Indianmarkets
-
రియల్మీ 8 ప్రో : సూపర్ కెమెరా ఫీచర్లు
సాక్షి, ముంబై: స్మార్ట్‌ఫోన్స్ తయారీ కంపెనీ రియల్మీ తొలిసారిగా 108 మెగాపిక్సెల్ అల్ట్రా క్వాడ్ కెమెరాతో ఒక స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరించింది. రియల్మీ8 ప్రో పేరుతో దీన్ని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. క్వాడ్ కెమెరాతోపాటు ప్రపంచంలో తొలిసారిగా స్టారీ టైమ్ ల్యాప్స్ వీడియో, టిల్ట్ షిఫ్ట్ టైమ్ ల్యాప్స్ వీడియో ఫీచర్లను జోడించినట్టు కంపెనీ తెలిపింది. రియల్మీ8 ప్రో ఫీచర్లు 6.40 అంగుళాల సూపర్ అమోలెడ్ ఫుల్ స్క్రీన్ డిస్ప్లే 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720 జీ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 11 16 ఎంపీ సెల్పీ కెమెరా 108+ 8 + 2+ 2 ఎంపీ క్వాడ్ రియల్ కెమెరా 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ధరలు 6 జీబీ వేరియంట్ ధర రూ.17,999 8 జీబీ వేరియంట్ రూ.19,999 -
2021 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ : ధర ఎంత?
సాక్షి, ముంబై: కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ 2021 బైక్ వచ్చేసింది. కొత్తరంగులు, కొత్త డిజైన్‌తో కస్టమర్లను ఆకట్టుకునేలా 2021 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బైక్‌ను భారత మార్కెట్లో తీసుకొచ్చింది. కస్టమర్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా హిమాతయన్ బైక్‌ను అప్డేట్ చేసింది. ఈ అడ్వెంచర్ బైక్ ధరలు 2.01 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుండి ప్రారంభమవుతాయి. గూగుల్ మ్యాప్స్ ప్లాట్‌ఫాంపై ఆధారి ట్రిప్పర్ టర్న్-బై-టర్న్ నావిగేషన్‌తో సహా అనేక అప్డేట్స్ను జోడించింది. రాయల్ ఎన్ఫీల్డ్ యాప్ ద్వారా రైడర్ స్మార్ట్‌ఫోన్‌కు దీన్ని జత చేయవచ్చు. ఈ బైక్‌లో అప్డేటెడ్ సీట్, రియర్ క్యారియర్, ఫ్రంట్ ర్యాక్ కొత్త విండ్‌స్క్రీన్ కూడా అమర్చింది. అయితే ఈ బైక్ మునుపటిలాగే అదే సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. 24.3 బిహెచ్పి, 32 ఎన్ఎమ్లను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ గేర్‌బాక్స్, ముందు వెనుక భాగంలో వరుసగా 300 మిమీ 240 మిమీ డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంటుంది. డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ అమర్చింది. లేదంటే వెనుక చక్రం కోసం ఏబిఎస్ స్విచ్ ఆఫ్ చేయవచ్చు. అలాగే లగేజ్ కోసం ఈసారి ఎక్కువ స్థలం ఉండేలా జాగ్రత్త పడింది. కావాలంటే దీన్ని నచ్చిన విధంగా డిజైన్ కస్టమైజ్ చేయించు కోవచ్చు. గ్రానైట్ బ్లాక్, మిరాజ్ సిల్వర్ పైన్ గ్రీన్ అనే మూడు కొత్త రంగుల్లో కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బైక్ లభిస్తుంది. 2021 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ధరలు మిరాజ్ సిల్వర్: రూ. 236286 గ్రావెల్ గ్రే: రూ. 236286 లేక్ బ్లూ: రూ. 240285 రాక్ రెడ్: రూ. 240285 గ్రానైట్ బ్లాక్: రూ. 240285 పైన్ గ్రీన్: రూ. 244284 -
వన్ ప్లస్ 5టి కొత్త ఎడిషన్
చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్ ప్లోన్ తన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌పోన్ వన్ ప్లోస్ 5 టిలో కొత్త ఎడిషన్‌ను లాంచ్ చేసింది. లిమిటెడ్ ఎడిషన్‌గా వన్ ప్లస్ 5టీ "లావా రెడ్" ఎడిషన్ ఇండియన్ మార్కెట్లో గురువారం విడుదల చేసింది. ఈ డివైస్ రిజిస్ట్రేషన్లు నేటినుంచి అమెజాన్ లో ప్రారంభమైనాయని, జనవరి 20వ తేదీ మధ్యాహ్నంనుంచి విక్రయానికి అందుబాటులో ఉంటాయని ప్రకటించింది అయితే 6జీబీర్యామ్, 64 జీబీ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ లభిస్తున్న ఒరిజినల్ వన్‌ప్లస్ 5 టీ లా కుండా 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులో ఉంచినట్టు సంస్థ తెలిపింది. దీని ధరను రూ .37,999 గా నిర్ణయించింది. అందమైన డిజైన్, పవర్ఫుల్ ఫీచర్స్లకై ఎదురుచూస్తున్న తమ వినియోగదారులకు కోసం మొట్టమొదటి 'లావా రెడ్' ఎడిషన్‌తో 2018నూతన సంవత్సరం ప్రారంభించడం సంతోషంగా ఉందని వన్ ప్లస్ ఇండియా జనరల్ మేనేజర్ వికాస్ అగర్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు. 6అంగుళాల ఫుల్ అమోలెడ్ డిస్ ప్లే,16ఎంపీ + 20ఎంపీ డ్యూయల్ రియర్‌కెమెరా, క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 835 చిప్సెట్ ,డాష్ ఛార్జ్ తదితర ఫీచర్లను ఈ డివైస్‌లో పొందుపర్చినట్టు చెప్పారు. Presenting the Powerfully Radiant OnePlus 5T Lava Red Learn more 👉 https://t.co/RsH6cbwCeK pic.twitter.com/nLcf6JYqCW — OnePlus India (@OnePlus_IN) January 11, 2018 -
మార్కెట్లకు నేడు సెలవు
ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లకు నేడు సెలవు. మే 1, సోమవారం మహారాష్ట్ర డే సందర్భంగా మార్కెట్లకు సెలవు ప్రకటించారు. దీంతో బీఎస్ఈ, ఎన్ఎస్ఈ పని చేయవు. మళ్లీ ట్రేడింగ్ 2వతేదీ మంగళవారం ఉదయం యథావిధిగా మొదలవుతుంది. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం. గత వారం సెన్సెక్స్ మార్కెట్ చరిత్రలో తొలిసారి 30,000 పాయింట్ల మైలురాయి అధిగమించగా, నిఫ్టీ సైతం మొట్టమొదటిసారి 9,350 అధిగమించి ఆల్ టైం హైని రికార్డ్ చేసింది. బ్యాంక్ నిఫ్టీ కూడా గరిష్ట స్థాయిలను నమోదు చేయడం విశేషం. శుక్రవారం సెన్సెక్స్ 29,918 వద్ద, నిఫ్టీ 9,304 వద్ద ముగిశాయి. డాలర్ మారకంలో రుపీ కూడా చాలా బలంగా కొనసాగుతోంది. ఒకదశలో 64 స్థాయిని బ్రేక్ చేసిన రుపాయి గత సెషన్ లో రూ.64.24వద్ద స్థిరపడింది. కాగా గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు విదేశీ ప్రతికూల సంకేతాలతో లాభాలతో ముగిశాయి. ప్రధానంగా ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల రేసులో సెంట్రిస్ట్ అభ్యర్థి ఇమాన్యుయేల్ మాక్రన్ ముందున్నట్లు వెల్లడికావడంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటుకు బూస్ట్ లభించిన సంగతి విదితమే.