Central Mumbai
-
ఈవీఎం, ఈడీ, ఐటీ లేకుండా మోదీ ఎన్నికల్లో నెగ్గలేడు: రాహుల్
ముంబై/లఖ్‌నవూ: బీజేపీ పాలనలో దేశంలో పెచ్చరిల్లిన నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, విద్వేషం తదితరాలను ప్రజలకు చాటిచెప్పేందుకు విధిలేని పరిస్థితుల్లో భారత్ జోడో యాత్రలు చేపట్టాల్సి వచి్చందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ అన్నారు. జాతుల హింసతో అట్టుడికిన మణిపూర్‌లో జనవరి 14న మొదలు పెట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర 63 రోజులకు ఆదివారం ముంబైలో ముగిసింది. ఈ సందర్భంగా సెంట్రల్ ముంబైలోని అంబేడ్కర్ స్మారకం చైత్యభూమిని రాహుల్ సందర్శించారు. రాజ్యాంగ ప్రవేశికను చదివి నివాళులరి్పంచారు. అనంతరం స్థానిక శివాజీ పార్కులో విపక్ష ఇండియా కూటమి ఆధ్వర్యంలో జరిగిన భారీ ర్యాలీలో మాట్లాడారు. మోదీ ఓ అసమర్థ నేత అంటూ దుయ్యబట్టారు. ఈవీఎంలు, ఈడీ, సీబీఐ, ఐటీ లేకుండా లోక్‌సభ ఎన్నికల్లో నెగ్గడం ఆయన తరం కాదన్నారు. ‘‘మోదీ కేవలం అధికారం కోసం అర్రులు చాచే ముసుగు మనిషి. అవినీతిపై మోదీదే గుత్తాధిపత్యం. తనది 56 అంగుళాల ఛాతీ అని ఆయన చెప్పుకునే మాటలన్నీ అబద్ధాలే’’ అంటూ తీవ్ర పదజాలంతో దుయ్యబట్టారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత కోసం వీవీప్యాట్లను కచ్చితంగా లెక్కించాలన్న తమ డిమాండ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం అంగీకరించలేదని ఆరోపించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ మోదీ గ్యారెంటీ సంపన్నుల కోసమైతే ఇండియా కూటమి హామీలు సామాన్యుని కోసమన్నారు. విపక్షాల బల ప్రదర్శనలో భాగంగా జోడో యాత్ర ముగింపులో ఇండియా కూటమి నేతలు పాల్గొన్నారు. డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌తో పాటు శరద్ పవార్ (ఎన్సీపీ–శరద్), తేజస్వీ యాదవ్ (ఆర్జేడీ), ఉద్ధవ్ ఠాక్రే (శివసేన–యూబీటీ), ఫరూఖ్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), మెహబూబా ముఫ్తీ (పీడీపీ) తదితరులు వీరిలో ఉన్నారు. ఇండియా కూటమిలో కీలక పక్షమైన సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ మాత్రం గైర్హాజరయ్యారు. అయితే, యాత్ర ను రాహుల్ విజయవంతంగా ముగించారని కొనియాడుతూ ఆయనకు లేఖ రాశారు. వచ్చేది ‘ఇండియా’ సర్కారే గాంధీ ముంబై నుంచే క్విట్ ఇండియా నినాదమిచ్చారని శరద్ పవార్ గుర్తు చేశారు. బీజేపీని అధికారం నుంచి దించేందుకు ఇండియా కూటమి కూడా ముంబైలో ప్రతినబూనాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఇండియా కూటమేనని స్టాలిన్ అన్నారు. ఎన్నికల బాండ్లను బీజేపీ పాల్పడ్డ వైట్ కాలర్ నేరంగా అభివర్ణించారు. ప్రజలంతా ఒక్కటైనప్పుడే నియంతృత్వానికి తెర పడు తుందని ఉద్ధవ్ అన్నారు. ఈడీ, సీబీఐ సాయంతో రాష్ట్రాల్లో ప్రభుత్వాలను బీజేపీ కూలదోస్తోందని తేజస్వి మండిపడ్డారు. తమ పోరు విద్వేష రాజకీయాలపైనే తప్ప మోదీపైనో, అమిత్ షాపైనో కాదన్నారు. రాజ్యాంగాన్ని మార్చడం బీజేపీ తరం కాదు అంతకుముందు ముంబైలో మహాత్మాగాంధీ నివసించిన మణిభవన్‌ను రాహు ల్ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మార్చడం బీజేపీ తరం కాదన్నారు. ఈ విషయంలో పార్టీ ప్రకటనలు ఉత్తి అరుపులు మాత్రమేనన్నారు. ‘‘జ్ఞానం కేవలం ఒక్క వ్యక్తి సొత్తేనన్నది బీజేపీ, ఆరెస్సెస్ భావన. రైతులు, కారి్మకులు, నిరుద్యోగ యువతకు ఏమీ తెలియదన్నది వారి దురభిప్రాయం’’ అంటూ మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికలను కేంద్రీకృత పాలనే కావాలనే బీజేపీ, అది వికేంద్రీకృత తరహాలో సాగాలనే కాంగ్రెస్ భావజాలాల మధ్య పోరుగా అభివరి్ణంచారు. -
ముంబైలో అగ్ని ప్రమాదం
ముంబై: సెంట్రల్ ముంబైలోని మూ డంతస్తుల సిటీ సెంటర్ మాల్లో గురువారం రాత్రి 8.50 గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. తీవ్రంగా శ్రమించిన అగ్ని మాపక సిబ్బంది శుక్రవారం సాయంత్రానికి మంటలను అదుపులోకి తేగలిగారు. ప్రమాద సమయంలో మాల్లో 300 మంది వినియోగదారులు, సిబ్బంది ఉన్నారు. వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ముందు జాగ్రత్తగా మాల్ పక్కనే ఉన్న 55 అంతస్తుల ఆర్కిడ్ ఎన్క్లేవ్ టవర్‌లో నివసించే 3,500 మందినీ బయటకు తీసుకొచ్చారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకున్నామనీ, మొత్తం 3,800 మందిని ప్రాణాపాయం నుంచి కాపాడినట్లు అధికారులు చెప్పారు. మంటలను ఆర్పుతుండగా ఐదుగురు అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారు. బేస్‌మెంట్‌తో కలిపి నాలుగు ఫ్లోర్లున్న ఈ మాల్ రెండో అంతస్తులోని మొబైల్ షాప్‌లో మొదటగా మంటలు వ్యాపించాయి. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
సెంట్రల్ ముంబైలో ఉద్రిక్తత
* ఇరు వర్గాల మధ్య ఘర్షణ * ఏడుగురికి గాయాలు, ఒక బైక్ ధ్వంసం * 50 మందిపై కేసు నమోదు సాక్షి, ముంబై: సెంట్రల్ ముంబైలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘర్షణలో ఏడుగురు గాయపడగా, ఓ ద్విచక్ర వాహనం ధ్వంసమైంది. చట్ట వ్యతిరేకంగా గుమికూడడం, అల్లర్లకు పాల్పడడం అభియోగాలపై పోలీసులు 50 మందిపై కేసు నమోదు చేశారు. లాల్బాగ్ ప్రాంతంలో ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో మత ప్రదర్శనలో పాల్గొని తిరిగి వెళుతున్న వారిపై మరో వర్గం వారు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ వివాదం చిలికి చిలికి గాలి వానగా మారినట్టు మత ఘర్షణనలకు దారితీసింది. దీంతో లాల్బాగ్, భారత్ మాత, బైకలా, పరేల్ తదితర ప్రాంతాల్లో పరిస్ధితులు ఒక్కసారిగా వేడెక్కాయి. అనేక మంది స్థానికులు రోడ్డుపైకి వచ్చారు. సందట్లో సడేమియా అన్నట్లు కొందరు అసాంఘిక దుష్టశక్తులు రాళ్లు రువ్వి శాంతి, భద్రతలకు భంగం వాటిళ్లజేశారు. దీంతో పరిస్థితులు అదుపుతప్పక ముందే పోలీసులు, ఇతర దళాలను రంగంలోకి దింపినట్లు నగర పోలీసు కమిషనర్ రాకేశ్ మారియా చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం ఈద్ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం మాదిరిగానే కొందరు మైనార్టీ యువకులు ఆదివారం రాత్రి బైక్‌లపై ర్యాలీ నిర్వహించారు. దీంతో నగర రహదారులపై ట్రాఫిక్ జాం ఏర్పడింది.భారత్‌మాతా జంక్షన్ వద్ద బైక్‌లపై ముగ్గురేసి యువకులు ప్రయాణిస్తుండగా, వారిపై ఎందుకు చర్య తీసుకోవడం లేదంటూ స్థానికులు కొందరు అక్కడున్న పోలీసులను ప్రశ్నించారని భోయివాడ పోలీస్‌స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ సునీల్ తోండ్వాల్కర్ చెప్పారు. ఈ ఘటన బైక్‌పై ఉన్న యువకులకు, పోలీసులకు, స్థానికులకు మధ్య వాగ్వివాదానికి దారి తీసిందన్నారు. ఆ తరువాత పరిస్థితి అదుపు తప్పి రెండు గ్రూపుల వారు పరస్పరం చేయి చేయి చేసుకున్నారని చెప్పారు. దీంతో మరిన్ని పోలీసు బలగాలను అక్కడికి రప్పించి పరిస్థితిని అదుపులోకి తెచ్చామన్నారు. ఈ ఘటనలో ఏడుగురు గాయపడ్డారని, సెంట్రల్ రైల్వే వర్క్‌షాప్ వద్ద ఒక మోటార్‌సైకిల్ ధ్వంసమైందని కమిషనర్ రాకేశ్ మారియా చెప్పారు. ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు రోడ్లపైకి వచ్చారు. అదే సమయంలో కొందరు రాళ్లు రువ్వడంతో పరిస్థితి అదుపు తప్పుతున్నట్లు కనిపించింది. కానీ పోలీసులు వెంటనే బలగాలను రంగంలోకి దింపి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించగలిగారు. ఈ ఘటనను నిరసిస్తూ రాత్రి వర్లీలో కొందరు రాస్తారోకో చేపట్టారు. దీంతో అక్కడ కూడా వాతావరణం వేడెక్కడంతో పోలీసులను మోహరించారు. మొత్తానికి సోమవారం రెండున్నర గంటల సమయానికి ప్రశాంతత నెలకొంది. అర్థరాత్రి వరకు రాకేశ్ మారియా లాల్బాగ్ ప్రాంతంలో పర్యటిస్తూనే ఉన్నారు. ఎప్పకప్పుడు పరిస్థితులను పర్యవేక్షించారు. సోమవారం కూడా శాంతి, భద్రతలు అదుపులోనే ఉన్నాయని మారియా అన్నారు. ఎలాంటి వదంతులు నమ్మవద్దని నగర ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ట్రాంబేకు చెందిన 27 ఏళ్ల వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని చెప్పారు.