
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కోసం చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే దిశగా హీరో మోటోకార్ప్, ప్రభుత్వ రంగ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) చేతులు కలిపాయి. దీని ప్రకారం ప్రస్తుతం హెచ్‌పీసీఎల్‌కి ఉన్న బంకుల్లో ఇరు సంస్థలు కలిసి చార్జింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తాయి. తొలి దశలో ఎంపిక చేసిన నగరాల్లో చార్జింగ్ స్టేషన్లను నెలకొల్పనున్నట్లు, ఆ తర్వాత ఇతరత్రా మార్కెట్లకు విస్తరించనున్నట్లు హీరో మోటోకార్ప్ తెలిపింది.
చార్జింగ్ మొదలుకుని చెల్లింపుల వరకూ మొత్తం ప్రక్రియను హీరో మోటోకార్ప్ మొబైల్ యాప్ ద్వారా నిర్వహించుకోవచ్చని పేర్కొంది. దేశవ్యాప్తంగా తమకు 20,000 పైచిలుకు రిటైల్ అవుట్‌లెట్లు ఉన్నాయని, ద్విచక్ర వాహనాల మార్కెట్లో దిగ్గజంగా ఉన్న హీరో మోటోకార్ప్‌తో జట్టు కట్టడం ద్వారా పెద్ద ఎత్తున చార్జింగ్ స్టేషన్లను అందుబాటులోకి తెచ్చేందుకు సాధ్యపడుతుందని హెచ్‌పీసీఎల్ చైర్మన్ పుష్ప్ కుమార్ జోషి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment