మీరు నమ్మడం కష్టమే..: సన్నీ లియోన్ | Bollywood reacts to me, Daniel Weber differently now: Sunny Leone | Sakshi
Sakshi News home page

మీరు నమ్మడం కష్టమే..: సన్నీ లియోన్

Published Mon, Dec 7 2015 11:11 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

మీరు నమ్మడం కష్టమే..: సన్నీ లియోన్ - Sakshi

మీరు నమ్మడం కష్టమే..: సన్నీ లియోన్

ముంబై: బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చే సమయంలో సన్నీ లియోన్ కొన్ని వర్గాల నుంచి చాలా అభ్యంతరాలనే ఎదుర్కొంది. అయితే, కాలక్రమంలో తన గురించి ప్రజల అభిప్రాయం మారుతున్నదని ఈ భామ చెప్తోంది. 34 ఏళ్ల సన్నీ లియోన్ 2012లో ఎరాటిక్ థ్రిల్లర్ అయిన 'జిస్మ్-2' చిత్రంతో బాలీవుడ్ లోకి ప్రవేశించింది. బాలీవుడ్ లో  మొదట్లో తన గురించి భిన్నంగా మాట్లాడుకున్నా.. ఇప్పుడు హిందీ పరిశ్రమ తనను, తన భర్త డానియెల్ వెబర్ ను స్వాగతిస్తున్నదని ఆమె తెలిపింది. ప్రజలు నమ్మడం కష్టమే అయినా తనకు కొంచెం సిగ్గు ఎక్కువ అని, అందుకే అంత సోషల్ గా మూవ్ కాలేకపోతున్నాని చెప్పింది.

'గత కొన్ని సంవత్సరాలుగా నేను చాలా మంచి వ్యక్తులను కలిశాను. ముఖ్యంగా ఈ సంవత్సరం కూడా. కానీ ఎక్కువమందిని స్నేహితులుగా చేసుకోలేకపోయాను. ఈ ఏడాది చాలామంది మాతో భిన్నంగా మాట్లాడారు.  నేను, భర్త వస్తే గతంలో కన్నా భిన్నంగా స్పందించారు' అని లియోన్ పేర్కొంది. అయితే, ఈ సంవత్సరం ఎక్కువమంది స్నేహితులను చేసుకోకపోవడానికి కారణం తానేనని, తాను అంతగా ప్రజల్లో కలిసిపోయే సోషల్ పర్సన్ కాదని చెప్పింది.

 'నిజంగా నాకు సిగ్గు ఎక్కువ. ఇది నమ్మడం మీకు కొంచెం కష్టమే అనిపించినా.. టీవీల్లో, సినిమాల్లో కనిపించే వ్యక్తుల పక్కన కూర్చున్నప్పుడు..'వావ్ ఆమెనే కదా.. అతనే కదా' అని నేనూ అందరిలా అనుకుంటాను. వారి అభిమానిగా మారిపోయి.. వారికి హాలో చెప్పడానికి భయపడతాను. మరింత సోషల్ గా ఎలా నడుచుకోవాలో నేనిప్పుడు నేర్చుకుంటున్నాను' అని సన్నీ లియోన్ వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement