ముంబైలో సంచలనం రేపిన ప్రియురాలి హత్యకేసు రోజుకో మలుపు తిరుగుతూ..ఒక్కొక్కటిగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు దొరక్కుండా ఉండేందుకు చేసిన పనులను చూసి పోలీసులు సైతం కంగుతిన్నారు. తొలుత బాధితురాలు తనకు కూతురు లాంటిదని ఏవేవో కట్టుకథలు చెప్పాడు. తర్వాత మళ్లీ మాటలు మారుస్తూ వేరువేరుగా ఇస్తున్న స్టేమెంట్‌లు చూసి పోలీసులు తలపట్టుకుంటున్నారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు బాధితురాలి జుట్టకు సంబంధించిన ఫోటోలను ఆమె చెల్లెళ్లకు చూపించారు.
వారంతా ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. ఆమెకు తన పొడవాటి జుట్టు అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు. బాధితురాలు సరస్వతి నలుగురు సోదరిమణులు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో ముగ్గురు వద్ద నుంచి వాంగ్ములాన్ని తీసుకున్నారు. నిందితుడు మనోజ్ సానేపై వారంతా కోపంగా ఉన్నారని, అతడిని కఠినంగా శిక్షించాలని కోరినట్లు తెలిపారు పోలీసులు. ఈ మేరకు పోలీస్ కమిషనరేట్ మీరా భయందర్ వసాయి విరార్ మాట్లాడుతూ..సానే విచారణ సమయంలో పదే పదే వేర్వేరుగా స్టేమెంట్‌లు ఇస్తున్నాడని చెప్పారు. అతడి వాంగ్ములాన్ని క్రాస్ వెరిఫికేషన్ చేయగా..జూన్ 4న సరస్వతి వైద్యను హతమార్చిన అనంతరం హార్డ్‌వేర్ దుకాణం నుంచి ఎలక్ట్రిక్ కలప కట్టర్ కొనుగోలు చేసినట్లు తేలిందన్నారు.
దానితోనే బాధితురాలి శరీర భాగాలను ముక్కలు చేయడమే గాక పనిచేయకపోతే మళ్లీ అదే షాపుకి వెళ్లి రిపేరు చేయించాడని పేర్కొన్నారు. మృతదేహం దుర్వాసన రాకుండా ఉండేందుకు ఏం చేయాలో గూగుల్‌లో సర్చ్ చేసినట్లు తెలిపారు. ఆ తర్వాత ఓ దుకాణం నుంచి నీలగిరి నూనె బాటిళ్లను కొనుగోలు చేశాడని అన్నారు. మరో షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే మొన్నటి వరకు ఆమె తన కూతుర లాంటిదని కథలు చెప్పిన మనోజ్ ఇప్పుడు ఆమెను ఓ గుడిలో పెళ్లి చేసుకున్నట్లు ఒప్పుకున్నాడని చెప్పారు
ఇరువురి మధ్య వయసు తేడా ఎక్కువగా ఉండటంతో బంధువుల ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అతడు పెళ్లి చేసుకున్న ఆలయ పూజారిని గురించి ఆరా తీస్తున్నామని, అలాగే ఈ కేసుకి సంబంధించి ఇతర సాక్షుల గురించి కూడా తనిఖీ చేస్తున్నట్లు కమిషనరేట్ విరార్ వెల్లడించారు. కాగా, బాధితురాలిని గుర్తించేందుకు ఆమె కుటుంబ సభ్యుల డీఎన్‌ఏ నమునాలను ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపనున్నట్లు తెలిపారు.
(చదవండి: ముంబై హత్య కేసు: విచారణలో షాకింగ్ ట్విస్ట్..శ్రద్ధా ఘటన స్ఫూర్తితోనే చేశా!)
Comments
Please login to add a commentAdd a comment