Hero HF Deluxe Black Canvas Edition: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన 'హీరో మోటోకార్ప్' (Hero MotoCorp) తన బెస్ట్ సెల్లింగ్ మోడల్ అయిన హెచ్ఎఫ్ డీలక్స్‌కి చెందిన మరో కొత్త ఎడిషన్‌ను లాంచ్ చేసింది. మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బైక్ పేరు 'హెచ్ఎఫ్ డీలక్స్ బ్లాక్ కాన్వాస్' (HF Deluxe Black Canvas). ఈ బైక్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ధరలు & కలర్ ఆప్షన్స్
కొత్త హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బ్లాక్ కాన్వాస్ ఎడిషన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి కిక్ వేరియంట్, సెల్ఫ్ స్టార్ట్ వేరియంట్. వీటి ధరలు వరుసగా రూ. 60760 & రూ. 66,408 (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ బైక్ ఇప్పుడు ఆల్ న్యూ బ్లాక్ పెయింట్ స్కీమ్‌లో లభిస్తుంది. అంతే కాకుండా ఇది నెక్సస్ బ్లూ, కాండీ బ్లేజింగ్ రెడ్, హెవీ గ్రే విత్ బ్లాక్, బ్లాక్ విత్ స్పోర్ట్స్ రెడ్ అనే పెయింట్ స్కీమ్‌లో కూడా అందుబాటులో ఉంటుంది.
(ఇదీ చదవండి: ఒకప్పుడు క్రెడిట్ కార్డు ఏజంట్.. ఇప్పుడు రూ. 1000 కోట్ల సామ్రాజ్యాధిపతి)
డిజైన్ & ఫీచర్స్
కొత్త హెచ్ఎఫ్ డీలక్స్ బ్లాక్ కాన్వాస్ ఎడిషన్ 3డీ హెచ్ఎఫ్ డీలక్స్ ఎంబ్లమ్ పొందుతుంది. ఇందులో అన్ని లైట్స్ హాలోజన్ యూనిట్లు కావడం విశేషం. ఫీచర్స్ విషయానికి వస్తే.. ట్యూబ్‌లెస్ టైర్స్, USB ఛార్జింగ్ పోర్ట్, సైడ్-స్టాండ్ ఇండికేటర్, టో-గార్డ్ వంటివి ఉన్నాయి. ఇక పరిమాణం పరంగా ఈ బైక్ పొడవు 1965 మిమీ, వెడల్పు 720 మిమీ, వీల్‌బేస్ 1,235 మిమీ, గ్రౌండ్ క్లియరెన్స్ 165 మిమీ వరకు ఉంటుంది.
(ఇదీ చదవండి: రోజుకి రూ. 1.6 లక్షల సంపాదిస్తున్న 34 ఏళ్ల యువతి.. ఈమె చేసే పనేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!)
ఇంజిన్ అండ్ పర్ఫామెన్స్
హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బ్లాక్ కాన్వాస్ ఎడిషన్ 97.2 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8000 ఆర్పీఎమ్ వద్ద 7.9 బీహెచ్పీ పవర్ 6000 ఆర్పీఎమ్ వద్ద 8.05 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, డ్యూయెల్ షాక్ అబ్సార్బర్స్, 130 మిమీ డ్రమ్ బ్రేక్స్ వంటివి ఉన్నాయి. ఈ బైక్‌పై కంపెనీ 5 సంవత్సరాల వారెంటీ లభిస్తుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి.
Comments
Please login to add a commentAdd a comment