![TDP Leaders Murder Attempt On Magazine Editor In Anantapur - Sakshi](/styles/webp/s3/article_images/2018/11/2/repot.jpg.webp?itok=TbFEnKnC)
సాక్షి, అనంతపురం: జిల్లాలో టీడీపీ నేతలు మరోసారి బరితెగించారు. నందు టైమ్స్ మ్యాగజైన్ ఎడిటర్ భాస్కర్ రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో భాస్కర్ రెడ్డి మ్యాగజైన్ ప్రతులు పంపిణీ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసకుంది. ఈ సంఘటనపై భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. తనను హత్య చేసేందుకు మేయర్ స్వరూప కుట్ర పన్నారని ఆరోపించారు. మేయర్ అనుచరులు 8 మంది తనపై దాడి చేసినట్టు తెలిపారు. వ్యతిరేక వార్తలు రాయవద్దని మేయర్ తనను బెదిరించారని అన్నారు. వారు చెప్పినట్టు వినకపోవడంతోనే తనపై దాడి చేసినట్టు పేర్కొన్నారు.
కాగా, ఈ ఘటనపై డీఎస్పీ వెంకట్రావు స్పందిస్తూ.. జర్నలిస్ట్ భాస్కర్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment