మోదీ రాజ్యం.. కుబేరుల భోజ్యం | modi government favous corporate sections, suravaram writes | Sakshi
Sakshi News home page

మోదీ రాజ్యం.. కుబేరుల భోజ్యం

Published Sat, May 23 2015 12:58 AM | Last Updated on Mon, Jul 29 2019 7:41 PM

మోదీ రాజ్యం.. కుబేరుల భోజ్యం - Sakshi

మోదీ రాజ్యం.. కుబేరుల భోజ్యం

నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ నెల 26 నాటికి ఏడాది పూర్తవుతుంది. ఈ తొలి ఏడాది పాలనా కాలంలో అది ప్రజా వ్యతిరేకమైనదిగా, కార్మిక వర్గానికి, రైతాంగానికి వ్యతిరేకమైనదిగా, కార్పొరేట్, ధనికవర్గాలకు అనుకూలమైనదిగా అత్యంత సిగ్గుచేటైన పేరు సంపాదించుకుంది.  కుల, మత, ప్రాంతీయతల ప్రాతిపదికపై ప్రజలను చీల్చి సెక్యులర్, సోషలిస్టు, సార్వభౌమ రాజ్యమైన మన భారత దేశ చరిత్రను వెనక్కు మరల్చాలనే దుష్ట పన్నాగాలు సైతం ఈ ఏడాది ఎన్డీఏ దుష్పరిపాలన ఘనతే. ఎన్డీఏ ప్రభుత్వం చేతల ఆధారంగానే దాని ఏడాది పని తీరును అంచనా వేద్దాం.

కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్పొ రేట్ సంస్థలకు ఆరు లక్షల కోట్ల రూపాయలు రాయితీలుగా కట్టబెట్టిందం టేనే ఇది కార్పొరేట్ సంస్థలకు, ధనవంతులకు ప్రియమైన ప్రభుత్వమ నేది స్పష్టమే. నిజానికి పుట్టుక నుంచీ ఆరెస్సెస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్), దాని అనుబంధ సంస్థలు, రాజకీయ విభాగమైన ఒకప్పటి జనసంఘ్, నేటి బీజేపీ హిందువుల్లోని పేదవారితోసహా పేద ప్రజానీకానికి అను కూలమైనవి కావు. దాని మితవాద భావజాలంలో పేదలు, శ్రామిక ప్రజల పట్ల ఎలాంటి పట్టింపూ ఎన్నడూ చూసి ఎరుగం. ఒకే ఒక్క ఈ-వేలంలోనే బొగ్గు గనులను ఏకధాటిగా 30 ఏళ్లు లీజుకు ఇచ్చేయడం కోసం మోదీ ప్రభుత్వం అహోరా త్రాలు పనిచేసింది.

ఈ ప్రభుత్వ మొదటి పూర్తి స్థాయి బడ్టెట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కార్పొరేట్ గుత్త సంస్థలను నెత్తినెక్కించుకోవడంలో ఏ మాత్రం తటపటాయింపు చూపలేదు. కార్పొరేట్ పన్ను బేసిక్ రేట్‌ను 30 శాతం నుంచి 25 శాతానికి నిస్సిగ్గుగా తగ్గించారు. పేద, మధ్య తరగతుల పట్ల మొసలి కన్నీళ్లు కారుస్తూనే అదానీ, అంబానీ తదితర కార్పొరేట్ గుత్తాధిప తులకు అసాధారణ రాయితీలను విస్తరించారు. ఏడాది పూర్తి కాకముందే మోదీ బండారం పూర్తిగా బట్టబయలైంది! సంప న్నులపై మోజుతో సంపద పన్నును సైతం రద్దు చేసిపారేశారు. ఫలితంగా జనాభాలో 90 శాతం ప్రజలు మూల్యం చెల్లించాల్సి వస్తోంది. కాబట్టే ఈ ఏడాది మోదీ పాలనలో ధనవం తులు మరింత ధనవంతులయ్యారు. కొన్ని కార్పొరేట్ సంస్థలు ప్రత్యేకించి అదానీకి చెందినవి అత్యంత వేగంగా అభివృద్ధి చెందాయి.

పచ్చి ప్రతీఘాతుక ధోరణులు, విచ్ఛిన్నకర చర్యలు
గత సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాక ఎంతోకాలం కాకుండానే సంఘ్ పరివార్, దాని అనుబంధ సంస్థలు ఒకప్పటి తమ రహస్య ఎజెండాను బహిరంగం చేశాయి. ఏడాది గడిచేసరికే ప్రజలు మోదీ ప్రభుత్వంపై ఏ ఆశలు పెట్టుకుని గెలిపించారో అవన్నీ ఒక్కొక్కటిగా వమ్ము చేస్తూ వచ్చారు. సార్వ త్రిక ఎన్నికల్లో లోక్‌సభలో తమ పార్టీకి ఒంటరిగా ఆధిపత్యం లభించడం బీజేపీని సైతం ఆశ్చర్యంలో ముంచింది, కింది నుంచి పైవరకు ఆ పార్టీ నేతల్లో అహంకారాన్ని అతిశయింపజేసింది. ఏదేమైనా బీజేపీ, ఆరెస్సెస్, దాని అనుబంధ సంస్థలు ఏవీ తమ నేతలు అహంకారంతో మైనారిటీలను దుర్భాషలాడటాన్ని, వారిపై విరుచుకుపడటాన్ని మానేలా చేయలేకపో యాయి.

విశ్వహిందూ పరిషత్ చేపట్టిన ‘ఘర్ వాపసీ’ నినాదం, అమాయక ముస్లిం యువతను లక్ష్యం చేసుకుని సాగించిన ‘లవ్ జిహాద్’ వంటి విచ్ఛిన్న కర మతోన్మాద కార్యకలాపాలు ఉత్తరప్రదేశ్, బిహార్ తదితర సున్నిత ప్రాంతాల్లో అరాచకాన్ని సృష్టించాలనే లక్ష్యంతో రచించిన ముందస్తు ప్రణా ళికల ఫలితాలే. ప్రజల దృష్టిని మరల్చి, తమ రహస్య ఎజెండాను అమలు చేయాలని బీజేపీ ప్రభుత్వం, పార్టీ ప్రయత్నిస్తున్నాయి. హిందూ ఓట్లను సంఘటితం చేసుకోవాలనే దుష్ట లక్ష్యంతోనే అవి మైనారిటీల వ్యతిరేక వైఖ రితో  హిందువుల పట్ల ప్రేమను ఒలకబోస్తున్నాయి.

ఫాసిస్టు అభివృద్ధి నిరోధకత్వం
బీజేపీ, ఆరెస్సెస్, వాటి అనుబంధ సంస్థల నేతలు ఫాసిస్టు ఉన్మాదంతో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బిహార్ తదితర ప్రాంతాల్లో జరిపిన దాడులు  మైనారిటీలన్ని టిలో అభద్రతను, మానసిక భయోత్పాతాన్ని రేకెత్తించడానికి ఉద్దేశించినవే. ముందు ముందు వారిని మత మార్పిడి చెందించడానికి బాట వేయాలనే లక్ష్యంతో సాగినవే. అందుకు అనుకూల వాతావరణాన్ని కల్పించడం కోసం బీజేపీ నేతలు హిట్లర్ రోజుల నాటి అభివృద్ధి నిరోధకతత్వాన్ని వంటబట్టిం చుకుని చరిత్రకారులు, రచయితలు, పాత్రికేయులపై దాడులను ప్రారంభిం చారు. కరుడుగట్టిన ఆరెస్సెస్ వ్యక్తులను గవర్నర్లుగానూ, ఐసీహెచ్‌ఆర్ (భారత చరిత్ర పరిశోధక మండలి) వంటి సంస్థల అధిపతులుగానూ, స్వయంప్రతిపత్తిగల ఇతర శాస్త్రీయ, సాంస్కృతిక, పరిశోధనా సంస్థల్లోని కీలక స్థానాల్లోనూ నియమిస్తున్నారు.

రోమిలా థాపర్, ఇర్ఫాన్ హబీబ్ తదితర సుప్రసిద్ధ చరిత్రకారులను ఐసీహెచ్‌ఆర్ సలహా బోర్డు నుంచి తొల గించారు. చరిత్ర పుస్తకాలనన్నిటినీ తగులబెట్టేయమని బీజేపీ నేత సుబ్ర హ్మణ్యస్వామి పిలుపునిచ్చారు. రచయితలు, కళాకారులను భయపెడుతు న్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛకు ఉన్న హక్కుపై దాడి జరుగుతోంది. మహా త్మాగాంధీలాంటి జాతీయోద్యమ నాయకులను అప్రతిష్టపాలు చేస్తూ, గాడ్సే సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారు. మరిన్ని అల్లర్లను సృష్టించాలనే లక్ష్యంతోనే హరియాణా, మహారాష్ట్రలలో గోమాంసాన్ని నిషేధించారు. కాగా వాటికి పొరుగునే ఉన్న గుజరాత్ గోమాంస ఎగుమతుల్లో అగ్రస్థానంలో ఉండటం విశేషం! పేదలు, ప్రత్యేకించి ఆదివాసీలు, దళితులు, మైనారిటీలు, ఓబీసీల ఆహారంలో గోమాంసం ఒక ప్రధాన అంశం.  

మోదీ బాధ్యత వహించక తప్పదు
ఆరెస్సెస్ చేస్తున్న ఈ విన్యాసాలలో మోదీ కూడా భాగస్వామే కాబట్టి లేదా  ఆయన సొంత మనుషులే వివాదాలను రేకెత్తింపజేసినా మౌనం వహిస్తు న్నారు కాబట్టి ఆయన వీటికి బాధ్యత వహించక తప్పదు. ‘‘అందరినీ ఉద్ధరించేవాడిని నేనే’’ అనే శైలితో ఆయన ప్లాస్టిక్ సర్జరీలో పురాతన భారత నైపుణ్యాన్ని పురాణ గాథలతో రుజువు చేసేస్తానంటున్నారు. మూఢవిశ్వా సాల వ్యాప్తి ద్వారా హిందుత్వ దాడులకు, హిందూ మహాపురుషునిగా తన నియంతృత్వ పని విధానానికి అనువైన పరిస్థితులను సృష్టించాలని ప్రయ త్నిస్తున్నారు.

ఒక వ్యక్తిగా మోదీలోని స్వాభావికమైన సంక్లిష్టత, పార్టీ లోపలా బయటా, తన చుట్టూ ఉన్నవారు ఏ క్షణానైనా తనపై తిరుగుబాటు చేయ వచ్చనే అనుమానం ఆయన్ను పట్టిపీడిస్తున్నాయి. హిట్లర్‌లాగే నియంతృత్వ ధోరణులతో క్రమక్రమంగా ప్రభుత్వం పనిని,  నిర్ణయాలనన్నిటినీ తన చుట్టూ కేంద్రీకృతం చేసుకుంటున్నారు. మంత్రులనందరినీ కీలుబొమ్మలుగా మార్చి, అత్యున్నత అధికారులంతా ప్రత్యక్షంగా తనకే జవాబుదారీ వహిం చాలని శాసించారు. ఈ ఒక్క ఏడాది కాలంలో మోదీ 18 దేశాలు సందర్శిం చడం చెప్పుకోదగిన రికార్డే. కానీ ఈ పర్యటనలన్నీ విదేశాంగ మంత్రి లేకుండా సాగడం విశేషం.

నిజంగా భారతీయమైన ప్రతిదాన్నీ నిర్మూలించడం ద్వారా ప్రధాని దేశా న్ని  మోదీ, గాడ్సేల రాజ్యంగా మార్చేయాలనుకుంటున్నారు. ఆయన అహం కారానికి మొదట బలైనది ప్రణాళికా సంఘం. అది మోదీ ‘నీతి ఆయోగ్’గా మారింది. ఇక ఆ తర్వాతది ఈశాన్య రాష్ట్రాల ప్రత్యేక హోదాను తిరస్కరిం చడం. తద్వారా మోదీ కేంద్రం తానా అంటే రాష్ట్రాలన్నీ తందానా అనేట్టు చేయాలని భావిస్తున్నారు. పోటీతోకూడిన సమాఖ్యతత్వం నేడు సహకార సమాఖ్యతత్వంగా మారింది. అంటే ‘‘అవును, ప్రధానమంత్రిగారు ఎప్పుడూ కరెక్టే’’ అని అర్థం. కాబట్టి మోదీ పాలనలోని నేటి హిందుత్వ... భౌతిక, సాంస్కృతిక, మత, కుల, మానసికపరమైన ఉగ్రవాదం తప్ప మరేమీ కాదు.

పచ్చి కార్మికవర్గ, రైతాంగ వ్యతిరేకత
కార్మిక చట్టాల సంఖ్యను కుదించి, సమర్థవంతం చేయడం పేరిట అతి తెలివిగా కార్మిక చట్టాలకు సవరణల పేరిట చేపట్టిన చర్యలు కార్మికులను హీనమైన, కట్టుబానిసల్లాంటి ఉద్యోగులుగా మార్చేవే. అలాగే 2013 నాటి భూసేకరణ చట్టాన్ని సవరించే లక్ష్యంతో తెచ్చిన 2015 భూసేకరణ బిల్లు కార్పొరేట్ సంస్థలు, రియల్టర్లు రైతుల భూములను సులువుగా స్వాధీనం చేసుకోవ డానికి వీలుకల్పించేది మాత్రమే. పైగా అది రైతులకు అనుకూల మైనదనే సిగ్గు మాలిన అబద్ధాలు! ఎస్సీ, ఎస్టీలకు నామ మాత్రపు కేటాయిం పులు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధుల కోత, మొదలైనవి బీజేపీ పేదల వ్యతిరేక మనస్తత్వానికి అద్దంపడతాయి.

క్రోడీకరించి చెప్పాలంటే బీజేపీ, మోదీల తొలి ఏడాది పాలనలో వారి ఎన్నికల వాగ్దానాలన్నీ పగటి కలలుగానే మిగిలిపోయాయి. వాటి జాబితాను విప్పడమూ దండగే. అయినా, విదేశాల్లోని నల్లధనాన్ని తిరిగి తెచ్చి ప్రతి కుటుంబం ఖాతాలో రూ. 15 లక్షలు డిపాజిట్ చేస్తామని ఘోరంగా విఫలం కావడం, నిత్యజీవితావసర వస్తువుల ధరల అదుపునకు చర్యలు చేపట్టక పోవడం, బాల కార్మిక వ్యవస్థకు ముగింపు పలకడానికి బదులు పారిశ్రామిక వేత్తలకు తోడ్పడేలా ఆ చట్టాన్ని సవరించడం, ‘జన ధన్ యోజన’ పేరిట నిరక్షరాస్య ప్రజలను వెర్రివాళ్లను చేయాలనుకోవడం వంటివి కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి.

మోదీ, లింకన్ ప్రజాస్వామ్యం నిర్వచనాన్ని తిరగరాసి... కార్పొరేట్ల చేత, కార్పొరేట్లే, కార్పొరేట్ల కొరకే  పాలించే ప్రభుత్వంగా మార్చారు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు ఒప్పందం కుదరడం మాత్రమే ఈ ఏడాది పాలనలోని ఏకైక సానుకూల అంశం. ఈ నేపథ్యంలో మోదీ ప్రభు త్వం నుంచి ప్రజానుకూల చర్యలేమీ ఆశించలేం. ప్రజాస్వామ్యంపైనా, వ్యక్తి స్వేచ్ఛ, వ్యక్తిగత, సామూహిక హక్కులు మొదలైన వాటిపైనా సాగుతున్న తీవ్ర దాడులను నిలవరించడం కోసం మిలిటెంటు ప్రజాపోరాటాలను నిరం తరాయంగా సాగించడం మాత్రమే ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం. శాంతి యుత, ప్రజాస్వామిక జీవనానికి వ్యతిరేకంగా మోదీ సాగిస్తున్న కుతం త్రాలను ఓడిస్తామని ప్రతిజ్ఞ చేద్దాం.
 
- సురవరం సుధాకరరెడ్డి
(వ్యాసకర్త ‘భారత కమ్యూనిస్టు పార్టీ’ ప్రధాన కార్యదర్శి)  

 మొబైల్: 9440066066

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement