![Murder Of Magazine Editor At Bhivandi - Sakshi](/styles/webp/s3/article_images/2019/03/19/pandey-ji.jpg.webp?itok=LWS7yjwe)
హత్యకు గురైన ఎడిటర్ నిత్యానంద్ పాండే
ముంబై: ఇంటర్న్‌షిప్ చేస్తున్న మహిళ చేతిలో మ్యాగజీన్ ఎడిటర్ హత్యకు గురైన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. నిత్యానంద్ పాండే(44) ముంబై కేంద్రంగా నడిచే న్యూస్ పోర్టల్ మ్యాగజీన్ ఎడిటర్. న్యూస్ పోర్టల్ సంస్థలో ఇంటర్న్‌గా పనిచేసే మహిళ, అదే అఫీసులో ప్రింటింగ్ సెక్షన్‌లో విధులు నిర్వహిస్తున్న సతీష్ మిశ్రా (34) కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దాడికి పాల్పడిన ఇద్దర్నీ వారి ఫోన్ కాల్ రికార్డుల (సీడీఆర్) ఆధారంగా పోలీసులు పట్టుకున్నట్టు సమాచారం.
ఈ ఘటనపై మీడియాతో భివండీ ఎస్సై సంజయ్ హజారే మాట్లాడుతూ ‘‘రెండు సంవత్సరాలుగా న్యూస్ పోర్టల్ సంస్థలో ఇంటర్న్‌గా పని చేస్తున్న మహిళను ఆ మ్యాగజీన్ ఎడిటర్ పాండే పదేపదే లైంగిక వేధింపులకు గురిచేసేవాడు. ఆ మహిళ ఎదురుతిరగడంతో ఆమెకు ప్రమోషన్ ఇవ్వడానికి అతడు నిరాకరించాడు. విసుగెత్తిన మహిళ పాండే బారి నుంచి తప్పించుకోవడానికి అదే ఆఫీసులో ప్రింటింగ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే మిశ్రా సహాయం కోరింది.
కొంతకాలంగా ఎడిటర్ పాండే తన వేతన చెల్లింపుల్లో ఆలస్యం చేస్తుండటంతో అతడి మీద మిశ్రా కోపంగా ఉన్నాడు. దీన్ని అదనుగా తీసుకున్న నిందితురాలు.. పాండే అడ్డును మిశ్రా సహాయంతో తొలగించాలని పథకం వేసింది. నిందితులిద్దరూ పాండేను ముంబైకి 8 కి.మీల దూరంలోని ఉత్తర భయందర్‌కు వెళ్లేలా ఒప్పించి తీసుకెళ్లారు. అలా వెళ్తున్న సమయంలో పాండేకు మత్తు మందు కలపి ఉన్న మద్యం తాగించారు. అతడు స్పృహ కోల్పోయిన అనంతరం తాడు సహాయంతో చంపి, భివండీ సమీపంలో పడేసి వెళ్లారని’’ తెలిపారు .
Comments
Please login to add a commentAdd a comment