
పాపులర్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ‘ఎడిట్ మెసేజ్’ అనే కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తుంది. కొన్నిసార్లు తొందరపాటు వల్లో, పరధ్యానం వల్లో పంపిన మెసేజ్‌లో తప్పులు దొర్లుతుంటాయి. ఇకముందు నాలుక కర్చుకొని అయ్యో అనుకోనక్కర్లేదు. ఎడిట్ మెసేజ్ ఫీచర్‌తో పంపిన మెసేజ్‌లో తప్పును సరిద్దుకోవచ్చు.
ఇప్పటికీ వాట్సాప్‌లో ‘డిలిట్ ఫర్ ఎవ్రీవన్’ ఫీచర్ అందుబాటులో ఉంది. దీంతో యూజర్స్ సెంట్ మెసేజ్‌లను డిలిట్ చేయవచ్చు. అయితే ‘ఎడిట్ మెసేజ్’తో పూర్తిగా డిలిట్ చేయాల్సిన అవసరం లేకుండానే అవసరం ఉన్న చోట ఎడిట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో ప్రకటిస్తారు. (క్లిక్: అక్టోబరు ఒకటిన 5జీ సేవలు లాంచ్)