మీ భర్తలు నాకొద్దు! | Your husbands   Worry! | Sakshi
Sakshi News home page

మీ భర్తలు నాకొద్దు!

Published Thu, Mar 20 2014 1:11 AM | Last Updated on Sat, Sep 2 2017 4:55 AM

మీ భర్తలు  నాకొద్దు!

మీ భర్తలు నాకొద్దు!

 గతం గతః అంటారు. ఇటీవల సన్నీ లియోన్ ఈ సామెతను బాగా వాడుతున్నారు. గతంలో అమెరికాలో నీలి చిత్రాల్లో నటించిన సన్నీ లియోన్ ‘జిస్మ్ 2’ ద్వారా బాలీవుడ్‌కి పరిచయమయ్యారు. ఆ చిత్రంలో దుస్తుల పరంగా వీలైనంత పొదుపు పాటించారామె. త్వరలో విడుదల కాబోతున్న ‘రాగిణి ఎమ్‌ఎమ్‌ఎస్ 2’లో కూడా అంగాంగ ప్రదర్శనకు సన్నీ ఏమాత్రం హద్దులు పెట్టుకోలేదు.


నీలి చిత్రాల్లో నటించి ఉండటంవల్ల తన మీద ‘పోర్న్ స్టార్’ అనే ఇమేజ్ ఉంది. ఆ చిత్రాలకు ఫుల్‌స్టాప్ పెట్టినప్పటికీ, హిందీ చిత్రాల్లో రెచ్చిపోవడం చూసి, బాలీవుడ్‌లోనూ ‘శృంగార తార’ అనే ఇమేజ్‌ని ఆపాదించేశారు. ఎప్పటికీ ఈ ఇమేజ్‌తోనే కొనసాగుతారా? మంచి నటి అనే ఇమేజ్ తెచ్చుకోవాలని లేదా?’’ అనే ప్రశ్న సన్నీ ముందుంచితే -‘‘ఎందుకు లేదు? ప్రస్తుతం నా ఆశయం అదే. అందుకే, నటనకు అవకాశం ఉన్న పాత్రలను ఎంచుకోవాలనుకుంటున్నాను. కానీ, నన్నీ స్థాయికి తీసుకొచ్చిన హాట్ కేరక్టర్స్‌ని మాత్రం వదులుకోను. నా మీద బ్యాడ్ ఇమేజ్ ఉండటంవల్ల, ఆడవాళ్లకు నేను నచ్చకపోవచ్చు.


వాళ్ల భర్తలని ఎక్కడ పడేస్తానేమోననే భయం కూడా ఉండొచ్చు. అందుకే, ‘మీ భర్తలు నాకొద్దు’ అని ఆడవాళ్లందరికీ చెబుతున్నా. నా భర్త డానియెల్ చాలా హాట్‌గా, సెక్సీగా ఉంటాడు. నాకు వేరే మగాళ్ల వైపు కన్నెత్తి చూడాల్సిన అవసరం లేదు. మా ప్రేమ చాలా గొప్పది. నా శ్రీవారికి కూడా వేరే ఆడవాళ్లతో పని లేదు. మా వివాహ బంధం చాలా పటిష్టంగా ఉంది. స్క్రీన్‌పై నేను చేసేవన్నీ నా నిజజీవితానికి ఆపాదించొద్దని మనవి చేసుకుంటున్నా’’ అని చెప్పారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement