఫొటోలు మార్పులు పడిన వారు డీఈఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.