
ఇక ఆ మెసేజ్ లను ఎడిట్ చేసుకోవచ్చట
100 కోట్ల యాక్టివ్ యూజర్లున్న వాట్సాప్ గాని, దాన్ని ప్రత్యర్థి స్థానంలో ఉన్న టెలిగ్రాం కు గాని ఇప్పటివరకూ పంపించిన మెసేజ్ లను ఎడిట్ చేసుకునే సౌకర్యం అందుబాటులో లేదు. అయితే ఎలాగైనా వాట్సాప్ ను అధిగమించి యూజర్లను ఆకట్టుకోవాలని టెలిగ్రాం నిర్ణయించుకుంది. ఇప్పటివరకూ అందుబాటులో లేని మెసేజ్ ఎడిటింగ్ ఆప్షన్ ను యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. నెలకు 1,000లక్షల యూజర్లున్న టెలిగ్రాం, దాన్ని యూజర్లకి మెసేజ్ లను పంపించిన తర్వాత దానిలో ఏమైనా తప్పులో దొర్లితే ఎడిట్ చేసుకునే సౌకర్యం నేటి నుంచి కల్పించనున్నట్టు పేర్కొంది.
అన్నీ టెలిగ్రాం చాట్స్ గ్రూప్స్, వన్ టూ వన్ సంభాషణల్లో మెసేజ్ లకు ఈ ఎడిటింగ్ ఆప్షన్ ను అందిస్తున్నట్టు తన బ్లాగ్ లో పేర్కొంది. పంపించిన మెసేజ్ ను ఎడిట్ చేయాలనుకున్నప్పుడు మెసేజ్ ను అలాగే హోల్డ్ చేసి పట్టుకుని ఎడిట్ ను ప్రెస్ చేయాలి. ఒకవేళ డెస్క్ టాప్ లో టెలిగ్రాం వాడుతున్నప్పుడు, పైన యారో బటన్ ను ప్రెస్ చేసి, చివరి మెసేజ్ ను ఎడిట్ చేసుకోవచ్చని తెలిపింది. నెలకు 1,000లక్షల యాక్లివ్ యూజర్లను టెలిగ్రాం కలిగిఉందని కంపెనీ ఇటీవలే ప్రకటించింది. 3,50,000మంది కొత్త యూజర్లు ప్రతిరోజు టెలిగ్రాంలో చేరుతున్నారని తెలిపింది. రోజుకి 1500కోట్ల మెసేజ్ ల సంభాషణను టెలిగ్రాం కలిగి ఉంది. ఈ కొత్త ఫీచర్లతో టెలిగ్రాంకు యూజర్ల సంఖ్య పెరుగుతుందని కంపెనీ ఆశిస్తోంది.