సాక్షి, న్యూఢిల్లీ: సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్(ఎస్‌ఎంఐపీఎల్) కొత్త బైక్‌ను పరిచయం చేసింది. జిక్సర్ సిరీస్‌కు కొనసాగింపుగా ‘జిక్సర్ 250’ బైక్‌ను లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించింది. దీని ధరను రూ.1,59,800 (ఎక్స్‌షోరూం, న్యూఢిల్లీ)గా నిర్ణయించింది. జిక్సెర్ ఎస్‌ఎఫ్‌కంటే రూ. 11 వేల ధను ఎక్కువ. ఫోర్-స్ట్రోక్ 249 సీసీ ఇంజిన్‌తో ఈ బైక్‌ను రూపొందించింది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో డ్యూయల్ ఛానల్ యాంటీ-లాక్ బ్రేక్ సిస్టమ్ (ఏబీఎస్) తో మెరుగైన బ్రేకింగ్ సామర్థ్యాన్ని అందిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రత్యేకంగా భారతీయ వినియోగదారులకోసం దీన్ని తీసుకొస్తున్నట్టు చెప్పింది. రెండు రంగుల్లో ఇది లభ్యం కానుంది.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి, పనితీరు గల మోటార్‌సైకిళ్లను అభివృద్ధికి నిదర్శనం తమ కొత్త జిక్సర్ 250 అని, సుజుకి వారసత్వానికి ఇది నిజమైన ప్రతిబింబమని కంపెనీ హెడ్ కొయిచిరో హిరావ్ అన్నారు. జిక్సెర్ పోర్ట్‌ఫోలియోతో తాము మరింత వృద్ధిని సాధించాలని ఆశిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment