Hayabusa
-
సుజుకి హయబుసాకు రీకాల్: కారణం ఇదే..
భారతదేశంలో సుజుకి మోటార్‌సైకిల్ విక్రయిస్తున్న అత్యంత ఖరీదైన బైక్ 'హయబుసా'కు రీకాల్ ప్రకటించింది. రూ. 15 లక్షల కంటే ఎక్కువ ఖరీదైన బైకుకు కంపెనీ ఎందుకు రీకాల్ ప్రకటించింది, సమస్యను పరిష్కరించడానికి డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉందా? అనే వివరాలు ఇక్కడ చూసేద్దాం.మూడవ తరం హయబుసాలలో బ్రేక్ సమస్య ఉన్నట్లు గుర్తించిన సుజుకి మోటార్‌సైకిల్ కంపెనీ స్వచ్ఛందంగానే రీకాల్ ప్రకటించింది. 2021 మార్చి - 2024 సెప్టెంబర్ మధ్య తయారైన సుమారు 1,056 బైకులలో ఈ సమస్య ఉన్నట్లు సమాచారం. ఇది బైక్ రైడర్లను ప్రమాదంలోకి నెడుతుంది.ఇప్పటి వరకు ఈ సమస్యకు సంబంధించిన పిర్యాదులు నమోదు కాలేదు. కానీ భవిష్యత్తులో ఈ సమస్య వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని భావించిన కంపెనీ ముందుగానే రీకాల్ ప్రకటించింది. త్వరలోనే దీనిని పరిష్కరిస్తుందని సమాచారం. దీనికోసం కస్టమర్ల నుంచి డబ్బు వసూలు చేయదు. ఈ సర్వీస్ పూర్తిగా ఉచితం. -
రూ.16 లక్షల బైకుపై ఫుడ్ డెలివరీ - వీడియో వైరల్
సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడానికి నేటి యువత ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందులో భాగంగానే గత కొన్ని రోజులుగా ఖరీదైన బైకుల ద్వారా జొమాటో ఫుడ్ డెలివరీ చేయడం వంటివి చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు గతంలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. హెచ్ఎస్బీ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజీలో కనిపించిన వీడియోలో ఒక వ్యక్తి ఖరీదైన 'సుజుకి హయబుసా' (Suzuki Hayabusa) బైక్ రైడ్ చేస్తున్నాడు. ఇందులో రైడర్ జొమాటో డెలివరీ బాయ్ వేషధారణలో ఉండటం గమనించవచ్చు. వీడియోలో కనిపించే ఖరీదైన సూపర్ బైక్ ధర రూ. 13 లక్షల నుంచి రూ. 17 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుంది. బైక్ రైడర్ నిజంగా డెలివరీ బాయ్ అవునా? కాదా? అనేది తెలియదు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా చాలామంది సోషల్ మీడియాలో ఫెమస్ అవ్వడానికి ఇలాంటి వీడియోలు చేస్తున్నారు. ఇదీ చదవండి: ఉద్యోగుల పనిగంటల రిపోర్ట్ - భారత్ ప్రపంచంలోనే.. ఇలాంటి వీడియోలు వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి కాదు, గత వారం ఇండోర్‌లో కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఇందులో రోడ్డుపై జొమాటో బ్రాండింగ్ టీ-షర్ట్ వేసుకున్న ఒక అమ్మాయి యమహా ఆర్15 మోటార్‌సైకిల్ రైడ్ చేసింది. ఈ వీడియో అతి తక్కువ కాలంలోనే వైరల్ అయింది. దీనిపై స్పందించిన జొమాటో సీఈవో దీపిందర్ గోయల్.. ఆ సంఘటనకు, జొమాటోకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చాడు. View this post on Instagram A post shared by HARPREET SINGH (@hsbofficial) -
25 సంవత్సరాల చరిత్రకు నిదర్శనం ఈ బైక్ - ధర ఎంతంటే?
Suzuki Hayabusa Anniversary Edition: సుజుకి మోటార్‌సైకిల్ (Suzuki Motorcycle) మార్కెట్లో విక్రయిస్తున్న అత్యంత ఖరీదైన బైక్ 'హయబుసా' (Hayabusa) అని అందరికి తెలుసు. అయితే సంస్థ ఇప్పుడు ఇందులో ఒక కొత్త ఎడిషన్ విడుదల చేయడానికి సర్వత్రా సన్నద్ధమవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మార్కెట్లో 25 సంవత్సరాల నుంచి అమ్మకానికి ఉన్న హయబుసా గుర్తుగా కంపెనీ 25వ యానివెర్సరీ ఎడిషన్ విడుదల చేయడానికి తయారైంది. ఇందులో భాగంగానే హమామట్సు (Hamamatsu) ఆధారిత మార్క్యూ స్పెషల్ ఎడిషన్ మోడల్ ఆవిష్కరించింది. సంస్థ ఈ బైక్ అమ్మకాలను ఈ నెల నుంచే ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభించే అవకాశం ఉంది. దేశీయ విఫణిలో అందుబాటులోకి రానున్న కొత్త హయాబుసా స్పెషల్ ఎడిషన్ ఆరెంజ్/బ్లాక్ పెయింట్, డ్రైవ్ చైన్ అడ్జస్టర్ వంటి బిట్ల కోసం ప్రత్యేకమైన యానోడైజ్డ్ గోల్డ్ కలర్ పొందుతుంది. కంజి లోగో, ట్యాంక్ మీద త్రీ-డైమెన్షనల్ సుజుకి లోగో వంటివి చూడవచ్చు. సింగిల్ సీట్ కౌల్ ప్రామాణికంగా లభిస్తుంది. సుజుకి హయాబుసా పవర్‌ట్రెయిన్ & ఎలక్ట్రానిక్స్ హయబుసా స్పెషల్ ఎడిషన్ అదే లిక్విడ్ కూల్డ్ 1340సీసీ ఇన్లైన్-ఫోర్ ఇంజిన్ కలిగి 190 hp పవర్, 150 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ ట్రాన్స్మిషన్ బై డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్‌తో లభిస్తుంది. రైడింగ్ మోడ్లు, పవర్ మోడ్లు, ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఎలక్ట్రానిక్స్ కూడా చాలా అద్భుతమైన పనితీరుని అందిస్తాయి. (ఇదీ చదవండి: రైల్వే స్టేషన్లో ఇంత తక్కువ ధరకు రూమ్ లభిస్తుందని తెలుసా! ఎలా బుక్ చేసుకోవాలంటే?) అంచనా ధర & ప్రత్యర్థులు సుజుకి హయబుసా యానివెర్సరీ ఎడిషన్ అంతర్జాతీయ మార్కెట్లో త్వరలోనే విక్రయానికి రానుంది. భారతీయ మార్కెట్లో అధికారికంగా ఎప్పుడు విడుదలవుతుందనేది ప్రస్తుతానికి వెల్లడి కాలేదు, సాధారణ హయబుసా ధర రూ. 16.90 లక్షలు, కావున స్పెషల్ ఎడిషన్ ధర అంతకంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. -
భారత్‌లో 2023 హయబుసా లాంచ్: ధర వింటే దడ పుట్టాల్సిందే..
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ సుజుకి మోటార్‌సైకిల్స్ దేశీయ మార్కెట్లో '2023 హయబుసా' లాంచ్ చేసింది. ఈ బైక్ దాని మునుపటి మోడల్ కంటే కూడా కొంత ఎక్కువ ధరలో అందుబాటులో ఉంటుంది. ఈ బైక్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దా.. ధరలు & బుకింగ్స్: భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త సుజుకి హయబుసా ధర రూ. 16.90 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ ధర దాని మునుపటి మోడల్ కంటే కూడా రూ. 49,000 ఎక్కువ. కంపెనీ ఈ బైక్ కోసం దేశ వ్యాప్తంగా బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. డిజైన్ & ఫీచర్స్: 2023 హయబుసాలో ఆల్‌రౌండ్ ఎల్ఇడి లైటింగ్స్ ఉన్నాయి. అయితే టర్న్-ఇండికేటర్స్ ఎయిర్ డ్యామ్ పక్కన ఉన్న ఫెయిరింగ్ పైన ఉంచారు. ఫెయిరింగ్ డిజైన్ కూడా అప్డేట్ చేయబడింది. ఇప్పుడు ఫ్రంట్ ఫెయిరింగ్ చివరిలో క్రోమ్ యాక్సెంట్స్ కూడా ఉన్నాయి. ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో టిఎఫ్టి డిస్ప్లే ఉంటుంది. దీని ద్వారా యాంటీ-లిఫ్ట్ కంట్రోల్ సిస్టమ్, యాక్టివ్ స్పీడ్ లిమిటర్, కంబైన్డ్ బ్రేక్ సిస్టమ్, మోషన్ ట్రాక్ బ్రేక్ సిస్టమ్ వంటి వాటిని కంట్రోల్ చేయవచ్చు. కలర్ ఆప్షన్స్: 2023 హయబుసాలో చెప్పుకోదగ్గ అప్డేట్ కలర్ ఆప్షన్స్. ఈ బైక్ ఇప్పుడు మెటాలిక్ గ్రే, గ్రే లెటర్రింగ్ అండ్ సైడ్‌లో క్రోమ్ స్ట్రిప్‌తో ఫుల్-బ్లాక్ పెయింట్ ఆప్షన్లో లభిస్తుంది. అంతే కాకుండా దీని ఫ్రంట్, రియర్, సైడ్ ఫెయిరింగ్‌లో క్యాండీ రెడ్ హైలైట్లు ఉంటాయి. ఇంజిన్ & పర్ఫామెన్స్: లేటెస్ట్ హయబుసా ఇంజిన్ ఎటువంటి అప్డేట్స్ పొందలేదు, కావున ఇందులో అదే 1,340 సిసి లిక్విడ్-కూల్డ్ ఇన్లైన్ ఫోర్-సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇది 190 బిహెచ్పి పవర్, 142 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ స్లిప్, అసిస్ట్ క్లచ్ & ద్విబై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్‌తో పాటు 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది, కావున ఉత్తమ పనితీరుని అందిస్తుంది. (ఇదీ చదవండి: మనవడితో ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్.. ఫోటోలు వైరల్) సుజుకి హయాబుసా అదే అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి భాగంలో పూర్తిగా అడ్జస్టబుల్ USD ఫోర్క్ & వెనుక భాగంలో మోనో-షాక్ యూనిట్ పొందుతుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో డ్యూయల్ 320 మి.మీ ఫ్లోటింగ్ డిస్క్ బ్రేక్ ద్వారా బ్రెంబో స్టైల్మా 4-పాట్ కాలిపర్, వెనుకవైపు నిస్సిన్ సింగిల్-పాట్ కాలిపర్‌తో ఒకే 260 మిమీ డిస్క్ బ్రేక్ కలిగి ఉంటుంది. -
లగ్జరీ బైక్‌తో ‘పఠాన్’ స్టార్ హల్చల్: వీడియో వైరల్
సాక్షి, ముంబై: సాధారణ ప్రజలకంటే కూడా సెలబ్రిటీలకు లగ్జరీ కార్లు, బైకులపైన ఎక్కువ క్రేజు ఉంటుంది. ఇందులో భాగంగానే ఇటీవల బాలీవుడ్ స్టార్ 'జాన్ అబ్రహం' ఒక ఖరీదైన సుజుకి హయబుసా బైక్ కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. 'పఠాన్' సినిమా అతి తక్కువ కాలంలోనే గొప్ప విజయం సాధించిన తరువాత 'జాన్ అబ్రహం' ఈ సరికొత్త 2023 మోడల్ హయబుసా కొనుగోలు చేశారు. ఈ మోడల్ ఇంకా భారతీయ మార్కెట్లో విడుదల కాలేదు. ధూమ్ సినిమాలో హయబుసా రైడ్ చేసి ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచిన జాన్ ఇప్పుడు లేటెస్ట్ హుయాబుసా సొంతం చేసుకున్నాడు. ఈ 2023 హయబుసా బైకుని CBU (కంప్లీట్ బిల్డ్ యూనిట్) మార్గం ద్వారా మన దేశానికి దిగుమతి చేసుకోవాలి. ఈ బైక్ 1,340cc ఇన్ లైన్ ఫోర్ సిలిండర్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 187.4 బిహెచ్పి పవర్ మరియు 142 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా ఈ బైక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జాన్ అబ్రహం ఇప్పటికే తన గ్యారేజిలో యమహా వి-మ్యాక్స్, డుకాటి పానిగేల్, MV అగస్టా, కెటిఎమ్ 390, బిఎండబ్ల్యు ఎస్1000ఆర్ఆర్, అప్రిలియా RSV4 RF వంటి బైకుయ్లను కూడా కలిగి ఉన్నారు. అయితే ఇప్పుడు హయబుసా కొత్త అతిధిగా తన గ్యారేజిలో అడుగుపెట్టింది. నిజానికి జాన్ అబ్రహం కాలిఫోర్నియా సూపర్ బైక్ స్కూల్ నుంచి ప్రత్యేక రైడింగ్ శిక్షణ పొందాడు. -
సుజుకి హయాబుసా క్రేజ్: ఆ వేరియంట్ ఔట్ ఆఫ్ స్టాక్!
సాక్షి, ముంబై: నిన్న(ఏప్రిల్ 26 సోమవారం) భారత మార్కెట్లో లాంచ్ అయిన 2021 సుజుకి హయాబుసా హాట్ కేకులా అమ్ముడు పోయింది. సుజుకి ఆన్లైన్ బుకింగ్ పోర్టల్‌లో వైట్ కలర్ మోడల్ నో స్టాక్ బోర్డు చూపిస్తోంది. దీంతో హయాబుసా పాపులారిటీ చూసి కస్టమర్లు షాక్ తిన్నారు. కానీ ఆసక్తి ఉన్న కస్టమర్లు లక్ష రూపాయలు చెల్లించి బ్లాక్ అండ్ సిల్వర్ కలర్ ఆప్షన్లను బుక్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఎన్ని యూనిట్లు బుక్ అయ్యాయనే దానిపై ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. అలాగే అవుట్ ఆఫ్ స్టాక్ ఈ విషయాన్ని కంపెనీ ఇంకా ధృవీకరించలేదు. సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా తన అగ్రశ్రేణి స్పోర్ట్స్ బైక్ హయబుస మూడో తరం వెర్షన్ బైక్‌ను సోమవారం భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ.16.40 లక్షలుగాఉంది. కంపెనీ దాదాపు 13 ఏళ్ల తర్వాత ఈ బైక్‌ను అప్డేట్ చేసింది. బీఎస్-6 ఉద్గార నియమాలను కలిగిన 1,340 సీసీ లిక్విడ్-కూల్డ్ ఇన్లైన్ ఫోర్-సిలిండర్ ఇంజిన్ ఇందులో ఉంది. హిల్‌హోల్డ్ కంట్రోల్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్‌తో పాటు అనేక అధునాతన ఫీచర్లను కలిగి ఉంది. బైక్ డెలివరీలు మే నెల ద్వితీయార్ధం నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని, రూ.లక్ష నగదు చెల్లించి ఆన్లైన్లో బుక్ చేసుకోచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. స్పోర్ట్స్ బైకులను ఇష్టపడే రైడర్లకు కొత్త హయబుస చక్కని ఎంపిక అని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కొయిచిరో హిరావ్ పేర్కొన్నారు. -
సుజుకి హయబుసా -2019 ఎడిషన్ లాంచ్
సాక్షి,న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన తయారీదారుమారుతి సుజుకి అనుబంధ సంస్థ సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్ఎంఐపీఎల్) తన పాపులర్ బైక్‌లో కొత్త ఎడిషన్‌ను విడుదల చేసింది. ఖరీదైన స్పోర్ట్స్ బైక్ హయబుసా 2019 ఎడిషన్‌ను గురువారం ప్రారంభించింది. భారతీయ పరిస్థితులకు అనుగుణంగా, అప్డేటెడ్ గ్రాఫిక్స్‌తో మెటాలిక్ ఓర్ట్ గ్రే , గ్లాస్ స్పార్కిల్ బ్లాక్ రెండు కొత్త రంగులలో హయాబూసా 2019 ఎడిషన్‌ను సుజుకి తీసుకొచ్చింది. దీని ధరను రూ. 13.74 లక్షలుగా (ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ) నిర్ణయించింది. తమ అన్ని డీలర్‌షిప్‌ల ద్వారా ఈ బైక్ అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. దాదాపు రెండు దశాబ్దాలుగా స్పోర్ట్స్ బైక్‌లలో సుజుకి హయాబూసాకు భారతదేశంలో అద్భుతమైన స్పందన లభించిందనీ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సతోషి ఉచిడా వెల్లడించారు. ఇండియాలోని బైక్ లవర్స్కోసం 2019 ఎడిషన్‌ను రెండు కొత్త రంగుల్లో,మరింత ఆకర్షణీయంగా తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. -
బ్యాంకు ఉద్యోగిని బలిగొన్న బైక్ రైడింగ్!
గురుగ్రామ్ : బైక్ రైడింగ్ సరదా ఓ బ్యాంకు ఉద్యోగి ప్రాణాలు బలిగొంది. స్నేహితులతో కలిసి లాంగ్‌డ్రైవ్‌కి వెళ్లిన అతడు అతి వేగం కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కుండ్లీ-మనేసర్- సల్వాల్ ఎక్స్‌ప్రెస్ వే పై చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... పశ్చిమ ఢిల్లీకి చెందిన సంచిత్ ఒబెరాయ్(25) ఓ మల్టీనేషనల్ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నాడు. బైక్ రైడింగ్ అంటే సరదా ఉన్న సంచిత్.. ఇటీవలే సుజుకి హయాబుసా సూపర్‌బైక్‌ను కొనుగోలు చేశాడు. స్నేహితులతో కలిసి ఆదివారం ఉదయం లాంగ్‌డ్రైవ్‌కు బయల్దేరాడు. ఈ క్రమంలో స్నేహితులంతా పోటాపోటీగా బైక్‌లు నడుపుతూ వేగంగా వెళ్తున్న సమయంలో.. సంచిత్ వేగాన్ని పెంచాడు. దీంతో తన ముందు ప్రయాణిస్తున్న లారీని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన సంచిత్‌ను ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అతి వేగం కారణంగానే.. ప్రమాదం జరిగిన సమయంలో సంచిత్ బైక్ 200 కిలో మీటర్ల స్పీడుతో ప్రయాణిస్తోందని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే ప్రమాదం సంభవించిందని పేర్కొన్నారు. సంచిత్ స్నేహితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
దేశీయంగా సుజుకీ ‘హయబుసా’ అసెంబ్లింగ్
న్యూఢిల్లీ: సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా తన ప్రీమియం బైక్ ‘హయబుసా’ అసెంబ్లింగ్‌ను హరియాణాలోని గుర్గావ్ ప్లాంటులో ప్రారంభించింది. దీంతో ఇప్పుడు బైక్ రూ.13.57 లక్షలకే వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. దిగుమతుల కారణంగా బైక్ ధర ఇదివరకు రూ.15.95 లక్షలుగా ఉండేది. అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీవి. కాగా బైక్ ఫీచర్లలో ఎలాంటి మార్పులు ఉండవని కంపెనీ పేర్కొంది.