![Hero Xtreme160R Stealth 2 point 0 launched in India price details inside - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/28/Hero%20Xtreme%20160R%20Stealth%202.jpg.webp?itok=DMO1z8sz)
సాక్షి,ముంబై: పండుగ సీజన్ సందర్భంగా హీరో మోటోకార్ప్ కొత్త బైక్‌ను రిలీజ్ చేసింది. ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ స్టీల్త్ 2.0 పేరుతో కొత్త ఎడిషన్ బైక్‌ను భారత మార్కెట్లో తీసుకొచ్చింది. దీని ధర రూ. 1.29 లక్షలుగా ఉంచింది.
హీరో కనెక్ట్‌తో తీసుకొచ్చిన కొత్త ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ స్టెల్త్ 2.0 రైడర్‌లను కనెక్ట్‌గా ఉండేలా చేసే స్మార్ట్ మొబిలిటీ బైక్. దీని ద్వారా ఈ వెహికల్ లైవ్ లొకేషన్‌ను ట్రేస్ చేయవచ్చు. ఇంకా టెలిస్కోపిక్ ఫోర్క్, ఫ్రేమ్,పిలియన్ గ్రిప్‌పై రెడ్ యాక్సెంట్‌లతో మ్యాట్ బ్లాక్ షేడ్‌తో వస్తోంది. హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ స్టెల్త్ 2.0 దేశవ్యాప్తంగా ఉన్న హీరో మోటోకార్ప్ షోరూమ్‌లలో రూ. 1,29,738 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ).
ఇంజీన్, ఫీచర్లు
163cc ఎయిర్-కూల్డ్ BS-VI కంప్లైంట్ ఇంజన్. ఇది 6500 RPM వద్ద 15.2 PS పవర్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది.కొత్త ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ స్టెల్త్ 2.0 టెలిస్కోపిక్ ఫోర్క్, ఫ్రేమ్ ,పిలియన్ గ్రిప్‌పై రెడ్ యాక్సెంట్‌లతో మ్యాట్ బ్లాక్ షేడ్‌తోపాటు జియో ఫెన్స్ అలర్ట్, స్పీడ్ అలర్ట్, టోప్ల్ అలర్ట్, టో ఎవే అలర్ట్ , అన్‌ప్లగ్ అలర్ట్‌లతో సహా రైడర్ వారి వాహనం గురించి అప్‌డేట్‌గా ఉంచేలా ఫీచర్లను ఇందులో పొందుపర్చింది.
Comments
Please login to add a commentAdd a comment