సాక్షి, ముంబై: ప్రముఖ టూ వీలర్ మేకర్ హీరో మోటో తన కస్టమర్లకు షాకిచ్చింది. ఏప్రిల్ నుంచి అన్ని వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎంపిక చేసిన ఉత్పత్తులపై వచ్చే నెల నుండి 2 శాతం వరకు ధరలు పెరగనున్నాయి. ఈ పెరుగుదల మోడల్స్ , మార్కెట్‌లను బట్టి మారుతూ ఉంటుందని హీరో మోటోకార్ప్ ప్రకటించింది. (ఓలా ఎలక్ట్రిక్ దూకుడు: రూ. 2,475 కోట్ల సమీకరణ !)
OBD-2 నిబంధనలకు అనుగుణంగా మారడం, ఉద్గార ప్రమాణాల అమలుతో ఉత్పత్తి వ్యయం పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. మరోవైపు కొత్త నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దీనికి అనుగుణంగా కంపెనీలు సైతం కొత్త ఉద్గార ప్రమాణాల అమలుకోసం తమ తమ వాహనాల్లో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. (ఇది నమ్మక ద్రోహమే..తక్షణమే రాజీనామా చెయ్యండి! జుకర్‌బర్గ్ ఆగ్రహం)
హీరో మోటోకార్ప్ తాజా లాంచ్‌లు:
హీరో మోటోకార్ప్ ఇటీవల భారతదేశంలో రూ. 68,599 (ఎక్స్-షోరూమ్) వద్ద సరికొత్త జూమ్ 110ని విడుదల చేసింది. అలాగే రూ. 83,368, ఎక్స్-షోరూమ్ ధరతో సూపర్ స్ప్లెండర్ కొత్త హైటెక్ XTEC వేరియంట్‌ను కూడా పరిచయం చేసింది. కాగా ఇలీవలి కాలంలో హీరో కంపెనీ ధరల పెంపు ఇదిరెండోసారి. అటు టాటా మోటార్స్ సైతం తాజాగా తన కమర్షియల్ వాహన ధరలను 5 శాతం మేర పెంచింది.
Comments
Please login to add a commentAdd a comment