మహమ్మారి కాలంలో చదువు సమస్య | Kids Struggling With Online Learning Classes | Sakshi
Sakshi News home page

మహమ్మారి కాలంలో చదువు సమస్య

Published Wed, Jul 7 2021 1:14 AM | Last Updated on Wed, Jul 7 2021 1:27 AM

Kids Struggling With Online Learning Classes - Sakshi

మహమ్మారి మూలాన, విద్యార్థులు, ఉపాధ్యాయులు భౌతికంగా తరగతి గదిలో కలుసుకొనే అవకాశమే లేకుండా పోయింది. అయినప్పటికీ విద్యాబోధన ఏదోలా ఆన్‌లైన్‌లో కొనసాగుతోంది. అయితే ఈ విషయంలో ఇందులో భాగ స్వాములైన అన్ని పక్షాలూ తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నాయి. భౌతిక తరగతి గదిలో విద్యార్థులు ప్రాథమిక పాఠశాల నుండి మధ్యస్థ పాఠశాలకు వచ్చేసరికి రాయడం, మాట్లాడటం, చదవడం, వినడం వంటి నైపుణ్యా లను ఒంటబట్టించుకొనే వారు. విద్యతో పాటు శారీరక శ్రమ, ఆటల పోటీలు, సాంస్కృతిక ఉత్సవాలు, విహార యాత్రలు విద్యార్థులలో జీవిత నైపుణ్యాలను పెంపొందించేవి. వీటికి ఇప్పుడు ఎంతమాత్రమూ వీలు లేకుండా పోయింది.

ఆన్‌లైన్‌ విద్య అందరికీ అందుబాటులో లేకపోయినా కొంత వరకు విద్యను కొనసాగించడానికి వెసులుబాటు కల్పించింది. దీని మూలంగా ఇళ్లే పాఠశాలగా, తల్లిదండ్రులే ఉపాధ్యా యులుగా అవతారం ఎత్తారు. అయినప్పటికీ విద్యార్థి నైపుణ్య శిక్షణలో అవాంతరాలు తలెత్తుతున్నాయి. ఐదు నుండి పద కొండేళ్ల వయసు గల పిల్లలు నీలిరంగు తెరలకు అతుక్కు పోతూ వివిధ ఆరోగ్య రుగ్మతలను కొనితెచ్చుకొంటున్నారు. కౌమార వయసు విద్యార్థులు కూడా పాఠాలను అర్థం చేసుకోవడంలో తీవ్రంగా కష్టపడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సాధారణ తరగతులు నిర్వహించడానికే కనీస సౌకర్యాలు లేవు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఫోన్లు, ట్యాబ్‌లు, ఇంటర్నెట్‌ కనెక్షన్లు వంటి స్మార్ట్‌ గాడ్జెట్‌లను కొనుగోలు చేయలేని దయ నీయ స్థితి. ఇంకా కొందరు విద్యార్థులు మిడ్‌–డే భోజన కార్య క్రమంలో భాగంగా పెట్టే ఒక్క పూట భోజనం కోల్పోయారు.

తరగతి గదిలో విద్యార్థుల వైఖరులు, ప్రవర్తనలను గమ నిస్తూ వారిని సక్రమమైన దారిలో మార్గనిర్దేశం చేసి విద్యార్థు లను సామాజిక బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు ముఖ్య భూమిక పోషిస్తారు. వాస్తవానికి, చాలా మంది టీచర్లు నల్లబల్ల, సుద్దముక్కను ఉపయోగించి బోధించే నైపుణ్యం గలవారు. ఆన్‌లైన్‌ టీచింగ్‌ మోడ్‌ చాలా మంది ఉపాద్యాయులకు కొత్తది. ప్రత్యేకించి కంటెంట్‌ను సిద్ధం చేయడానికి, కంటెంట్‌ను పంచుకోవడానికి, ఉపన్యాసం ఇవ్వడానికి, మదిం పులను, మూల్యాంకనాలను రూపొందించడానికి  సీనియర్‌ ఉపాధ్యాయులు చాలా కష్టపడుతున్నారు. ఆన్‌లైన్‌ బోధనలో  విద్యార్థి పనితీరును అంచనా వేయడం వంటి వాటికి మాత్రమే టీచర్ల పాత్ర పరిమితమైంది. మెంటర్స్, గైడ్స్‌ మొదలైన ఇతర ముఖ్య పాత్రలను నిర్వర్తించలేకపోతున్నారు.  

తల్లిదండ్రులు ఆన్‌లైన్‌ పాఠశాలల కంటే సంప్రదాయ పాఠ శాల విద్యావిధానంలో సంతోషంగా ఉండేవారు. పిల్లలు రోజుకు ఎనిమిది గంటలు ఇంటి నుండి దూరంగా ఉండేవారు. దీనికి తోడుగా, కొంతమంది తల్లిదండ్రులు వారిని స్పోర్ట్స్, ఫిజికల్‌ ఫిట్నెస్, డ్రాయింగ్, సంగీతం మొదలైన క్లాసులలో చేర్పించే వారు. ఈ మహమ్మారి ప్రతి విద్యార్థినీ ఇళ్ళలోనే ఉండేలా కట్టడి చేసింది. పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగం చేసే తల్లిదండ్రులు పిల్లల ఆన్‌లైన్‌ తరగతులు, హోంవర్క్, అసైన్‌మెంట్‌లు, కనెక్టివిటీ సమస్యలతో సతమతమవుతున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా, చాలామంది తల్లిదండ్రులు తమ ఉద్యోగాలను, ఉపాధిని కోల్పో యారు. ఫలితంగా అనేక మంది పిల్లల విద్య కొనసాగింపు ప్రశ్నార్థకమైంది. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఫార్మసీ షాపులు, కూరగాయల మార్కెట్లు, కిరాణా షాపులు, గాజు దుకాణాలు మొదలైన వ్యాపారాలలో సహాయం కోసం తీసుకువెళ్తున్నారు. 

మిగులు నగదులో ఉన్న పాఠశాలలు మహమ్మారి సంక్షో భాన్ని ఎదుర్కొన్నాయి. బడ్జెట్‌ పాఠశాలలను నిర్వహించే నిర్వా హకులు మాత్రం అనేక ఆటుపోటులను ఎదుర్కోవడం వలన పాఠశాల నిర్వహణ కష్టసాధ్యం అవుతోంది. ముఖ్యంగా ఈ పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు రుసుములు చెల్లించడంలో విఫలమవ్వటం వలన నగదు సంక్షోభానికి దారితీసింది. బోధన, బోధనేతర సిబ్బంది జీతాలను చెల్లించలేక పోయారు. బడ్జెట్‌ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు సగం జీతాలు లేదా జీతాలు లేకుండా పనిచేస్తున్నారు. వారిలో కొందరు బోధనా వృత్తిని వదిలి వేరొక వృత్తిని చేపట్టారు. అను భవజ్ఞులైన ఉపాధ్యాయులు తిరిగి విద్యారంగంలోకి రాకపో వచ్చు. ఇది విద్యావ్యవస్థకు భారీ నష్టాన్ని కలిగించే అవకాశం లేకపోలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల పట్ల శ్రద్ధ వహించి ఒక బ్లూప్రింట్‌ రూపకల్పన చేయాలి. అధికారిక తర గతి గది విద్యను పొందకుండా విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును మహమ్మారి నాశనం చేసింది. ఇది వారి నైపుణ్యాలు, వైఖరులు, సామాజిక ప్రవర్తనను కూడా ప్రభావితం చేస్తుంది. ఒక ప్రధాన, బాధ్యతాయుతమైన వాటాదారుగా ప్రభుత్వం దేశంలోని ప్రతి బిడ్డకు సమాన విద్యను పొందే ప్రణాళికను రూపొందించాలి.

డాక్టర్‌ మైలవరం చంద్రశేఖర్‌ గౌడ్‌
వ్యాసకర్త సహాయ ఆచార్యులు,
ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఇంటర్‌ప్రైజ్, హైదరాబాద్‌ ‘ 81870 56918 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement