chopping
-
ముంబై హత్య కేసు: దుర్వాసన రాకుండా ఉండేలా..నీలగిరి నూనెని..
ముంబైలో సంచలనం రేపిన ప్రియురాలి హత్యకేసు రోజుకో మలుపు తిరుగుతూ..ఒక్కొక్కటిగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు దొరక్కుండా ఉండేందుకు చేసిన పనులను చూసి పోలీసులు సైతం కంగుతిన్నారు. తొలుత బాధితురాలు తనకు కూతురు లాంటిదని ఏవేవో కట్టుకథలు చెప్పాడు. తర్వాత మళ్లీ మాటలు మారుస్తూ వేరువేరుగా ఇస్తున్న స్టేమెంట్లు చూసి పోలీసులు తలపట్టుకుంటున్నారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు బాధితురాలి జుట్టకు సంబంధించిన ఫోటోలను ఆమె చెల్లెళ్లకు చూపించారు. వారంతా ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. ఆమెకు తన పొడవాటి జుట్టు అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు. బాధితురాలు సరస్వతి నలుగురు సోదరిమణులు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో ముగ్గురు వద్ద నుంచి వాంగ్ములాన్ని తీసుకున్నారు. నిందితుడు మనోజ్ సానేపై వారంతా కోపంగా ఉన్నారని, అతడిని కఠినంగా శిక్షించాలని కోరినట్లు తెలిపారు పోలీసులు. ఈ మేరకు పోలీస్ కమిషనరేట్ మీరా భయందర్ వసాయి విరార్ మాట్లాడుతూ..సానే విచారణ సమయంలో పదే పదే వేర్వేరుగా స్టేమెంట్లు ఇస్తున్నాడని చెప్పారు. అతడి వాంగ్ములాన్ని క్రాస్ వెరిఫికేషన్ చేయగా..జూన్ 4న సరస్వతి వైద్యను హతమార్చిన అనంతరం హార్డ్‌వేర్ దుకాణం నుంచి ఎలక్ట్రిక్ కలప కట్టర్ కొనుగోలు చేసినట్లు తేలిందన్నారు. దానితోనే బాధితురాలి శరీర భాగాలను ముక్కలు చేయడమే గాక పనిచేయకపోతే మళ్లీ అదే షాపుకి వెళ్లి రిపేరు చేయించాడని పేర్కొన్నారు. మృతదేహం దుర్వాసన రాకుండా ఉండేందుకు ఏం చేయాలో గూగుల్‌లో సర్చ్ చేసినట్లు తెలిపారు. ఆ తర్వాత ఓ దుకాణం నుంచి నీలగిరి నూనె బాటిళ్లను కొనుగోలు చేశాడని అన్నారు. మరో షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే మొన్నటి వరకు ఆమె తన కూతుర లాంటిదని కథలు చెప్పిన మనోజ్ ఇప్పుడు ఆమెను ఓ గుడిలో పెళ్లి చేసుకున్నట్లు ఒప్పుకున్నాడని చెప్పారు ఇరువురి మధ్య వయసు తేడా ఎక్కువగా ఉండటంతో బంధువుల ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అతడు పెళ్లి చేసుకున్న ఆలయ పూజారిని గురించి ఆరా తీస్తున్నామని, అలాగే ఈ కేసుకి సంబంధించి ఇతర సాక్షుల గురించి కూడా తనిఖీ చేస్తున్నట్లు కమిషనరేట్ విరార్ వెల్లడించారు. కాగా, బాధితురాలిని గుర్తించేందుకు ఆమె కుటుంబ సభ్యుల డీఎన్ఏ నమునాలను ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపనున్నట్లు తెలిపారు. (చదవండి: ముంబై హత్య కేసు: విచారణలో షాకింగ్ ట్విస్ట్..శ్రద్ధా ఘటన స్ఫూర్తితోనే చేశా!) -
‘ఆయన చేతులు నరికేయాలనిపించింది’
పాట్నా : కేంద్ర మంత్రి రామ్ కృపాల్ యాదవ్‌ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె, ఆర్జేడీ నాయకురాలు మీసా భారతి. పాట్నాలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో పాల్గొన్న మీసా భారతి రామ్ కృపాల్ యాదవ్ గురించి మాట్లాడుతూ.. ‘అతన్ని మేము చాలా గౌరవించే వాళ్లం. కానీ 2014లో అతను మా పార్టీని వీడి.. సుశీల్ కుమార్ మోదీతో చేతులు కలిపినప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. ఆయన చేతులను నరికేయాలనిపించిందం’టూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాక రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు మీసా భారతి. అయితే ఆర్జేడీకి విధేయుడిగా పేరు పొందిన రామ్ కృపాల్‌కు 2014 ఎన్నికల్లో ఆ పార్టీ టికెట్ ఇవ్వలేదు. దాంతో ఆయన బీజేపీలో చేరారు. అనంతరం ఎన్నికల్లో గెలుపొంది ప్రస్తుతం నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పని చేస్తున్నారు. -
మా జోలికొస్తే గోళ్లు కత్తిరిస్తా: ముఖ్యమంత్రి
న్యూఢిల్లీ : తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలవడం బాగా అలవాటయ్యింది త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్. ఈయన ప్రతి రోజు ఏదో ఒక వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో నెటిజన్లు విప్లవ్‌ని, బీజేపీలను విపరీతంగా ట్రోల్ చేసేస్తున్నారు. మహాభారత కాలంలో శాటిలైట్ కమ్యూనికేషన్ ఉందంటూ మొదలైన ఆయన వ్యవహారం.. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీకి మతి చెడిందంటూ వ్యాఖ్యలు... మాజీ మిస్ వరల్డ్ డయానా హెడెన్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు... సివిల్ సర్వీసెస్‌కు సివిల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్లే సరితూగుతారని, మెకానికల్ వాళ్లు పనికి రారని ప్రకటన... చివరకు.. చదువుకోవటం కన్నా పాన్ షాపులు పెట్టుకోవటం, ఆవులు మేపుకోవటం ఉత్తమం అంటూ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించటం, ఇలా వరుస వివాదస్పద వ్యాఖ్యలతో రోజు మీడియాలో నిలుస్తున్నారు. తాజాగా బిప్లబ్ కుమార్ దేబ్ తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవారికి ప్రమాదం తప్పదు అని హెచ్చరిస్తున్న వీడియో ఒకటి వైరల్‌గా మారడంతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ వీడియోలో తన ప్రభుత్వం జోలికి వస్తే ఎలాంటి పరిస్థితిలు ఎదురవుతాయో చెప్పడానికి ఆయన కూరగాయలు అమ్మే వ్యక్తిని ఉదాహరణగా తీసుకున్నాడు. ‘కూరగాయలు అమ్మే వ్యక్తి సొరకాయలను అమ్ముదామని ఉదయ 8 గంటల ప్రాంతంలో మార్కెట్‌కు వచ్చాడు. కానీ 9 గంటలకల్లా ఆ సొరకాయ చెడిపోయింది. కారణం... వచ్చిన వినియోగదారలందరూ సొరకాయను పరీక్షించడానికి తమ గోర్లతో నొక్కి చూసారు. అందువల్ల ఆ సొరకాయ చెడిపోయింది.’ అలానే ఎవరైన నా ప్రభుత్వ వ్యవహరాల్లో జోక్యం చేసుకున్న, నా ప్రభుత్వాన్ని హేళన చేస్తే... నేను వారి గోళ్లను కత్తిరిస్తాను. కాబట్టి జాగ్రత్త నా ప్రభుత్వాన్ని తాకే ప్రయత్నం కూడా చేయకండి అంటూ హెచ్చరించారు. బిప్లబ్ రోజు ఇలా ఏదో ఒక వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో అతని నోటికి అడ్డుకట్ట వేసేందుకు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ రంగంలోకి దిగారు. బిప్లబ్‌ను తన ఎదుట హాజరు కావాల్సిందిగా ఆయన సమన్లు జారీ చేశారు. మే 2నఆయనను తమ ఎదుట హాజరు కావాలని ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఆదేశించినట్లు సీనియర్ నేత ఒకరు మీడియాకు వెల్లడించారు. -
ఒక్కొక్కటీ కాదు... వంద పండ్లని ఒకేసారి కోయొచ్చు!
న్యూ ప్రొడక్ట్ యాపిల్ని కట్ చేయాలంటే చాకు కావాలి. నిమ్మకాయ, బత్తాయిల రసం తీయాలంటే జ్యూసర్ కావాలి. కీరాని చెక్కాలంటే చాపర్ కావాలి. ఇలా ఒక్కో పనికీ ఒక్కో యంత్రం కావాలి... కదా! కానీ అది ఒకప్పుడు. ఇప్పుడు ఒక్క ‘ఫ్రూట్ ప్లాంట్’ కొంటే చాలు... అదే అన్ని పనులూ చేసి పారేస్తుంది. చూడ్డానికి చెంచాలు, చాకుల స్టాండులాగా కనిపిస్తున్న ఇదే... ఫ్రూట్ ప్లాంట్ మల్టీ కిచెన్ టూల్ సెట్. రెండో ఫొటోలో చూపినట్టు ఇది చాలా భాగాలుగా విడిపోతుంది. ఒక్కో భాగంతో ఒక్కో పని. ఒకటి చాపింగ్కి, ఒకటి కటింగ్‌కి, ఇంకొకటి మ్యాష్ చేయడానికి, మరొకటి గ్రేట్ చేయడానికి... ఇది చేయని పనంటూ లేదు. దానికి తోడు కొన్ని కటర్స్, ఓ స్కూప్, కొన్ని పిక్స్ కూడా లభిస్తాయి. పని అయ్యాక శుభ్రంగా కడిగేసి అమర్చేసుకుంటే అందమైన స్టాండులాగా మారిపోతుంది. దీని ధర రూ. 400 పైనే ఉంది. ఆన్లైన్లో కాస్త తక్కువకి దొరకొచ్చు. -
భార్యతో గొడవపడి ముక్కు కోశాడు
కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లో ఓ వ్యక్తి భార్య పట్ల ఉన్మాదిలా ప్రవర్తించాడు. భార్యతో గొడవపడి కోపంతో ఆమె ముక్కు కోశాడు. కాన్పూర్ సమీపంలోని చండీపూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. సంజయ్ సాహూ అనే వ్యక్తి ఓ విషయంపై తన భార్య ఆశతో గొడవపడ్డాడు. ఆ సమయంలో సాహు స్నేహితుడు మనీష్ అక్కడే ఉన్నాడు. మనీష్.. ఆశను బంధించగా.. సాహూ కత్తితో భార్యపై దాడి చేసి ఆమె ముక్కు కోశాడు. బాధితురాలి అరుపులు విని చుట్టుపక్కల వారు వచ్చారు. సాహు అక్కడి నుంచి పారిపోగా, మనీస్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణపాయం లేదని వైద్యులు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.