షాహిన్ భట్ వచ్చేస్తోంది! | Sahin perfect butt! | Sakshi
Sakshi News home page

షాహిన్ భట్ వచ్చేస్తోంది!

Published Wed, May 28 2014 9:45 PM | Last Updated on Wed, Apr 3 2019 8:58 PM

షాహిన్ భట్ వచ్చేస్తోంది! - Sakshi

షాహిన్ భట్ వచ్చేస్తోంది!

పరిచయం
 
 ఇప్పుడు అందరి కళ్లు ఆమె మీదే...
 ‘షాహిన్ ఎవరు?’
 ???
 ‘పోనీ... షాహిన్ భట్ ఎవరు?’
 ఫోటో చూసి మీరు ఊహించింది నిజమే. అక్షరాల అలియా భట్ చెల్లెలు. ఇప్పుడు అందరి దృష్టి ఇరవై సంవత్సరాల ఈ అమ్మాయి మీదే ఉంది. తండ్రిలా డెరైక్టర్ అవుతుందా? అక్కలా హీరోయిన్ అవుతుందా? అనేది తరువాత విషయంగానీ ముందు ఈ ముద్దు గుమ్మ చెబుతున్న విషయాలు చదువుదాం...
     
‘జెహెర్’, ‘జిస్మ్2’ సినిమాకు కొన్ని సీన్లు రాశాను. ‘రాజ్-3’కి అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేశాను. ‘సన్ ఆఫ్ సర్దార్’ కు సహ రచయితగా పనిచేశాను. లండన్‌లో ఎడిటింగ్, ఫిల్మ్ మేకింగ్ కోర్సులు చేశాను. ఇటీవలే మేకప్ కోర్సు కూడా పూర్తి చేశాను.
     
ఎడిటింగ్ నేర్చుకోవడం అనేది బెస్ట్ డెరైక్టర్ కావడానికి ఉపయోగపడుతుంది. అందుకే ఆసక్తిగా నేర్చుకున్నాను. ప్రొడక్షన్ విషయాలను కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను.
   
స్కూల్లో చదువు మీద కంటే సృజనాత్మక విషయాల పైనే ఎక్కువ దృష్టి ఉండేది. కవిత్వం, నటన నన్ను బాగా ఆకర్షించేవి.
     
కెమెరాలకు పోజు ఇవ్వడం ఎందుకో నాకు నచ్చదు. కెమెరా వెనక తప్ప కెమెరా ముందు నిల్చోలేను.
     
నాన్న నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. ముఖ్యంగా క్రమశిక్షణ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement