ఫోన్‌ చేసి దొరికిపోయిన మింటూ! | Terrorist Mintoo arrested from Delhi after he made contact | Sakshi
Sakshi News home page

ఫోన్‌ చేసి దొరికిపోయిన మింటూ!

Published Mon, Nov 28 2016 11:37 AM | Last Updated on Mon, Sep 4 2017 9:21 PM

ఫోన్‌ చేసి దొరికిపోయిన మింటూ!

ఫోన్‌ చేసి దొరికిపోయిన మింటూ!

న్యూఢిల్లీ: ఖలిస్థాన్‌ ఉ‍గ్రవాది హర్మిందర్‌ సింగ్‌ అలియాస్‌ మింటూను ఆదివారం కొందరు సాయుధులు పంజాబ్‌లోని నభా జైలు నుంచి విడిపించుకెళ్లారు. సోమవారం ఉదయం ఢిల్లీ, పంజాబ్‌ పోలీసులు జాయింట్‌ ఆపరేషన్‌ నిర్వహించి ఢిల్లీలోని ఓ రైల్వే స్టేషన్‌లో మింటూను అదుపులోకి తీసుకున్నారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో జైలు నుంచి పరారైన మరో ఐదుగురి కోసం పోలీసుల వేట కొనసాగుతుంది.
 
అయితే.. సుభాష్‌ నగర్‌లోని తన బంధువులకు ఫోన్‌ చేయడం ద్వారానే మింటూ పోలీసులకు పట్టుబడినట్లు తెలుస్తోంది. మింటూ మాట్లాడిన ఫోన్‌ కాల్‌ను ట్రేస్‌ చేయడం వల్ల అతడి సమాచారం తెలిసిందని ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసు అధికారి ఒకరు మీడియాతో వెల్లడించారు. మింటూను స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి.. అనంతరం ట్రాన్సిట్‌ రిమాండ్‌పై పంజాబ్‌ పోలీసులకు అప్పగించనున్నట్లు ఆయన వెల్లడించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement