Harley Davidson X440: భారతీయ మార్కెట్లో 'హార్లే డేవిడ్సన్' (Harley Davidson) బైకులు ఎంత ఖరీదైనవో అందరికి తెలుసు. అయితే ఇప్పుడు కంపెనీ కనీవినీ ఎరుగని రీతిలో చాలా తక్కువ ధరకే ఎక్స్440 (X440) బైక్ లాంచ్ చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ధర & వేరియంట్స్
హార్లే డేవిడ్సన్ ఎక్స్440 మొత్తం మూడు వేరియంట్లలో విడుదలైంది. అవి 'డెనిమ్, వివిడ్, ఎస్' వేరియంట్లు. వీటి ధరలు వరుసగా రూ. 2.29 లక్షలు, రూ. 2.49 లక్షలు, రూ.2.69 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ బైక్ ధర ఎవర్ గ్రీన్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 కంటే కేవలం రూ. 35,000 ఎక్కువ.
డిజైన్ & ఫీచర్స్
హార్లే డేవిడ్సన్ ఎక్స్440 డిజైన్ పరంగా చాలా సింపుల్‌గా, స్టైలిష్‍గా చూడగానే ఆకర్శించే విధంగా ఉంది. బేస్ వేరియంట్ వైర్-స్పోక్ రిమ్స్, మినిమల్ బ్యాడ్జింగ్ కలిగి ఉంటుంది. మిడ్ వేరియంట్ అల్లాయ్ వీల్స్ కలిగి డ్యూయల్-టోన్ పెయింట్ ఆప్షన్‌లతో వస్తుంది. చివరగా టాప్ వేరియంట్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, మెషిన్డ్ ఇంజన్ కూలింగ్ ఫిన్స్, 3D బ్యాడ్జింగ్ అండ్ బ్లూటూత్ కనెక్టివిటీతో కలర్ TFT డాష్, నావిగేషన్ మొదలైన వాటిని పొందుతుంది.
(ఇదీ చదవండి: ఆస్తులమ్మినా ఈ ఒక్క వైన్ బాటిల్ కొనలేరు.. ధర ఎన్ని కోట్లంటే?)
ఇంజిన్ వివరాలు
ఎక్స్440 ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ 440 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ కలిగి 6,000 rpm వద్ద 27 hp పవర్ & 4,000 rpm వద్ద 38 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. కావున మంచి పనితీరుని అందిస్తుంది. బ్రేకింగ్ అండ్ సస్పెన్షన్ వంటివి ఇండియన్ రోడ్లకు సరిపోయే విధంగా ఉంటాయి.
(ఇదీ చదవండి: రైల్వే స్టేషన్‌లో ఇంత తక్కువ ధరకు రూమ్ లభిస్తుందని తెలుసా! ఎలా బుక్ చేసుకోవాలంటే?)
ప్రత్యర్థులు
నిజానికి భారతీయ మార్కెట్లో హార్లే డేవిడ్సన్ ఇంత తక్కువ ధరకు ఎప్పుడు బైక్ చేయలేదు. కావున దేశీయ విఫణిలో తక్కువ ధరకు లభించే ఏకైన హార్లే డేవిడ్సన్ బైక్ ఎక్స్440 కావడం విశేషం. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైకుకి ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment