Karizma XMR: దేశీయ ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు హీరో మోటోకార్ప్ సరికొత్త బైక్‌ను (మంగళవారం, ఆగస్టు 29) లాంచ్ చేసింది. కరిజ్మా XMR 210 పేరుతో ఈ కొత్త బైక్ లాంచ్‌తో కరిజ్మా బ్రాండ్‌ను రీలాంచ్ చేసింది. అంతేకాదు ఈ బైక్‌పై ఆకర్షణీయమైన్ రూ. 10వేల ప్రత్యేక తగ్గింపు అందిస్తోంది. యంగ్ జనరేషన్ బైకర్లను దృష్టిలో ఉంచుకని దీన్ని తీసు కొచ్చినట్టు హీరో మోటోకార్ప్ కంపెనీ వెల్లడించింది. బుకింగ్‌లను కూడా షురూ చేసింది.
రూ. 1,82,900 లాంచింగ్ ప్రైస్‌గా ఉన్న Karizma XMR 210 ఈ తగ్గింపుతో రూ. 1,72,900 (ఎక్స్-షోరూమ్ ధర ఆల్ ఇండియా) అందుబాటులో ఉంటుంది. నటుడు,బ్రాండ్ అంబాసిడర్ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కరిజ్మా XMR 210ని ఆవిష్కరించారు. ఇది ఐకానిక్ ఎల్లో, టర్బో రెడ్ , మ్యాట్ ఫాంటమ్ బ్లాక్ అనే మూడు కలర్ ఆప్షన్‌లలో లభ్యం.
Karizma XMR 210 ఇంజీన్, ఫీచర్లు
210cc సింగిల్-సిలిండర్, 4V, DOHC , లిక్విడ్-కూల్డ్ యూనిట్ 9250 RPM (కంపెనీ అత్యంత శక్తివంతమైన ఇంజిన్)ను అమర్చింది. RPM వద్ద 20.4 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గరిష్ట వేగం గంటకు 140 కి.మీ. అని కంపెనీ తెలిపింది.
లిక్విడ్ కూల్ సెటప్ డ్యూయల్-ఛానల్ ABS, స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్, 6-స్పీడ్ గేర్‌బాక్స్ ఫ్యాటర్ రియల్ వెక టైర్‌తో వస్తుంది.ఇంకా ఈ బైక్‌లో కొత్త ఎల్‌ఈడీ లైట్లు , ఇండికేటర్‌లు, స్లీకర్ ఇంధన ట్యాంక్, షార్ప్ లైన్‌లో, రైడర్‌కు ప్రొటెక్షన్‌గా స్నాజీ విండ్‌స్క్రీన్‌తో యంగస్టర్స్‌ను ఆకట్టుకునేలా ఉంది. కాల్‌ల్స్, ఇతర నోటిఫికేషన్ అలర్ట్ కోసం బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్, ఇంకా టర్న్-బై-టర్న్ నావిగేషన్ కూడా ఉంది. సరికొత్త ఫుల్లీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంది. ఇది గేర్ పొజిషన్ ఇండికేటర్, తేదీ, సమయం, టూర్, ఓడోమీటర్ రీడింగ్, ఇంధన స్థాయి, టాకోమీటర్ స్పీడోమీటర్ రీడింగ్‌ల వంటి సమాచారాన్ని అందిస్తుంది.
Say hello to the Most Powerful in its Class machine loaded with cutting-edge tech, and a design that's an absolute head-turner. 😎 Introducing the new #KarizmaXMR, at an introductory price of Rs. 1,72,900* (*Ex-showroom price All India).
— Hero MotoCorp (@HeroMotoCorp) August 29, 2023
BOOKINGS OPEN https://t.co/Y7zhD7lJTE pic.twitter.com/7NEhA4Fijr
Comments
Please login to add a commentAdd a comment