ఒక్కొక్కటీ కాదు... వంద పండ్లని ఒకేసారి కోయొచ్చు! | vegetable cutter Fruit Plant Multi Kitchen Tool Set! | Sakshi
Sakshi News home page

ఒక్కొక్కటీ కాదు... వంద పండ్లని ఒకేసారి కోయొచ్చు!

Published Sat, Mar 12 2016 11:11 PM | Last Updated on Mon, Aug 20 2018 2:55 PM

ఒక్కొక్కటీ కాదు... వంద పండ్లని ఒకేసారి కోయొచ్చు! - Sakshi

ఒక్కొక్కటీ కాదు... వంద పండ్లని ఒకేసారి కోయొచ్చు!

న్యూ ప్రొడక్ట్
యాపిల్‌ని కట్ చేయాలంటే చాకు కావాలి. నిమ్మకాయ, బత్తాయిల రసం తీయాలంటే జ్యూసర్ కావాలి. కీరాని చెక్కాలంటే చాపర్ కావాలి. ఇలా ఒక్కో పనికీ ఒక్కో యంత్రం కావాలి... కదా! కానీ అది ఒకప్పుడు. ఇప్పుడు ఒక్క ‘ఫ్రూట్ ప్లాంట్’ కొంటే చాలు... అదే అన్ని పనులూ చేసి పారేస్తుంది. చూడ్డానికి చెంచాలు, చాకుల స్టాండులాగా కనిపిస్తున్న ఇదే... ఫ్రూట్ ప్లాంట్ మల్టీ కిచెన్ టూల్ సెట్. రెండో ఫొటోలో చూపినట్టు ఇది చాలా భాగాలుగా విడిపోతుంది. ఒక్కో భాగంతో ఒక్కో పని.

ఒకటి చాపింగ్‌కి, ఒకటి కటింగ్‌కి, ఇంకొకటి మ్యాష్ చేయడానికి, మరొకటి గ్రేట్ చేయడానికి... ఇది చేయని పనంటూ లేదు. దానికి తోడు కొన్ని కటర్స్, ఓ స్కూప్, కొన్ని పిక్స్ కూడా లభిస్తాయి. పని అయ్యాక శుభ్రంగా కడిగేసి అమర్చేసుకుంటే అందమైన స్టాండులాగా మారిపోతుంది. దీని ధర రూ. 400 పైనే ఉంది. ఆన్‌లైన్లో కాస్త తక్కువకి దొరకొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement