Jism 2
-
మీరు నమ్మడం కష్టమే..: సన్నీ లియోన్
ముంబై: బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చే సమయంలో సన్నీ లియోన్ కొన్ని వర్గాల నుంచి చాలా అభ్యంతరాలనే ఎదుర్కొంది. అయితే, కాలక్రమంలో తన గురించి ప్రజల అభిప్రాయం మారుతున్నదని ఈ భామ చెప్తోంది. 34 ఏళ్ల సన్నీ లియోన్ 2012లో ఎరాటిక్ థ్రిల్లర్ అయిన 'జిస్మ్-2' చిత్రంతో బాలీవుడ్ లోకి ప్రవేశించింది. బాలీవుడ్ లో మొదట్లో తన గురించి భిన్నంగా మాట్లాడుకున్నా.. ఇప్పుడు హిందీ పరిశ్రమ తనను, తన భర్త డానియెల్ వెబర్ ను స్వాగతిస్తున్నదని ఆమె తెలిపింది. ప్రజలు నమ్మడం కష్టమే అయినా తనకు కొంచెం సిగ్గు ఎక్కువ అని, అందుకే అంత సోషల్ గా మూవ్ కాలేకపోతున్నాని చెప్పింది. 'గత కొన్ని సంవత్సరాలుగా నేను చాలా మంచి వ్యక్తులను కలిశాను. ముఖ్యంగా ఈ సంవత్సరం కూడా. కానీ ఎక్కువమందిని స్నేహితులుగా చేసుకోలేకపోయాను. ఈ ఏడాది చాలామంది మాతో భిన్నంగా మాట్లాడారు. నేను, భర్త వస్తే గతంలో కన్నా భిన్నంగా స్పందించారు' అని లియోన్ పేర్కొంది. అయితే, ఈ సంవత్సరం ఎక్కువమంది స్నేహితులను చేసుకోకపోవడానికి కారణం తానేనని, తాను అంతగా ప్రజల్లో కలిసిపోయే సోషల్ పర్సన్ కాదని చెప్పింది. 'నిజంగా నాకు సిగ్గు ఎక్కువ. ఇది నమ్మడం మీకు కొంచెం కష్టమే అనిపించినా.. టీవీల్లో, సినిమాల్లో కనిపించే వ్యక్తుల పక్కన కూర్చున్నప్పుడు..'వావ్ ఆమెనే కదా.. అతనే కదా' అని నేనూ అందరిలా అనుకుంటాను. వారి అభిమానిగా మారిపోయి.. వారికి హాలో చెప్పడానికి భయపడతాను. మరింత సోషల్ గా ఎలా నడుచుకోవాలో నేనిప్పుడు నేర్చుకుంటున్నాను' అని సన్నీ లియోన్ వివరించింది. -
షాహిన్ భట్ వచ్చేస్తోంది!
పరిచయం ఇప్పుడు అందరి కళ్లు ఆమె మీదే... ‘షాహిన్ ఎవరు?’ ??? ‘పోనీ... షాహిన్ భట్ ఎవరు?’ ఫోటో చూసి మీరు ఊహించింది నిజమే. అక్షరాల అలియా భట్ చెల్లెలు. ఇప్పుడు అందరి దృష్టి ఇరవై సంవత్సరాల ఈ అమ్మాయి మీదే ఉంది. తండ్రిలా డెరైక్టర్ అవుతుందా? అక్కలా హీరోయిన్ అవుతుందా? అనేది తరువాత విషయంగానీ ముందు ఈ ముద్దు గుమ్మ చెబుతున్న విషయాలు చదువుదాం... ‘జెహెర్’, ‘జిస్మ్2’ సినిమాకు కొన్ని సీన్లు రాశాను. ‘రాజ్-3’కి అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేశాను. ‘సన్ ఆఫ్ సర్దార్’ కు సహ రచయితగా పనిచేశాను. లండన్‌లో ఎడిటింగ్, ఫిల్మ్ మేకింగ్ కోర్సులు చేశాను. ఇటీవలే మేకప్ కోర్సు కూడా పూర్తి చేశాను. ఎడిటింగ్ నేర్చుకోవడం అనేది బెస్ట్ డెరైక్టర్ కావడానికి ఉపయోగపడుతుంది. అందుకే ఆసక్తిగా నేర్చుకున్నాను. ప్రొడక్షన్ విషయాలను కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను. స్కూల్లో చదువు మీద కంటే సృజనాత్మక విషయాల పైనే ఎక్కువ దృష్టి ఉండేది. కవిత్వం, నటన నన్ను బాగా ఆకర్షించేవి. కెమెరాలకు పోజు ఇవ్వడం ఎందుకో నాకు నచ్చదు. కెమెరా వెనక తప్ప కెమెరా ముందు నిల్చోలేను. నాన్న నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. ముఖ్యంగా క్రమశిక్షణ. -
మీ భర్తలు నాకొద్దు!
గతం గతః అంటారు. ఇటీవల సన్నీ లియోన్ ఈ సామెతను బాగా వాడుతున్నారు. గతంలో అమెరికాలో నీలి చిత్రాల్లో నటించిన సన్నీ లియోన్ ‘జిస్మ్ 2’ ద్వారా బాలీవుడ్‌కి పరిచయమయ్యారు. ఆ చిత్రంలో దుస్తుల పరంగా వీలైనంత పొదుపు పాటించారామె. త్వరలో విడుదల కాబోతున్న ‘రాగిణి ఎమ్ఎమ్ఎస్ 2’లో కూడా అంగాంగ ప్రదర్శనకు సన్నీ ఏమాత్రం హద్దులు పెట్టుకోలేదు. నీలి చిత్రాల్లో నటించి ఉండటంవల్ల తన మీద ‘పోర్న్ స్టార్’ అనే ఇమేజ్ ఉంది. ఆ చిత్రాలకు ఫుల్స్టాప్ పెట్టినప్పటికీ, హిందీ చిత్రాల్లో రెచ్చిపోవడం చూసి, బాలీవుడ్‌లోనూ ‘శృంగార తార’ అనే ఇమేజ్‌ని ఆపాదించేశారు. ఎప్పటికీ ఈ ఇమేజ్‌తోనే కొనసాగుతారా? మంచి నటి అనే ఇమేజ్ తెచ్చుకోవాలని లేదా?’’ అనే ప్రశ్న సన్నీ ముందుంచితే -‘‘ఎందుకు లేదు? ప్రస్తుతం నా ఆశయం అదే. అందుకే, నటనకు అవకాశం ఉన్న పాత్రలను ఎంచుకోవాలనుకుంటున్నాను. కానీ, నన్నీ స్థాయికి తీసుకొచ్చిన హాట్ కేరక్టర్స్‌ని మాత్రం వదులుకోను. నా మీద బ్యాడ్ ఇమేజ్ ఉండటంవల్ల, ఆడవాళ్లకు నేను నచ్చకపోవచ్చు. వాళ్ల భర్తలని ఎక్కడ పడేస్తానేమోననే భయం కూడా ఉండొచ్చు. అందుకే, ‘మీ భర్తలు నాకొద్దు’ అని ఆడవాళ్లందరికీ చెబుతున్నా. నా భర్త డానియెల్ చాలా హాట్‌గా, సెక్సీగా ఉంటాడు. నాకు వేరే మగాళ్ల వైపు కన్నెత్తి చూడాల్సిన అవసరం లేదు. మా ప్రేమ చాలా గొప్పది. నా శ్రీవారికి కూడా వేరే ఆడవాళ్లతో పని లేదు. మా వివాహ బంధం చాలా పటిష్టంగా ఉంది. స్క్రీన్‌పై నేను చేసేవన్నీ నా నిజజీవితానికి ఆపాదించొద్దని మనవి చేసుకుంటున్నా’’ అని చెప్పారు.