సిటీ సెంట్రల్ మాల్ నుంచి వెలువడుతున్న దట్టమైన పొగ
ముంబై: సెంట్రల్ ముంబైలోని మూ డంతస్తుల సిటీ సెంటర్ మాల్‌లో గురువారం రాత్రి 8.50 గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. తీవ్రంగా శ్రమించిన అగ్ని మాపక సిబ్బంది శుక్రవారం సాయంత్రానికి మంటలను అదుపులోకి తేగలిగారు. ప్రమాద సమయంలో మాల్‌లో 300 మంది వినియోగదారులు, సిబ్బంది ఉన్నారు. వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ముందు జాగ్రత్తగా మాల్ పక్కనే ఉన్న 55 అంతస్తుల ఆర్కిడ్ ఎన్‌క్లేవ్ టవర్‌లో నివసించే 3,500 మందినీ బయటకు తీసుకొచ్చారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకున్నామనీ, మొత్తం 3,800 మందిని ప్రాణాపాయం నుంచి కాపాడినట్లు అధికారులు చెప్పారు. మంటలను ఆర్పుతుండగా ఐదుగురు అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారు. బేస్‌మెంట్‌తో కలిపి నాలుగు ఫ్లోర్లున్న ఈ మాల్ రెండో అంతస్తులోని మొబైల్ షాప్‌లో మొదటగా మంటలు వ్యాపించాయి. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment