Hero moto Corp
-
ఎలక్ట్రిక్ టూవీలర్స్ పోటీ!
ఎలక్ట్రిక్ టూవీలర్ల అమ్మకాలు మళ్లీ ఫుల్ స్వింగ్‌లో పరుగులు తీస్తున్నాయి. తాజాగా జూలై నెలలో సేల్స్ దాదాపు రెట్టింపు కావడం దీనికి నిదర్శనం. మరోపక్క, ఈ విభాగంలో పోటీ ఫాస్ట్ చార్జింగ్ అవుతోంది. మార్కెట్ లీడర్‌గా ఉన్న ఓలా ఎలక్ట్రిక్‌కు సాంప్రదాయ టూవీలర్ దిగ్గజాలు షాకిస్తున్నాయి. ధరల యుద్ధానికి తెరతీసి, ఓలా మార్కెట్ వాటాకు గండికొడుతున్నాయి. ఐపీఓ సక్సెస్‌తో దండిగా నిధుల జోష్‌లో ఉన్న ఓలా.. ఈ పోటీని ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తి రేపుతోంది! ఈ ఏడాది జూలై నెలలో దేశవ్యాప్తంగా మొత్తం 1,07,016 ఈ–టూవీలర్లు రోడ్డెక్కాయి. గతేడాది అమ్ముడైన 54,616 వాహనాలతో పోలిస్తే 96 శాతం వృద్ధి నమోదైంది. ఈ ఏడాది జూన్‌లో అమ్మకాలు 79,868 మాత్రమే. గత కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న సేల్స్ మళ్లీ ఎలక్ట్రిక్ వేగంతో దూసుకెళ్తున్నాయి. పెట్రోలు టూవీలర్లలో రారాజులుగా ఉన్న సాంప్రదాయ టూవీలర్ కంపెనీలు.. బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్స్, హీరో మోటో సైతం ఎలక్ట్రిక్ బరిలో తగ్గేదేలే అంటూ కాలుదువ్వడమే దీనికి ప్రధాన కారణం. జూలైలో బజాజ్ ఆటో ఏకంగా 17,642 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించడం విశేషం. జూన్‌తో పోలిస్తే 80 శాతం సేల్స్ పెరిగాయి. మార్కెట్ వాటా సైతం 11.6 శాతం నుంచి 16.9 శాతానికి జంప్ చేసింది. ఇక టీవీఎస్ అమ్మకాలు 30 శాతం పైగా ఎగబాకి 19,471 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ రెండింటితో పోలిస్తే వెనుకబడ్డ హీరో మోటో 5,044 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించి సత్తా చాటింది. మొత్తంమీద చూస్తే, ఈ మూడు దిగ్గజాల ‘ఎలక్ట్రిక్’ వాటా 40 శాతానికి పైగా ఛార్జింగ్ అయింది. ఇందులో టీవీఎస్, బజాజ్ వాటాయే దాదాపు 35 శాతం గమనార్హం. ఓలాకు షాక్... రెండు నెలల క్రితం, మే నెలలో దాదాపు 50 శాతం మార్కెట్ వాటాతో తిరుగులేని స్థానంలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్‌కు పోటీ సెగ బాగానే తగులుతోంది. జూన్‌లో కంపెనీ 36,781 వాహనాలు విక్రయించగా.. జూలైలో ఈ సంఖ్య కాస్త మెరుగుపడి 41,597కు చేరింది. అయితే, మార్కెట్ వాటా మాత్రం జూన్‌లో 47.5 శాతానికి, ఆపై జూలైలో ఏకంగా 40 శాతానికి పడిపోయింది. ఓలాకు తగ్గుతున్న మార్కెట్ వాటాను సాంప్రదాయ టూవీలర్ కంపెనీలు ఎలక్ట్రిక్ వేగంతో కొట్టేస్తున్నాయి. మరోపక్క, పూర్తిగా ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తున్న ఏథర్ ఎనర్జీ క్రమంగా తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటోంది. జూన్‌లో 6,189 (8% మార్కెట్ వాటా), జూలైలో 10,080 (10% వాటా) వాహనాలను అమ్మింది. అయితే, దీని స్కూటర్ల ధరలు రూ. లక్ష పైనే ఉన్నాయి. సాంప్రదాయ టూవీలర్ దిగ్గజాలు రూ. లక్ష లోపు ధరతో ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేస్తుండటంతో.. ఓలా, ఏథర్ వంటి పూర్తి ఈవీ కంపెనీలు కూడా ధరల యుద్ధంలోకి దూకాల్సిన పరిస్థితి నెలకొంది. మార్కెట్ వాటా పతనంతో ఓలా ఇక పూర్తిగా ఈ–టూవీలర్లపైనే దృష్టిసారించాలని నిర్ణయించుకుంది.భారీ నెట్వర్క్, సర్వీస్ ప్లస్..తొలిసారిగా రూ. లక్ష లోపు స్కూటర్లను ప్రవేశపెట్టడం కూడా బజాజ్, టీవీఎస్, హీరో అమ్మకాలు పుంజుకున్నాయి. ‘ఈ 3 సాంప్రదాయ టూవీలర్ కంపెనీలకు విస్తృత డి్రస్టిబ్యూషన్ నెట్వర్క్, బ్రాండ్ విలువ, సర్వీస్ సదుపాయాలు దన్నుగా నిలుస్తున్నాయి.మార్కెట్ వాటాను కొల్లగొట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి’ అని రీసెర్చ్ సంస్థ నోమురా ఆటోమోటివ్ రిటైల్ విభాగం హెడ్ హర్షవర్ధన్ శర్మ పేర్కొన్నారు. ధరల పోరు, బ్యాటరీ టెక్నాలజీలో మెరుగుదల వంటివి ఈ విభాగంలో పోటీని మరింత తీవ్రతరం చేయనుంది. తాజా పరిణామాలతో ఛార్జింగ్ స్టేషన్ల భారీ పెరుగుదలతో పాటు ఇతరత్రా మౌలిక సదుపాయాలు జోరందుకుంటాయని, వినియోగదారులకు కూడా ఇది మేలు చేకూరుస్తుందని హర్షవర్ధన్ చెప్పారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
పబ్లిక్ ఇష్యూ ద్వారా హీరో ఫిన్‌కార్ప్ రూ.4వేల కోట్లు సమీకరణ!
ప్రముఖ దిగ్గజ కంపెనీ హిరో మోటోకార్ప్ ఆటోమోబైల్ రంగంలో సేవలు అందించడంతో పాటు ఫైనాన్స్ రంగంలోనూ తన సత్తాచాటేందుకు సిద్ధం అయింది. హీరో మోటోకార్ప్ ఆర్థిక సేవల విభాగమైన హీరో ఫిన్‌కార్ప్ రూ.4,000 కోట్ల సమీకరణ లక్ష్యంతో 2024లో పబ్లిక్ ఇష్యూకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పబ్లిక్ ఇష్యూపై సలహాలు ఇచ్చేందుకు ఎనిమిది ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులను సంస్థ ఎంపిక చేసినట్లు సమాచారం. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకుల్లో జేఎం ఫైనాన్షియల్, బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్, జెఫ్రీస్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, హెచ్ఎస్బీసీ సెక్యూరిటీస్, యూబీఎస్, ఎస్బీఐ కేపిటల్, హెచ్డీఎఫ్సీ ఉన్నాయని ఓ వార్త మీడియాలో ప్రచురించారు. ప్రతిపాదిత ఐపీఓలో భాగంగా కొత్త షేర్ల జారీ, ప్రస్తుత వాటాదార్ల షేర్ల విక్రయం ద్వారా రూ.4,000 కోట్లను సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. హీరో ఫిన్‌కార్ప్‌లో హీరోమోటో కార్ప్ సంస్థకు 40 శాతం వాటా ఉంది. ముంజల్ కుటుంబం చేతిలో 35-39 శాతం వాటా ఉండగా.. అపోలో గ్లోబల్, క్రిస్ కేపిటల్, క్రెడిట్ సూయిజ్, హీరో మోటోకార్ప్‌నకు చెందిన కొన్ని డీలర్ల సంస్థల వద్ద మిగిలిన వాటా ఉంది. 1991లో హీరో ఫిన్‌కార్ప్ బ్యాంకింగేతర ఆర్థిక సేవల కంపెనీగా ఏర్పడింది. -
ఆ ఐకానిక్ బైక్ మళ్లీ వచ్చేసింది.. అదిరిపోయే లాంచింగ్ ఆఫర్ కూడా
Karizma XMR: దేశీయ ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు హీరో మోటోకార్ప్ సరికొత్త బైక్‌ను (మంగళవారం, ఆగస్టు 29) లాంచ్ చేసింది. కరిజ్మా XMR 210 పేరుతో ఈ కొత్త బైక్ లాంచ్‌తో కరిజ్మా బ్రాండ్‌ను రీలాంచ్ చేసింది. అంతేకాదు ఈ బైక్‌పై ఆకర్షణీయమైన్ రూ. 10వేల ప్రత్యేక తగ్గింపు అందిస్తోంది. యంగ్ జనరేషన్ బైకర్లను దృష్టిలో ఉంచుకని దీన్ని తీసు కొచ్చినట్టు హీరో మోటోకార్ప్ కంపెనీ వెల్లడించింది. బుకింగ్‌లను కూడా షురూ చేసింది. రూ. 1,82,900 లాంచింగ్ ప్రైస్‌గా ఉన్న Karizma XMR 210 ఈ తగ్గింపుతో రూ. 1,72,900 (ఎక్స్-షోరూమ్ ధర ఆల్ ఇండియా) అందుబాటులో ఉంటుంది. నటుడు,బ్రాండ్ అంబాసిడర్ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కరిజ్మా XMR 210ని ఆవిష్కరించారు. ఇది ఐకానిక్ ఎల్లో, టర్బో రెడ్ , మ్యాట్ ఫాంటమ్ బ్లాక్ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభ్యం. Karizma XMR 210 ఇంజీన్, ఫీచర్లు 210cc సింగిల్-సిలిండర్, 4V, DOHC , లిక్విడ్-కూల్డ్ యూనిట్ 9250 RPM (కంపెనీ అత్యంత శక్తివంతమైన ఇంజిన్)ను అమర్చింది. RPM వద్ద 20.4 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గరిష్ట వేగం గంటకు 140 కి.మీ. అని కంపెనీ తెలిపింది. లిక్విడ్ కూల్ సెటప్ డ్యూయల్-ఛానల్ ABS, స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్, 6-స్పీడ్ గేర్‌బాక్స్ ఫ్యాటర్ రియల్ వెక టైర్‌తో వస్తుంది.ఇంకా ఈ బైక్‌లో కొత్త ఎల్ఈడీ లైట్లు , ఇండికేటర్లు, స్లీకర్ ఇంధన ట్యాంక్, షార్ప్ లైన్లో, రైడర్‌కు ప్రొటెక్షన్గా స్నాజీ విండ్‌స్క్రీన్‌తో యంగస్టర్స్ను ఆకట్టుకునేలా ఉంది. కాల్ల్స్, ఇతర నోటిఫికేషన్ అలర్ట్ కోసం బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్, ఇంకా టర్న్-బై-టర్న్ నావిగేషన్ కూడా ఉంది. సరికొత్త ఫుల్లీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంది. ఇది గేర్ పొజిషన్ ఇండికేటర్, తేదీ, సమయం, టూర్, ఓడోమీటర్ రీడింగ్, ఇంధన స్థాయి, టాకోమీటర్ స్పీడోమీటర్ రీడింగ్‌ల వంటి సమాచారాన్ని అందిస్తుంది. Say hello to the Most Powerful in its Class machine loaded with cutting-edge tech, and a design that's an absolute head-turner. 😎 Introducing the new #KarizmaXMR, at an introductory price of Rs. 1,72,900* (*Ex-showroom price All India). BOOKINGS OPEN https://t.co/Y7zhD7lJTE pic.twitter.com/7NEhA4Fijr — Hero MotoCorp (@HeroMotoCorp) August 29, 2023 -
హార్లే-డేవిడ్సన్ లవర్స్‌కు భారీ షాక్, ఏకంగా పదివేలు!
Harley Davidson X440:హార్లే-డేవిడ్సన్ లవర్స్‌కు భారీ షాక్. హీరో మోటోకార్ప్ హార్లే-డేవిడ్సన్ బైక్స్ లేటెస్ట్ బైక్ ధరలను భారీగా పెంచేసింది. ఏకంగా 10,500 మేర ధరలను పెంచింది. ఈ పెరుగుదల అన్ని వేరియంట్లకు వర్తిస్తుందని హీరో మోటోకార్ప్ ధృవీకరించింది. ధర పెంపు తర్వాత, హార్లే-డేవిడ్సన్ ఎక్స్440 బైక్ ధర రూ. 2,39,500 నుండి ప్రారంభమవుతుంది (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ప్రస్తుత ప్రారంభ ధర ఆగస్టు 3 వరకు అందుబాటులో ఉంటుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు రూ. 5,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించి బైక్‌ను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు హీరో మోటోకార్ప్ గత నెలలో విడుదల చేసిన హార్లే డేవిడ్సన్ ఎక్స్440 కొత్త ధరను ప్రకటించింది. కంపెనీ ప్రయోగ ధరతో పోలిస్తే రూ.10,500 ఖరీదు ఎక్కువ. ఇది 2,29,000 ప్రారంభ ధరతో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. (టికెట్ల ధరలకు ‘రెక్కలు’: ప్రయాణీకులకు ఇక చుక్కలే!) హీరో మోటోకార్ప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నిరంజన్ గుప్తా మాట్లాడుతూ, హార్లీ-డేవిడ్సన్ ఎక్స్ 440 ప్రారంభించినప్పటి నుంచి మంచి ఆదరణ లభించిందనీ, ఆన్లైన్ బుకింగ్‌ల తదుపరి విండోకు వర్తించే కొత్త ధరను ప్రకటిస్తున్నట్టు వెల్లడించారు. హీరో మోటో భాగస్వామ్యంతో, అమెరికా ప్రీమియం ఆటోమొబైల్ హార్లే-డేవిడ్సన్ భారత మార్కెట్లో తన పోర్ట్‌ఫోలియోను అందుబాటులోకి తెస్తోంది. డిమాండ్కనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు హీరో మోటోకార్ప్ ధృవీకరించింది.సెప్టెంబర్‌లో భారతదేశంలోని రాజస్థాన్‌లోని నీమ్రానాలోని వారి గార్డెన్ ఫ్యాక్టరీలో హార్లే-డేవిడ్సన్ X440 ఉత్పత్తిని ప్రారంభిస్తారు. బుకింగ్ తేదీల ఆధారంగా అక్టోబర్ 2023లో కస్టమర్ డెలివరీలు ప్రారంభమవుతాయి. కాగా హార్లే-డేవిడ్సన్ ఎక్స్ 440 సెగ్మెంట్లో అత్యంత సరసమైన బైక్‌గా చెప్పవచ్చు. అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350, హోండా హెచ్నెస్ CB350, బెనెల్లీ ఇంపీరియాలే 400 వంటి ఇతర ప్రసిద్ధ మోడళ్లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది. -
పవన్ ముంజాల్ కార్యాలయాల్లో ఈడీ సోదాలు
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా హీరో మోటో కార్ప్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ పవన్ ముంజాల్‌తోపాటు ఇతరుల నివాసాలు, కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. ఢిల్లీ, గుర్గావ్లో ఈ సోదాలు జరిగినట్లు వెల్లడించారు. పవన్ ముంజాల్‌తోపాటు ఇతర నిందితులపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద ఈడీ గతంలోనే కేసు నమోదు చేసింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ), సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, కస్టమ్స్(సీబీఐసీ) ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. ఈడీ దర్యాప్తునకు తాము సంపూర్ణంగా సహకరిస్తామని హీరో మోటో కార్ప్ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఢిల్లీ, గుర్గావ్లో పవన్ ముంజాల్ నివాసం, రెండు ఆఫీసుల్లో సోదాలు జరిగాయని తెలియజేసింది. పన్నుల ఎగవేత కేసులో ఐటీ శాఖ గత ఏడాది మార్చిలో పవన్ ముంజాల్ ఇంట్లో సోదాలు నిర్వహించింది. -
సరికొత్త ఫీచర్లతో ప్రీమియం హీరో బైక్ వచ్చేస్తోంది: ఎప్పుడంటే?
హిస్టారిక్ ప్రీమియం మోటార్‌సైకిల్ బ్రాండ్, కరిజ్మా ఎక్స్ఎంఆర్ బైక్ మళ్లీ ఎంట్రీ ఇస్తోందన్న ఊహాగానాలు, ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ దారు హీరో మోటోకార్ప్ దాఖలు చేసిన ట్రేడ్‌మార్క్ దరఖాస్తుతో మరోసారి ఊపందు కున్నాయి. హీరో మోటోకార్ప్, రాబోయే మోటార్‌సైకిల్‌కి సంబంధించిన 14 సెకన్ల టీజర్ వీడియోను ఇటీవల విడుదల చేసింది. జూన్ 14న లాంచ్ డేట్ నిర్ధారించినప్పటికీ నిర్దిష్ట మోడల్ ఇంకా వెల్లడించలేదు. ఎక్స్ఎంఆర్ 210 లేదా ఎక్స్ట్రీమ్ 160R అప్డేటెడ్ వెర్షన్ అని కావచ్చని భావిస్తున్నారు. హీరో మోటార్స్ అప్డేట్ చేసిన రీమోడల్ బైక్ ఎక్స్ట్రీమ్160R అప్డేటెడ్ వెర్షన్లో ఫీచర్లు, డిజైన్, ఇంజన్ స్పెసిఫికేషన్లు పెద్దగా మారకపోవచ్చని అంచనా. అప్డేటెడ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, 5-స్పీడ్ గేర్‌బాక్స్ లాంటి అదనపు ఫీచర్లతో కీలక అప్‌గ్రేడ్స్‌నే అందిస్తోందట. కొత్త టూ-టోన్ బాడీ షేడ్స్‌ను కూడా పరిచయం చేసే అవకాశం ఉంది. అయితే, డ్యూయల్-ఛానల్ ABS సిస్టమ్‌తో వస్తుందా అనేది స్పష్టత లేదు. 163cc ఎయిర్-కూల్డ్ ఇంజిన్ 15 పవర్‌ను, 14 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బైక్ ధర రూ. 1.30 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. -
ఉద్యోగులకు షాక్..వీఆర్ఎస్పై హీరోమోటోకార్ప్ కీలక ప్రకటన!
ప్రముఖ ద్విచక్రవాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని ప్రకటించింది. మోటో కార్ప్ సంస్థ టూవీలర్ల తయారీలో రోబో టెక్నాలజీని వినియోగించాలని, తద్వారా మరింత ఉత్పాదకత సాధించాలని కంపెనీ భావిస్తోంది. ఇందులో భాగంగానే గత కొంత కాలంగా సంస్థలో ఉద్యోగ సమస్యలు పరిష్కరించేందుకు హీరో మోటోకార్ప్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో హీరో మోటోకార్ప్ ఉద్యోగులకు వీఆర్ఎస్ ప్రకటించింది. ఉద్యోగులకు వన్‌టైమ్ సెటిల్మెంట్, వేరియబుల్ పే, మెడికల్ కవరేజ్, కంపెనీ అందించే కారుకు అద్దె చెల్లింపులు వంటి వాటితోపాటు ఇతర ప్రోత్సహాకాలు ఉంటాయని హీరో మోటోకార్ప్ తెలిపింది. ఇక గత రెండేళ్లలో మార్కెటింగ్, ఆర్అండ్డీ, హెచ్ఆర్, ఎలక్ట్రిక్ వాహనాలు విభాగాలకు కొత్త సీఈవోలను సంస్థలోని వారిని ఎంపిక చేసింది. ఫైనాన్స్, ఎలక్ట్రిక్ వాహన విభాగానికి బయటి వ్యక్తులను సీఈవోలుగా నియమించింది. తాజాగా వీఆర్ఎస్ అంశాన్ని తెరపైకి తెచ్చింది. -
హీరో మోటోకార్ప్ కొత్త సీఈవో ఎవరో తెలుసా?
సాక్షి, ముంబై: ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్‌సైకిల్ స్కూటర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ కొత్త సీఈవోను ప్రటించింది. ప్రస్తుతం సీఎఫ్‌వోగా ఉన్న నిరంజన్ గుప్తాకు ప్రమోషన్ ఇచ్చి మరీ సీఈవోగా నియమించింది. గుప్తా నియామకం 2023 మే 1వ తేదీ నుండి బాధ్యతలు స్వీకరిస్తారని కంపెనీ ప్రకటించింది. అయితే కొత్త సీఎఫ్‌వో ఎవరుఅనేది ఇంకా ప్రకటించలేదు. (ఇదీ చదవండి: IPL 2023: ఆ క్రికెటర్‌కు లక్కీ చాన్స్, టియోగో ఈవీ ఓనర్లకు బంపర్ ఆఫర్లు) ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం, హార్లే డేవిడ్సన్, జీరో మోటార్‌సైకిల్స్ వంటి గ్లోబల్ బ్రాండ్లతో హీరో మోటోకార్ప్ భాగస్వామ్యంలో నిరంజన్ కీలక పాత్ర పోషించారు. గుప్తా ఏథర్ ఎనర్జీ, హెచ్‌ఎంసిఎల్ కొలంబియా, హెచ్ఎంసి ఎంఎం ఆటో ప్రైవేట్ లిమిటెడ్ బోర్డులలో కూడా సేవలందిస్తున్నారు. నిరంజన్ హీరో మోటోకార్ప్‌లో చేరడానికి ముందు మూడేళ్లు వేదాంతలో, 20 సంవత్సరాలు యూనిలీవర్లో పనిచేశారు. గుప్తా సీఈవోగా ఎదగడంపై హీరో మోటోకార్ప్ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోల్ టైమ్ డైరెక్టర్ పవన్ ముంజాల్ సంతోషంప్రకటించారు. కాగా బోర్డు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా, హోల్‌టైమ్ డైరెక్టర్‌గా పవన్ ముంజాల్ కొనసాగనున్నారు. -
‘హీరో’ లవర్స్‌కు షాక్: ఏప్రిల్ 1 నుంచి షురూ!
సాక్షి, ముంబై: ప్రముఖ టూ వీలర్ మేకర్ హీరో మోటో తన కస్టమర్లకు షాకిచ్చింది. ఏప్రిల్ నుంచి అన్ని వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎంపిక చేసిన ఉత్పత్తులపై వచ్చే నెల నుండి 2 శాతం వరకు ధరలు పెరగనున్నాయి. ఈ పెరుగుదల మోడల్స్ , మార్కెట్లను బట్టి మారుతూ ఉంటుందని హీరో మోటోకార్ప్ ప్రకటించింది. (ఓలా ఎలక్ట్రిక్ దూకుడు: రూ. 2,475 కోట్ల సమీకరణ !) OBD-2 నిబంధనలకు అనుగుణంగా మారడం, ఉద్గార ప్రమాణాల అమలుతో ఉత్పత్తి వ్యయం పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. మరోవైపు కొత్త నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దీనికి అనుగుణంగా కంపెనీలు సైతం కొత్త ఉద్గార ప్రమాణాల అమలుకోసం తమ తమ వాహనాల్లో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. (ఇది నమ్మక ద్రోహమే..తక్షణమే రాజీనామా చెయ్యండి! జుకర్‌బర్గ్ ఆగ్రహం) హీరో మోటోకార్ప్ తాజా లాంచ్‌లు: హీరో మోటోకార్ప్ ఇటీవల భారతదేశంలో రూ. 68,599 (ఎక్స్-షోరూమ్) వద్ద సరికొత్త జూమ్ 110ని విడుదల చేసింది. అలాగే రూ. 83,368, ఎక్స్-షోరూమ్ ధరతో సూపర్ స్ప్లెండర్ కొత్త హైటెక్ XTEC వేరియంట్‌ను కూడా పరిచయం చేసింది. కాగా ఇలీవలి కాలంలో హీరో కంపెనీ ధరల పెంపు ఇదిరెండోసారి. అటు టాటా మోటార్స్ సైతం తాజాగా తన కమర్షియల్ వాహన ధరలను 5 శాతం మేర పెంచింది. -
హీరో-జీరో జట్టు.. ఎలక్ట్రిక్ బైక్‌ల ఉత్పత్తిలో ఇక తిరుగులేదు!
దేశీయ ద్విచక్రవాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ అమెరికాకు చెందిన జీరో మోటర్‌సైకిల్స్‌తో జట్టు కట్టింది. ఈ రెండు సంస్థలూ కలిసి ప్రీమియం ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను ఉత్పత్తి చేయనున్నాయి. ఈ మేరకు హీరో మోటర్ కార్ప్.. జీరో మోటర్‌సైకిల్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఎలక్ట్రిక్ మోటర్ సైకిళ్లు తయారు చేయడంలో నైపుణ్యం ఉన్న జీరో మోటార్ సైకిల్స్ సంస్థ ఈ ఒప్పందం ద్వారా ప్రీమియం ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాల తయారీలో హీరో సంస్థకు సహకారం అందిస్తుంది. గతేడాది సెప్టెంబర్‌లో జీరో మోటార్‌సైకిల్స్ సంస్థలో హీరో ఆటోమొబైల్స్ 60 మిలియన్ డాలర్ల మేరకు ఈక్విటీ పెట్టుబడి పెట్టింది. ఈ తాజా ఒప్పందం గురించి హీరో మోటోకార్ప్ చైర్మన్, సీఈవో పవన్ ముంజాల్ మాట్లాడుతూ.. జీరో మోటార్‌సైకిల్స్‌తో తమ భాగస్వామ్యాన్ని కీలకమైన మైలురాయిగా అభివర్ణించారు. ప్రపంచంలో అతిపెద్ద మోటార్‌సైకిల్ తయారీ సంస్థ అయిన హీరో మోటోకార్ప్ తమను భాగస్వామిగా ఎంచుకున్నందుకు సంతోషిస్తున్నామని జీరో మోటార్‌సైకిల్స్ సీఈవో శామ్ పాస్చెల్ పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో హీరో సంస్థ లక్ష్య సాధనకు ఈ ఒప్పందం మరింత దోహదం చేస్తుంది. హీరో సంస్థ ఇప్పటికే విడా వీ1 పేరుతో ఓ ప్రీమియం ఎలక్ట్రానిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ప్లస్ వెర్షన్ రూ.1.45 లక్షలు, ప్రో వేరియంట్ (ఎక్స్-షోరూమ్, బెంగళూరు) రూ. 1.59 లక్షలుగా ఉంది. ఇది బెంగళూరు, ఢిల్లీ, జైపూర్లలో పబ్లిక్ ఛార్జింగ్ సదుపాయాలను కూడా ప్రవేశపెట్టింది. ఈ మూడు నగరాల్లో దాదాపు 300 ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసింది. ఇదీ చదవండి: వాహనదారులకు షాక్! హైవే ఎక్కితే బాదుడే.. పెరగనున్న టోల్ చార్జీలు! -
హీరో లాభం రూ.721 కోట్లు
న్యూఢిల్లీ: హీరో మోటో కార్ప్ డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి రూ.721 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన లాభంతో పోలిస్తే 2.41 శాతం పెరిగింది. ఆదాయం స్వల్ప వృద్ధితో రూ.8,118 కోట్లుగా ఉంది. 12.40 లక్షల యూనిట్ల మోటారు సైకిళ్లను విక్రయించినట్టు సంస్థ ప్రకటించింది. వ్యయాలు రూ.7,217 కోట్ల నుంచి రూ.7,373 కోట్లకు చేరాయి. ‘‘మా మార్కెట్ వాటా కాస్తంత కోలుకుంది. వచ్చే కొన్ని త్రైమాసికాల్లో ముఖ్యంగా ప్రీమియం విభాగంలో కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణతో మార్కెట్ వాటా పెంచుకుంటామని అంచనా వేస్తున్నాం’’అని హీరో మోటోకార్ప్ సీఎఫ్‌వో నిరంజన్ గుప్తా తెలిపారు. తమ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం ‘విదా’ని వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా పలు పట్టణాలకు చేరువ చేస్తామన్నారు. -
హీరో నుంచి గ్రాండ్ లాంచ్.. తక్కువ ధరకే 110 సీసీ స్కూటర్!
గురుగ్రామ్: ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ కొత్తగా జూమ్ పేరిట 110 సీసీ స్కూటర్‌ను ఆవిష్కరించింది. ప్రారంభ ఆఫర్ కింద దీని ధర రూ. 68,599–76,699గా ఉంటుందని సంస్థ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ రణ్జీవ్జిత్ సింగ్ తెలిపారు. స్కూటర్ల మార్కెట్లో 110 సీసీ వాహనాల వాటా అత్యధికంగా 60 శాతం పైగా ఉంటోందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో స్పోర్టీ స్కూటర్ల విభాగంలో ఉన్న భారీ అవకాశాలను అందిపుచ్చుకోవాలని నిర్దేశించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. బీఎస్6 ప్రమాణాలకు అనుగుణమైన హీరో జూమ్‌లో పూర్తి డిజిటల్ స్పీడోమీటర్, బ్లూటూత్ కనెక్టివిటీ, కాలర్ ఐడీ, ఎస్ఎంఎస్ అప్డేట్స్, సైడ్ స్టాండ్ ఇంజిన్ కటాఫ్, మొబైల్ చార్జర్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఆటోమొబైల్ సంస్థల సమాఖ్య సియామ్ గణాంకాల ప్రకారం 2022–23 ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలో హీరో 2,82,169 స్కూటర్లను విక్రయించింది. చదవండి: పన్ను ప్రయోజనాలు కావాలంటే.. ఈ పోస్టాఫీస్ పథకాలపై ఓ లుక్కేయండి! -
హీరో తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. బుకింగ్.. ఫీచర్లు, ధర వివరాలు
సాక్షి, ముంబై: భారతదేశపు అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారు హీరో మోటోకార్ప్ తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకొచ్చింది. విడా వీ1, వీ1 ప్రొ అనే రెండు వేరియంట్లలో దీన్ని శుక్రవారం లాంచ్ చేసింది. కొత్త ఈవీ అనుబంధ సంస్థ- విడా బ్రాండ్ క్రింద ఇ-స్కూటర్లను ప్రారంభించడం ద్వారా దేశంలోని ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలోకి హీరో మోటో ప్రవేశించింది. విడా వీ1 ధరను ఇండియాలో రూ. 1.45 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. విడా ప్రో రూ. 1.59 లక్షలు (ఎక్స్-షోరూమ్). 2499 రూపాయలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి బెంగళూరు ఢిల్లీ , జైపూర్ మూడు నగరాల్లో దశల వారీగా లాంచ్‌లు ప్రారంభమవుతాయి. బుకింగ్‌లు అక్టోబర్ 10న ప్రారంభం. డిసెంబర్ రెండో వారంలో డెలివరీలు ప్రారంభమవుతాయని హీరో వెల్లడించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం తైవాన్‌కు చెందిన గోగోరో సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఒక్కో ఛార్జింగ్‌కు 165 కి.మీ వరకు రైడింగ్ రేంజ్‌ను అందించవచ్చని హీరో వెల్లడించింది. ఫీచర్ల విషయానికి వస్తే 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ అండ్ టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి సాంకేతికతతో వస్తుంది. ఇది OTA అప్డేట్లను అందించడానికి కనెక్ట్ చేయబడిన సాంకేతికతలను ఉపయోగిస్తుంది. ఇంకా ఫాలో-మీ-హోమ్ లైట్, SOS హెచ్చరికలు, రివర్స్ మోడ్, బూస్ట్ మోడ్ లాంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి. కాగా హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్లు ప్రస్తుత మార్కెట్లో ఓలా ఎస్1 ప్రో, ఏథర్ 450ఎక్స్, టీవీఎస్ ఐక్యూబ్ బజాజ్ చేతక్ వంటి ప్రీమియం ఇ-స్కూటర్లతో పోటీ ఇవ్వనుందని భావిస్తున్నారు. -
హీరో పండుగ కానుక అదిరిందిగా!ఎక్స్ట్రీమ్ 160ఆర్ స్టీల్త్ 2.0
సాక్షి,ముంబై: పండుగ సీజన్ సందర్భంగా హీరో మోటోకార్ప్ కొత్త బైక్‌ను రిలీజ్ చేసింది. ఎక్స్ట్రీమ్ 160ఆర్ స్టీల్త్ 2.0 పేరుతో కొత్త ఎడిషన్ బైక్‌ను భారత మార్కెట్లో తీసుకొచ్చింది. దీని ధర రూ. 1.29 లక్షలుగా ఉంచింది. హీరో కనెక్ట్‌తో తీసుకొచ్చిన కొత్త ఎక్స్ట్రీమ్ 160ఆర్ స్టెల్త్ 2.0 రైడర్లను కనెక్ట్‌గా ఉండేలా చేసే స్మార్ట్ మొబిలిటీ బైక్. దీని ద్వారా ఈ వెహికల్ లైవ్ లొకేషన్‌ను ట్రేస్ చేయవచ్చు. ఇంకా టెలిస్కోపిక్ ఫోర్క్, ఫ్రేమ్,పిలియన్ గ్రిప్‌పై రెడ్ యాక్సెంట్లతో మ్యాట్ బ్లాక్ షేడ్‌తో వస్తోంది. హీరో ఎక్స్ట్రీమ్ 160ఆర్ స్టెల్త్ 2.0 దేశవ్యాప్తంగా ఉన్న హీరో మోటోకార్ప్ షోరూమ్‌లలో రూ. 1,29,738 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ). ఇంజీన్, ఫీచర్లు 163cc ఎయిర్-కూల్డ్ BS-VI కంప్లైంట్ ఇంజన్. ఇది 6500 RPM వద్ద 15.2 PS పవర్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది.కొత్త ఎక్స్ట్రీమ్ 160ఆర్ స్టెల్త్ 2.0 టెలిస్కోపిక్ ఫోర్క్, ఫ్రేమ్ ,పిలియన్ గ్రిప్‌పై రెడ్ యాక్సెంట్లతో మ్యాట్ బ్లాక్ షేడ్తోపాటు జియో ఫెన్స్ అలర్ట్, స్పీడ్ అలర్ట్, టోప్ల్ అలర్ట్, టో ఎవే అలర్ట్ , అన్‌ప్లగ్ అలర్ట్‌లతో సహా రైడర్ వారి వాహనం గురించి అప్డేట్గా ఉంచేలా ఫీచర్లను ఇందులో పొందుపర్చింది. -
పండగకి బైక్ కొనాలనుకునేవాళ్ళకి షాక్
-
పండుగ సీజన్.. కొత్త బైక్ కొనేవారికి షాక్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ ధరలను సవరించింది. మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ధర మోడల్‌ను బట్టి రూ.1,000 వరకు పెంచింది. కొత్త ధరలు వెంటనే అమలులోకి వస్తాయని కంపెనీ గురువారం ప్రకటించింది. తయారీ ఖర్చులు పెరగడంతో వాహన ధరలు పెంచుతున్నట్లు తెలిపింది. పెరిగిన ధరలు మోటారు సైకిళ్లు, స్కూటర్లకు వరిస్తుందని పేర్కొంది. పండుగ సీజన్లో కంపెనీలు డిస్కౌంట్లు, ఆఫర్లు ఇవ్వడం సహజం, కానీ హీరో మోటో కార్ప్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఆగస్టులో.. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ద్విచక్ర వాహనాల అమ్మకాలు 1.92% పెరిగి 462,608 యూనిట్లకు చేరుకున్నాయని కంపెనీ తెలిపింది. దేశీయ విక్రయాల వాల్యూమ్ కూడా గత ఏడాది విక్రయించిన యూనిట్లతో పోలిస్తే 4.55% పెరిగి 450,740 యూనిట్లకు చేరుకున్నాయి. అయితే ఆగస్టు 2022లో ఎగుమతులు క్షీణించాయి. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కోసం చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే దిశగా హీరో మోటోకార్ప్, ప్రభుత్వ రంగ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) చేతులు కలిపిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం ప్రస్తుతం హెచ్‌పీసీఎల్‌కి ఉన్న బంకుల్లో ఈ రెండు సంస్థలు కలిసి చార్జింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయనున్నారు. -
హెచ్పీసీఎల్తో హీరో మోటోకార్ప్ జట్టు.. గట్టి ప్లానే వేసింది!
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కోసం చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే దిశగా హీరో మోటోకార్ప్, ప్రభుత్వ రంగ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) చేతులు కలిపాయి. దీని ప్రకారం ప్రస్తుతం హెచ్‌పీసీఎల్‌కి ఉన్న బంకుల్లో ఇరు సంస్థలు కలిసి చార్జింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తాయి. తొలి దశలో ఎంపిక చేసిన నగరాల్లో చార్జింగ్ స్టేషన్లను నెలకొల్పనున్నట్లు, ఆ తర్వాత ఇతరత్రా మార్కెట్లకు విస్తరించనున్నట్లు హీరో మోటోకార్ప్ తెలిపింది. చార్జింగ్ మొదలుకుని చెల్లింపుల వరకూ మొత్తం ప్రక్రియను హీరో మోటోకార్ప్ మొబైల్ యాప్ ద్వారా నిర్వహించుకోవచ్చని పేర్కొంది. దేశవ్యాప్తంగా తమకు 20,000 పైచిలుకు రిటైల్ అవుట్లెట్లు ఉన్నాయని, ద్విచక్ర వాహనాల మార్కెట్లో దిగ్గజంగా ఉన్న హీరో మోటోకార్ప్‌తో జట్టు కట్టడం ద్వారా పెద్ద ఎత్తున చార్జింగ్ స్టేషన్లను అందుబాటులోకి తెచ్చేందుకు సాధ్యపడుతుందని హెచ్‌పీసీఎల్ చైర్మన్ పుష్ప్ కుమార్ జోషి చెప్పారు. చదవండి: పవర్ ఆఫ్ సారీ: రూ. 6 లక్షలకు..50 కోట్లు వచ్చాయ్! -
ఆటోమొబైల్ రంగంలో సత్తా చాటుతున్న వనితలు
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ తయారీలో సహజంగా పురుషులదే ఆధిపత్యం. అలాంటి చోట మహిళలూ రాణిస్తున్నారు. క్రమంగా తమ స్థానాన్ని బలోపేతం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో లింగ సమానత్వం/లింగవైవిధ్యం (పనివారిలో స్త్రీ, పురుషలకు సమ ప్రాధాన్యం) కోసం ప్రముఖ కంపెనీలైన టాటా మోటార్స్, ఎంజీ, బజాజ్ ఆటో, హీరో మోటో కార్ప్ చర్యలు తీసుకోవడం హర్షణీయం. టాటా మోటార్స్‌కు చెందిన ఆరు తయారీ ప్లాంట్లలోని షాప్ ఫ్లోర్లలో సుమారు 3,000 మంది మహిళలు పనిచేస్తున్నారు. చిన్న కార్ల నుంచి వాణిజ్య వాహనాల తయారీ వరకు వివిధ హోదాల్లో వీరు సేవలు అందిస్తున్నారు. తయారీ కేంద్రాల్లో మరింత మంది మహిళలను నియమించుకునే ప్రణాళికలతో టాటా మోటార్స్ ఉంది. టాటా మోటార్స్ పుణె ప్యాసింజర్ వాహన ప్లాంట్‌లో గత రెండేళ్లలోనే మహిళా కార్మికుల సంఖ్య 10 రెట్లు పెరిగింది. 2020లో 178 మంది ఉంటే, వారి సంఖ్య 1,600కు చేరింది. ‘‘పుణెలో పూర్తిగా మహిళలతో కూడిన తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడాన్ని సవాలుగా తీసుకున్నాం. ఇప్పటికే 1,100 మంది మహిళలను నియమించుకున్నాం. వచ్చే రెండేళ్లలో వీరి సంఖ్యను 1,500కు చేర్చే దిశగా పనిచేస్తున్నాం’’అని టాటా మోటార్స్ చీఫ్ హ్యుమన్ రీసోర్సెస్ ఆఫీసర్ రవీంద్ర కుమార్ తెలిపారు. ఎంజీ మోటార్ ఆదర్శనీయం.. ఎంజీ మోటార్ ఇండియా అయితే స్త్రీ, పురుషులు సమానమేనని చాటే విధంగా 2023 డిసెంబర్ నాటికి తన మొత్తం ఫ్యాక్టరీ సిబ్బందిలో మహిళల వాటాను 50 శాతానికి చేర్చాలన్న లక్ష్యం దిశగా పనిచేస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థకు చెందిన గుజరాత్‌లోని హలోల్ ప్లాంట్‌లో మొత్తం 2,000 మంది పనిచేస్తుండగా.. మహిళల వాటా 34 శాతంగా ఉంది. తయారీలో కీలకమైన పెయింట్ నాణ్యత, సర్ఫెస్ టెస్టింగ్, పరిశోధన, అభివృద్ధి, అసెంబ్లీ తదితర బాధ్యతల్లోకి మహిళలను తీసుకుంటోంది. జనరల్ మోటార్స్ నుంచి 2017లో హలోల్ ప్లాంట్‌ను సొంతం చేసుకోగా, ఇక్కడి సిబ్బందిలో స్త్రీ, పురుషులను సమానంగా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. దీనివల్లే మహిళా సిబ్బంది సంఖ్య గణనీయంగా పెరిగింది. పరిశ్రమలో అధిక లింగ వైవిధ్యాన్ని ఇప్పటికే ఎంజీమోటార్స్ సాధించినప్పటికీ.. 50:50 నిష్పత్తికి చేర్చే లక్ష్యంతో అడుగులు వేస్తున్నట్టు సంస్థ డైరెక్టర్ (హెచ్ఆర్) యశ్వింద్ పాటియాల్ తెలిపారు. హీరో మోటోలో 9.3 శాతం ప్రముఖ ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటోకార్ప్‌లో ప్రస్తుతం 1,500 మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారు. లింగ సమానత్వ రేషియో 2021–22 నాటికి 9.3 శాతంగా ఉంది. సమీప కాలంలో దీన్ని మరింత పెంచుకునే లక్ష్యంతో కంపెనీ ఉంది. బజాజ్ ఆటో చకాన్ ప్లాంట్‌లో డోమినార్ 400, ఆర్ఎస్ 200 తయారీకి ప్రత్యేకంగా మహిళలనే వినియోగిస్తోంది. 2012-14 నాటికి 148 మందిగా ఉన్న మహిళా ఉద్యోగుల సంఖ్య 2021-22 నాటికి 667కు పెరిగింది. హీరో మోటో కార్ప్ ‘తేజశ్విని’ పేరుతో మహిళా సిబ్బందిని పెంచుకునేందుకు ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టింది. దీనిద్వారా తయారీ కేంద్రాల్లో ఇప్పటికే మహిళల సంఖ్యను పెంచుకున్నట్టు కంపెనీ అధికార ప్రతినిధి తెలిపారు. రిక్రూట్మెంట్లు, విద్య, శిక్షణ, మార్గదర్శక కార్యక్రమాలను అమలు చేస్తున్నట్టు చెప్పారు. సవాళ్లు.. తయారీ కేంద్రాల్లో మరింత మంది మహిళలను తీసుకునే విషయంలో ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి టాటా మోటార్స్ చీఫ్ హ్యుమన్ రీసోర్సెస్ ఆఫీసర్ రవీంద్ర కుమార్ వివరించారు. ‘‘ఆటోమొబైల్ రంగం మొదటి నుంచీ పురుషుల ఆధిపత్యంతో కొనసాగుతోంది. టెక్నీషియన్లు, విక్రేతలు, ఇంజనీర్లుగా మహిళలు రావడం అన్నది ఓ కల. కానీ ఇందులో క్రమంగా మార్పు వచ్చింది. ఐటీఐ, 12వ తరగతి చదివిన మహిళలకు రెండు, మూడేళ్ల పాటు సమగ్రమైన శిక్షణ ఇచ్చేందుకు కౌశల్య కార్యక్రమాన్ని చేపట్టాం. దీని తర్వాత వారు బీఈ/బీటెక్‌ను ఎంపిక చేసుకోవచ్చు. లేదంటే కంపెనీ ఉద్యోగిగా కొనసాగొచ్చు’’అని వివరించారు. -
బీపీసీఎల్‌తో హీరో మోటోకార్ప్ జట్టు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల (ఈవీ) కోసం చార్జింగ్ మౌలిక సదుపాయాలను కలి్పంచే దిశగా ప్రభుత్వ రంగ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), టూ వీలర్ దిగ్గజం హీరో మోటోకార్ప్ జట్టు కట్టాయి. ‘మొదటి దశలో ఢిల్లీ, బెంగళూరుతో మొదలుపెట్టి తొమ్మిది నగరాల్లో చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత చార్జింగ్ స్టేషన్లను విస్తృత స్థాయిలో అందుబాటులోకి తెచ్చే దిశగా నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా విస్తరిస్తాం‘ అని ఇరు సంస్థలు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపాయి. ప్రణాళిక ప్రకారం రెండు సంస్థలు.. ముందుగా బీపీసీఎల్‌కు ప్రస్తుతం ఉన్న పెట్రోల్ బంకుల్లో చార్జింగ్ సదుపాయాలను ఏర్పాటు చేయనున్నాయి. ఆ తర్వాత ఎలక్ట్రిక్ వాహనాల వ్యవస్థకు సంబంధించి మిగతా అంశాల్లోనూ కలిసి పనిచేయనున్నాయి. మధ్యకాలికం నుంచి దీర్ఘకాలికంగా .. విద్యుత్ వాహనాలకు చార్జింగ్ సదుపాయం కలి్పంచడం సహా వివిధ రకాల ఇంధనాలను విక్రయించే ఇంధన కేంద్రాలుగా దాదాపు 7,000 పైచిలుకు సాంప్రదాయ పెట్రోల్ బంకులను మార్చనున్నట్లు బీపీసీఎల్ గతేడాది సెపె్టంబర్లో వెల్లడించింది. నగదురహితంగా ప్రక్రియ..: హీరో మోటోకార్ప్ త్వరలోనే రెండు నగరాల్లో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ సదుపాయాల కల్పన ప్రారంభించనుంది. ఒక్కో చార్జింగ్ స్టేషన్లో డీసీ, ఏసీ చార్జర్లు సహా పలు చార్జింగ్ పాయింట్లు ఉంటాయి. అన్ని రకాల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు ఉపయోగపడతాయి. చార్జింగ్ ప్రక్రియను హీరో మోటోకార్ప్ మొబైల్ యాప్ ద్వారా నగదురహితంగా పూర్తి చేయవచ్చు. తమ భారీ నెట్‌వర్క్‌తో ఈవీ చార్జింగ్ సదుపాయాలను గణనీయంగా విస్తరించవచ్చని బీపీసీఎల్ సీఎండీ అరుణ్ కుమార్ సింగ్ తెలిపారు. వాహన రంగంలో కొంగొత్త ధోరణులను అందిపుచ్చుకోవడంలో తమ సంస్థ ఎప్పుడూ ముందుంటుందని హీరో మోటో చైర్మన్ పవన్ ముంజల్ పేర్కొన్నారు. -
న్యూ ఇయర్ గిఫ్ట్ : హీరోమోటో కొత్త బైక్
సాక్షి,ముంబై : హీరోమోటో కొత్త ఏడాదిలో సరికొత్త బైక్‌ను లాంచ్ చేసింది.100సీసీ సెగ్మెంట్లో బీఎస్-6 నిబంధనలకు అనుగుణంగా తన తొలి మోటార్ సైకిల్ తీసుకొచ్చింది. హెచ్ఎఫ్ డీలక్స్ పేరుతో తీసుకొచ్చిన ఈ బైక్ ప్రారంభ ధరను రూ. 55925 గా నిర్ణయించింది. 2020 ఏప్రిల్ నుంచి కొత్త ఉద్గార నిబంధనలు అమలుకానున్న నేపథ్యంలో కంపెనీ బీఎస్-6 ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోలో వేగం పెంచింది. హీరో బైక్స్ లవర్స్‌కు కొత్త సంవత్సరం బహుమతిని అందించింది. తన పాపులర్, ఐకానిక్ మోటారుసైకిల్ హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ బీఎస్-6 మోడల్‌ను రెండు వేరియంట్లలో లాంచ్ చేసింది. సెల్ఫ్-స్టార్ట్ అల్లాయ్-వీల్ వేరియంట్ ధర రూ. 55,925 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ), సెల్ఫ్-స్టార్ట్ అల్లాయ్-వీల్ ఐ3ఎస్ వేరియంట్ రూ.57,250 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వద్ద దేశంలోని హీరో మోటోకార్ప్ షోరూమ్‌లలో జనవరి 2020 ప్రారంభం నుండి అందుబాటులో వుంటాయని హీరోమోటో ఒకప్రకటనలో వెల్లడించింది. -
జనవరి నుంచి హీరో బైక్స్ ధరల పెంపు
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ జనవరి నుంచి మోటార్ సైకిల్స్, స్కూటర్ల ధరలను రూ.2 వేల వరకు పెంచనుంది. ప్రస్తుతం హీరో కార్ప్ వాహనాల ధరల శ్రేణి రూ.39 వేల నుంచి రూ.1.05 లక్షల మధ్య ఉన్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఇప్పటికే మారుతీ సుజుకీ ఇండియా, టొయోటా, మహీంద్రా అండ్ మహీంద్రా, మెర్సిడెస్ బెంజ్ కార్ల కంపెనీలు ధరలు పెంచుతున్నట్లు ప్రకటించడం తెలిసిందే. -
సుజుకీ అప్.. హీరో డౌన్
న్యూఢిల్లీ: ఈ ఏడాది నవంబర్‌లో కూడా ఆటో రంగ అమ్మకాలు నెమ్మదించాయి.ద్విచక్ర వాహన విభాగంలో సుజుకీ మోటార్‌సైకిల్ విక్రయాలు 14.69 శాతం పెరిగాయి. దిగ్గజ కంపెనీలైన హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో అమ్మకాలు తగ్గాయి. వాణిజ్య వాహన విభాగంలో అశోక్ లేలాండ్ 25 శాతం తగ్గుదలను నమోదుచేసింది. ప్యాసింజర్ వాహన విభాగంలో మారుతీ వంటి దిగ్గజ కంపెనీల అమ్మకాలు తగ్గిన విషయం తెలిసిందే కాగా, తాజాగా వెల్లడైన టయోటా విక్రయాలు సైతం 22 శాతం క్షీణతను నమోదుచేశాయి. -
‘ఆటో’లో మరిన్ని మూసి‘వెతలు’
న్యూఢిల్లీ: వాహన విక్రయాలు పడిపోయి, సంక్షోభ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న ఆటోమొబైల్ కంపెనీలు ఉత్పత్తిని మరింతగా తగ్గించుకుంటున్నాయి. దీంతో పలు కంపెనీల ప్లాంట్ల మూసివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్, సుందరం–క్లేటన్ (ఎస్సీఎల్) సంస్థలు తాత్కాలికంగా ప్లాంట్లను మూసివేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించాయి. హీరో మోటోకార్ప్ ఆగస్టు 15–18 దాకా (నాలుగు రోజుల పాటు) ప్లాంట్లను మూసివేస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుత మార్కెట్ డిమాండ్‌కి అనుగుణంగా ఉత్పత్తిని సర్దుబాటు చేసుకునేందుకు, వార్షిక మెయింటెనెన్స్‌లో భాగంగాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. ‘స్వాతంత్య్ర దినోత్సవం, రక్షా బంధన్, వారాంత సెలవులు వంటి అంశాల కారణంగా ప్లాంట్ల మూసివేత నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుత మార్కెట్ డిమాండ్ పరిస్థితులు ఇందుకు కొంత కారణం‘ అని హీరో మోటోకార్ప్ ఈ సందర్భంగా వివరించింది. ఈ ఏడాది ఏప్రిల్–జూలై మధ్య కాలంలో హీరో మోటోకార్ప్ వాహనాల ఉత్పత్తిని 12 శాతం తగ్గించుకుని 24,66,802 యూనిట్లకు పరిమితం చేసుకుంది. మరోవైపు, దేశ, విదేశ ఆటోమోటివ్స్ తయారీ సంస్థలకు అల్యూమినియం ఉత్పత్తులు సరఫరా చేసే ఎస్సీఎల్ కూడా ’పాడి’లోని ప్లాంటులో ఆగస్టు 16, 17న (రెండు రోజులు) కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు వివరించింది. ఇప్పటికే టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఆటో పరికరాల తయారీ దిగ్గజం బాష్ తదితర సంస్థలు డిమాండ్‌కి అనుగుణంగా సర్దుబాటు చేసుకునేందుకు ఉత్పత్తిని తగ్గించుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. మారుతీలో 3 వేల ఉద్యోగాలు కట్.. ఆటోమొబైల్ రంగంలో డిమాండ్ మందగించిన నేపథ్యంలో దేశీ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియాలో (ఎంఎస్ఐ) సుమారు 3,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. వీరంతా తాత్కాలిక ఉద్యోగులు. మందగమనంతో తాత్కాలిక ఉద్యోగుల కాంట్రాక్టులను రెన్యువల్ చేయలేదని సంస్థ చైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు. ‘మారుతీలో సుమారు 3,000 మంది సిబ్బంది ఉద్యోగాలు కోల్పోయారు. వ్యాపారంలో ఇది సర్వసాధారణమే. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు మరింత మంది కాంట్రాక్టు ఉద్యోగులను తీసుకోవడం, డిమాండ్ పడిపోయినప్పుడు తగ్గించుకోవడం జరుగుతుంది‘ అని చెప్పారు. అయితే, పర్మనెంట్ ఉద్యోగులపై మాత్రం ప్రభావమేమీ పడలేదన్నారు. ప్రభుత్వం కూడా సానుకూల చర్యలేమైనా ప్రకటిస్తే ఆటోమొబైల్ రంగంలో పరిస్థితులు మెరుగుపడటానికి ఉపయోగకరంగా ఉండగలవన్నారు. -
భారీగా తగ్గిన ద్విచక్ర వాహన విక్రయాలు
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన కంపెనీల అమ్మకాలు జూలై నెలలో గణనీయంగా పడిపోయాయి. హీరో మోటోకార్ప్.. విక్రయాలు ఏకంగా 21.18% దిగజారి 5,35,810 యూనిట్లకు పరిమితమమ్యాయి. రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాలు 27% తగ్గిపోయాయి. ఈ సంస్థ దేశీ విక్రయాలు 49,182 యూనిట్లు కాగా, బజాజ్ ఆటో అమ్మకాల్లో 13%, టీవీఎస్ మోటార్ విక్రయాల్లో 16% తగ్గుదల నమోదైంది. మరోవైపు టాటా మోటార్స్ అమ్మకాలు 34 శాతం తగ్గుదలతో 32,938 యూనిట్లుగా నయోదయ్యాయి. ఇక పూణేలో ఈ సంస్థ ఏడు చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటుచేసింది. ఈ ఏడాదిలోనే దేశవ్యాప్తంగా ఐదు ప్రధాన నగరాల్లో 300 చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటుచేయనున్నట్లు వెల్లడించింది. ఢిల్లీ, ముంబై, పూణే, బెంగళూరు, హైదరాబాద్‌లలో వీటిని ప్రారంభించనున్నట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. రూ.1.58 లక్షలు తగ్గిన ‘కోనా’ ధర హ్యుందాయ్ తాజాగా విడుదలచేసిన తన తొలి ఎలక్ట్రిక్ కారు ‘కోనా’ ధరను రూ.1.58 లక్షలు తగ్గించింది. దీంతో ఈ కారు ధర రూ.23.71 లక్షలకు తగ్గింది. జీఎస్టీ తగ్గిన నేపథ్యంలో ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీచేయడంలో భాగంగా ఈ మేరకు ధర తగ్గినట్లు కంపెనీ వివరించింది. మహీంద్రా కూడా ఈ–వెరిటో ధరను రూ.80 వేల వరకూ తగ్గించింది. -
యూతే టార్గెట్: హీరో రెండు స్కూటర్లు
సాక్షి, ముంబై : ప్రముఖ ద్విచక్ర తయారీదారు హీరో మోటో కార్ప్ మోట్సా కొత్త వాహనాన్ని లాంచ్ చేసింది. మాస్ట్రోఎడ్జ్ అనే స్కూటర్‌తోపాటు, ప్లెజర్ ప్లస్‌ను అప్డేట్ చేసి 2019 వెర్షన్‌ను లాంచ్ చేసింది. ప్రధానంగాయువతే టార్గెట్‌గా మాస్ట్రో 125’, ‘ప్లెజర్ 110’ మోడల్ స్కూటర్లను సోమవారం విడుదల చేసింది. హీరో మోటో కార్ప్స్ నుంచి 125 సీసీ స్కూటర్ సెగ్మెంట్లో వస్తున్న స్కూటర్ హీరో మాస్ట్రో ఎడ్జ్ 125 స్కూటర్. 125 సీసీ ఎనర్జీ బూస్ట్ మేకర్ 6750 ఆర్పీఎం వద్ద 8.7 బీహెచ్పీ, 5000 ఆర్పీఎం వద్ద 10.2 ఎన్ఎం టార్క్ అందిస్తుంది. హీరో న్యూ ప్లెజర్ ప్లస్ స్కూటర్ ఇది రెండు వేరియంట్లలో లభ్యం. రీ ఫర్బిష్డ్ హెడ్ ల్యాంప్, టెయిల్ లైట్స్, 102 సీసీ మోటార్ కలిగి ఉంటుంది. ఇది 7000 ఆర్పీఎం వద్ద 6.9 బీహెచ్పీ, 5000 ఆర్పీఎం వద్ద 8.1 ఎన్ఎం టార్క్ ఆవిష్కరిస్తుంది. ధరలు : మాస్ట్రో ఎడ్జ్ ధర రూ. 62,700(ఎక్స్‌షో రూం, న్యూఢిల్లీ) మాస్ట్రో ఎడ్జ్ : మే16వ తేదీనుంచి బుకింగ్స్ ప్రారంభం. హీరో ప్లెజర్ ప్లస్ రూ. 49, 300 (ఎక్స్‌షో రూం ,న్యూఢిల్లీ) బుకింగ్స్ జూన్ మొదటి వారంలోప్రారంభం కానున్నాయి.