సుజుకి హయబుసా -2019 ఎడిషన్‌ లాంచ్‌ | Suzuki Hayabusa 2019 edition launched in India | Sakshi
Sakshi News home page

సుజుకి హయబుసా-2019 ఎడిషన్‌ లాంచ్‌

Dec 27 2018 3:15 PM | Updated on Jul 29 2019 7:41 PM

Suzuki Hayabusa 2019 edition launched in India - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన తయారీదారుమారుతి సుజుకి అనుబంధ సంస్థ  సుజుకి మోటార్‌ సైకిల్‌ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్‌ఎంఐపీఎల్‌)  తన పాపులర్‌ బైక్‌లో కొత్త ఎడిషన్‌ను విడుదల చేసింది.  ఖరీదైన స్పోర్ట్స్‌ బైక్‌ హయబుసా 2019 ఎడిషన్‌ను గురువారం ప్రారంభించింది.

భారతీయ పరిస్థితులకు అనుగుణంగా, అప్‌డేటెడ్‌ గ్రాఫిక్స్‌తో మెటాలిక్ ఓర్ట్ గ్రే , గ్లాస్ స్పార్కిల్ బ్లాక్  రెండు కొత్త రంగులలో హయాబూసా 2019 ఎడిషన్‌ను సుజుకి తీసుకొచ్చింది.  దీని ధరను రూ. 13.74 లక్షలుగా  (ఢిల్లీ ఎక్స్ షోరూమ్ )  నిర్ణయించింది. తమ అన్ని డీలర్‌షిప్‌ల ద్వారా ఈ  బైక్‌ అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.

దాదాపు రెండు దశాబ్దాలుగా  స్పోర్ట్స్‌ బైక్‌లలో  సుజుకి హయాబూసాకు భారతదేశంలో అద్భుతమైన స్పందన లభించిందనీ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సతోషి ఉచిడా వెల్లడించారు. ఇండియాలోని బైక్‌ లవర్స్‌కోసం 2019 ఎడిషన్‌ను రెండు కొత్త రంగుల్లో,మరింత ఆకర్షణీయంగా తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement