సాక్షి, ముంబై: నిన్న(ఏప్రిల్ 26 సోమవారం) భారత మార్కెట్లో లాంచ్ అయిన 2021 సుజుకి హయాబుసా హాట్ కేకులా అమ్ముడు పోయింది. సుజుకి ఆన్‌లైన్ బుకింగ్ పోర్టల్‌లో వైట్ కలర్ మోడల్ నో స్టాక్ బోర్డు చూపిస్తోంది. దీంతో హయాబుసా పాపులారిటీ చూసి కస్టమర్లు షాక్ తిన్నారు. కానీ ఆసక్తి ఉన్న కస్టమర్లు లక్ష రూపాయలు చెల్లించి బ్లాక్ అండ్ సిల్వర్ కలర్ ఆప్షన్లను బుక్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఎన్ని యూనిట్లు బుక్ అయ్యాయనే దానిపై ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. అలాగే అవుట్ ఆఫ్ స్టాక్ ఈ విషయాన్ని కంపెనీ ఇంకా ధృవీకరించలేదు.
సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా తన అగ్రశ్రేణి స్పోర్ట్స్ బైక్ హయబుస మూడో తరం వెర్షన్ బైక్‌ను సోమవారం భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ.16.40 లక్షలుగాఉంది. కంపెనీ దాదాపు 13 ఏళ్ల తర్వాత ఈ బైక్‌ను అప్‌డేట్ చేసింది. బీఎస్-6 ఉద్గార నియమాలను కలిగిన 1,340 సీసీ లిక్విడ్-కూల్డ్ ఇన్లైన్ ఫోర్-సిలిండర్ ఇంజిన్ ఇందులో ఉంది. హిల్‌హోల్డ్ కంట్రోల్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్‌తో పాటు అనేక అధునాతన ఫీచర్లను కలిగి ఉంది. బైక్ డెలివరీలు మే నెల ద్వితీయార్ధం నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని, రూ.లక్ష నగదు చెల్లించి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. స్పోర్ట్స్ బైకులను ఇష్టపడే రైడర్లకు కొత్త హయబుస చక్కని ఎంపిక అని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కొయిచిరో హిరావ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment