Hatred
-
ఈవీఎం, ఈడీ, ఐటీ లేకుండా మోదీ ఎన్నికల్లో నెగ్గలేడు: రాహుల్
ముంబై/లఖ్‌నవూ: బీజేపీ పాలనలో దేశంలో పెచ్చరిల్లిన నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, విద్వేషం తదితరాలను ప్రజలకు చాటిచెప్పేందుకు విధిలేని పరిస్థితుల్లో భారత్ జోడో యాత్రలు చేపట్టాల్సి వచి్చందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ అన్నారు. జాతుల హింసతో అట్టుడికిన మణిపూర్‌లో జనవరి 14న మొదలు పెట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర 63 రోజులకు ఆదివారం ముంబైలో ముగిసింది. ఈ సందర్భంగా సెంట్రల్ ముంబైలోని అంబేడ్కర్ స్మారకం చైత్యభూమిని రాహుల్ సందర్శించారు. రాజ్యాంగ ప్రవేశికను చదివి నివాళులరి్పంచారు. అనంతరం స్థానిక శివాజీ పార్కులో విపక్ష ఇండియా కూటమి ఆధ్వర్యంలో జరిగిన భారీ ర్యాలీలో మాట్లాడారు. మోదీ ఓ అసమర్థ నేత అంటూ దుయ్యబట్టారు. ఈవీఎంలు, ఈడీ, సీబీఐ, ఐటీ లేకుండా లోక్‌సభ ఎన్నికల్లో నెగ్గడం ఆయన తరం కాదన్నారు. ‘‘మోదీ కేవలం అధికారం కోసం అర్రులు చాచే ముసుగు మనిషి. అవినీతిపై మోదీదే గుత్తాధిపత్యం. తనది 56 అంగుళాల ఛాతీ అని ఆయన చెప్పుకునే మాటలన్నీ అబద్ధాలే’’ అంటూ తీవ్ర పదజాలంతో దుయ్యబట్టారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత కోసం వీవీప్యాట్లను కచ్చితంగా లెక్కించాలన్న తమ డిమాండ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం అంగీకరించలేదని ఆరోపించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ మోదీ గ్యారెంటీ సంపన్నుల కోసమైతే ఇండియా కూటమి హామీలు సామాన్యుని కోసమన్నారు. విపక్షాల బల ప్రదర్శనలో భాగంగా జోడో యాత్ర ముగింపులో ఇండియా కూటమి నేతలు పాల్గొన్నారు. డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌తో పాటు శరద్ పవార్ (ఎన్సీపీ–శరద్), తేజస్వీ యాదవ్ (ఆర్జేడీ), ఉద్ధవ్ ఠాక్రే (శివసేన–యూబీటీ), ఫరూఖ్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), మెహబూబా ముఫ్తీ (పీడీపీ) తదితరులు వీరిలో ఉన్నారు. ఇండియా కూటమిలో కీలక పక్షమైన సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ మాత్రం గైర్హాజరయ్యారు. అయితే, యాత్ర ను రాహుల్ విజయవంతంగా ముగించారని కొనియాడుతూ ఆయనకు లేఖ రాశారు. వచ్చేది ‘ఇండియా’ సర్కారే గాంధీ ముంబై నుంచే క్విట్ ఇండియా నినాదమిచ్చారని శరద్ పవార్ గుర్తు చేశారు. బీజేపీని అధికారం నుంచి దించేందుకు ఇండియా కూటమి కూడా ముంబైలో ప్రతినబూనాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఇండియా కూటమేనని స్టాలిన్ అన్నారు. ఎన్నికల బాండ్లను బీజేపీ పాల్పడ్డ వైట్ కాలర్ నేరంగా అభివర్ణించారు. ప్రజలంతా ఒక్కటైనప్పుడే నియంతృత్వానికి తెర పడు తుందని ఉద్ధవ్ అన్నారు. ఈడీ, సీబీఐ సాయంతో రాష్ట్రాల్లో ప్రభుత్వాలను బీజేపీ కూలదోస్తోందని తేజస్వి మండిపడ్డారు. తమ పోరు విద్వేష రాజకీయాలపైనే తప్ప మోదీపైనో, అమిత్ షాపైనో కాదన్నారు. రాజ్యాంగాన్ని మార్చడం బీజేపీ తరం కాదు అంతకుముందు ముంబైలో మహాత్మాగాంధీ నివసించిన మణిభవన్‌ను రాహు ల్ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మార్చడం బీజేపీ తరం కాదన్నారు. ఈ విషయంలో పార్టీ ప్రకటనలు ఉత్తి అరుపులు మాత్రమేనన్నారు. ‘‘జ్ఞానం కేవలం ఒక్క వ్యక్తి సొత్తేనన్నది బీజేపీ, ఆరెస్సెస్ భావన. రైతులు, కారి్మకులు, నిరుద్యోగ యువతకు ఏమీ తెలియదన్నది వారి దురభిప్రాయం’’ అంటూ మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికలను కేంద్రీకృత పాలనే కావాలనే బీజేపీ, అది వికేంద్రీకృత తరహాలో సాగాలనే కాంగ్రెస్ భావజాలాల మధ్య పోరుగా అభివరి్ణంచారు. -
Rahul Gandhi: ప్రేమ మన డీఎన్ఏలోనే ఉంది
రాయ్‌గఢ్: మన దేశ డీఎన్ఏలోనే ప్రేమ ఉందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మాత్రం దేశంలో విద్వేషం వ్యాప్తి చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఆయన భారత్ జోడో న్యాయ్ యాత్ర రెండు రోజుల విరామం తర్వాత ఆదివారం ఛత్తీస్‌గఢ్‌లో మొదలైంది. రాయ్‌గఢ్ ర్యాలీలో రాహుల్ మాట్లాడారు. ‘‘భారత్‌లో భిన్న మతాలు, భిన్న సంప్రదాయాల ప్రజలు పరస్పరం ప్రేమతో శాంతియుతంగా జీవిస్తున్నారు. కానీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ విద్వేష రాజకీయాల వల్ల ప్రతి ప్రాంతంలో విద్వేషం, హింస పెరిగిపో తున్నాయి. భాష ఆధారంగా కొందరు, రాష్ట్రాన్ని బట్టి ఇంకొందరు ఇతరులను ద్వేషిస్తామంటున్నారు’’ అని ఆవేదన వెలిబుచ్చారు. విద్వేషం, హింసకు తావులేని హిందుస్తాన్‌ను భవిష్యత్ తరానికి అందించడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. -
తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు
బంజారాహిల్స్ (హైదరాబాద్): వివిధ వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాడనే అభియోగం మీద.. తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌కుమార్‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కమలానగర్ బస్తీవాసి విజయ్‌తో కలసి షేక్ హైదర్ అనే వ్యక్తి బస్తీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పిస్తామని కొంతమంది నుంచి డబ్బులు వసూలు చేశారు. అయితే వారెవరికీ అక్కడ ఇళ్లు రాలేదు. షేక్‌హైదర్, విజయ్ చేతుల్లో మోసపోయినట్లు వారికి తెలిసింది. దీంతో వారంతా బస్తీవాసులపై గొడవకు దిగుతుండటంతో శాంతి భద్రతలకు భంగం కలుగుతోందంటూ అదే బస్తీకి చెందిన జె.గోపీచంద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే తమను మోసగించాడంటూ డబ్బులు చెల్లించిన వారందరికీ విజయ్, షేక్‌హైదర్‌లు చెబుతూ.. వారిని నమ్మించి తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూన్యూస్ స్టూడియోకు తీసుకెళ్లాడు. అక్కడ వారిని బస్తీవాసులుగా పేర్కొంటూ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించేందుకు వారినుంచి ఎమ్మెల్యేపై తప్పుడు కథనాలను ప్రసారం చేశారు. దీంతో తీన్మార్‌మల్లన్నతోపాటు షేక్‌హైదర్, విజయ్, మధులపై ఫిర్యాదు చేశారు. ఇదీ చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాం.. కవితే అసలైన పెట్టుబడిదారు! -
హరీష్ మాటలతో బీఆర్ఎస్కే నష్టం! ఆయన కేటీఆర్‌లా చేస్తే బాగుండేది..
తెలంగాణ సీనియర్ మంత్రి హరీష్ రావు తొందరపడుతున్నారు. కారణం ఏమో కానీ, ఆయన బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన దుందుడుకుగా వ్యవహరించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయినా అదంతా ఉద్యమంలో భాగమని సరిపెట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన బాధ్యత కలిగిన మంత్రిగా ఉన్నారు. దానికి తగినట్లు ఆయన హుందాగా ఉండాలి. అందులోను పొరుగు రాష్ట్రం గురించి , పక్క రాష్ట్రం ప్రజల గురించి మాట్లాడేటప్పుడు మరింత పద్ధతిగా వ్యవహరించాలి. దురదృష్టవశాత్తు హరీష్ రావు అందుకు భిన్నంగా మాట్లాడి ఆంధ్ర నేతలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారనిపిస్తుంది. హరీష్ రావు సమర్ధనేతగా గుర్తింపు పొందారు. టాస్క్ మాస్టర్ గా కూడా పేరొందారు. అయినా అక్కడి రాజకీయ కారణాలతో కొన్నిసార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కనపెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ చరిత్ర అవసరం లేదు. కానీ హరీష్ ఎందుకో అప్పుడప్పుడు ఆంధ్రనేతలను గిల్లుతుంటారు. తాజాగా కూడా ఆయన అదే పనిచేశారు. దానికి అదే రీతిలో ఏపీ మంత్రులు కూడా స్పందించారు. వీరిలో కూడా ఒకరు కొంచెం ఎక్కువగానే మాట్లాడి ఉండవచ్చు. కానీ అందుకు హరీష్ అవకాశం ఇచ్చారు. హరీష్ ఆంధ్ర పాలన గురించి, ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితుల గురించి తనదైన భాషలో మాట్లాడారు. వాస్తవ పరిస్థితులతో సంబంధం లేకుండా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆంధ్ర ప్రాంతం వారిని అవమానించేలా ఉన్నాయి. తెలంగాణలో పనులు చేసుకుంటున్న వలస కూలీలను ఉద్దేశించి అక్కడే ఓటర్లుగా మారాలని కోరారు. అంతవరకు తప్పు లేదు. కానీ ఆంధ్రలో అసలు ఏమీ లేనట్లు, ఇక్కడ రోడ్లు లేనట్లు, పాలనే సాగనట్లు, ఏపీలో సంక్షేమ స్కీములు లేనట్లు ఏవేవో అనవసరంగా మాట్లాడారు. ఆయన కాకతాళీయంగా మాట్లాడానని అన్నప్పటికి, అవి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రజలను అవమానించేలా ఉన్నాయి. ఎదుటివారు హర్ట్ అయ్యారని తెలిసిన వెంటనే సారీ అంటే సరిపోయేది.. అలాకాకుండా మళ్లీ రెచ్చగొట్టేలా మాట్లాడారు. 'ఆంధ్రనేతలారా! మా జోలికి రావద్దు. మా గురించి మాట్లాడకపోతేనే మీకు మంచిది "అని హెచ్చరించారట. ఏపీకి ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించారు. తెలంగాణలో అమలు అవుతున్న స్కీములు ఎపిలో లేవని అన్నారట. అసలు రెండు రాష్ట్రాల మధ్య పోల్చి చూడవలసిన అవసరం ఏముంది?హైదరాబాద్ నగరం ద్వారా వచ్చిన అడ్వాంటేజ్ ను అనుభవిస్తున్న తెలంగాణ నేతలు, ఏపీని అగౌరవపరిచేలా మాట్లాడనవసరం లేదు. ఎంత టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చినా హరీష్ రావు పాత తత్వం మారలేదని దీనిద్వారా అర్ధం అవుతుంది. ఆయనకు ఆంధ్ర వాసులు అంటే ద్వేషం కొంచెం ఎక్కువే. అందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఉద్యమ సమయంలో సిద్దిపేట సమీపంలోని లక్ష్మీపురం అనే గ్రామం అనుకుంటా. అక్కడ ఆంధ్ర ప్రాంతం నుంచి వెళ్లినవారు ఎక్కువ మంది స్థిరపడ్డారు. వారిపై ఆయన ఆద్వర్యంలో దాడి జరిపే యత్నం వార్త అప్పట్లో పెద్ద సంచలనం అయింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత కూడా హరీష్ రావు, మరో మంత్రి ప్రశాంతరెడ్డి వంటి కొద్ది మంది ఆంధ్రపై నోరు పారేసుకున్నారు. తద్వారా తీవ్ర విమర్శలకు గురి అయ్యారు. ఏ రాష్ట్రంలో ఉండే పాజిటివ్ అంశాలు అక్కడ ఉంటాయి. ఏ రాష్ట్రంలో ఉండే నెగిటివ్ పాయింట్లు అక్కడ ఉంటాయి. సమయం సందర్భాన్ని బట్టి మాట్లాడాలి. ఏదైనా ఎన్నికల సమయం అయితే అదో రకం. అలాంటిదేమీ లేకుండానే హరీష్ మాట్లాడడం ఏపీ మంత్రులకు ఆగ్రహం తెప్పించింది. వారు ఏపీలో జరుగుతున్న అమ్మ ఒడి, స్కూళ్ల నాడు-నేడు, చేయూత, కాపు నేస్తం, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ , రైతు భరోసా కేంద్రాలు తదితర స్కీముల గురించి ప్రస్తావించి అవి తెలంగాణలో ఉన్నాయా అని అడిగారు. ఏపీలో ఆయన ఎప్పుడుపర్యటించారు కనుక రోడ్లు బాగోలేదని అంటారు. నిజానికి ఈ మధ్య రాష్ట్రంలో రోడ్లన్నీ బాగుపడ్డాయి. అయినా అదొక నిరంతరం ప్రక్రియ. హైదరాబాద్ నగరంలో అనేక కాలనీలలో రోడ్లు సరిగా ఉండవు. డ్రైనేజి వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉంటుంది. వీటికి సంబంధించి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు డెక్కన్ క్రానికల్ వంటి పత్రికలలో ఒక పేజీలో ప్రత్యేకంగా వస్తుంటాయి. వర్షం పడితే పలు చోట్ల రోడ్లు ఎలా మారతాయో అందరికీ తెలుసు. సరూర్ నగర్ ప్రాంతంలో వరదలు వచ్చినప్పుడు ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడింది చూశాం .తెలంగాణలో టీఆర్ఎస్ నేతలు( ప్రస్తుతం బీఆర్ఎస్)పలు హామీలు ఇచ్చారు. వాటిలో పలు హామీలు ఇప్పటికీ నెరవేరలేదు. ఆ విషయాలను అక్కడి ప్రతిపక్షాలు ప్రస్తావిస్తుంటాయి. వాటి గురించి హరీష్ ఏమి చెబుతారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి పేర్ని నాని చమత్కారంగా మాట్లాడుతూ మామ కేసీఆర్ పై కోపం వచ్చినప్పుడు ఆంధ్ర వాళ్లను హరీష్ తిడుతుంటాడని, చంద్రబాబు మాదిరి ఎప్పుడోసారి మామకు ఈయన కూడా పోటు పొడవవచ్చని వ్యాఖ్యానించారు. మంత్రులు కారుమూరి, బొత్స, సిదిరి అప్పలరాజు లు కూడా గట్టిగానే సమాధానం ఇచ్చారు. సిదిరి మాత్రం కొన్ని పదాలు అతిగా వాడారు. ఆయన అలాంటి పదాలు వినియోగించి ఉండాల్సింది కాదు. హరీష్ రావు చేసిన వ్యాఖ్యల వల్ల రాజకీయంగా ఆయన పార్టీకే నష్టం కలిగించవచ్చు. ఎంతకాదన్నా తెలంగాణలో హైదరాబాద్ తో సహా పలు ప్రాంతాలలో ఆంధ్ర సెటిలర్ల ఓట్లు గణనీయంగా ఉన్నాయి. ఇటీవలికాలంలో వారిలో పలువురు బీఆర్ఎస్ కు అనుకూలంగానే ఉన్నారు. వారిలో చాలామంది ఏపీ ముఖ్యమంత్రి జగన్ మద్దతుదారులు కూడా ఉండవచ్చు. వారందరిలో అసంతృప్తి కలిగితే బీఆర్ఎస్ కే నష్టం అన్న సంగతి హరీష్ గమనించాలి. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పత్రికల కళ్లలో సంతోషం చూడడానికి హరీష్ అలాంటి మాటలు మాట్లాడారేమో తెలియదు. ఇకనైనా ఆయన తన ధోరణి మార్చుకుంటే మంచిది. గతంలో మంత్రి కేటీఆర్ కూడా ఇలాగే మాట్లాడి ఆ వెంటనే సరిదిద్దుకున్నారు. హరీష్ అలా చేయకపోవడం బాధాకరం. రెండు రాష్ట్రాలు కలిసి,మెలిసి ఉండవలసిన తరుణంలో ఇలాంటి అవాంఛనీయ ఘటనలు స్వాగతించవలసిన పరిణామం కాదని చెప్పాలి. మరో సంగతి ఏమిటంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ వివాదంలో జోక్యం చేసుకుని ఆంధ్ర నేతలను తప్పుపట్టారు కానీ, తెలంగాణ మంత్రి హరీష్ రావును ఒక్క మాట అనలేకపోయారు. ఎంత హైదరాబాద్ లో స్థిర నివాసం ఏర్పరచుకున్నా, ఏపీలో రాజకీయాలు చేస్తున్న విషయాన్ని ఆయన విస్మరించరాదు. ఇక విశాఖ ఉక్కు గురించి కూడా హరీష్, కేటీఆర్ లు చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి. వారితో పోటీపడి పవన్ కళ్యాణ్ తాను కేంద్రంతో మాట్లాడి రావడం వల్లే అంతా ఆగిపోయిందని చెప్పేసుకున్నారు. కేంద్ర మంత్రి విశాఖలో స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటైజ్ చేయడం లేదన్నట్లుగా మాట్లాడగానే ఇదంతా తమ ఘనతేనని వారు అన్నారు. ఆ వెంటనే ఆ కేంద్ర మంత్రి మాట మార్చారు. తదుపరి కేంద్ర ప్రభుత్వం కూడా విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ప్రక్రియ ఆపలేదని స్పష్టం చేసింది. దాంతో వీరు తీసుకున్న క్రెడిట్ ఉత్తిదే అని తేలింది. ఆ తర్వాత వీరు ఆ ఊసెత్తలేదు. ఒక పక్క తెలంగాణలో నిజాం షుగర్స్ ను తెరిపించడంలో వైఫల్యం చెందిన తెలంగాణ మంత్రులు విశాఖ ఉక్కు గురించి భారీగా ప్రసంగాలు చేస్తున్నారు. నిజంగానే అంత డబ్బు ఉంటే బయ్యారం స్టీల్ ప్లాంట్ ను వారే ఏర్పాటు చేసుకుని ఉండవచ్చు. అన్నిటికి మించి ఆర్ధిక మంత్రిగా హరీష్ రావు ఉద్యోగులకు ఏ నెలకు ఆ నెల మొదటి తేదీన జీతాలు ఇచ్చి శభాష్ అనిపించుకోవచ్చు కదా! -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ ప్రెస్ అకాడెమీ ఛైర్మన్ -
కుల, మత విద్వేషాలను నియంత్రించకపోతే అంతర్యుద్ధమే
చెన్నై: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కుల, మత విద్వేషాలు పెరుగుతున్నాయని, ఇది ఇలాగే కొనసాగితే పౌర యుద్ధానికి దారి తీస్తుందని హెచ్చరించారు. రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్ర ప్రారంభానికి ముందు కన్యాకుమారిలో మీడియాతో మాట్లాడారు గహ్లేత్. కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు రాహుల్ గాంధీనే చేపట్టాలని, తనతో పాటు అనేక మంది పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారని గహ్లోత్ అన్నారు. పార్టీ బలోపేతానికి ఇది ఎంతో అవసరం అన్నారు. దేశం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుందని, రాహుల్ గాంధీ వాటిని పరిష్కరించగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ ప్రజల మధ్య సోదరభావం, ప్రేమ ఉండాలని, కానీ అందుకు విరుద్ధంగా విద్వేషం, హింస సృష్టిస్తున్నారని గహ్లోత్ విమర్శించారు. కుల, మతాల పేరుతో ప్రజల మధ్య విభజన రేఖ గీస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ వీటిపై ఏ రోజూ మాట్లాడలేదని పేర్కొన్నారు. ఇది దేశానికి ఎంత మాత్రమూ మంచిదికాదన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయనని రాహుల్ గాంధీ ఇదివరకే స్పష్టం చేశారు. అయితే గాంధీ కుటుంబసభ్యుల తరఫున ఆశోక్ గహ్లేత్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఆయన మాత్రం రాహుల్ గాంధీనే బాధ్యతలు చేపట్టాలని కోరుకుంటున్నారు. మరోవైపు గాంధీ కుటుంబసభ్యులే పార్టీ పగ్గాలను చేపట్టాలని వారి విధేయులు డిమాండ్ చేస్తున్నారు. ప్రమోద్ తివారీ, వీ హనుమంతు రావు సహా మరికొంత మంది నేతలు ఈ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశఆరు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు అక్టోబర్ 17న జరగనున్నాయి. 19న ఫలితాలు ప్రకటిస్తారు. చదవండి: చేతనైతే మళ్లీ అఖండ భారతావనిని సృష్టించు -
... కానివాళ్లకు కంచాల్లోనా?
ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపైన ఒక దినపత్రిక యుద్ధం ప్రకటించినట్లు కనిపిస్తోంది. ఎక్కడ, ఎప్పుడు, ఏ అవకాశం వస్తుందా అని కాచుకుని కూర్చున్నట్లుగా వార్తలతో పాటు సంపాదకీయాలూ రాస్తున్నారు. నిజంగానే పత్రికకు చిత్తశుద్ధి ఉంటే ఎడిటోరియల్ రాయడం అభ్యంతరకరం కాదు. కానీ రాసిన తీరు చదివితే జగన్ పట్ల ఉన్న ద్వేషం ప్రతి అక్షరంలో కనిపిస్తుంది. రాజ్యాంగ విరుద్ధమైనవీ, నిబంధనలకు వ్యతిరేకమైనవీ ఉంటే వాటిని పత్రికలు రాస్తే తప్పుకాదు. అలా కాకుండా తాము కోరుకున్న వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయడానికి జనం ముందుకు రారేమిటి? అన్న ఆక్రోశంతో రాయడంలో మాత్రం కచ్చితంగా సమాజాన్ని భ్రష్టు పట్టించే తాపత్రయమే తప్ప మరొకటి కనపడదు. తాజాగా ఈనాడు పత్రికలో ‘అయ్యాఎస్’ అన్న శీర్షికన రాసిన ఎడిటోరియల్‌లో ముఖ్య మంత్రి జగన్‌పై ఉన్న అక్కసునంతా వెళ్లగక్కారు. కొందరు ఐఏఎస్ లకు సంబంధించి ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా ఆ పత్రిక ఈ ఎడిటోరియల్ రాసింది. పత్రికలు ప్రమాణాలు పాటించాలని నీతులు చెప్పే రామోజీ తాను మాత్రం వాటన్నిటికీ అతీతుడు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని అనుకోవాలి. ఎందుకంటే ఏపీలో ఐఏఎస్‌లకు శిక్ష విధిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిన తెల్లవారేసరికల్లా ఎడిటోరియల్ రాసేశారు. అందులో ఏపీలోని ఐఏఎస్‌లను దుయ్య బట్టారే కానీ, మిగిలిన ఏ రాష్ట్రంలో అధికారుల గురించీ ప్రస్తావించక పోవడం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. అంతదాకా ఎందుకు? తెలంగాణ రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీపై ఎన్ని కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయి? తెలంగాణకు చెందిన ఎందరు ఐఏఎస్‌లకు హైకోర్టు శిక్షలు వేసిందీ? వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిందీ! ఆర్టీసీ సమ్మె సమయంలో హైకోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేసిందీ? అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ వెనక్కి తగ్గలేదే. మరి వీటన్నిటి గురించి కూడా రాసి ఉంటే ఆ సంపా దకీయాన్ని తప్పుపట్టనవసరం లేదు. వారే దేశ వ్యాప్తంగా 3,464 మంది ఐఏఎస్‌లపై ఫిర్యాదులు వచ్చాయనీ, 44 మందిపై సీబీఐ కేసులు నమోదు చేసిందనీ రాశారు. మరి అలాంటప్పుడు ఆయా రాష్ట్రాలలోని కొన్ని కేసులనైనా రిఫర్ చేయాలి కదా. మధ్యప్రదేశ్‌లో ఒక ఐఏఎస్ అధికారి ఇంటి నుంచి కోట్ల రూపాయల నగదు పట్టు బడింది. దాని గురించి ‘ఈనాడు’కు తెలియదనుకోవాలి. అధికారులనే కాదు... జగన్‌పై కూడా అవాకులు, చవాకులు రాశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలకూ, పాలకుల అధికారాలకూ రాజ్యాంగం విధించిన పరిమితులంటే జగన్‌కు ఏహ్య భావమట! ఆయన ఏలుబడిలో అధికారులకు కూడా ఆ అవలక్షణం అలవడిం దట. జగన్‌కు ఏహ్య భావమేమో కానీ, రామోజీకి ఉన్న ఏహ్య భావాన్ని దాచుకోలేకపోయారని అర్థం చేసుకోవచ్చు. మూడు రాజ ధానులపై వచ్చిన తీర్పుపై ఏపీ శాసన సభ సమగ్రంగా సమీక్షించి తీర్పులోని లోటుపాట్లను బహిరంగ పరచడం బహుశా ఈ పత్రికకు నచ్చి ఉండదు. మూడు రాజధానులపై తీర్పు వచ్చిన వెంటనే రామోజీ ఒక ఎడిటోరియల్ రాసి జగన్‌పై ఉన్న అక్కసును వెళ్ల గక్కారు. అయినా జగన్ ముందుకు వెళ్తానని ప్రకటించడంతో దానిని మనసులో పెట్టుకుని ఇలాంటి సంపాదకీయాలూ, వార్తా కథనాలూ రాస్తున్నట్లుగా ఉంది. ఏపీలోని కొన్నిచోట్ల స్కూళ్ల ప్రాంగణాలలో గ్రామ సచివాల యాలు ఏర్పాటు చేశారన్నది అభియోగం. దీనిపై కొందరు కోర్టుకు వెళ్లారు. కోర్టు తీర్పు ఇచ్చింది. దానిని చాలావరకు అధికారులు అమలు చేశారు. అయినా ఆలస్యంగా అమలు చేసినందుకు జైలు శిక్షలు వేస్తున్నానని చెప్పి, తదుపరి... దానికి బదులుగా హాస్టళ్లలో నెలకు ఒక రోజు సేవ చేయాలని ఆదేశించారు. ఈ మాత్రానికే అదేదో కొంప మునిగిపోయినట్లు ‘ఈనాడు’ రాసింది. పనిలో పని ఏపీలో విద్యా వ్యవస్థపై కూడా తన ఆక్షేపణలు తెలియ చేసింది. కొద్ది రోజుల క్రితం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఏపీలో జాతీయ విద్యా విధానం బాగా అమలవుతోందని ప్రశంసిస్తే, ‘ఈనాడు’కు మాత్రం దానిని తుంగలో తొక్కినట్లు కనిపిస్తుంది. నిజానికి ఏపీలో విద్యా రంగం అభివృద్ధికి జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై సర్వత్రా ప్రశంసలు వచ్చాయి. ‘నాడు–నేడు’ కింద స్కూళ్లను కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తయారు చేసిన తీరుపై ఎన్నడైనా ఈ పత్రిక మంచి వార్త ఇచ్చిందా? ఏపీలో ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం పెడితే ఇదే పత్రిక గగ్గోలుగా వార్తలు రాసింది. అదే పద్ధతిని తెలంగాణలో కూడా తీసుకువస్తే ఎందుకు వ్యతిరేక కథనాలు ఇవ్వలేదు? ఏపీలో తీసుకువచ్చిన సంస్కరణలు ‘ఈనాడు’కు కనిపించడం లేదా? గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు అందుతున్న సేవల గురించి ఎన్నడైనా ప్రస్తావించారా? కొత్త జిల్లాల ఏర్పాటు సంద ర్భంగా... మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరినట్లుగా ఆయన నియోజకవర్గమైన కుప్పంలో కూడా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశారే. అయినా రామోజీకి అవేమీ కనిపించలేదు. మరో విషయం చూడండి. జగన్‌కు అధికారం దఖలు పడగానే, అయ్యవారి దర్శనానికి బారులు తీరిన ఉన్నతాధికారులలో బోలెడు మంది జగన్‌ను పరిపాలన దక్షుడనీ, ప్రగతి కాముకుడనీ నోరారా కీర్తించి నట్లు కథనాలు వచ్చాయట. ఎవరు ముఖ్యమంత్రి అయినా అధికా రులు వారికి దగ్గరగానే ఉంటారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారులు ఆయనతో సన్నిహితంగా లేరా? ఆయనకు సన్నిహితంగా ఉండే ఒక ఐఏఎస్ అధికారి ఏకంగా హెరిటేజ్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయ్యారే. ఇది గొప్ప విషయంగా రామోజీకి కనిపించిందా? అధికారులు ఆయా ఫైళ్లను పరిశీలించేటప్పడు తమ అభిప్రాయాలను నిష్కర్షగా రాయాలి. అది వారి బాధ్యత. రామోజీకి ఎంతో గొప్పగా కనిపించే అమరావతి భూముల విషయమై ఆనాటి చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు రాసిన అభ్యంత రాలను చంద్రబాబు ఖాతరు చేయకపోయినా ఆ ప్రభుత్వం గొప్పది అని రామోజీ భావన కావచ్చు. ‘నాకిది–నీకిది’ అని ప్రభువుల మోచేతి నీళ్లు తాగుతున్నారట. ఇంత నిష్కర్షగా చెప్పే పెద్ద మనిషి ఐఏఎస్‌లను రోజూ పిలిపించుకుని తన పెంట్ హౌస్‌లో ఎందుకు విందులు ఇచ్చేవారో కూడా వివరిస్తే ఇంకా బాగుండేది కదా. ఐఏఎస్‌లు అయినా, ప్రభుత్వంలోని వారైనా ఎవరు అవినీతికి పాల్పడినా సహించనక్కర్లేదు. మరి ఓటుకు నోటు కేసు వచ్చినప్పుడు రామోజీకి ఈ ఆవేశం ఏమైపోయింది? ఒక సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారి ఇరవై మూడు మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే లావాదేవీలో పాల్గొంటే అది ప్రజాక్షేమం! ఏకంగా టీడీపీ రాజకీయ వ్యవహారాలలో మమేకమై చివరికి ‘తెలుగు యువత’ వంటి పదవు లకు సైతం ఎంపికయిన పోలీసు అధికారులు అత్యంత సమర్థులూ, నిష్పక్షపాతంగా పనిచేసినట్లూ! కడప జిల్లాలో తెలుగుదేశంలో ఉన్నప్పుడు మంత్రిగా పనిచేసిన ఒకాయనకు, మరో నేతకు మధ్య అధికారులతో రాజీ చేయించి, వాటాను ఎలా పంచుకోవాలో చెప్పిన ఆనాటి ప్రభుత్వ పెద్దలు గొప్ప వారు! అలా వాటాలు పంచిన అధికారులు పాలనలో సమర్థులన్న మాట! తన ఎదుట చేతులు కట్టుకుని కూర్చునే ముఖ్యమంత్రి అయితే పాలనాదక్షుడు అవుతారని ఆ పత్రికాధినేత భావనేమో తెలియదు. ఐఏఎస్‌ల గురించి చాలా రాశారు కదా... తన మీడియా రిపోర్టర్ల ద్వారా ఇదే ఐఏఎస్‌ల వద్దకు ఎందుకు పైరవీలకు పంపించారో గుర్తు చేసుకుంటే వాస్తవం ఏమిటో బోధపడుతుంది కదా. మరొకాయన అయితే మంత్రులు, ఐఏఎస్ చాంబర్లలోనే కాదు.. ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయ చాంబర్లో కూర్చుని కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టుల పైరవీలు చేసినప్పుడు ఐఏఎస్‌లు మంచివారన్నమాట. ఇలా పాత్రికేయుల ముసుగులో దందాలు చేసిన వారు నీతులు చెబితే జనం చెవిలో పూలు పెట్టుకుని వినాలన్నమాట! ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగానే అధికారులు పనిచేయవలసి ఉంటుంది. ఏమైనా రాజ్యాంగ విరుద్ధమైనవీ, నిబంధనలకు వ్యతిరేక మైనవీ ఉంటే వాటిని అధికారులు ఒప్పుకోరాదన్నంత వరకూ పత్రి కలు రాస్తే తప్పుకాదు. అలా కాకుండా ఈ అధికారులు ఎవరూ జగన్‌పై తిరుగుబాటు చేయరేమిటి? తాము కోరుకున్న వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయడానికి జనం ముందుకు రారేమిటి? అన్న ఆక్రో శంతో రాయడం మాత్రం కచ్చితంగా సమాజాన్ని భ్రష్టు పట్టించా లన్న తాపత్రయమే తప్ప మరొకటి కనపడదు. ఈ సందర్భంగా జగన్ ఏపీ శాసనసభలో ప్రస్తావించినట్లుగానే మరికొన్ని మీడియా సంస్థ లతో పాటు ‘ఈనాడు’ పత్రికా, రామోజీ రావూ టీడీపీని మోయడానికే కంకణం కట్టుకున్నట్లుగా ఉందన్న సంగతి నగ్నంగా కనిపిస్తోంది. కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
పప్పు సేన నన్ను మిస్ అవుతోంది : కంగన
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు వరుస కేసుల షాక్ తగులుతోంది. ఇప్పటికే కర్నాటక కోర్టు ఆదేశాలకు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు కాగా తాజాగా బాంద్రా కోర్ట్ కంగనాకు మరో ఝలక్ ఇచ్చింది. అంతేకాదు కంగనాతోపాటు ఆమె సోదరి రంగోలి చందేల్‌కి ఇబ్బందులు తప్పలేదు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే పై అవమానకరమైన వ్యాఖ్యలు,సోషల్ మీడియాలో మతవిద్వేషాన్ని రెచ్చగొడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో వారిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు నమోదైంది. దీన్ని విచారించిన బాంద్రా మేజిస్ట్రేట్ మెట్రోపాలిటన్ కోర్టు కంగనా, ఆమె సోదరి రంగోలి చందేల్ పై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. ఇద్దరు సోదరీమణులు బాలీవుడ్, ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే గురించి అవమానకరమైన వ్యాఖ్యలను ట్వీట్ చేస్తున్నారని ఆరోపించిన మున్నవారాలి అకాసాహిల్ అహస్రఫాలి సయ్యద్ ఈ ఫిర్యాదును నమోదు చేశారు. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, వారి ట్వీట్లు మత విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నాయని ఆరోపించారు. ఈమేరకు బాంద్రా పోలీస్‌స్టేషన్‌లో దీనిపై ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించానని, కాని వారు దానిని నమోదు చేయలేదని ఆయన ఆరోపించారు. దీంతో బాంద్రా కోర్టును ఆశ్రయించానన్నారు. మరోవైపు దీనిపై స్పందించిన కంగనా మహారాష్ట్రలోని పప్పు సేనకు తనపై మక్కువ ఎక్కువై పోయిందంటూ వ్యంగ్యంగా కమెంట్ చేశారు. అంత మిస్ అవ్వద్దు.. త్వరలోనే అక్కడకు వస్తాను అంటూ ట్వీట్ చేశారు. తన నవరాత్రి ఉపవాస ఫోటోలను షేర్ చేశారు. కాగా వ్యవసాయ చట్టాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తుమకూరు కోర్టు ఆదేశాల మేరకు క్యతాసంద్ర పోలీస్ స్టేషన్లో కంగనాపై ఎఫ్ఐఆర్ దాఖలైన సంగతి తెలిసిందే. Who all are fasting on Navratris? Pictures clicked from today’s celebrations as I am also fasting, meanwhile another FIR filed against me, Pappu sena in Maharashtra seems to be obsessing over me, don’t miss me so much I will be there soon ❤️#Navratri pic.twitter.com/qRW8HVNf0F — Kangana Ranaut (@KanganaTeam) October 17, 2020 -
భార్య మనసు మారిపోయిందా?
భార్య ప్రేమ భర్త మనసుకు తెలుస్తుంటుంది. భార్య ద్వేషం కూడా భర్తకు తెలుస్తుంటుంది. ఈ రెంటికీ కారణాలు ఉంటాయి. కాని భార్యకు ద్వేషం ఉండి ప్రేమ నటిస్తుంటే? మనసు లోపల ఏ అనుబంధం మిగుల్చుకోకుండా కేవలం నాటకీయమైన ప్రేమ ప్రదర్శిస్తూ ఉంటే? ఆ సంగతి భర్తకు తెలిసిపోతూ ఉంటే? ఆ భర్త దానిని ఎలా అర్థం చేసుకోవాలి? సునంద ఆ రోజు భర్త ఆఫీసుకు ఫోన్ చేసింది. ‘ఏమండీ ఏం చేస్తున్నారు?’ అడిగింది. ‘భోజనం చేశారా?’ అడిగింది. ‘ఇంటికి ఎప్పుడొస్తున్నారు?’ అడిగింది. ‘తొందరగా వచ్చేయండి మరి’ అని గారం పోయింది. భార్య ఫోన్ పెట్టేశాక రామచంద్రం ఆశ్చర్యపోయాడు. భార్య తన పట్ల కొంచెం జంకుగా ఉంటుంది. తను కొంచెం సరదాగా మాట్లాడితే తనూ సరదాగా మాట్లాడుతుంది. తన మూడ్‌ని బట్టి వ్యవహరిస్తుంది. అనవసర చనువు తీసుకోదు. అలాంటిది ఇలా ఫోన్ చేసి మాట్లాడటం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇంటికి వెళితే భార్య ఉత్సాహంగా ఎదురు వచ్చింది. ‘ఇవాళ ఏం వండానో చెప్పుకోండి చూద్దాం’ అంది. ‘ఏం వండావు?’ ‘మీకిష్టమని పాలకూర చికెన్ చేశాను’ ‘ఓ’... ‘పిల్లలేరి?’ ‘వాళ్ల రూమ్‌లో టీవీ చూసుకుంటున్నారు లేండి. కాసేపట్లో పడుకుంటారు. స్నానం చేస్తారా? ముఖం కడుక్కుని భోజనం చేస్తారా?’ రామచంద్రం మళ్లీ ఆశ్చర్యపోయాడు. ఆఫీసు నుంచి వచ్చాక రాత్రుళ్లు అతడు స్నానం చేయడు. ఇన్నేళ్లలో ఎప్పుడూ చేయలేదు. ఇదేం ప్రశ్న. ‘ముఖమే కడుక్కుంటాను’ ‘కడుక్కోండి మరి’ అని అతడు బాత్రూమ్లో సింక్ దగ్గర ముఖం కడుక్కుంటూ ఉంటే టవల్ పట్టుకుని బాత్రూమ్ డోర్ దగ్గర నిలబడింది. ‘ఏంటి సునందా.. ఏమైనా కావాలా? ఏమైనా కొనుక్కోవాలా?’ అడిగాడు రామచంద్రం, భార్య తాపత్రయానికి నిజంగానే ఏదైనా అడిగితే ఇద్దామని. ‘నాకేం కావాలండీ. మీరుంటే అదే పది వేలు. మీతో కాపురం తప్ప ఇంకేం కావాలి?’ అంది సునంద నవ్వుతూ. ఉదయం పూట పిల్లల్ని స్కూల్‌కి హుషారుగా తయారు చేస్తోంది సునంద. అంతకు ముందు పిల్లలను అప్పుడప్పుడు కసిరేది. విసుక్కునేది లేటవుతుంటే. ఇప్పుడలా లేదు. ముద్దు చేస్తోంది. భర్త రావడంతోటే ‘ఒక్క నిమిషం అండీ’ అని హడావిడిగా వెళ్లి టీ పెట్టుకుని వచ్చి ఇస్తోంది. ఆ రోజు పిల్లల కోసం ఉప్మా, అతని కోసం పూరీ చేసింది. ‘ఉప్మా ఏం తింటార్లేండి మీరు. పూరి తినండి’ అని కర్రీతోపాటు ఆవకాయ కూడా తెచ్చి పెట్టింది. అతడు రెడీ అయ్యి బైక్ తీసి ఆఫీసుకు బయలుదేరుతుంటే బాక్స్ తెచ్చి చిరునవ్వుతో నిలబడింది. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లిపోయింది. రామచంద్రంకు గుటకలు పడ్డాయి. ఈమె ఇలా ఎందుకు మారిపోయింది.రామచంద్రంకు, సునందకు పెళ్లయ్యి పదేళ్లు. ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. రామచంద్రంకు తల్లిదండ్రుల సపోర్ట్ లేదు. సునంద తల్లిదండ్రులే బాగా సపోర్ట్ చేశారు. అందుకే ఒక ఫ్లాట్ కొనుక్కున్నాడు. ఉద్యోగంలో వచ్చేది గొప్ప జీతం కాకపోయినా వారి సపోర్ట్ వల్ల పిల్లల్ని మంచి బడిలో చదివిస్తున్నాడు. రామచంద్రంకు బయట పెద్ద వ్యాపకాలు లేవు. ఆఫీసు, ఇల్లు.. అంతే తెలిసింది. సునందతో విపరీతంగా మాట్లాడటం కబుర్లు చెప్పడం అలా ఏమీ చేయడు. అతిగా వ్యవహరించడం అనుకుంటాడు. సునంద కూడా మామూలుగా బిహేవ్ చేస్తుంది. ఇద్దరిలో ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఎంత ఉందో తెలియకపోయినా ద్వేషం మాత్రం లేదు. అనుబంధం ఉంది. ఒకరి పట్ల ఒకరికి అవగాహన ఉంది. కాని సునంద ప్రవర్తన ఇలా మారడం అతడికి విచిత్రంగా ఉంది. పదకొండు గంటలకు భార్య వాట్సప్ నుంచి ముద్దులు, లవ్ సింబల్స్ వచ్చాయి. ఇది ఇంకా స్ట్రేంజ్. సునంద వాట్సప్ వాడటం బహు తక్కువ. పిల్లలకు స్నాక్స్ అయిపోయినప్పుడు, వంట మరీ బద్దకించినప్పుడు ఫుడ్ తెచ్చుకోమనో పెడుతుంది. ఇలా ముద్దులు గిద్దులు పెట్టదు. రామచంద్రం ఆ మెసేజ్‌లు చూసి ఆ తర్వాత పనిలో పడిపోయాడు. రాత్రి కాస్త లేట్ కూడా అయ్యింది. ఇంటికొచ్చేసరికి ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. పిల్లలను అప్పటికే నిద్ర పుచ్చేసినట్టుంది. సునందను చూసే సరికి అదిరిపోయాడు. ఏడ్చి ఏడ్చి ఉన్నట్టుగా కళ్లు ఎర్రగా అయిపోయి ఉన్నాయి. చాలా డిస్ట్రబ్డ్‌గా కనిపించింది. విసురుగా ఉన్నాయి కదలికలు. ‘ఏమైంది?’ అన్నాడు కంగారుగా. ‘మీరు నా మెసేజ్‌లకు రిప్లై ఇవ్వలేదు’ అంది. ‘సునందా... ఏమిటి నీ ప్రవర్తన’ అని అనునయంగా అన్నాడు రామచంద్రం. ఆ రాత్రంతా సునంద ఏడుస్తూ ఉంది. రామచంద్రం ఎన్ని విధాలుగా చెప్పినా వినలేదు. ఇది చాలా విపరీత ప్రదర్శన అనుకుని రెండు మూడు రోజులు సైలెంట్‌గా ఉండి ఆ తర్వాత సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లాడు రామచంద్రం. ఆమెను లోపల వదిలి తాను తప్పుకున్నాడు.సునందను చూసిన సైకియాట్రిస్ట్ ‘తొందరేమీ లేదు మెల్లగా మాట్లాడుకుందాం’ అని మంచినీళ్లిచ్చింది. సునంద చామనఛాయగా ఉంటుంది. పుట్టుకతో మడమ మెలికపడి ఉండటం వల్ల కాలు కొంచెం ఎగరేసి నడుస్తుంది. గమనించి చూస్తే తప్ప ఆ తేడా తెలియదు. కాని లోలోపల ఆ లోపం పట్ల న్యూనత పెంచుకొని కాలేజీకి వచ్చేసరికి చదువు మానేసింది. కొన్ని సంబంధాలు ఈ కాలి లోపం వల్ల తప్పిపోయాయి. అప్పుడు తల్లిదండ్రులు ఈ రామచంద్రం సంబంధం వెతికి చేశారు. ఇద్దరిదీ ఆర్థికంగా సమస్థాయి కాకపోయినా కూతురి కోసం దిగి వచ్చారు. రామచంద్రం ఊహల్లో ఉన్న భార్య వేరు. వచ్చిన భార్య వేరు. అయితే ఆ భార్యను అతడు ఎప్పుడూ ఆమెకు తెలిసేంత ప్రేమతో చూడలేదు. అలాగని దూరమూ లేడు. చాలా సాధారణ స్థాయిలో వ్యవహరించేవాడు. కాని అతడి లోపల ఉన్న ఏదో అసంతృప్తి అతని పిలుపు వల్ల తెలిసేది. ‘ఎల్.సునంద’ అని పిలిచేవాడు అప్పుడప్పుడు. ఆమె ఇంటి పేరు ఎల్ కాదు. ఎల్ అంటే ‘లెగ్’. ‘ఏమోయ్ లెగ్గూ’ అనేవాడు అప్పుడప్పుడు. ‘నల్ల పెళ్లాం’ అనేవాడు. వాటికి సునంద నవ్వి ఊరుకునేది కాని లోపలి ప్రేమ వ్యక్తం చేసేది కాదు. ఈ మధ్య ఆమెకు ఒక ఫేస్బుక్ ఫ్రెండ్ పరిచయమయ్యాడు. మొదటిసారి అతడు ‘మీరు బంగారమండీ’ అన్నాడు. ‘మీరు మహరాణి అండీ’ అన్నాడు. ‘మీ కళ్లల్లో స్వచ్ఛత అద్భుతం’ అన్నాడు. ‘నా కాలు సంగతి మీకు తెలియదు’ అని సునంద అంటే ‘కాలు ఎవరు చూస్తారండీ... మనసు చూడాలి’ అన్నాడు. ఇవన్నీ సునందకు కొత్త. అందుకే తబ్బిబ్బు అవుతోంది. అయితే అవన్నీ వేరే మగవాడి నుంచి వినడం ఆమెకు ఇష్టం లేదు. అందుకే గిల్ట్ ఫీల్ అవుతోంది. ఆ గిల్ట్తో భర్త మీద అతి ప్రేమ మొదలెట్టింది. కొత్త స్నేహం కొనసాగించలేక, ఉన్న అనుబంధంలో తనకు కావలసింది పొందలేక ఆమె నలుగుబాటే ఈ కేస్. సైకియాట్రిస్ట్ అంతా విని భర్తకు విడిగా చెప్పింది–‘మీరు ఉట్టి భర్తగా కాకుండా ప్రేమించే భర్తగా మారాలి. లాలించే భర్తగా మారాలి. ఆమె లోపాలను దాటి ఇష్టపడే భర్తగా మారాలి. ఈ జన్మకు తనే మీ భార్య అని ఆమె అనుకుంటోంది. ఇద్దరు పిల్లల్ని కని ఇచ్చి జీవితాన్ని ఇచ్చి మీ నుంచి ఆశించే కొద్దిపాటి ప్రేమ కూడా పొందకపోతే ఆమె పరిస్థితి ఏమి కావాలి? చెప్పండి?’ అంది. రోజులు గడిచాయి. సునంద ఫేస్బుక్ నుంచి బయటకు వచ్చేసింది.రామచంద్రంకు స్పెషల్ కాల్స్ చేయడం లేదు. స్పెషల్ మెసేజెస్ పెట్టడం లేదు. కాని అతడు ఇంటికొచ్చాక టీవీ చూస్తూ చేయి పట్టుకుని దగ్గర కూచోబెట్టుకున్నప్పుడు మాత్రం మనస్ఫూర్తిగా అతడి భుజాన తల వాల్చుతోంది. – కథనం: సాక్షి ఫీచర్స్ డెస్క్ -
‘మోదీ విద్వేష విషం విరజిమ్మారు’
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ విద్వేషపూరిత ప్రచారానికి మొగ్గుచూపారని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఆరోపించారు. మోదీ ద్వేషాన్ని విరజిమ్మితే తాము ప్రేమను పంచామని, ఈ ఎన్నికల్లో ప్రేమే గెలుస్తుందని తాను నమ్ముతున్నానని రాహుల్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని ఔరంగజేబు లేన్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం రాహుల్ మాట్లాడారు. ఈ ఎన్నికల్లో నోట్ల రద్దు, రైతు సమస్యలు, గబ్బర్ సింగ్ ట్యాక్స్, రఫేల్ ఒప్పందంలో అవినీతి వంటి అంశాలు కీలక పాత్ర పోషించాయని అన్నారు. -
ఏంటా ఆశ్చర్యం?
ఓ గురువు తన శిష్యులకు పాఠం చెబుతున్నారు.అప్పుడు ఓ నాస్తికుడు అక్కడికి వచ్చాడు. ఆ గురువుగారి తీరుతెన్నులను, విధానాలను కించపరుస్తూ మాట్లాడాడు. అవమానపరిచాడు. ఇదంతా అక్కడున్న శిష్యులు చూస్తూనే ఉన్నారు. వారికేమీ బోధపడలేదు. ఎందుకంటే అతనిని అంతకుముందెన్నడూ వారెవరూ చూడలేదు. తమ గురువుగారు ఎవరితోనూ గొడవపడటం కానీ వాదులాటకు దిగటం కానీ ఎప్పుడూ చూడలేదు. అసలాయనలో కోపమే ఎరుగరు. అటువంటిది ఎవరో ఓ అజ్ఞాత వ్యక్తి వచ్చీరావడంతోనే రెచ్చిపోవడం వారికి విచిత్రంగా చూస్తున్నారు. గురువుగారు ఎలా స్పందిస్తారోనని వారిలో ఆసక్తి పెరిగింది.మనసుకి ఏదనిపిస్తే అది మాట్లాడుతూ వచ్చిన ఆ నాస్తికుడు ‘‘మిమ్మల్ని ఓ బౌద్ధ భిక్షువుగానో లేక జెన్ గురువుగానో నేనెందుకు స్వీకరించాలి... ఎందుకు నమస్కరించాలి’’ అని అడిగాడు కటువుగా.అతనలా అంటున్నప్పటికీ ఆ గురువుగారేమీ ఆగ్రహించలేదు. రెచ్చిపోలేదు. అతని మాటలను ఖండించలేదు. అతనితో ఎంతోమర్యాదగానే మాట్లాడుతూ, ‘‘మీరు చెప్పిందల్లా నిజమే. మీ సిద్ధాంతాలనూ మీ నమ్మకాలనూ నేను ఎందుకు కాదంటాను....మీ దారి మీది. నా దారి నాది. నేనేమీ మీ అభిప్రాయాలకు అడ్డురాను.కానీ ఒక్క విషయం... నేనే కాదు నాలాంటివారు ఓ ఆశ్చర్యాన్ని చెయ్యగలరు’’ అన్నారా గురువు.‘‘అదేంటీ’’ అని అడిగాడు నాస్తికుడు.గురువుగారు ప్రశాంత చిత్తంతో ఇలా అన్నారు...‘‘ఎవరైనా తప్పు చేసినా, మాకు ద్రోహం చేసినా, అవమానించినా వారిపై మేము మండిపడం. కోప్పడం. ద్వేషం పెంచుకోము. వారి మాటలను అప్పటికప్పుడే మరచిపోతాము. అంతే తప్ప వాటిని మనసులో ఉంచుకుని లోలోపల రగిలిపోము....’’ అని చెప్పారు.అందుకే అంటారు జ్ఞానుల దగ్గర ఒకరిని క్షమించిన వాటి నీడలు కూడా చూడలేమని. – యామిజాల జగదీశ్ -
కర్ణాటక ఎన్నికలు; బీజేపీకి మరో షాక్
హుబ్లీ: ఎన్నికల రాష్ట్రం కర్ణాటకలో బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ‘ప్రధాని మోదీ దేశాన్ని సర్వనాశనం చేశారు..’ అని అమిత్ షా ప్రసంగాన్ని తప్పుగా అనువదించిన ఎంపీ ప్రహ్లాద్ జోషి గుర్తున్నారు కదా, నోరుజారి అభాసుపాలైన ఆ కీలక నేత.. ఇప్పుడు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసి కొత్త తలనొప్పులు కొనితెచ్చుకున్నారు. విద్వేషం: హుబ్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ధర్వాడ ఎంపీ అయిన ప్రహ్లాద్ జోషి శుక్రవారం సదార్సోఫా గ్రామంలో పర్యటించారు. ‘‘ఇది ఊరు కాదు, మినీ పాకిస్తాన్లా ఉంది. ఇక్కడి మసీదుల్లో అక్రమంగా ఆయుధాలను దాచి ఉంచారు’’ అని ఎంపీ అనడంతో అక్కడున్నవారు షాకయ్యారు. ఇటీవలే మరణించిన ఓ బీజేపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ సదార్సోఫా ముస్లిం మత పెద్దలు కసభాపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశారు. ప్రాధమిక దర్యాప్తు అనంతరం ఎంపీ ప్రహ్లాద్ జోషిపై ఐపీసీ153, 298 సెక్షన్ల కింద కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు. వరుస షాక్‌లు: ‘యడ్యూరప్ప అవినీతిలో నంబర్ వన్’ అని అమిత్ షా నోరుజారడం మొదలు.. ‘మోదీ దేశాన్ని నాశనం చేశాడ’నే తప్పుడు అనువాదం, షా ప్రసంగిస్తున్నవేళ యడ్డీ కునుకు తీయడం, ఇప్పుడు ఏకంగా బీజేపీ కీలక నేత ప్రహ్లాద్ జోషిపై కేసు నమోదు కావడం.. ఇలా బీజేపీ కర్ణాటక ఎన్నికల ప్రచార పర్వంలో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. -
లబ్...డబ్...
నేను మెరుపు వేగంతో ముసలతన్ని పరుపు మీది నుంచి నేలపైకి తోసేసి, అదే ఊపులో బరువుగా ఉన్న పరుపును అతనిపైన కప్పేశాను. తర్వాత నా బరువంతా ఆ పరుపుపై వేసి బలంగా అదిమేస్తూ అతనికి ఊపిరి ఆడకుండా చేశాను. ఇలా చేస్తున్నప్పుడు పైశాచికపు ఆనందంతో నా పెదాలపై విషపు నవ్వు విచ్చుకుంది. పరుపు మీద ఉన్న నాకు అతని గుండె చప్పుడు కొద్ది నిమిషాల వరకు స్పష్టంగా వినబడింది. తర్వాత హఠాత్తుగా అది ఆగిపోయింది. ముసలతను చనిపోయాడు.నేను పరుపును పక్కకి జరిపి అతని ఎదపై చెవి ఆనించి చూశాను. చడీ చప్పుడు లేదు. అతని గుండె శాశ్వతంగా ఆగిపోయింది. అతని కళ్లు జీవం కోల్పోయాయి. అవి ఇంకెప్పుడూ నన్ను చిరాకు పెట్టలేవు. ముఖ్యంగా రక్తపు ముద్దలా ఎర్రగా ఉండే అతని ఎడమ కన్ను అంటే నాకు పరమ అసహ్యం. నేను అతణ్ని చంపడానికి అదీ ఒక కారణం.ఈ ముసలతను చాలా కాలం నుంచి మా ఇంట్లో పేయింగ్ గెస్ట్‌గా ఉంటున్నాడు. అతనిది ఏ ఊరో నాకు తెలియదు. అతనికి నా అన్నవారెవరూ లేరు. కొంత డబ్బు, కొన్ని ఆస్తిపాస్తుల పత్రాలు మాత్రం అతని వద్ద ఉన్నాయి. అయితే అతని డబ్బుగాని పత్రాలనుగాని తస్కరించాలన్న దురుద్దేశం నాకు లేదు. కానీ ఎందుకో కొన్నాళ్లుగా ఆ ముసలతనిపై నాకు ద్వేషభావన ఏర్పడింది. దానికి కారణం భయానకంగా ఉన్న అతని ఎడమ కన్ను కావచ్చు. ఆ కంటిని చూడగానే నేను ద్వేషంతో రగిలిపోయేవాణ్ని. ఆ ద్వేషాగ్నిని చల్లార్చుకోవడానికే నేనతన్ని అంతమొందించాను. పైగా అతణ్ని చంపే ముందు బాగా భయపెట్టాలనుకున్నాను. నేనెంతగానో అసహ్యించుకునే ఆ రక్తపు ముద్దలాంటి అతని కన్ను భయంతో అదురుతుంటే చూసి ఆనందించాలనుకున్నాను.నా కోరిక తీర్చుకోవడానికి రోజూ సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటలకు చప్పుడు చెయ్యకుండా అతని గది దగ్గరికెళ్లేవాణ్ని. ఆ సమయంలో ఇల్లంతా చీకటిగా ఉండేది. తన గదిలోని దీపాన్ని ఆర్పేసి చీకట్లో పడుకోవడం ముసలతనికి అలవాటు. నేను చిమ్నీకి దట్టంగా మసి పూసిన ఓ లాంతరు తీసుకొని ముసలతని గది తలుపు దగ్గరికెళ్లే వాణ్ని. తలుపును కొద్దిగా తెరిచి ఆ సందులోంచి లాంతరును లోపలికి దూర్చేవాణ్ని. తర్వాత చిమ్నీ మీది మసిని వేలిగోటితో కొద్దిగా తుడిచేవాణ్ని. కొద్దిగా అంటే ఎంతో తెలుసా? నువ్వు గింజ కన్నా తక్కువ. అందులోంచి ఒకే ఒక కిరణం బయటికి వెలువడేది. ఆ కిరణం గదిలో పడుకున్న ముసలతని ఎడమ కంటిపై నేరుగా, సూటిగా పడేలా నేను లాంతరుని పట్టుకునేవాణ్ని. అతని ఎడమ కనుగుడ్డు పెద్దగా ఉండటం వల్ల అతను పడుకున్నప్పుడు కూడా అది తెరుచుకునే ఉండేది. దానిపైన కాంతి కిరణం పడగానే అది అసహనంగా కొట్టుకునేది. అది చూసి నాకు అనిర్వచనీయమైన ఆనందం కలిగేది. నా మనసులోని ద్వేషాగ్ని కొద్దికొద్దిగా చల్లారేది. ఇలా వారం రోజులు చేశాను. కానీ ఎనిమిదో రోజు రాత్రి ఇలా చేస్తున్నప్పుడు నా చేతివేలి గోరు చిమ్నీకి గట్టిగా తగలటంతో సన్నగా చప్పుడైంది. ఆ నిశ్శబ్ద నిశీధిలో అది ముసలతనికి పెద్దగా వినిపించినట్టుంది. అతను భయం, విస్మయం జత కలిసిన స్వరంతో ‘‘ఎవరూ?’’ అని అరిచాడు. నేను జవాబివ్వలేదు. ఉన్న చోటు నుంచి కదల్లేదు. ఇల్లంతా చిమ్మచీకటి, పైగా నేను నల్లటి దుస్తులు ధరించాను. అతనికెలా కన్పిస్తాను? నేను చాలాసేపటి వరకు కదలకుండా అలాగే కూర్చున్నాను.గంట తర్వాత లాంతరు చిమ్నీ మీది మసిని వేలిగోటితో గీకాను. సన్నటి దారపు పోగు లాంటి కాంతి కిరణం బయటికి వెలువడింది. దాన్ని సూటిగా ముసలాయన ఎడమ కన్నుపై పడేలా లాంతరును పట్టుకున్నాను. ఇప్పుడు ఆ కన్ను పూర్తిగా తెరుచుకొని ఉంది. భయంగా లాంతరు వైపు చూస్తోంది. రక్తపు ముద్దలా ఉన్న ఆ ఎర్రటి కనుగుడ్డును చూడగానే నాలో కసి రేగింది.భయంతో ముసలాయన గుండె కొట్టుకుంటున్న చప్పుడు నాకు స్పష్టంగా వినపడసాగింది.‘లబ్.. డబ్... లబ్... డబ్’ అంటూ.గంట నుంచి ముసలతను బిక్కుబిక్కుమంటూ పడుకున్నాడని నాకు అర్థమైంది. క్షణక్షణానికీ అతని భయం పెరుగుతోందనటానికి సూచనగా అతని గుండె చప్పుడు మరింతగా పెరగసాగింది. ఆ శబ్దాన్ని నేను భరించలేకపోయాను. వెంటనే దాన్ని ఆపకపోతే నాకు పిచ్చెక్కుతుందనిపించింది. వెంటనే లాంతరు పక్కన పెట్టేసి అతని పరుపు దగ్గరికెళ్లాను. ఆ అలికిడికి ముసలతను కెవ్వుమంటూ గట్టిగా అరిచాడు.అంతే! నేను మెరుపు వేగంతో అతణ్ని పరుపుపై నుంచి కిందికి తోసేసి అదే పరుపుతో అతనికి ఊపిరి ఆడకుండా చేసి చంపేశాను. ఇప్పుడతని గుండె చప్పుడు శాశ్వతంగా మూగబోయింది. ఇంతవరకు నన్ను చిరాకు పెట్టిన ఆ ఎర్రటి కనుగుడ్డు కూడా జీవం కోల్పోయింది. ఇక నన్ను ఆ కన్నుగాని, గుండె చప్పుడుగాని ఇబ్బంది పెట్టలేవు.మీరు నన్ను పిచ్చివాడనుకుంటున్నారా? మీ అంచనా తప్పు. నేను హత్య చేశాక ఎంత తెలివిగా శవాన్ని మాయం చేశానో తెలిస్తే మీరు నా తెలివిని మెచ్చుకోకుండా ఉండలేరు. అమెరికాలోని చాలా ఇళ్లు కలపతోనే చేస్తారని మీకు తెలుసు కదా. చివరికి ఇంట్లోని నేలను కూడా చెక్క పలకలతోనే కప్పుతారు. ముసలాయన ఉండే గదిలో పలకల కింద ఓ నేలమాళిగ ఉంది. ఆ విషయం నాకు తప్ప ఇంకెవరికీ తెలియదు. నేను నేలమాళిగ మీద గల మూడు పలకల్ని తొలగించి ముసలాయన శవాన్ని అందులోకి చేర్చాను. తర్వాత పలకల్ని యథాస్థానంలో బిగించాను. ఆ పని ఎంత చాకచక్యంగా చేశానంటే, ఆ పలకల్ని తీసి మళ్లీ బిగించినట్టు బ్రహ్మదేవుడు కూడా కనుక్కోలేడు.నేను ఎంత తెలివిగా హత్య చేశానో చూశారా? ఘటనా స్థలంలో ఒక్క ఆధారాన్నీ వదల్లేదు. అక్కడ ఒక్క చుక్క రక్తం లేదు. చిన్న మరక కూడా పడలేదు. అంటే అక్కడ కడగటానికీ, తుడవటానికీ ఏమీ లేదు. అప్పుడు సమయం తెల్లవారుజాము నాలుగు గంటలు కావస్తోంది. కానీ దట్టమైన చీకటి వల్ల ఇంకా అర్ధరాత్రి దాటలేదనిపిస్తోంది. గోడ గడియారం నాలుగు గంటలు కొట్టింది. అదే సమయంలో ఎవరో తలుపు తట్టారు. నేను ఉలిక్కిపడలేదు. ఎందుకు భయపడాలి? నేనెక్కడా పొరపాటు చెయ్యలేదు కదా. ధైర్యంగా వెళ్లి తలుపు తీశాను. ముగ్గురు వ్యక్తులు లోపలికొచ్చారు. వారు పోలీసులు! రెండు గంటల క్రితం నా ఇంట్లోంచి ఓ గావుకేక వినపడిందని పక్కింటివారు పోలీసులకు సమాచారం అందించారట. ఏం జరిగిందో తెలుసుకోవడానికి పోలీసులు నా ఇంటికొచ్చారు.నేను కంగారు పడలేదు. చిరునవ్వు నవ్వి వారికి స్వాగతం పలికాను. ‘‘మీకు కష్టం కలిగించినందుకు నన్ను క్షమించండి. ఆ గావుకేక నేను వేసిందే! ఇంట్లో నేను తప్ప ఇంకెవరూ లేరు. ఇక్కడ పేయింగ్ గెస్ట్‌గా ఉన్న ముసలాయన తన ఊరికెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉండటం వల్ల కాబోలు నిద్రలో పీడ కలొచ్చి భయంతో అరిచాను సార్’’ వినయంగా చెప్పాను.తర్వాత నేను వారికి ఇల్లంతా తిప్పి చూపించాను. చివరగా మేం ముసలాయన గదిలోకి అడుగుపెట్టాం. అక్కడ ముసలాయనకి సంబంధించిన ఖరీదైన వస్తువులు, విలువైన పత్రాలను కూడా చూపించాను. వాటిని చూసి పోలీసులు సంతృప్తి చెందారు. నేను అత్యుత్సాహంగా ఆ గదిలో వారి కోసం కుర్చీలు వేసి కూర్చోమని చెప్పాను. ‘‘పాపం, మీరు నా కోసం నిద్ర చెడగొట్టుకొని వచ్చారు. కాసేపు విశ్రాంతి తీసుకొని వెళ్లండి’’ అంటూ నేను కూడా కుర్చీలో కూలబడ్డాను. నా కుర్చీని సరిగ్గా నేలలో శవం ఉన్న చోట వేసుకున్నాను. చూశారా, నాకెంత ధైర్యమో! పోలీసులు నా మాటల్ని తేలిగ్గా నమ్మేశారు. ఓ బరువు దిగిపోయినట్టు వారు నిశ్చింతగా కుర్చీల్లో కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకోసాగారు. అందులో నేను కూడా ఉత్సాహంగా పాలుపంచుకున్నాను.కాసేపు సరదాగా గడిచింది. అంతలో ఉన్నట్లుండి నా మనసులో అలజడి మొదలైంది. తల నొప్పిగా అనిపించింది. చెవుల్లో ఏవేవో శబ్దాలు వినిపించసాగాయి. పోలీసులు తొందరగా వెళ్లిపోతే బావుండనిపించింది. కానీ వారు మాటల్లో లీనమైపోయారు. నాకు విన్పిస్తున్న శబ్దాలు పోలీసులకు వినిపించకూడదని నేను గట్టిగా మాట్లాడసాగాను. కానీ నేను ఎంత గట్టిగా మాట్లాడితే ఆ శబ్దాలు అంతకన్నా గట్టిగా వినపడసాగాయి. అంతలో ఆ శబ్దాలు ఎక్కడ నుంచి వస్తున్నాయో నాకు తెలిసి పోయింది. అవి నేను కూర్చున్న కుర్చీ కింద గల నేలమాళిగలో నుంచి వస్తున్నాయి. రాను రాను ఆ శబ్దాల తీవ్రత పెరగసాగింది. ఇప్పుడవి మరింత స్పష్టంగా వినిపించసాగాయి.‘‘లబ్... డబ్... లబ్.. డబ్...’’వేగంగా గుండె కొట్టుకునే శబ్దాలవి. సందేహం లేదు. ముమ్మాటికీ అవి ముసలాయన గుండె చప్పుళ్లే! కానీ ఇదెలా సాధ్యం? చనిపోయిన మనిషి గుండె ఎలా కొట్టుకుంటుంది?ఆ ఆలోచన రాగానే ఉద్వేగంతో నా గుండె ఆగిపోతుందేమోనని భయమేసింది. భయాందోళనల వల్ల నా ముఖం వివర్ణమైంది. విచిత్రమేమంటే, ఆ శబ్దాలు పోలీసులకు వినిపించడం లేదు. వారు ఉల్లాసంగా కూర్చొని తమ పాత కేసుల గురించి చర్చించుకుంటున్నారు. పోలీసుల్ని వెళ్లగొట్టాలనే ఉద్దేశంతో వారి మాటలకు అడ్డు తగులుతూ వారి గురించి నిష్ఠూరంగా మాట్లాడటం మొదలెట్టాను. అయినా వారు నా మాటల్ని పట్టించుకోలేదు. దాంతో నేను కుర్చీలో నుంచి లేచి గదిలో అసహనంగా పచార్లు చేస్తూ, వారి ప్రతి మాటనీ తప్పు పట్టసాగాను. కోపంగా కాళ్లతో నేలను తన్నుతూ వారిని తిట్టసాగాను.వారు హఠాత్తుగా మాటలాపి నా వైపు వింతగా చూశారు. అయినా వారు తమ కుర్చీలోంచి లేవలేదు. మరోపక్క ఆ శబ్దాల తీవ్రత క్షణక్షణానికీ పెరగసాగింది. ‘‘లబ్.. డబ్.. లబ్.. డబ్’’నాలో ఉద్వేగం తారాస్థాయికి చేరుకుంది. కోపంగా నా కుర్చీని పైకెత్తి దూరంగా విసిరేశాను. అది చూసి పోలీసులు మొదట విస్తుపోయినా తర్వాత ఒకరివైపొకరు చూసుకొని ముసిముసిగా నవ్వుకోసాగారు. అది చూసి నా కోపం నషాళానికి ఎక్కింది.వారెందుకు నవ్వుతున్నారు? నాకు వినిపిస్తున్న శబ్దాలు వారికి వినిపించడం లేదా? లేక అవి వినిపించనట్టు నటిస్తున్నారా? హే భగవాన్! వారి నవ్వు నన్ను చిత్రవధకు గురి చేస్తోంది. నా గుట్టుతెలిసిపోయిందని వారు నన్ను అవహేళన చేస్తున్నారా? వారి ఎగతాళిని నేను భరించలేక పోతున్నాను. పుండు మీద కారం చల్లినట్టు నేలమాళిగలో నుంచి ఆ శబ్దాలు మరింత పెద్దగా, కర్ణకఠోరంగా వినిపిస్తున్నాయి. ‘‘లబ్.. డబ్.. లబ్.. డబ్..’’నేను భయంగా చెవులు మూసుకున్నాను. అయినా ఆ శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. పైగా వాటి తీవ్రత క్షణక్షణానికీ పెరుగుతోంది. ఆ శబ్దాల తాకిడికి నా తల బద్దలవుతుందనిపించింది. వెంటనే వాటిని ఆపకపోతే నేను చచ్చిపోవడం ఖాయమనిపించింది.నేనిక తట్టుకోలేకపోయాను. గొంతు చిరిగిపోయేలా గట్టిగా అరిచాను. ‘‘మూర్ఖుల్లారా..! ఇంతసేపు చోద్యం చూస్తూ కూర్చున్నారా? నేను నేరాన్ని అంగీకరిస్తున్నాను. ఈ పలకల్ని తొలగించండి. వాటి కింద నేను దాచిన ఆ ముసలివాడి శవాన్ని వెంటనే ఇక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లండి. ఆ శవం లోంచి వస్తున్న గుండె చప్పుడు నా ప్రాణాన్ని తోడేస్తోంది’’. అంతలో ఉన్నట్లుండి నా మనసులో అలజడి మొదలైంది. తల నొప్పిగా అనిపించింది. చెవుల్లో ఏవేవో శబ్దాలు వినిపించసాగాయి. పోలీసులు తొందరగా వెళ్లిపోతే బావుండనిపించింది. కానీ వారు మాటల్లో లీనమైపోయారు. నాకు వినిపిస్తున్న శబ్దాలు పోలీసులకు వినిపించకూడదని నేను గట్టిగా మాట్లాడసాగాను. కానీ నేను ఎంత గట్టిగా మాట్లాడితే ఆ శబ్దాలు అంతకన్నా గట్టిగా వినపడసాగాయి. అంతలో ఆ శబ్దాలు ఎక్కడ నుంచి వస్తున్నాయో నాకు తెలిసి పోయింది. అవి నేను కూర్చున్న కుర్చీ కింద గల నేలమాళిగలో నుంచి వస్తున్నాయి. -
బలం ఉన్నోళ్లకే జలం
చెరువులకు నీటి సరఫరాలో రాజకీయం ప్రాంతాల మధ్వ విద్వేషాలు రెచ్చగొడుతున్న నేతలు అల్లాడిపోతున్న సామాన్యులు ఈ చిత్రంలో కనిపిస్తున్నది శింగనమల చెరువు. ఈ చెరువు కింద శింగనమల మండలంతో ఏడెనిమిది గ్రామాలు ఆధారపడి ఉన్నాయి. చెరువులోకి ఏటా మిడ్‌పెన్నార్ నుంచి నీరొచ్చేది. దీంతో ఆయా గ్రామాల్లో తాగునీటి సమస్య ఉండేది కాదు. మరోవైపు వందల మంది మత్స్యకారులకు చేపల పెంపకం ద్వారా ఉపాధి దొరికేది. కానీ ఈ ఏడాది శింగనమల చెరువుకు చుక్కనీరు విడుదల చేయలేదు. దీంతో ఆయా గ్రామాల వారు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న అధికార పార్టీ నేతలకు పార్టీలో, ప్రభుత్వంలో పెద్దగా ప్రాధాన్యత లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ చిత్రంలో ఉన్నది అనంతపురం రూరల్ మండలం పామురాయి చెరువు.మిడ్‌పెన్నార్ సౌత్ కెనాల్ నుంచి నీళ్లు వచ్చిచేరడంతో తొణికిసలాడుతోంది. ఊట వస్తుండడంతో ఆ నీటితోనే చెరువుకింద భూముల్లో వరిసాగు చేస్తున్నారు. భూగర్భ జలాలు పెరగడంతో పాటు, బోర్లలో నీటిమట్టం పెరిగి తాగునీటి ఇబ్బందులు తీరాయి. ఈ ప్రాంతానికి చెందిన ఓ చోట నాయకుడు అధికారపార్టీ ముఖ్య నేత వద్ద అనుచరుడు ఉండడమే నీటి విఽడుదలకు కారణంగా తెలుస్తోంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఆగాడలకు పై రెండు సంఘటనలు అద్దం పడుతున్నాయి. అయినవారికి ఆకుల్లో..కానివారికి కంచాల్లో పెట్టడం అధికార పార్టీ నాయకులకు మామూలైపోయింది. ఇన్నాళ్లు ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రాతనిథ్యం వహించే ప్రాంతాలకు నిధులు, నీళ్లివ్వకుండా ఇబ్బందులు గురిచేసిన అధికారపార్టీ పెద్దలు..ఇపుడు సొంత పార్టీవారినీ ఇబ్బందులు పెడుతున్నారు. అనుయాయులకు పెద్దపీట వేస్తూ సొంతపార్టీవారినే టార్గెట్ చేస్తున్నారు. అంతిమంగా సామాన్యులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. స్వపక్షీయులపైనా పక్షపాతం ఈ ఏడాది చెరువులకు నీటి విడుదల చేయడంలో అధికారులు పక్షపాతం వహించారన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. నీటి విడుదలలో అధికార పార్టీ నేతలు రాజకీయం చేస్తున్నారు. బలం ఉన్నోళ్లకే జలం అన్న చందంగా నీటి పంపిణీ జరుగుతోంది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో తుంగభధ్ర నుంచి హెచ్చెల్సీకి నీళ్లు గణనీయంగా తగ్గాయి. ఈ కారణంతో ఈ ఏడాది ఆయకట్టుకు కాకుండా భూగర్భజలాల అభివృద్ధికి చెరువులను, కుంటలను నింపాలని నిర్ణయించారు. హెచ్చెల్సీకి వచ్చిన నీళ్లు, హంద్రీ-నీవా కలిపి దాదాపు 25 టీఎంసీలకు పైగా నీళ్లొచ్చాయి. వీటిలో సింహభాగం చెరువులు, కుంటలు నింపేందుకే వెచ్చించినట్లు అధికారులు చెప్తున్నారు. అయితే ఓ ప్రణాళిక లేకుండా నీటి పంపిణీ జరుగుతోందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. కొన్ని చెరువులకే నీళ్లు! హెచ్చెల్సీ సౌత్ కెనాల్ కింద 18 చెరువులకు 1.88 టీఎంసీలు కేటాయించారు. పీఏబీఆర్ కుడికాలువ కింద 49 చెరువులుంటే 38 వాటికి నీరిచ్చారు. ఇప్పటి వరకూ 2.4 టీఎంసీలు విడుదల చేశారు.15 శాతం నుంచి 50 శాతం, రెండు చెరువులు వందశాతం నింపామని అధికారులే చెప్తుండడం గమనార్హం. కొన్ని వాటికి 50 శాతం, వందశాతం, మరికొన్నింటికి కేవలం 15 శాతం మాత్రమే నీళ్లు వదలడం ఏమిటనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చెరువులు నింపడంలో ఇంత వ్యత్యాసం ఎందుకనే ప్రశ్నలూ ఉత్పన్నమవుతున్నాయి. చుక్కనీటిని నోచుకోని ముక్తాపురం చెరువు కనగానపల్లి మండలం ముక్తాపురం చెరువుకు చుక్కనీరు ఇవ్వలేదు. కానీ చివరన ఉన్న ఉన్న తాడిమర్రి మండలం నార్సింపల్లి చెరువును 50 శాతం నీటితో నింపడం విమర్శలకు దారితీస్తోంది. విశ్రాంత డీజీపీ జేవీ రాముడు సొంత గ్రామం నార్సింపల్లి కావడంతో అధికారులు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారనే ఆరోపణలు రెండేళ్ల నుంచీ వినిపిస్తున్నాయి. ఈ ఏడాది కూడా సీఎం స్థాయిలో ఒత్తిళ్లు తెచ్చుకొని నీటిని తీసుకుపోయారు. కానీ ముందున్న చెరువులకు చుక్కనీరు పోవడం లేదు. ఆయకట్టు ఎలాగూ పోయింది. కనీసం భూగర్భజలాలు పెంచుకునేందుకు చెరువులకైనా నీటిని సక్రమంగా పంపిణీ చేశారా ? అంటే అదీ లేదు. వచ్చే వేసవిలో ఆయా గ్రామాల్లో భూగర్భజలాలు అడుగంటి తాగునీటికి సైతం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొందని ఆయా ప్రాంతాల రైతులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిసారి మాకు అన్యాయమే కాలువ నీటి విషయంలో ప్రజాప్రతినిధులు, అ«ధికారులు ప్రతి సంవత్సరం అన్యాయం చేస్తున్నారు. ముక్తాపురం చెరువు పక్కనే కాలువ పోతున్నా ఒక్కసారి కూడా చెరువులోకి నీటిని వదలలేదు. బోరుబావులలో నీరు అడుగంటిపోయి ఖరీప్‌లో సాగుచేసిన పంటలన్నీ ఎండిపోయాయి. ఇప్పుడైనా చెరువుకు నీటిని వదిలితే రబీలోనైనా పంటలు సాగు చేసుకుందామనుకుంటే ఇంతవరకు కాలువ నీరు ఇటువైపు రాలేదు. -రైతు, సుబ్బిరెడ్డి, ముక్తాపురం గ్రామం వరి మడులన్నీ బొందుపోయాయి బోరుబావుల్లో నీరు అడుగంటిపోయి ఖరీఫ్‌లో సాగుచేసిన వరి మడులన్నీ బొందుపోయాయి. పశుగ్రాసం మాత్రమే దక్కింది. కాలువకు నీరు రావటం లేదు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కాలువ ద్వారా ముక్తాపురం చెరువుకు నీటిని వదలాలి. -చెన్నేకేశవులు, ముక్తాపురం గ్రామం -
‘ఆన్‌ఫ్రాంక్’ పేరు ఎపుడైనా విన్నారా?
కొత్త కోణం ఆన్‌ఫ్రాంక్ డైరీని చదివినప్పుడల్లా రెండవ ప్రపంచయుద్ధం సందర్భంగా జరిగిన నరమేధానికి కారణమైన జాత్యహంకారం వికృతరూపం గుర్తుకొస్తుంది. జాతి, వర్ణ, మత, కులపరమైన దురహంకారం ఎన్ని దారుణాలకు ఒడిగడుతుందో, ఎంతటి మారణహోమం సృష్టించగలదో అవగతమవుతుంది. ఈ నాటికీ ప్రపంచంలో ఇటువంటి ఆధిపత్య ధోరణులు, దురహంకారాలు ఇంకా బతికే ఉన్నాయన్నది వాస్తవం. దురహంకారం వివక్షకు, వివక్ష విద్వేషానికి, విద్వేషం వినాశనానికి దారితీస్తుందనేది చరిత్ర చెప్పిన సత్యం. ‘ఆన్‌ఫ్రాంక్’ పేరు ఎపుడైనా విన్నారా? అప్పుడే ప్రపంచాన్ని అర్థం చేసుకుంటున్న చిన్న వయస్సులోనే ఆమె ప్రపంచ యుద్ధ బీభత్సాన్ని చూడాల్సి వచ్చింది. జర్మన్ నాజీల జాత్యహంకారాన్ని, యూదుల ఊచకోతను, ఫాసిస్టు నిరంకుశత్వాన్ని అర్థం చేసుకోవాల్సిరావడమే కాదు... స్వయంగా తాను, తన కుటుంబం గురికావాల్సి వచ్చింది. ఆటపాటలతో సాగాల్సిన ప్రాయంలో యుద్ధం మధ్య, చిన్న బ్రెడ్డు ముక్క కరువై పేగులు లుంగలు చుట్టుకుపోతుండగా... నాజీల నరమేధానికి ఏరులై పారిన యూదుల నెత్తుటి ప్రవాహాలు, శవాల గుట్టలను, నాజీల ఇనుప బూట్ల కింద నలిగిపోతున్న మాన వత్వాన్ని చూస్తూ కూడా స్వేచ్ఛా కాంక్షను, జీవితేచ్ఛను, రేపటిపై ఆశను గానం చేసింది. అందుకే ఆ చిన్నారి పసి హృదయంపై ఆ చీకటి రోజుల ముద్రలను నమోదు చేసిన ఆమె జీవితం, ప్రత్యేకించి ఆమె ‘డైరీ’ దశాబ్దాలుగా ఎందరినో ప్రభావితం చేస్తోంది. నల్ల సూరీడు నెల్సన్ మండేలా వారిలో ఒకరు. ఆయన ‘‘ఆన్‌ఫ్రాంక్ డైరీని నాతో పాటు చాలా మందిమి చదివాం. ఈ పుస్తకాన్ని నేను జైలుకు వెళ్లక ముందు చదివాను. మళ్ళీ దక్షిణాఫ్రికాలోని రాబెన్ దీవిలోని జైల్లో చదివాను. బయట చదివిన దానికి, జైల్లో ఖైదీగా చదివిన దానికి ఎంతో తేడా ఉంది. ఆ పుస్తకం నిండా మా జీవితాలే ఉన్నట్టు భావించి, దానితో మేమూ మమేకమయ్యాం. అతి చిన్న వయస్సులో ఆ అమ్మాయి చూపిన ఆత్మ విశ్వాసం నన్ను నిబ్బరంగా నిలిచేట్టు చేయగలిగింది. జర్మనీలో నాజీ జాత్యహంకారం మైనారిటీలుగా ఉన్న యూదులతో సహా లక్షలాది మందిని పొట్టనపెట్టుకున్నది. ఆన్‌ఫ్రాంక్ ప్రదర్శించిన ధైర్యం మానవ హక్కుల ఉద్యమానికి అజరామరమైన స్ఫూర్తిని అందించింది.’’ చీకటి రోజుల్లోకి... జర్మనీకి చెందిన ఆన్ ఫ్రాంక్ పదమూడో పుట్టిన రోజు (1942 జూన్ 12) కానుకగా లభించిన చిన్న నోట్ బుక్... ఆన్ ఫ్రాంక్ డైరీగా 70 భాషల్లో కోట్లలో ప్రతులు అమ్ముడుపోయి చరిత్రను సృష్టించింది. యుద్ధం, జాత్యహంకారం పదిహేనేళ్లకే చిదిమేసిన ఆ చిన్నారి 1929లో జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్డ్‌లో జన్మించింది. 1933 సార్వత్రిక ఎన్నికల్లో అడాల్ఫ్ హిట్లర్ నేషనలిస్టు సోషలిస్టు జర్మన్ వ ర్కర్స్ పార్టీ (నాజీ)అధికారంలోకి వచ్చింది. ఆర్యన్ జాతి మాత్రమే సంకరం కానిదని, అన్ని జాతులకన్నా అదే పవిత్ర మైనదని, పాలించే హక్కు దానిదేనని నాజీలు బహిరంగంగానే ప్రకటిం చింది. అందుకనుగుణంగా పాఠ్యాంశాలను, పుస్తకాలను, చరిత్రను తిరగ రాయించారు. ప్రత్యేకించి మైనారిటీలుగా ఉన్న యూదులపట్ల విష పూరిత ద్వేషాన్ని నింపారు, అన్ని కళలలోనూ, సంస్కృతిలోనూ జర్మన్ జాత్య హంకారాన్ని నింపారు. జర్మన్ యువతకు విపరీత జాత్యహంకారాన్ని నూరిపోసి, ఎంతటి క్రూరత్వానికైనా పాల్పడేలా వారి మనసులను కలుషితం చేశారు. వారితో హిట్లర్ ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసి... శత్రువులు, రాజకీయ ప్రత్యర్థులపై హింసను, హత్యాకాండను ప్రేరేపించాడు. 1933లోనే మొట్టమొదటి నిర్బంధ శిబిరం ప్రారంభమైంది. సరిగ్గా ఆ సమయంలోనే కుటుంబ వ్యాపారం జీవనాధారంగా బతికే యూదులైన ఆన్ ఫ్రాంక్ కుటుంబం జర్మనీ నుంచి నెదర్లాండ్స్‌కు పారిపోయింది. ఆమ్‌స్టర్‌డాంలో మళ్లీ వ్యాపారం మొదలు పెట్టిన ఆ కుటుంబం ఎంతో కాలం ప్రశాంతంగా బతికింది లేదు. 1940లో నాజీ జర్మనీ, నెదర్లాండ్స్‌ను ఆక్రమించింది. ఆన్‌ఫ్రాంక్ తండ్రి అమెరికాకు వలస వెళ్ళడానికి ప్రయత్నించారు. కానీ 1941 జూన్ నాటికే అమెరికా వలసలను నిలిపివేసింది. దీంతో ఆన్‌ఫ్రాంక్ తండ్రి ఒట్టో ఫ్రాంక్ తన కుటుంబం అజ్ఞాతంలో బతికే ఏర్పాట్లు చేశాడు. ఒట్టో ఫ్రాంక్ పెద్ద కూతురు మార్గట్‌ను నాజీ నిర్బంధ శ్రమ శిబిరానికి పంపాలని 1942 జూలైలో సైనిక ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. దీంతో తల్లిదండ్రులు, అక్కలతో కలిసి ఆన్ 1942, జూలై 6 నుంచి 1944, ఆగష్టు 4న అరెస్టయ్యేవరకు అదే పట్టణం లోని ఒక చిన్న ఇంటిలోని రహస్యమైన అటకలాంటి ప్రదేశంలో అజ్ఞాత జీవితం గడిపారు. ఆన్ ఫ్రాంక్ డైరీ అక్కడే రూపుదిద్దుకున్నది. పసి హృదయంపై జాత్యహంకారం గురుతులు నాటి పరిస్థితులు నిష్కల్మషమైన ఒక అమాయకపు పసి హృదయంపై వేసిన ముద్రలకు మించిన సజీవ చరిత్ర రచన మరేముంటుంది? ‘‘జర్మన్లు ఆక్రమించుకోవడంతో మా బాధలు మొదలయ్యాయి. యూదులను హింసించే చట్టాలు కూడా చేశారు. యూదులు ప్రత్యేకంగా కనిపించాలి. పసుపు నక్షత్రాలు ధరించాలి. యూదులు సైకిళ్ళపైనే తిరగాలి. ట్రాములు ఎక్కకూడదు. కార్లు ఉన్నా వాటిలో తిరగరాదు. సాయంత్రం 3 నుంచి 5 గంటల మధ్యనే షాపింగ్ చేయాలి. అదీ వారికి కేటాయించిన షాపుల్లోని వస్తువులనే కొనుగోలు చేయాలి. మంగలి షాపులు, బ్యూటీ క్లినిక్‌లు కూడా అంతే. రాత్రి 8 నుంచి పొద్దున ఆరు వరకు ఇండ్ల నుంచి బయటకు రాకూడదు. సినిమాలు, నాటకాల లాంటి వినోదాలకు వెళ్ళకూడదు. ఎటువంటి క్రీడల్లో పాల్గొనరాదు. స్వంత తోటలలోనైనా, స్నేహితుల తోటలలోనైనా రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఎటువంటి గోష్టులు, సమావేశాలు జరపకూడదు. యూదుల ఇళ్ళలోకి క్రైస్తవులను రానివ్వరాదు. యూదుల పిల్లలు వాళ్ళు నడిపే పాఠశాలల్లోనే చదవాలి. మీరు ఇది చెయ్య కూడదు. అది చెయ్యకూడదు. అడుగడుగునా ఆంక్షలే మమ్మల్ని వెంటాడు తున్నాయి. కానీ జీవితం సాగుతూనే ఉన్నది.’’ కిట్టీని ఉద్దేశిస్తూ ఆన్ ఫ్రాంక్ రాసింది. ఎవరో ఒకరితో మాట్లాడినట్లు రాయకపోతే తనకు బాగుండదని అభిప్రాయపడిన ఆన్ ఫ్రాంక్ ‘కిట్టీ’గా తనని తానే సంబోధించుకుంది. ‘‘కింద పెద్ద షాపుంది. దాన్ని స్టోర్‌గా వాడతారు. ఇంటి ముఖద్వారం పక్కనే ఆ షాపు తలుపుంది. ప్రవేశానికి ఎదురుగా నిటారుగా ఉన్న మెట్ల వరుస ఉంది. ఎడమవైపున్న సన్నని వరండా ఒక గదిలోకి తీసుకెళుతుంది. అదే ఫ్రాంక్ కుటుంబం బెడ్రూం. మూలనున్న తలుపు తీస్తే మరుగుదొడ్డి, మరో తలుపుతీస్తే, నేనూ, మార్గెట్ ఉండే గది. భవనానికి ముందు వైపు ఒక అటక, ఒక కొట్టు. అదీ మేముండే రహస్యమైన గృహానుబంధ భాగం (ఎనెక్స్)’’ అంటూ ఆన్ ఫ్రాంక్ తమ రహస్య నివాస స్థలాన్ని వివరించింది. ఆ ఇరుకు స్టోర్ రూంలోనే దాదాపు మూడేళ్లు ఫ్రాంక్ కుటుంబం సహా ఎనిమిది మంది ఉన్నారు. మరుగుదొడ్డి, బాత్రూంలు కూడా తాత్కాలికంగా ఏర్పర్చుకున్నవే. తిండికి, మందులకు ఎంతో అవస్థ పడ్డారు. అదే సమయంలో జర్మనీలో, నెదర్లాండ్‌లో, ఇతర యూరప్ దేశాల్లో యూదులు, ఇతర మైనారిటీ జాతులు, మతస్తులు, రాజకీయ ప్రత్యర్థులు లక్షలాది మంది జైళ్ళల్లో, నిర్బంధ శిబిరాల్లో బందీలయ్యారు. అప్పట్లో భార్యల నుంచి భర్తలను, తల్లిదండ్రుల నుంచి పిల్లలను, అక్కచెల్లెళ్ళను, అన్నదమ్ములను వేరు చేసి నిర్దాక్షిణ్యంగా, అత్యంత కిరాతకంగా హత్య చేసిన వైనం ఆ డైరీలో ఉంది. 1945లో జర్మనీ ఓటమి పొందే నాటికి దాదాపు 90 లక్షల మంది యూదులు ఊచకోతకు గురైనట్టు అంచనా. పోలండ్‌లో 1939లో 33 లక్షలుగా ఉన్న యూదు జనాభా యుద్ధం ముగిసేనాటికి 20 వేలకు పడిపో యిందంటే నాటి జాత్యహంకార విద్వేషం ఎంతటి నరమేధాన్ని సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు. నాజీ నరమేధంలో రాలిన శాంతి కపోతం జాత్యహంకారానికి బలైన ఐదు లక్షల మంది యూదు బాలలలో ఆన్‌ఫ్రాంక్, ఆమె అక్క మార్గెట్ ఫ్రాంక్ కూడా ఉన్నారు. రహస్య జీవితంలో ఉండగానే ఎవరో ద్రోహులు ఇచ్చిన సమాచారం వల్ల పోలీసులు, జర్మన్ సైనికులు 1944, ఆగస్టు 4న వాళ్ళు తల దాచుకున్న ఇంటిని చుట్టుముట్టి వారిని అరెస్టు చేశారు. ఆన్ ఫ్రాంక్ తల్లిదండ్రులను వేర్వేరు నిర్బంధ శిబిరాలకు తర లించారు. మార్గట్, ఆన్‌లను మరొక శిబిరంలో నిర్బంధించారు. ఆరు నెలల తర్వాత తల్లి, ఇద్దరు అక్కాచెల్లెళ్ళు టైఫస్ వ్యాధితో చనిపోయారు. 1945 సెప్టెంబర్‌లో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసేనాటికి ఆన్ తండ్రి ఒట్టో ఫ్రాంక్ మాత్రమే సజీవంగా మిగిలాడు. 1947లో డచ్ భాషలో ఆయన ఆన్ ఫ్రాంక్ డైరీని ప్రచురించారు. అది 1952లో ఇంగ్లిష్‌లో వచ్చింది. అందులోని ఈ వాక్యాలు ఆమె వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి: ‘‘నేను నా తల్లి లాగా, మిగతా అందరు ఆడవాళ్ళలాగా భర్త పిల్లల కోసం మాత్రమే బతకాలను కోవడం లేదు. ఇంకా ఏదో చేయాలని ఉంది. వృధాగా బతకడం నాకిష్టం లేదు. నేను అందరికీ ఉపయోగపడాలి. సంతోషపెట్టాలి. నేను నా చావు తర్వాత కూడా బతకాలి.’’ ఆమె రాసుకున్నట్టే ఆన్ ఫ్రాంక్ ఎప్పటికీ సజీవంగానే నిలిచింది. ఆన్‌ఫ్రాంక్ డైరీని చదివినప్పుడల్లా రెండవ ప్రపంచయుద్ధం సంద ర్భంగా జరిగిన నరమేధానికి కారణమైన జాత్యహంకారం వికృతరూపం గుర్తు కొస్తుంది. జాతి, వర్ణ, మత, కుల పరమైన దురహంకారం ఎన్ని దారు ణాలకు ఒడిగడుతుందో, ఎంతటి నరమేధానికి కారణం కాగలదో అవ గతమ వుతుంది. ఈ నాటికీ ప్రపంచంలో ఇటువంటి ఆధిపత్య ధోరణులు, దురహం కారాలు ఇంకా బతికే ఉన్నాయన్నది వాస్తవం. దురహంకారం వివక్షకు, వివక్ష విద్వేషానికి, విద్వేషం వినాశనానికి దారితీస్తుందనేది చరిత్ర చెప్పిన సత్యం. ఆన్‌ఫ్రాంక్ స్ఫూర్తిగా ఆధిపత్య భావజాలానికి వ్యతిరేకంగా మనిషి... మానవత్వం, సత్యం కోసం నిరంతరం పోరాడాల్సిన సమయమిది. మార్చి 12 ఆన్ ఫ్రాంక్ 71వ వర్ధంతి వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు, మల్లెపల్లి లక్ష్మయ్య మొబైల్: 97055 66213 -
చంద్రబాబుపై ఫిర్యాదు
ఖైరతాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వాఖ్యలు చేయడంతో పాటు తెలంగాణను విదేశంతో పోల్చిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జీడిమెట్లకు చెందిన న్యాయవాది రాజశేఖర్‌రెడ్డి బుధవారం సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశాడు. ఇటీవల ఏపీఎన్జీఓలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు హైదరాబాద్ నగరంలో ఉండి ఆంధ్రాను పరిపాలించడం విదేశాల్లో ఉండి పాలించినట్టుగా ఉందని చేసిన వాఖ్యలు పత్రికల్లో వచ్చాయని, తెలంగాణను అవమానించే రీతిలో విదేశంతో పోల్చడం రాజద్రోహం అవుతుందని రాజశేఖర్‌రెడ్డి పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఈ వ్యాఖ్యలు రాజద్రోహం కిందకు వస్తాయని చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరాడు. పోలీసులు ఈ ఫిర్యాదును స్వీకరించారు.