
సాక్షి, హైదరాబాద్: ఐదు దశాబ్దాల్లో ఎప్పుడూ లేనంతగా దేశంలో నిరుద్యోగం పెరిగినందుకు ప్రధాని నరేంద్రమోదీ క్షమాపణలు చెప్పాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. నేషనల్ శాంపిల్ సర్వే(ఎన్‌ఎస్‌ఎస్) ›ప్రకారం నిరుద్యోగం పెరగగా, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగంలో అది తగ్గినట్టుగా పేర్కొనడం ద్వారా వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని విమర్శించారు. ఎన్‌ఎస్‌ఎస్ నివేదికను పార్లమెంట్ ముందు ఉంచాలన్నారు. శుక్రవారం ఇక్కడి మఖ్దూంభవన్‌లో ఆ పార్టీ నేతలు చాడ వెంకట్‌రెడ్డి, పల్లా వెంకట్‌రెడ్డిలతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్డీయే ఆర్థిక విధానాల వల్ల నిరుద్యోగం దారుణంగా పెరిగిందని, ప్రభుత్వరంగాన్ని పెంచాల్సింది పోయి, ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు.
పార్లమెంట్‌లో బీజేపీకి వ్యతి రేకంగా వ్యవహరిస్తామంటూ టీఆర్‌ఎస్ చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందన్నారు. నాలుగేళ్లలో బీజేపీ ప్రవేశపెట్టిన ప్రతి అంశానికి టీఆర్‌ఎస్ మద్దతు తెలిపిందని, ఇప్పుడు బీజేపీతోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్‌పట్ల కూడా వ్యతి రేక వైఖరినే టీఆర్‌ఎస్ అవలంబిస్తుందంటే ఆ పార్టీకి బీజేపీతో ఉన్న లాలూచీ బయటపడుతోందన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్ప డి యాభై రోజులు గడిచినా మంత్రులు లేకుం డానే ప్రభుత్వాన్ని నిర్వహించడం కేసీఆర్ ఒంటెత్తు పోకడకు నిదర్శనమని చాడ ధ్వజమెత్తారు. పూర్తిస్థాయి కేబినెట్ లేకపోవడంతో ప్రజాసమస్యలపై తక్షణ చర్యలు తీసుకునే అవకాశం లేకుండా పోయిందని, దీనిని ప్రభు త్వ వైఫల్యంగా భావిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment