కామారెడ్డి టౌన్: కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నాజ్‌టాకీస్ రోడ్‌లోని అయ్యప్ప షాపింగ్ మాల్‌లో రాత్రి 11.20 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. దీనిని గమనించిన నైట్ వాచ్‌మన్ మాల్ యజమానికి, ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చాడు. అయితే ఫైర్ స్టేషన్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పడానికి ప్రయత్నించేలోపే భారీగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దీంతో ఎల్లారెడ్డి, గాంధారి, ఇందల్వాయి, రామాయంపేట, నిజామాబాద్‌ల నుంచి ఆరు ఫైర్ ఇంజన్లను, 50 మంది సిబ్బందిని రప్పించారు.
భవనం నాలుగు అంతస్తుల్లో ఉండటంతో హైదరాబాద్ నుంచి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్, ఫైర్ సర్విసెస్ విభాగం నుంచి భారీ స్కై లిఫ్ట్‌ను తెప్పించారు. ఆరు ఫైర్ ఇంజన్‌లతో పాటు స్కైలిఫ్ట్ ద్వారా మంటలను ఆర్పేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. సుమారు 50 ట్యాంకర్‌ల నీటిని తీసుకు వచ్చి మంటలను ఆర్పారు. గురువారం ఉదయం 11 గంటల సమయానికి మంటలను అదుపులోకి తెచ్చారు. సాయంత్రం 6 గంటల వరకు మంటలు పూర్తిగా ఆరిపోయాయి. అయితే మాల్‌లోని దుకాణాలు కాలిపోయాయి. ఈ ప్రమాదంలో రూ. 6 కోట్లకుపైగా ఆస్తినష్టం జరిగిందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment