ఆదివారం ముంబైలో భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు సభలో ఫరూక్ అబ్దుల్లా, ఉద్ధవ్ ఠాక్రే, స్టాలిన్, రాహుల్, మల్లికార్జున ఖర్గే, శరద్ పవార్ తదితరులు
ఇవి లేకుండా మోదీ ఎన్నికల్లో నెగ్గలేడు: రాహుల్
అధికారం కోసం అర్రులు చాచే అసమర్థుడు
భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు సభలో నిప్పులు
విపక్షాల బల ప్రదర్శన ఎస్పీ చీఫ్ అఖిలేశ్ డుమ్మా
ముంబై/లఖ్‌నవూ: బీజేపీ పాలనలో దేశంలో పెచ్చరిల్లిన నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, విద్వేషం తదితరాలను ప్రజలకు చాటిచెప్పేందుకు విధిలేని పరిస్థితుల్లో భారత్ జోడో యాత్రలు చేపట్టాల్సి వచి్చందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ అన్నారు. జాతుల హింసతో అట్టుడికిన మణిపూర్‌లో జనవరి 14న మొదలు పెట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర 63 రోజులకు ఆదివారం ముంబైలో ముగిసింది.
ఈ సందర్భంగా సెంట్రల్ ముంబైలోని అంబేడ్కర్ స్మారకం చైత్యభూమిని రాహుల్ సందర్శించారు. రాజ్యాంగ ప్రవేశికను చదివి నివాళులరి్పంచారు. అనంతరం స్థానిక శివాజీ పార్కులో విపక్ష ఇండియా కూటమి ఆధ్వర్యంలో జరిగిన భారీ ర్యాలీలో మాట్లాడారు. మోదీ ఓ అసమర్థ నేత అంటూ దుయ్యబట్టారు. ఈవీఎంలు, ఈడీ, సీబీఐ, ఐటీ లేకుండా లోక్‌సభ ఎన్నికల్లో నెగ్గడం ఆయన తరం కాదన్నారు.
‘‘మోదీ కేవలం అధికారం కోసం అర్రులు చాచే ముసుగు మనిషి. అవినీతిపై మోదీదే గుత్తాధిపత్యం. తనది 56 అంగుళాల ఛాతీ అని ఆయన చెప్పుకునే మాటలన్నీ అబద్ధాలే’’ అంటూ తీవ్ర పదజాలంతో దుయ్యబట్టారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత కోసం వీవీప్యాట్‌లను కచ్చితంగా లెక్కించాలన్న తమ డిమాండ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం అంగీకరించలేదని ఆరోపించారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ మోదీ గ్యారెంటీ సంపన్నుల కోసమైతే ఇండియా కూటమి హామీలు సామాన్యుని కోసమన్నారు. విపక్షాల బల ప్రదర్శనలో భాగంగా జోడో యాత్ర ముగింపులో ఇండియా కూటమి నేతలు పాల్గొన్నారు. డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌తో పాటు శరద్ పవార్ (ఎన్సీపీ–శరద్), తేజస్వీ యాదవ్ (ఆర్జేడీ), ఉద్ధవ్ ఠాక్రే (శివసేన–యూబీటీ), ఫరూఖ్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), మెహబూబా ముఫ్తీ (పీడీపీ) తదితరులు వీరిలో ఉన్నారు. ఇండియా కూటమిలో కీలక పక్షమైన సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ మాత్రం గైర్హాజరయ్యారు. అయితే, యాత్ర ను రాహుల్ విజయవంతంగా ముగించారని కొనియాడుతూ ఆయనకు లేఖ రాశారు.
వచ్చేది ‘ఇండియా’ సర్కారే
గాంధీ ముంబై నుంచే క్విట్ ఇండియా నినాదమిచ్చారని శరద్ పవార్ గుర్తు చేశారు. బీజేపీని అధికారం నుంచి దించేందుకు ఇండియా కూటమి కూడా ముంబైలో ప్రతినబూనాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఇండియా కూటమేనని స్టాలిన్ అన్నారు. ఎన్నికల బాండ్లను బీజేపీ పాల్పడ్డ వైట్ కాలర్ నేరంగా అభివర్ణించారు. ప్రజలంతా ఒక్కటైనప్పుడే నియంతృత్వానికి తెర పడు తుందని ఉద్ధవ్ అన్నారు. ఈడీ, సీబీఐ సాయంతో రాష్ట్రాల్లో ప్రభుత్వాలను బీజేపీ కూలదోస్తోందని తేజస్వి మండిపడ్డారు. తమ పోరు విద్వేష రాజకీయాలపైనే తప్ప మోదీపైనో, అమిత్ షాపైనో కాదన్నారు.
రాజ్యాంగాన్ని మార్చడం బీజేపీ తరం కాదు
అంతకుముందు ముంబైలో మహాత్మాగాంధీ నివసించిన మణిభవన్‌ను రాహు ల్ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మార్చడం బీజేపీ తరం కాదన్నారు. ఈ విషయంలో పార్టీ ప్రకటనలు ఉత్తి అరుపులు మాత్రమేనన్నారు. ‘‘జ్ఞానం కేవలం ఒక్క వ్యక్తి సొత్తేనన్నది బీజేపీ, ఆరెస్సెస్ భావన. రైతులు, కారి్మకులు, నిరుద్యోగ యువతకు ఏమీ తెలియదన్నది వారి దురభిప్రాయం’’ అంటూ మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికలను కేంద్రీకృత పాలనే కావాలనే బీజేపీ, అది వికేంద్రీకృత తరహాలో సాగాలనే కాంగ్రెస్ భావజాలాల మధ్య పోరుగా అభివరి్ణంచారు.
Comments
Please login to add a commentAdd a comment