City Center
-
ముంబైలో అగ్ని ప్రమాదం
ముంబై: సెంట్రల్ ముంబైలోని మూ డంతస్తుల సిటీ సెంటర్ మాల్లో గురువారం రాత్రి 8.50 గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. తీవ్రంగా శ్రమించిన అగ్ని మాపక సిబ్బంది శుక్రవారం సాయంత్రానికి మంటలను అదుపులోకి తేగలిగారు. ప్రమాద సమయంలో మాల్లో 300 మంది వినియోగదారులు, సిబ్బంది ఉన్నారు. వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ముందు జాగ్రత్తగా మాల్ పక్కనే ఉన్న 55 అంతస్తుల ఆర్కిడ్ ఎన్క్లేవ్ టవర్‌లో నివసించే 3,500 మందినీ బయటకు తీసుకొచ్చారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకున్నామనీ, మొత్తం 3,800 మందిని ప్రాణాపాయం నుంచి కాపాడినట్లు అధికారులు చెప్పారు. మంటలను ఆర్పుతుండగా ఐదుగురు అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారు. బేస్‌మెంట్‌తో కలిపి నాలుగు ఫ్లోర్లున్న ఈ మాల్ రెండో అంతస్తులోని మొబైల్ షాప్‌లో మొదటగా మంటలు వ్యాపించాయి. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
బ్యూటీ లుక్స్..
కలర్‌ఫుల్.. బ్యూటిఫుల్ మోడల్స్ హయలు.. కలర్‌ఫుల్ డ్రస్సులు.. ఫ్యాషన్ ప్రియుల సందడితో బంజారాహిల్స్ సిటీ సెంటర్లోని మాక్స్ షోరూంలో ఉత్సాహం నెలకొంది. ప్రముఖ ఫ్యాషన్ రిటైల్ స్టోర్ మాక్స్‌లో సరికొత్త స్ప్రింగ్ కలెక్షన్ –2017 ఆవిష్కరించింది. బంజారాహిల్స్ సిటి సెంటర్లోని మాక్స్ షోరూంలో బుధవారం మాక్స్ ఏవీపీ వివేక్‌శర్మ కొత్త కలెక్షన్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మోడల్స్ కొత్త కలెక్షన్స్ ప్రదర్శించారు. త్వరలో హిమాయత్‌నగర్‌లో కొత్త షోరూం ప్రారంభిస్తున్నామని, తెలంగాణ, ఏపీల్లో మరిన్ని షోరూంలు ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. – జూబ్లీహిల్స్ -
నమ్మండి.. బాయ్‌ఫ్రెండ్స్ లేరండి
‘నా తాజా చిత్రం ‘నేను.. నాన్న.. నా బాయ్‌ఫ్రెండ్స్’ త్వరలో విడుదల కానుంది. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరిస్తుంది. కానీ నాకు నిజజీవితంలో బాయ్‌ఫ్రెండ్స్ లేరండి’ అని చెప్పింది హీరోయిన్ హెబ్బా పటేల్. ఎస్వీఎం బౌలింగ్ అండ్ గేమింగ్ సెంటర్స్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని సిటీ సెంటర్లో శనివారం చాలెంజ్ పోటీలు నిర్వహించారు. హెబ్బా పటేల్ ఈ కార్యక్రమంలో పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. సినీ నటుడు నోయల్, గేమింగ్ సెంటర్స్ ఎండీ తూళ్ల విజయేందర్‌గౌడ్, పార్వతీశం పాల్గొన్నారు. – జూబ్లీహిల్స్ -
మళ్లీ మొరాయించిన బ్లూలైన్ మెట్రో
సాక్షి, న్యూఢిల్లీ: బ్లూలైన్ మార్గంలో మెట్రో రైలు ప్రయాణం మరోసారి నగరవాసులకు చుక్కలు చూపించింది. సాంకేతిక సమస్య తలెత్తిన కారణంగా బుధవారం ఈ మార్గంలో మెట్రో రైళ్లు నెమ్మదిగా ప్రయాణించడమేకాకుండా పలు స్టేషన్లలో చాలాసేపు ఆగుతూ ఆలస్యంగా ముందుకుసాగాయి. దీంతో అనేక స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ద్వారకా సెక్టర్ 21 నుంచి నోయిడా, వైశాలి వరకుగల మెట్రో లైన్‌పై ఉదయం పది గంటలకు ఓ మెట్రో రైలు ఆగిపోయి ముందుకు కదలలేదు. చాలాసేపు మొరాయించింది. నోయిడా సిటీ సెంటర్ వెళ్లే మెట్రో రైలులోనే సమస్య ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ద్వారకా సెక్టార్-21 నుంచి నోయిడాకు బయలుదేరిన ఈ రైలు ద్వారకా సెక్టార్ - 14 స్టేషన్లో ఆగిపోయింది. సమస్య ఈ రైలులోనే ఉన్నట్లు గుర్తించిన మెట్రో అధికారులు ప్రయాణికులందరినీ దించి ఆ తరువాత సమీపంలోని డిపోకు పంపారు. రైలులో తల్తెతిన సమస్య ఏమిటనేది పరీక్ష అనంతరం తేలుతుందని సంబంధిత అధికారులు చెప్పారు. ఈ సమస్య కారణంగా బ్లూలైన్పై ఇతర రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. పలువురు ప్రయాణికులు తమ తమ గమ్యస్థానాలకు ఆలస్యంగా చేరుకున్నారు. ఇతర లైన్లపై మాత్రం రైళ్లు యథావిథిగా నడిచాయి. 45 నిమిషాలసేపు ఆగిపోయింది కపిల్ అనే ఓ ప్రయాణికుడు మాట్లాడుతూ ద్వారకా సెక్టార్ -9లో ఉదయం గం 9.15 నిమిషాలకు మెట్రో రైలు ఎక్కానన్నాడు. ఆ తరువాత ఈ రైలు పది గంటలదాకా అక్కడే ఉండిపోయింది. ప్రయాణంలో ఆలస్యం కారణంగా నోయిడాలోని కార్యాలయానికి చేరుకునేసరికి మధ్యాహ్నం 12 గంటలైందన్నాడు. కాగా ఈ నెల రెండో తేదీన కూడా మెట్రో రైలు ప్రయాణికులు నానాయాతనలకు గురైన సంగతి విదితమే. ద్వారకా-నోయిడా సిటీసెంటర్-వైశాలి మార్గంలోని జనక్‌పురి స్టేషన్ సమీపంలో ఓవర్‌హెడ్ వైర్ తెగిపోయిన కారణంగా మెట్రో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ మార్గంలో ప్రతిరోజూ దాదాపు ఏడు లక్షలమంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. కాగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్ సీ)... జాతీయ రాజధానితోపాటు జాతీయ ప్రాదేశిక ప్రాంతం పరిధిలోని గుర్గావ్, నోయిడా, ఘజియాబాద్ మెట్రో రైలు సేవలను అందజేస్తోంది. ప్రపంచంలో 13వ అతిపెద్ద మెట్రో రైలు వ్యవస్థ ఇదే. రెడ్, బ్లూ, గ్రీన్, ఎల్లో, వయోలెట్ అని ఐదు రకాల కలర్ కోడ్ లైన్లు ఇందులో ఉన్నాయి. ఇందులో ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో మార్గం అత్యంత పొడవైనది. దీని పొడవు 193.2 కిలోమీటర్లు. ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో మార్గంలో 38 భూగర్భ స్టేషన్లు ఉన్నాయి. అన్ని స్టేషన్లలో ఎస్కలేటర్లు, ఎలివేటర్లను ఏర్పాటుచేశారు. రోజుకు మొత్తం 2,700 ట్రిప్పులను డీఎంఆర్సీ నడుపుతోంది. ఉదయం ఆరు గంటలనుంచి రాత్రి పదకొండు గంటలవరకూ వీటి సేవలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. నాలుగు లేదా ఆరు బోగీలతో మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. -
ఘనంగా వైఎస్సార్ జయంతి
సాక్షి,సిటీబ్యూరో: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 66వ జయంతి ఘనంగా జరిగింది. మంగళవారం నగరంలోని సిటీ సెంటర్, పంజగుట్ట తదితర ప్రాంతాల్లోని వైఎస్సార్ విగ్రహాలను పూలమాలలతో అలంకరించారు. పలుచోట్ల నేతలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ యువజన విభాగం, ఐటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, పేదలకు దుపట్ల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు నగర నేతలు వైఎస్సార్ విగ్రహనికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కేక్‌ను కట్ చేశారు. దాదాపు 70 మంది రక్తాన్ని దానం చేశారు. అనంతరం వైఎస్సార్ యువజన విభాగం రాష్ట్ర నేత పుత్తా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా నగరానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఐటీ, వైద్య విభాగం నేతలు చల్లా మధుసూదన్ రెడ్డి, గోసుల శివభారత్ రెడ్డి , కార్పొరేటర్ సురేష్ రెడ్డి, నగర నాయకులు వెల్లాల రామ్మోహన్, సూర్యనారాయణ రెడ్డి, కోటం రెడ్డి వినయ్ రెడ్డి, భువనగిరి శ్రీకాంత్, నీలం రాజు, బి.మోహన్ కుమార్, వైఎస్సార్ సీపీ ఐటీ విభాగం స్వచ్ఛంద సేవకురాలు కేవీఎస్ పద్మజ, యువజ విభాగం స్టేట్ స్టీరింగ్ కమిటీ సభ్యులు పి. మదన్మోహన్ రెడ్డి, నీలం రాజు మహిళా నేత కె.జ్యోతి రెడ్డి, జార్జ్, కలిఫా, శ్రీకాంత్‌లాల్, జీవన్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇరురాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు కూడా నివాళులర్పించారు.