బంజారాహిల్స్ (హైదరాబాద్): వివిధ వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాడనే అభియోగం మీద.. తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌కుమార్‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
కమలానగర్ బస్తీవాసి విజయ్‌తో కలసి షేక్ హైదర్ అనే వ్యక్తి బస్తీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పిస్తామని కొంతమంది నుంచి డబ్బులు వసూలు చేశారు. అయితే వారెవరికీ అక్కడ ఇళ్లు రాలేదు. షేక్‌హైదర్, విజయ్ చేతుల్లో మోసపోయినట్లు వారికి తెలిసింది. దీంతో వారంతా బస్తీవాసులపై గొడవకు దిగుతుండటంతో శాంతి భద్రతలకు భంగం కలుగుతోందంటూ అదే బస్తీకి చెందిన జె.గోపీచంద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దీంతో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే తమను మోసగించాడంటూ డబ్బులు చెల్లించిన వారందరికీ విజయ్, షేక్‌హైదర్‌లు చెబుతూ.. వారిని నమ్మించి తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూన్యూస్ స్టూడియోకు తీసుకెళ్లాడు. అక్కడ వారిని బస్తీవాసులుగా పేర్కొంటూ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించేందుకు వారినుంచి ఎమ్మెల్యేపై తప్పుడు కథనాలను ప్రసారం చేశారు. దీంతో తీన్మార్‌మల్లన్నతోపాటు షేక్‌హైదర్, విజయ్, మధులపై ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాం.. కవితే అసలైన పెట్టుబడిదారు!
Comments
Please login to add a commentAdd a comment