Harley Davidson X440:హార్లే-డేవిడ్‌సన్ లవర్స్‌కు భారీ షాక్. హీరో మోటోకార్ప్ హార్లే-డేవిడ్‌సన్ బైక్స్ లేటెస్ట్ బైక్ ధరలను భారీగా పెంచేసింది. ఏకంగా 10,500 మేర ధరలను పెంచింది. ఈ పెరుగుదల అన్ని వేరియంట్లకు వర్తిస్తుందని హీరో మోటోకార్ప్ ధృవీకరించింది.
ధర పెంపు తర్వాత, హార్లే-డేవిడ్సన్ ఎక్స్440 బైక్ ధర రూ. 2,39,500 నుండి ప్రారంభమవుతుంది (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ప్రస్తుత ప్రారంభ ధర ఆగస్టు 3 వరకు అందుబాటులో ఉంటుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు రూ. 5,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించి బైక్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు హీరో మోటోకార్ప్ గత నెలలో విడుదల చేసిన హార్లే డేవిడ్సన్ ఎక్స్440 కొత్త ధరను ప్రకటించింది. కంపెనీ ప్రయోగ ధరతో పోలిస్తే రూ.10,500 ఖరీదు ఎక్కువ. ఇది 2,29,000 ప్రారంభ ధరతో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. (టికెట్ల ధరలకు ‘రెక్కలు’: ప్రయాణీకులకు ఇక చుక్కలే!)
హీరో మోటోకార్ప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నిరంజన్ గుప్తా మాట్లాడుతూ, హార్లీ-డేవిడ్సన్ ఎక్స్ 440 ప్రారంభించినప్పటి నుంచి మంచి ఆదరణ లభించిందనీ, ఆన్‌లైన్ బుకింగ్‌ల తదుపరి విండోకు వర్తించే కొత్త ధరను ప్రకటిస్తున్నట్టు వెల్లడించారు. హీరో మోటో భాగస్వామ్యంతో, అమెరికా ప్రీమియం ఆటోమొబైల్ హార్లే-డేవిడ్‌సన్ భారత మార్కెట్‌లో తన పోర్ట్‌ఫోలియోను అందుబాటులోకి తెస్తోంది.
డిమాండ్‌కనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు హీరో మోటోకార్ప్ ధృవీకరించింది.సెప్టెంబర్‌లో భారతదేశంలోని రాజస్థాన్‌లోని నీమ్రానాలోని వారి గార్డెన్ ఫ్యాక్టరీలో హార్లే-డేవిడ్‌సన్ X440 ఉత్పత్తిని ప్రారంభిస్తారు. బుకింగ్ తేదీల ఆధారంగా అక్టోబర్ 2023లో కస్టమర్ డెలివరీలు ప్రారంభమవుతాయి. కాగా హార్లే-డేవిడ్సన్ ఎక్స్ 440 సెగ్మెంట్లో అత్యంత సరసమైన బైక్‌గా చెప్పవచ్చు. అలాగే రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, హోండా హెచ్‌నెస్ CB350, బెనెల్లీ ఇంపీరియాలే 400 వంటి ఇతర ప్రసిద్ధ మోడళ్లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.
Comments
Please login to add a commentAdd a comment