
చైనా స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ వన్ ప్లోన్ తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌పోన్ వన్ ప్లోస్ 5 టిలో కొత్త ఎడిషన్‌ను లాంచ్ చేసింది. లిమిటెడ్ ఎడిషన్‌గా వన్ ప్లస్ 5టీ "లావా రెడ్" ఎడిషన్ ఇండియన్ మార్కెట్‌లో గురువారం విడుదల చేసింది. ఈ డివైస్ రిజిస్ట్రేషన్లు నేటినుంచి అమెజాన్ లో ప్రారంభమైనాయని, జనవరి 20వ తేదీ మధ్యాహ్నంనుంచి విక్రయానికి అందుబాటులో ఉంటాయని ప్రకటించింది అయితే 6జీబీర్యామ్, 64 జీబీ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ లభిస్తున్న ఒరిజినల్ వన్‌ప్లస్ 5 టీ లా కుండా 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులో ఉంచినట్టు సంస్థ తెలిపింది. దీని ధరను రూ .37,999 గా నిర్ణయించింది.
అందమైన డిజైన్, పవర్‌ఫుల్ ఫీచర్స్‌లకై ఎదురుచూస్తున్న తమ వినియోగదారులకు కోసం మొట్టమొదటి 'లావా రెడ్' ఎడిషన్‌తో 2018నూతన సంవత్సరం ప్రారంభించడం సంతోషంగా ఉందని వన్ ప్లస్ ఇండియా జనరల్ మేనేజర్ వికాస్ అగర్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు. 6అంగుళాల ఫుల్ అమోలెడ్ డిస్ ప్లే,16ఎంపీ + 20ఎంపీ డ్యూయల్ రియర్‌కెమెరా, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 835 చిప్‌సెట్ ,డాష్ ఛార్జ్ తదితర ఫీచర్లను ఈ డివైస్‌లో పొందుపర్చినట్టు చెప్పారు.
Presenting the Powerfully Radiant OnePlus 5T Lava Red
— OnePlus India (@OnePlus_IN) January 11, 2018
Learn more 👉 https://t.co/RsH6cbwCeK pic.twitter.com/nLcf6JYqCW