contact
-
ఐదుకి చేరిన నిఫా కేసులు.. కాంటాక్ట్ లిస్ట్‌లో 706 మంది..
తిరువనంతపురం: కేరళలో నిఫా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా మరో వ్యక్తి వైరస్ బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలో వైరస్ సోకిన వారి సంఖ్య ఐదుకు చేరింది. కోజికోడ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తాజాగా 24 ఏళ్ల యువకుడు వైరస్‌తో చికిత్స తీసుకుంటున్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 706 మంది కాంటాక్ట్ లిస్టులో ఉండగా.. 77 మంది అధిక ముప్పులో ఉన్నారు. వీరిలో 153 మంది హెల్త్ వర్కర్లే కావడం గమనార్హం. ఆస్పత్రిలో 13 మంది స్వల్ప లక్షణాలతో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. హై రిస్క్ జోన్లో ఉన్నవారందరూ ఇంట్లోనే ఉండాలని ప్రభుత్వం తెలిపింది. నిబంధనల అమలుకు ప్రభుత్వం ఇప్పటికే 19 కోర్ కమిటీలను ఏర్పరిచింది. ఐసోలేషన్‌లో ఉన్నవారికి నిత్యావసరాలు ఇవ్వడానికి వాలంటీర్లు పనిచేస్తున్నట్లు వెల్లడించారు. నిఫా వైరస్‌తో రాష్ట్రంలో ఇప్పటికే ఇద్దరు మరణించారు. కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించిన ఏడు గ్రామ పంచాయితీల్లో ఎలాంటి రాకపోకలు జరపరాదని కోజికోడ్ జిల్లా కలెక్టర్ ఏ గీతా తెలిపారు. ఆతన్చేరి, మారుతోంకర, తిరువళ్లూరు, కుట్టియాడి, కాయక్కోడి, విల్యపల్లి, కవిలుంపర గ్రామాలు కంటైన్మెంట్ జాబితాలో ఉన్నట్లు పేర్కొన్నారు. పోలీసులు ఈ ప్రాంతాలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. నిత్యావసరాల కొనుగోలుకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఆ సమయం తర్వాత దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. నిఫా లక్షణాలు.. నిపా ప్రధానంగా మెదడుకు ఇన్ఫెక్షన్ కలిగించి, మెదడువాపునకు (ఎన్సెఫలోపతి) కారణమవుతుంది. అందుకే తొలుత దీన్ని ఒకరకం మెదడువాపుగా భావించారు. ఒకసారి ఈ వైరస్ ఒంట్లోకి ప్రవేశించాక సాధారణంగా సగటున తొమ్మిది రోజుల్లో లేదా మరీ నిర్దిష్టంగా చెప్పాలంటే.. 5 నుంచి 14 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి. మెదడువాపు కారణంగా తలనొప్పి రావచ్చు. ఈ తీవ్రమైన తలనొప్పి కొందరిలో 24–48 గంటల్లో కోమాకి దారితీయవచ్చు. వ్యాప్తి ఇలా... ఇది ప్రధానంగా జంతువుల నుంచి వ్యాపించే వైరస్. తాటి జాతికి చెంది డేట్‌పామ్ చెట్ల పండ్లపై ఆధారపడే ఒక రకం గబ్బిలాలు (ఫ్రూట్ బ్యాట్స్)తో ఈ వైరస్ వ్యాపిస్తోంది. ఇవి తాటిపండ్లతో పాటు ఇతర పండ్లనూ తింటుంటాయి. జామ వంటి పండ్లు సగం కొరికి ఉన్నప్పుడు దాన్ని చిలక కొట్టిన పండు అనీ, తియ్యగా ఉంటుందని కొందరు అపోహ పడుతుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి చిలక్కొట్టినట్టు ఉండే ఏ పండ్లనూ తినకూడదు. పందుల పెంపకం రంగంలో ఉన్నవారిలో ఈ వైరస్ ఎక్కువగా కనిపించినందున, అలాంటి వృత్తుల్లో ఉండేవారూ అప్రమత్తంగా ఉండాలి. ఇదీ చదవండి: భారత్‌లో నిపా వైరస్ కలకలం.. ఇద్దరు మృతి! -
మీరెవరో.. ట్రూకాలర్ ఇట్టే చేప్పేస్తుంది!
కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్ మరో అదిరిపోయే ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేసింది. ఈ ఫీచర్ సాయంతో తాము గవర్నమెంట్ అధికారులమని, లేదంటే మంత్రి, ఎమ్మెల్యేలం’ అంటూ డబ్బులు వసూలు చేసే కేటుగాళ్ల ఆటకట్టిస్తున్నట్లు తెలిపింది. తాము తెచ్చిన ఈ గవర్నమెంట్ డిజిటల్ డైరెక్టరీ ఫీచర్‌తో ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు, ప్రజాప్రతినిధుల పేర్లను ఈజీగా గుర్తించవచ్చని ట్రూకాలర్ ప్రతినిధులు వెల్లడించారు. అంతేకాదు బాధితులు సమస్యల్ని నేరుగా అధికారులు, సంబంధిత ఎమ్మెల్యే, ఎంపీలతో చర్చించవచ్చని, ఇందుకోసం గవర్నమెంట్ డిజిటల్ డైరెక్టరీ ఫీచర్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులు, ప్రజా ప్రతినిధుల ఫోన్ నెంబర్లు ఉన్నాయని చెబుతోంది. తాము ప్రభుత్వ పెద్దలమని సామాన్యుల్ని మోసం చేసే వారిని గుర్తించే అవకాశం ఏర్పడుతుందని, తద్వారా మోసాల్ని అరికట్టవచ్చని ట్రూకాలర్ తెలిపింది. ఎవరైనా మోసం చేసేందుకు ప్రయత్నిస్తే వెంటనే ఆ సమాచారం గవర్నమెంట్ డిజిటల్ డైరెక్టరీలో సంబంధిత ఫోన్ వినియోగదారులకు సమాచారం వెళ్తుందని వెల్లడించింది. కాగా, ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉంది. యూజర్లు తమ ఫోన్లలో ట్రూకాలర్ యాప్‌ను అప్డేట్ చేసి ఈ ఫీచర్‌ను పొందవచ్చు. -
ఉద్యోగాలు 4... దరఖాస్తులు 675!
అనంతపురం: పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం, పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ పర్యవేక్షణకు సంబంధించి నాలుగు కాంట్రాక్ట్/ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి మొత్తం 675 దరఖాస్తులు అందినట్లు డీఈఓ కె.శామ్యూల్ తెలిపారు. మరుగుదొడ్ల నిర్వహణ నిధి ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, మధ్యాహ్న భోజన పథకం డేటా అనలిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. మరుగుదొడ్ల నిర్వహణ నిధి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పోస్టుకు మొత్తం 166 దరఖాస్తులు, డేటా ఆపరేటర్ ఉద్యోగానికి 199 దరఖాస్తులు, మధ్యాహ్న భోజన పథకం నిర్వహణకు సంబంధించి డేటా అనలిస్ట్‌కు 122 మంది, డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు 188 మంది దరఖాస్తు చేశారు. (చదవండి: ఆస్తి కోసం అంధురాలిపై హత్యాయత్నం) -
వాట్సాప్‌లో కొత్త ఫీచర్..! యూజర్లకు కాస్త ఊరట..!
ప్రముఖ సోషల్ మెసేజింగ్ వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసురానుంది. గతంలో ప్రవేశపెట్టిన ప్రైవసీ సెట్టింగ్‌ను తిరిగి యూజర్లకు అందుబాటులో రానుంది. చివరిసారిగా వాట్సాప్‌ను ఏ సమయంలో ఉపయోగించారో చూపించే లాస్ట్‌సీన్ సెట్టింగ్‌లో అప్డేట్ను తీసుకురానుంది. లాస్ట్‌సీన్ ఆప్షన్ ద్వారా యూజర్లకు సంబంధించిన ప్రతి ఒక్కరికి వాట్సాప్ ఆయా యూజర్ ఎప్పుడు వాడరనే విషయాన్ని రెసిపెంట్ కాంటాక్టులకు తెలియజేస్తుంది. చదవండి: WhatsApp: 'మనీ హెయిస్ట్ సీజన్ 5' ఎమోజీలొస్తున్నాయ్ లాస్ట్‌సీన్ ఆప్షన్ ఎవరు చూడకుండా ఉండడం కోసం ప్రైవసీ సెట్టింగ్‌లో ‘నోబడీ’, ఎవ్రీవన్, మై కాంటాక్ట్స్ అప్షన్స్ను ఎంచుకోవడం ద్వారా లాస్ట్‌సీన్‌ను ఇతర యూజర్ల నుంచి నియంత్రించుకోవచ్చును. తాజాగా వాట్సాప్ లాస్ట్‌సీన్ సెట్టింగ్‌లో మరో ఆప్షన్ త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. లాస్ట్‌సీన్ సెట్టింగ్‌లో భాగంగా ‘మై కాంటాక్ట్స్ ఎక్సప్ట్’ అనే ఆప్షన్‌ను వాట్సాప్ పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎంచుకున్న ఆయా కాంటాక్ట్‌లకు యూజర్ లాస్ట్‌సీన్ కన్పించదు. ప్రస్తుతం ఈ సెట్టింగ్‌ను వాట్సాప్ కేవలం ఐవోస్ యూజర్లకోసం పరీక్షిస్తుండగా ఈ సెట్టింగ్‌ను త్వరలోనే ఆండ్రాయిడ్ యూజర్ల కోసం అందుబాటులోకి వస్తోందని డబ్ల్యూఏబెటాఇన్ఫో ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సెట్టింగ్‌తో కొంతమంది లాస్ట్‌సీన్ ఆప్షన్‌ను పూర్తిగా ఆఫ్ చేయకుండా నచ్చిన వ్యక్తులకు కన్పించే విధంగా చేసుకోవడంతో యూజర్లకు కాస్త ఊరట కల్గనుంది. చదవండి: Microprocessor Chips: సొంత చిప్ ప్రకటనలు పాతవే.. ఇప్పటికైతే డిజైన్ వరకే? -
కరోనా: సెకండరీ కాంటాక్ట్‌లపై ప్రత్యేక దృష్టి
కంటికి కనిపించని శత్రువు చాపకింద నీరులా విస్తరిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే నాలుగు పాజిటివ్ కేసులు నమోదవడంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 52కి చేరింది. ఇందులో విజయవాడ నగరంతోపాటు, జగ్గయ్యపేట, పెనమలూరు మండలాలకు చెందిన వారున్నారు. దీంతో అప్రమత్తమైన యంత్రాంగం మరింత పకడ్బందీ చర్యలను తీసుకుంటోంది. బాధిత కుటుంబాలతోపాటు వారు కలిసిన వారెవరనే విషయమై మరోసారి ఆరా తీస్తోంది. విజయవాడలో ప్రతి డివిజన్లో వైద్య శిబిరం ఏర్పాటు చేసి లక్షణాలు ఉన్న వారిని గుర్తించి ఆస్పత్రికి తరలిస్తోంది. ప్రైమరీ కాంటాక్ట్, సెకండరీ కాంటాక్ట్‌లపై ప్రత్యేక దృష్టి సారించింది. సిబ్బంది ఇంటింటికీ వెళ్లి సర్వే చేసి వారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. సాక్షి, విజయవాడ: జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే నాలుగు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విజయవాడ నగరంలోని ఖుద్దూస్‌నగర్‌లో ఒకరికి, గుప్తాసెంటర్(విద్యాధరపురం)లో మరొకరికి, జగ్గయ్యపేట పట్టణంలో ఒకరికి, పెనమలూరు మండలం సనత్‌నగర్‌లో ఇంకొకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరంతా ఢిల్లీ వెళ్లి వచ్చిన వారే కావడం గమనార్హం. నాలుగు రోజుల్లో 16 మంది.. క్వారంటైన్ కేంద్రాలకు వస్తున్న పాజిటివ్ సోకిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మంగళవారం నుంచి శుక్రవారం వరకు నాలుగురోజుల్లో ఏకంగా 16 మంది విజయవాడ జీజీహెచ్, పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాలలో ఉన్న క్వారంటైన్ కేంద్రాలకు వచ్చారు. అయితే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కరోనా బాధితులకు, అనుమానితులకు చికిత్స అందిస్తున్నామని, కొత్త కేసులు రాకుండా ఆయా ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని అధికారులు స్పష్టం చేశారు. వైరస్ గొలుసును తెగ్గొట్టేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. ప్రతి డివిజన్లో వైద్య శిబిరాలు.. విజయవాడలో 64 డివిజన్లు ఉండగా, ప్రతి డివిజన్లో నిత్యం వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఆ శిబిరాల్లో జలుబు, దగ్గు, జ్వరం ఉన్న వారికి పరీక్షలు చేసి, కరోనా లక్షణాలు ఉంటే ప్రభుత్వాస్పత్రికి తరలిస్తున్నారు. ఇలా నిత్యం ప్రతి వార్డు నుంచి ఇద్దరు, ముగ్గురు అనుమానితులను పరీక్షల కోసం పంపుతుండగా, అలా వెళ్లిన వారిలో కొందరికి పాజిటివ్ వచ్చిన వారు కూడా ఉన్నారు. ఇలా వారం రోజులుగా డివిజన్లలో వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, లక్షణాలు ఉన్న అనుమానితులను గుర్తిస్తున్నారు. మరోవైపు రెడ్‌జోన్ ప్రాంతాల్లో స్వాబ్ కలెక్షన్ శిబిరాలు నిర్వహిస్తూ, అక్కడే నేరుగా అనుమానితుల నుంచి శాంపిళ్లను సేకరిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి వెతుకులాట.. నగరంలో రెండు వేల బృందాలు ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహిస్తున్నారు. కాంటాక్టులను గుర్తించడం, వారిని రెవెన్యూ, పోలీసు సహకారంతో క్వారంటైన్‌కు , ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఈ సర్వేలో వలంటీర్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇలా మొత్తం నగరంలో రెండు వేల మంది వలంటీర్లు సర్వే చేస్తున్నారు. వారితో పాటు, ఆశా వర్కర్, ఏఎన్ఎంలు కూడా భాగస్వాములు అవుతున్నారు. నగరంలో ఎక్కువుగా కరోనా కేసులు నమోదవడంతో ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, సీఎంఓహెచ్ డాక్టర్ డి. షాలినీదేవిలు నిరంతరం పర్యవేక్షిస్తూ కరోనా కట్టడి చర్యలకు తగు సూచనలు సలహాలు ఇస్తున్నారు. మాస్కులతో జాగ్రత్త! పటమట(విజయవాడ తూర్పు): కరోనా నివారణ చర్యల్లో భాగంగా ప్రజలు వినియోగిస్తున్న మాస్‌్కలను సురక్షితంగా డిస్పోజ్ చేయాలని వీఎంసీ కమిషనర్ ప్రసన్నవెంకటేష్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. మాస్కులను రోడ్లపై లేదా నివాసాలలోని చెత్త బుట్టలలో పడేయటం వల్ల వాటిని పెంపుడు/ వీధులలో సంచరించు పశువులు తాకితే వైరస్ వ్యాప్తి అత్యంత ప్రమాదకర పరిస్థితిగా మారుతుందన్నారు. నగవాసులందరూ వినియోగించిన మాస్్క, గ్లౌజ్‌లను ముక్కలు ముక్కలుగా చేసి తడి పొడి చెత్తతో కాకుండా విడిగా ఒక పేపర్ కవర్, ప్యాకెట్లో/కాగితంలో చుట్టి పారిశుద్ధ్య సిబ్బందికి అందజేయాలని అన్నారు. ప్రజారోగ్య పారిశుద్ధ్య సిబ్బంది ప్రత్యేక సంచుల ద్వారా సేకరించిన మాస్‌్కలను శాస్త్రీయ పద్ధతిలో డిస్పోజ్ చేస్తామని ఆయన పేర్కొన్నారు. -
కరోనా: కాంటాక్ట్ కేసులపై ప్రత్యేక దృష్టి
సాక్షి, గుంటూరు : జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. గుంటూరు నగరంలో మొత్తం 27 కేసులు నమోదవ్వగా మంగళగిరి, మాచర్ల మున్సిపాలీ్టలు, అచ్చంపేట, తురకపాలెం, కారంపూడి ప్రాంతాల్లో 14 కేసులు వెలుగు చూశాయి. ఈ క్రమంలో మొత్తంగా జిల్లాలో కేసుల సంఖ్య 41కి చేరింది. మంగళవారం నగరంలో నమోదైన ఎనిమిది కేసుల్లో బుచ్చతోటలో మూడు, శ్రీనివాసరావుతోటలో మూడు, కొరిటెపాడులో ఒకటి, చైతన్యపురి సాయిబాబా కాలనీ రోడ్డులో ఒకటి ఉన్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే తాజాగా విదేశాల నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణయ్యింది. మిగిలినవి ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు ఉన్నారు. ఇందులో గతంలో వచ్చిన పాజిటివ్ కేసులకు సంబంధించి వారి కుటుంబ సభ్యులు, క్లోజ్ కాంటాక్ట్స్ ఉండటం కలవర పెడుతోంది. కంటైన్నెంట్‌లో కఠిన ఆంక్షలు.. గుంటూరు నగరంలో మంగళదాస్‌నగర్, ఆటోనగర్, సంగడిగుంట, ఆనందపేట, దర్గామాన్యం, శ్రీనివాసరావుతోట, బుచ్చయ్యతోట, కుమ్మరిబజారు, నల్లచెరువు ప్రాంతాలను మొత్తం అధికారులు 11 కంటైన్మెంట్ జోన్లుగా విభజించారు. కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ఇంటి పక్కన పదివేల గృహాలు ఉండగా, ఒక్క కిలోమీటరు దూరంలో 89వేల కుటుంబాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మొత్తం ఈ ప్రాంతాల్లో ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు. ఇళ్లల్లో నుంచి ప్రజలు బయటకు రావద్దని కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనంద్‌కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ ఇప్పటికే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం నుంచి లాక్డౌన్ మరింత కఠినంగా అమలు చేస్తామని, ప్రజలు అనవసరంగా బయటకు వస్తే కేసులు నమోదు చేస్తామని అర్బన్ ఎస్పీ రామకృష్ణ హెచ్చరికలు జారీ చేశారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లో నిత్యవసర వస్తువులు, కూరగాయలు, పాలకు ఇబ్బంది లేకుండా సరఫరా చేసేలా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. విస్తృతంగా నమూనాల సేకరణ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా నిర్ధారణ కోసం 581 నమూనాలు సేకరించారు. ఇందులో 41పాజిటివ్ రాగా, 116 ఫలితాలు రావాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా క్వారంటైన్ సెంటర్లలో 509 మంది, ఐసోలేషన్‌లో 98 మంది ఉన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల ప్రైమరీ కాంటాక్ట్‌లపైన అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. గుంటూరు జిల్లా రూరల్ పరిధిలో 78 మందిని గుర్తించి 72 మందికి కరోనా పరీక్షలు చేశారు. గుంటూరు నగరంలోనే 27 కేసులు ఉండటంతో కాంటాక్ట్‌ల సంఖ్య దాదాపుగా 200పై ఉంటుందని, దాదాపు 75 శాతానికిపైగా కరోనా పరీక్షలు పూర్తయినట్లు సమాచారం. ప్రధానంగా రెడ్‌జోన్ ప్రాంతాల్లో ప్రతిరోజూ ఇంటింటి సర్వే చేస్తూ దగ్గు, జలుబు ఉన్నవారిని, విదేశాలు, ఢిల్లీ లింకులు ఉన్నవారిని గుర్తించి వైద్య పరీక్షలు చేసేలా ఏర్పాట్లు చేశారు. రెడ్‌జోన్ ప్రాంతాల్లో ర్యాండమ్‌గా శాంపిళ్ల తీస్తున్నారు. ప్రధానంగా నగరంతోపాటు కరోనా కేసులు నమోదైన హాట్‌స్పాట్ ప్రాంతాల్లో 28 రోజులపాటు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. -
రేవంత్ టీఆర్ఎస్లోకి వస్తానన్నాడు: తలసాని
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరేందుకు తనతో సంప్రదింపులు చేశారని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ చోటు దక్కకపోవడంతోనే కాంగ్రెస్‌లో చేరారని వ్యాఖ్యానించారు. సహచర మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డితో కలసి గురువారం మహబూబ్‌నగర్ జిల్లా కోస్గిలో యాదవులకు గొర్రెలు పంపిణీ చేశారు. తలసాని మాట్లాడుతూ ‘‘నేను టీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత రేవంత్ కూడా వస్తానని నాతో మాట్లాడిండు. పార్టీలో చేర్చుకోమని కోరితే ఈ విషయాన్ని సహచర పాలమూరు మంత్రుల దృష్టికి తీసుకెళ్లా.. వాడు పెద్ద దొంగ, అలాంటోళ్లను తీసుకోవద్దు అని వారు అన్నరు. అందుకే రేవంత్‌కు టీఆర్ఎస్లో చోటు దక్కలేదు’’ అని మంత్రి వివరించారు. ఓటుకు కోట్లు కేసులో జైలుకు వెళ్లినప్పుడు కొడంగల్ పౌరుషం ఎక్కడకు పోయిందని ప్రశ్నించారు. గొల్ల, కురుమల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకున్న సీఎం కేసీఆర్.. శంషాబాద్‌లో 10 ఎకరాలు కేటాయించేందుకు అంగీకరించారని మంత్రి తెలిపారు. ఈ భూమిలో రూ.5 కోట్లతో గొల్లలకు, మరో రూ.5 కోట్లతో కురుమల సంక్షేమ భవనాన్ని నిర్మించనున్నట్లు చెప్పారు. ఆ స్థలంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం హాస్టల్ కూడా నిర్మించనున్నట్లు చెప్పారు. -
కష్టాలు + కన్నీళ్లు = కాంట్రాక్ట్ లెక్చరర్లు
విద్యా సంవత్సరం ప్రారంభమైనా రెన్యువల్ కాని పోస్టులు రెండు నెలలైనా విడుదల కాని వేతనాలు రాయవరం(మండపేట) : జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు అయోమయంలో పడ్డారు. కళాశాలలు ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా ఉన్నత విద్యామండలి నుంచి ఇప్పటి వరకు కొనసాగింపు ఉత్తర్వులు రాకపోవడంతో పాటు జీతాలు విడుదల కాలేదు. దీంతో అధ్యాపకులు ఆర్ధిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లాలో 573 మంది.. జిల్లాలో మొత్తం 543 మంది కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారు. వీరిలో 42 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 351 మంది, 12 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 152 మంది, పాలిటెక్నిక్ కళాశాలల్లో 70 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. కార్పొరేట్ సంస్థలకు దీటుగా ప్రభుత్వ కళాశాల విద్యార్థులను తీర్చిదిద్దడంలో వీరు కీలకంగా వ్యవహరిస్తున్నారు. 17 ఏళ్లుగా చాలీచాలని జీతాలతో.. 17ఏళ్లుగా కాంట్రాక్టు అధ్యాపకులు చాలీచాలని జీతాలతో ఉద్యోగాలు చేస్తున్నారు. ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో..ఊడుతుందో తెలియని స్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆయన ముఖ్యమంత్రై మూడేళ్లు పూర్తయినా ఇప్పటికీ ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని కాంట్రాక్ట్ అధ్యాపకులు ఆవేదన చెందుతున్నారు. సబ్ కమిటీ వేసి నెల రోజుల్లోనే సమస్యను పరిష్కరిస్తామన్నారని.. అయినా సమస్య ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉందని వారు వాపోతున్నారు. ఉద్యోగాలను క్రమబద్ధీకరించే వరకైనా జీవో 03 ప్రకారం పదో తేదీన సవరణ సంఘం సిఫారసుల మేరకు జీతాలు పెంచాలని కోరుతున్నారు. 2000లో నియామకం.. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన విద్యాబోధన చేసేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం కాంట్రాక్ట్ అధ్యాపకులను నియమించింది. ప్రారంభంలో వీరికి నెలకు రూ.4,500 ఇచ్చేవారు. అదీ ఏడు నెలలకు ఒక్కసారి జీతాలు ఇచ్చేవారు. 2006లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి నెల జీతం రూ.8,500కు పెంచారు. 2010లో అనేక ఆందోళనల అనంతరం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం వీరి జీతం నెలకు రూ.18వేలకు పెంచింది. ప్రసూతి సెలవులు ఇవ్వాలి.. మహిళా కాంట్రాక్ట్ అధ్యాపకులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రసూతి సెలవులు ఇవ్వాలి. 17 ఏళ్లుగా పనిచేస్తున్నా ఇప్పటికీ సర్వీసులు రెగ్యులర్ చేయకపోవడం విచారకరం. అధ్యాపక వృత్తినే నమ్ముకుని పనిచేస్తున్న తమకు ప్రభుత్వం న్యాయం చేయాలి. – కె.వినుతకుమారి, ప్రభుత్వ జూనియర్ కళాశాల, కిర్లంపూడి వేతనాలు పెంచాలి.. పదో పీఆర్సీ ప్రకారం జీతాలు పెంచాలి. 2000లో ఉద్యోగంలో చేరాం. ఎప్పటికైనా రెగ్యులర్ చేస్తారనే ఆశతో జీవిస్తున్నాం. ప్రభుత్వం మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. – గుమ్మడి వెంకటరమణ, కాంట్రాక్ట్ లెక్చరర్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, గోకవరం ఉద్యమం చేపడతాం.. కాంట్రాక్ట్ అధ్యాపకులను ప్రభుత్వం వెంటనే రెన్యువల్ చేయాలి. పెండింగ్‌లో ఉన్న జీతాలను విడుదల చేయాలి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట నిలుపుకొని కాంట్రాక్ట్ అధ్యాపకులకు న్యాయం చేయాలి. – డాక్టర్ వాలుపు కనకరాజు, 475 కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం జిల్లా అధ్యక్షుడు, రాజానగరం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి.. సుప్రీం కోర్టు ఆదేశం ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. సుప్రీం కోర్టు తీర్పును అమలు చేయకుండా కాంట్రాక్టు అధ్యాపకుల శ్రమను దోచుకుంటున్నారు. కమిటీలతో కాలయాపన చేయకుండా తెలంగాణ రాష్ట్రం మాదిరిగా కాంట్రాక్ట్ అధ్యాపకులను క్రమబద్ధీకరించాలి. – ఎం.శ్రీనివాసరావు, కాంట్రాక్టు అధ్యాపకుడు, ప్రభుత్వ జూనియర్ కళాశాల, రాయవరం -
ఫోన్ చేసి దొరికిపోయిన మింటూ!
న్యూఢిల్లీ: ఖలిస్థాన్ ఉగ్రవాది హర్మిందర్ సింగ్ అలియాస్ మింటూను ఆదివారం కొందరు సాయుధులు పంజాబ్‌లోని నభా జైలు నుంచి విడిపించుకెళ్లారు. సోమవారం ఉదయం ఢిల్లీ, పంజాబ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి ఢిల్లీలోని ఓ రైల్వే స్టేషన్లో మింటూను అదుపులోకి తీసుకున్నారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో జైలు నుంచి పరారైన మరో ఐదుగురి కోసం పోలీసుల వేట కొనసాగుతుంది. అయితే.. సుభాష్ నగర్‌లోని తన బంధువులకు ఫోన్ చేయడం ద్వారానే మింటూ పోలీసులకు పట్టుబడినట్లు తెలుస్తోంది. మింటూ మాట్లాడిన ఫోన్ కాల్‌ను ట్రేస్ చేయడం వల్ల అతడి సమాచారం తెలిసిందని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసు అధికారి ఒకరు మీడియాతో వెల్లడించారు. మింటూను స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి.. అనంతరం ట్రాన్సిట్ రిమాండ్‌పై పంజాబ్ పోలీసులకు అప్పగించనున్నట్లు ఆయన వెల్లడించారు. -
ఫేస్‘బుక్కై’పోతున్నారు!
జానకి ప్రాణం తీసిన ఫేస్బుక్ పరిచయం ఈ ‘పేజీలను’ అడ్డంపెట్టుకుని వంచనలూ అపరిచిత స్నేహాలు వద్దంటున్న పోలీసులు సిటీబ్యూరో: సిటీలో తొలి ‘ఫేస్బుక్ మర్డర్’ రికార్డులకెక్కింది. డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేస్తున్న జానకి-ట్యాక్స్ కన్సల్టెంట్ యశ్వంత్ కుమార్ ఉదంతం ఈ కోవకు చెందినదే. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన జానకితో సాన్నిహిత్యం పెంచుకుని మోసం చేసిన యశ్వంత్ ఆపై దారుణంగా హత్య చేశాడు. ఆదివారం వెలుగులోకి వచ్చిన ఈ హత్యతో పాటు ఫేస్బుక్ ఆధారంగా జరుగుతున్న ఘోరాలు సిటీలో అనేకం ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు... ముఖ్యంగా యువతులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు. అతడో సైబర్ శాడిస్ట్... బంజారాహిల్స్ రోడ్ నెం.10లో నివసించే అబ్దుల్ మాజిద్ రెండేళ్లుగా ఫేస్బుక్లో అమ్మాయిల పేరుతో నకిలీ ఖాతా లు తెరిచాడు. సంపన్న వర్గాలకు చెందిన విద్యార్థినుల ప్రొఫైల్స్‌ను గుర్తించి ‘ఫ్రెండ్ రిక్వెస్ట్’ పంపిస్తాడు. అవతలి వారు కూడా అమ్మాయిలే అనే ఉద్దేశంతో విద్యార్థినులు ‘యాక్సెప్ట్’ చేయడంతో అసలు కథ మొదలెడతాడు. వారితో స్నేహపూరితంగానే ఛాటింగ్ చేస్తూ వ్యక్తిగత విషయాలు అడుగుతాడు. ఇలా స్నేహం పెరిగిన తర్వాత వారి ఆంతరంగిక అంశాల్లోకీ తలదూర్చుతాడు. విద్యార్థినుల్ని వంచిస్తూ వారి నగ్న చిత్రాలు, వీడియోలు సంగ్రహిస్తాడు. ప్రైవేట్ ఛాటింగ్ ద్వారా అసభ్యకరమైన సంభాషణలు కొనసాగిస్తాడు. ఆ తర్వాత తన వద్ద ఉన్న ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో పెట్టడంతో పాటు తల్లిదండ్రులకూ పంపుతానంటూ వారిని బెదిరిస్తూ అందినకాడికి దండుకుంటాడు. మాజిద్‌ను గతేడాది సెప్టెంబర్ 11న సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అప్పట్లో ఇతడు దాదాపు 80 మందిని వంచించినట్లు ఆరోపణలున్నాయి. జైలు నుంచి వచ్చినా అదే పంథాలో రెచ్చిపోతూ ఈ ఏడాది ఏప్రిల్‌లో మళ్లీ హైదరాబాద్ పోలీసులకు చిక్కాడు. చాటింగ్స్‌తో మొదలెట్టి ... గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన బాబూరావు ఫేస్బుక్ సహా ఇతర సామాజిక మాధ్యమాల్లో వివిధ రకాలైన ఉద్యోగాల పేరుతో ప్రకటనలు ఇస్తాడు. అందులో తన ఈ-మెయిల్ ఐడీతో పాటు ఫోన్ నెంబర్ సైతం పొందుపరుస్తాడు. ఆసక్తికనబరుస్తూ దరఖాస్తు చేసిన వారిలో యువతులు, మహిళల్ని ఎంచుకుంటాడు. దరఖాస్తు పత్రాల్లో ఉన్న వారి ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీలు తీసుకుంటాడు. వీటి ఆధారంగా వారిలో చాటింగ్ చేయడం ప్రారంభిస్తాడు. తొలుత ఉద్యోగానికి సంబంధించిన విషయాలే చర్చించే బాబూరావు... కొన్నాళ్లకు వారిని మాయజేస్తూ వ్యక్తిగత అంశాలతో పాటు అభ్యంతరకర, అశ్లీల సందేశాలూ పంపిస్తుంటాడు. ఇలా కొన్నాళ్లు గడిచిన తర్వాత సదరు యువతి/మహిళకు ఫోన్లు చేసి ‘చాటింగ్’ వివరాలకు కుటుంబీకులు, సంబంధీకులకు చెప్తానంటూ బ్లాక్‌మెయిలింగ్ మొదలెడతాడు. అలా కాకుండా ఉండాలంటే తాను అడిగినంతా ఇవ్వాలంటూ అందినంత మొత్తం బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకుంటాడు. బాబూరావు చేతిలో మోసపోయిన ఓ నగర విద్యార్థిని ఫిర్యాదుతో సీసీఎస్ ఆధీనంలోని సైబర్‌క్రైమ్ పోలీసులు ఈ ఏడాది ఫిబ్రవరిలో అరెస్టు చేశారు. స్నేహం ముసుగులో వంచన... ‘ఫేస్బుక్ మర్డర్’ జానకి ఉదంతం వెలుగులోకి రావడానికి కొన్ని నెలల ముందే నగరంలో ‘ఫేస్బుక్ రేప్’ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ టోలిచౌకిలోని ఫ్రెండ్స్ కాలనీకి చెందిన ఓ యువకుడు సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. ఇతడికి ఫేస్బుక్ ద్వారా సమీపం ప్రాంతంలో నివసించే ఓ యువతి పరిచయమైంది. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తు న్న ఆమెతో కొన్ని రోజుల పాటు స్నేహం నటిం చాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తన ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. స్వయంగా వెళ్లి కారులో ఎక్కించుకుని వచ్చాడు. ఆమె నమ్మకాన్ని ఆసరాగా చేసుకు న్న ఈ నయవంచకుడు కూల్‌డ్రింక్‌లో మత్తు మం దు కలిపి స్ఫృహతప్పేలా చేశాడు. ఆపై లైంగికదాడికి పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలు మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేయడంతో పాటు యువతిని తీసుకురావడానికి వినియోగించిన కారునూ స్వాధీనం చేసుకున్నారు. యువతులూ తక్కువేం కాదు.. ఫేస్బుక్లో అందమైన అమ్మాయిల ఫొటోలు పెట్టి యువకుల్ని ఆకర్షిస్తూ వారి నుంచి డబ్బులు వసూలు చేసి జల్సాలు చేస్తున్న ఇద్ద రు యువతులూ నగరంలో పట్టుబడ్డారు. పాతబస్తీలోని పత్తర్‌గట్టీ, రికాబ్గంజ్లకు చెందిన ఇద్దరు యువతులు స్నేహితులు. వీరిద్దరూ తప్పిపోయారనే ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వారిని పట్టుకున్నాక అసలు విషయం తెలిసి కంగుతిన్నారు. ఫేస్బుక్లో అందమైన అమ్మాయిల ఫొటోలతో వీరు ఖాతాలు తెరిచారు. వాటి ద్వారా యువకుల్ని ఆకర్షిస్తూ వారితో స్నేహం, చాటింగ్ చేస్తూ ముగ్గులోకి దింపారు. ఆ యువకుల నుంచి నగదు, నగలు, కెమెరాలు, ఫోన్లు రాబట్టుకున్నారు. ఆ డబ్బుతో డెహ్రా డూన్, ఊటీ, వైజాగ్ల్లో జల్సాలు చేస్తుండేవారు. ఈ పంథాలో వీరిద్దరూ 17 మంది యువకుల్ని మోసం చేశారు. -
'ఆ జంటకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయి'
సాన్ బెర్నార్డినో: ఊహించిందే నిజమైంది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో దాడులకు పాల్పడిన పాకిస్థాన్ సంతతికి చెందిన ఫరూక్, మాలిక్ యువజంటకు ఇస్లామిక్ ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని అమెరికా ఇంటలిజెన్స్ అధికారులు తెలిపారు. సోషల్ మీడియా ద్వారా ఫరూక్ పలుమార్లు ఇస్లామిక్ తీవ్రవాదులతో సంభాషణలు జరిపినట్లు తమ విచారణలో తేలినట్లు స్పష్టం చేశారు. దాడులకు పాల్పడిన సమయంలో వందలాది మందిని హతమార్చడానికి సరిపడే మారణాయుధాలు ఫరూక్ వద్ద ఉన్నాయని అధికారులు వెల్లడించారు. దాడుల తర్వాత ప్రాధమికంగా చేపట్టిన విచారణలో ఫరూక్‌కు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే విషయం స్సష్టంకాలేదు. వారి కుటుంబంతో పరిచయం ఉన్నవారు సైతం వారు దాడులకు పాల్పడ్డారంటే నమ్మలేకుండా ఉన్నారు. గతంలో ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఎఫ్‌బీఐ నిఘా పరిధిలో ఫరూక్ దంపతులు లేరని అధికారులు వెల్లడించారు. -
షాహిన్ భట్ వచ్చేస్తోంది!
పరిచయం ఇప్పుడు అందరి కళ్లు ఆమె మీదే... ‘షాహిన్ ఎవరు?’ ??? ‘పోనీ... షాహిన్ భట్ ఎవరు?’ ఫోటో చూసి మీరు ఊహించింది నిజమే. అక్షరాల అలియా భట్ చెల్లెలు. ఇప్పుడు అందరి దృష్టి ఇరవై సంవత్సరాల ఈ అమ్మాయి మీదే ఉంది. తండ్రిలా డెరైక్టర్ అవుతుందా? అక్కలా హీరోయిన్ అవుతుందా? అనేది తరువాత విషయంగానీ ముందు ఈ ముద్దు గుమ్మ చెబుతున్న విషయాలు చదువుదాం... ‘జెహెర్’, ‘జిస్మ్2’ సినిమాకు కొన్ని సీన్లు రాశాను. ‘రాజ్-3’కి అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేశాను. ‘సన్ ఆఫ్ సర్దార్’ కు సహ రచయితగా పనిచేశాను. లండన్‌లో ఎడిటింగ్, ఫిల్మ్ మేకింగ్ కోర్సులు చేశాను. ఇటీవలే మేకప్ కోర్సు కూడా పూర్తి చేశాను. ఎడిటింగ్ నేర్చుకోవడం అనేది బెస్ట్ డెరైక్టర్ కావడానికి ఉపయోగపడుతుంది. అందుకే ఆసక్తిగా నేర్చుకున్నాను. ప్రొడక్షన్ విషయాలను కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను. స్కూల్లో చదువు మీద కంటే సృజనాత్మక విషయాల పైనే ఎక్కువ దృష్టి ఉండేది. కవిత్వం, నటన నన్ను బాగా ఆకర్షించేవి. కెమెరాలకు పోజు ఇవ్వడం ఎందుకో నాకు నచ్చదు. కెమెరా వెనక తప్ప కెమెరా ముందు నిల్చోలేను. నాన్న నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. ముఖ్యంగా క్రమశిక్షణ. -
విగ్‌ల తయారీలో మహిళా దీప్తి
పరిచయం ఎన్టీయార్, ఏయన్నార్, ఎంజీయార్ల కాలంలో విగ్ అంటే వెండితెరకు మాత్రమే పరిమితమైంది. ఉంగరాల, నొక్కుల జుత్తు హీరోలు, నడుం కింద కి పారాడే పొడవాటి జడలున్న కథానాయికలను తెరకెక్కించడానికి, ప్రేక్షకుల కలలరూపాలను హీరో హీరోయిన్ల రూపంలో దర్శింపజేయడానికి సినిమా రూపకర్తలు విగ్లను ఉపయోగించేవారు. అయితే ఇప్పుడా పరిస్థితి మారింది. సాధారణ జనం సైతం విగ్‌ల వినియోగంపై మక్కువ చూపుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో తొలిసారిగా ఒక యువతి విగ్ తయారీ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవడం విశేషం. 29 ఏళ్ళ దీప్తి పంచుకున్న సంగతులు ఆమె మాటల్లోనే... నాన్నే తొలి గురువు... మేం తెలుగువాళ్లమైనా, చెన్నైలో స్థిరపడ్డాం. నాన్న (అప్పారావు) సినిమా రంగంలో విగ్ మేకర్. రజనీకాంత్, బాలకృష్ణ వంటి ఎందరో పెద్ద తారలతో వర్క్ చేశారు. చిన్నప్పటి నుంచి నాన్న పని చూస్తూ పెరిగా. అప్పుడప్పుడు ఆయన పనిలో సాయపడేదాన్ని కూడా. అయితే నన్ను ఈ రంగంలోకి తీసుకురావాలని నాన్న అనుకోలేదు. బహుశా నా సోదరుణ్ణి తీసుకువద్దామని అనుకున్నారేమో... బిఎస్సీ, ఎంబిఎ పూర్తి చేశా. కార్పొరేట్ కంపెనీలో పెద్ద జీతంతో ఉద్యోగం కూడా వచ్చింది. కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నప్పుడు... జుట్టు లేకపోవడం అనేది యువతను కూడా తీవ్రంగా బాధిస్తున్న సమస్యగా అర్థమైంది. నిజానికి సినిమాల కంటే బయటే దీని అవసరం చాలా ఉందనిపించింది. దీంతో 8 నెలల్లోనే ఉద్యోగం వదిలేసి ఈ రంగంలోకి రావాలని నిశ్చయించుకున్నా.. అధ్యయనం చేసి... అడుగేశా... విగ్ తయారీలోకి వస్తానన్నప్పుడు నాన్నతో సహా అందరూ కొంత సందేహించినా... తర్వాత నా ఆలోచన పూర్తిగా వివరించాక ఓకె అన్నారు. మన దగ్గర విగ్ తయారీకి సంబంధించి ప్రత్యేకంగా కోర్సు ఏమీ లేదు కాబట్టి...సింగపూర్, కొరియా లాంటి దేశాలకు వెళ్లి అక్కడ అత్యాధునిక మెలకువలు నేర్చుకున్నా. చైనాలో, కొరియాలో అయితే విగ్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్స్‌కు ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ ఏరియాలే ఉంటాయి. మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా విగ్ తయారీలో వస్తున్న మార్పులు అందుబాటులో ఉన్న కేశాలంకరణ శైలులు... వీటిన్నింటి మీదా అవగాహన ఏర్పరచుకున్నా. ఇప్పుడు హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ‘లా మార్స్’ హెయిర్ సొల్యూషన్స్ పేరుతో సంస్థ ప్రారంభిస్తున్నా. కేశ ‘సంపదే’... మనవాళ్లు కేశసంపద అంటుంటారు నిజంగా కేశాలు సంపదే. జుట్టు విలువ, అది లేకపోతే ఎదురయ్యే సమస్యలు, వారి ఇబ్బందులు వర్ణనాతీతం. ముఖవర్ఛస్సుకు అత్యంత అవసరమైనది జుట్టే. అలాంటి పరిస్థితుల్లో... కారణాలేవైతేనేం... ప్రస్తుతం జుట్టు లేకపోవడం అనేది యువతను బాధిస్తున్న పెద్ద సమస్యగా మారింది. మిగతా అన్ని రకాలుగా బాగున్నా... కేవలం కేశాలు నిర్ణీత పరిమాణంలో లేకపోవడం చాలా మందిని వేధిస్తోంది. అయితే మన దగ్గర చాలా మందికి విగ్ వాడకంపై పూర్తి అవగాహన లేదు. విదేశాలలో విగ్‌లు సర్వసాధారణంగా వినియోగిస్తారు. మన దగ్గర మాత్రం రకరకాల నూనెలు, వైద్యప్రక్రియలతో జుట్టు మొలిపించేందుకు అష్టకష్టాలు పడతారే గాని విగ్‌ల జోలికి వెళ్లడం తక్కువే. అయితే ఇప్పుడిప్పుడే ఈ పరిస్థితి మారుతోంది. అందరికీ అందుబాటులో... వంశపారంపర్యంగా బట్టతల వచ్చేవాళ్లే కాకుండా విభిన్న కారణాల వల్ల కేశాలను కోల్పోతున్నవాళ్లు, కేన్సర్, అలోపేసియా వంటి రోగాల బాధితులు... ఇలా విగ్‌ల అవసరం ఉన్నవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ప్రతి ఒక్కరూ నిస్సంకోచంగా వినియోగించేందుకు వీలుగా విగ్లను అందరికీ అందుబాటులోకి తేవాలని ప్రయత్నిస్తున్నా. కానీ ఒక విషయం...తక్కువ ఖరీదు కదా అని సింథటిక్ హెయిర్స్‌తో రూపొందిన విగ్లను వాడితే అవి ఇతరత్రా సమస్యలు సృష్టిస్తాయి. ఈ విషయంలో విగ్ వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలి. -ఎస్.సత్యబాబు -
సమ్మె షాక్
కడప అగ్రికల్చర్,న్యూస్‌లైన్ : విద్యుత్ ఉద్యోగులు ఐకాస ఆధ్వర్యంలో 72 గంటల సమ్మెలోకి వెళ్లడంతో జిల్లాలోని పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. శుక్రవారం సీమాంధ్ర జేఏసీ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద విద్యుత్ ఐకాస నాయకులు, ఉద్యోగులు, సిబ్బంది నిరసన తెలిపారు. శంకరాపురం పవర్‌హౌస్‌లో విభజనను నిరసిస్తూ నినాదాలు చేశారు. విద్యుత్ ఉద్యోగుల సమ్మె కారణంగా ఆసుపత్రులకు, నీటి సరఫరాకు చాలా ప్రాంతాల్లో అవాంతరాలు సంభవించాయి. కడప నగరంలోని శంకరాపురంలో ఉన్న పవర్ స్టేషన్ ట్రిప్ అయింది. దీంతో విద్యుత్ సరఫరా దాదాపు కొన్ని గంటల పాటు పునరుద్ధరణకు నోచుకోలేదు. ప్రొద్దుటూరులోని ఆటోనగర్ విద్యుత్ వైర్లు తెగిపోవడంతో ఆ ప్రాంత పరిధిలో ఆంధకారం నెలకొన్నట్లు కాంట్రాక్టు ఉద్యోగులు తెలిపారు. అలాగే సంబేపల్లె మండలంలో వర్షానికి విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో దాదాపు 10 గ్రామాల్లో అంధకారం నెలకొంది. చిట్వేలి మండలంలోని మూడు సబ్స్టేషన్లలోని ట్రాన్స్మీటర్లు మొరాయించడంతో 15 గ్రామాలు అంధకారంలో ఉండిపోయాయి. ట్రిపుల్ ఐటీఐ పరిధిలోని సబ్స్టేషన్ట్రిప్ కావడంతో ఆ పరిధిలోని 3 గ్రామాలు చీకట్లో ఉండిపోయాయి. గోపవరం మండలంలోని 20 గ్రామాల్లో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. రెగ్యులర్ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లడంతో కాంట్రాక్టు ఉద్యోగులు సమస్యలు ఉత్పన్నమవుతున్న ప్రాంతాలను గుర్తించలేక పోతున్నారు. రూ.. 2.30 కోట్ల బిల్లు వసూళ్లకు గండి విద్యుత్ ఉద్యోగులు 72 గంటల సమ్మెకు వెళ్లడంతో జిల్లాలో విద్యుత్ బిల్లుల వసూళ్లు ఆగిపోయాయి. జిల్లా వ్యాప్తంగా బిల్లుల వసూలు కేంద్రాలు 22 ఉన్నాయి. ప్రతి రోజు రూ.1.15 కోట్ల బిల్లులు వసూళ్ల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది. విద్యుత్ బిల్లు వసూళ్ల సిబ్బంది రెండు రోజులుగా సమ్మెలోకి పోవడంతో రూ.2.30 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి గండి పడినట్లయింది. జిల్లా పరిశీలనకు వచ్చిన తిరుపతి సర్కిల్ సీఈ రాంసింగ్ విద్యుత్ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లడంతో పాటు సంస్థ ఇచ్చిన సిమ్ కార్డులను ఎస్ఈకి అప్పగించారు. జిల్లాలో పరిస్థితులు ఎలా ఉన్నాయో పరిశీలించేందుకు తిరుపతి డిస్కం సర్కిల్ చీఫ్ ఇంజనీర్ రాంసింగ్ రెండు రోజులుగా పరిశీలన చేస్తున్నారు. అన్ని సబ్స్టేషన్లను పరిశీలిస్తూ ఏయే ప్రాంతాలలో విద్యుత్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయో కాంట్రాక్టు ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. చిన్నచిన్న అంతరాయాలకు ఎలాగోలా మరమ్మత్తులు చేస్తామని, పెద్ద సమస్యలు పరిష్కరించడం తమవల్ల కాదని పలు ప్రాంతాల కాంట్రాక్టు ఉద్యోగులు సీఈకి వివరించినట్లు సమాచారం.