Hero MotoCorp Ltd
-
రూ. 60760కే హెచ్ఎఫ్ డీలక్స్ కొత్త ఎడిషన్ - అదిరిపోయే ఫీచర్స్
Hero HF Deluxe Black Canvas Edition: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన 'హీరో మోటోకార్ప్' (Hero MotoCorp) తన బెస్ట్ సెల్లింగ్ మోడల్ అయిన హెచ్ఎఫ్ డీలక్స్‌కి చెందిన మరో కొత్త ఎడిషన్‌ను లాంచ్ చేసింది. మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బైక్ పేరు 'హెచ్ఎఫ్ డీలక్స్ బ్లాక్ కాన్వాస్' (HF Deluxe Black Canvas). ఈ బైక్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధరలు & కలర్ ఆప్షన్స్ కొత్త హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బ్లాక్ కాన్వాస్ ఎడిషన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి కిక్ వేరియంట్, సెల్ఫ్ స్టార్ట్ వేరియంట్. వీటి ధరలు వరుసగా రూ. 60760 & రూ. 66,408 (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ బైక్ ఇప్పుడు ఆల్ న్యూ బ్లాక్ పెయింట్ స్కీమ్‌లో లభిస్తుంది. అంతే కాకుండా ఇది నెక్సస్ బ్లూ, కాండీ బ్లేజింగ్ రెడ్, హెవీ గ్రే విత్ బ్లాక్, బ్లాక్ విత్ స్పోర్ట్స్ రెడ్ అనే పెయింట్ స్కీమ్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. (ఇదీ చదవండి: ఒకప్పుడు క్రెడిట్ కార్డు ఏజంట్.. ఇప్పుడు రూ. 1000 కోట్ల సామ్రాజ్యాధిపతి) డిజైన్ & ఫీచర్స్ కొత్త హెచ్ఎఫ్ డీలక్స్ బ్లాక్ కాన్వాస్ ఎడిషన్ 3డీ హెచ్ఎఫ్ డీలక్స్ ఎంబ్లమ్ పొందుతుంది. ఇందులో అన్ని లైట్స్ హాలోజన్ యూనిట్లు కావడం విశేషం. ఫీచర్స్ విషయానికి వస్తే.. ట్యూబ్‌లెస్ టైర్స్, USB ఛార్జింగ్ పోర్ట్, సైడ్-స్టాండ్ ఇండికేటర్, టో-గార్డ్ వంటివి ఉన్నాయి. ఇక పరిమాణం పరంగా ఈ బైక్ పొడవు 1965 మిమీ, వెడల్పు 720 మిమీ, వీల్‌బేస్ 1,235 మిమీ, గ్రౌండ్ క్లియరెన్స్ 165 మిమీ వరకు ఉంటుంది. (ఇదీ చదవండి: రోజుకి రూ. 1.6 లక్షల సంపాదిస్తున్న 34 ఏళ్ల యువతి.. ఈమె చేసే పనేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!) ఇంజిన్ అండ్ పర్ఫామెన్స్ హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బ్లాక్ కాన్వాస్ ఎడిషన్ 97.2 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8000 ఆర్పీఎమ్ వద్ద 7.9 బీహెచ్పీ పవర్ 6000 ఆర్పీఎమ్ వద్ద 8.05 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, డ్యూయెల్ షాక్ అబ్సార్బర్స్, 130 మిమీ డ్రమ్ బ్రేక్స్ వంటివి ఉన్నాయి. ఈ బైక్‌పై కంపెనీ 5 సంవత్సరాల వారెంటీ లభిస్తుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
ఫిలిప్పైన్స్‌లో హీరో మోటోకార్ప్ ఎంట్రీ, కీలక డీల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ ఫిలిప్పైన్స్‌లో ఎంట్రీ ఇస్తోంది. వాహనాల అసెంబ్లింగ్, పంపిణీ కోసం టెరాఫిర్మా మోటార్స్ కార్పొరేషన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. లగూనా నగరంలోని తయారీ ప్లాంటులో ప్రత్యేకంగా 29,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అసెంబ్లింగ్ కేంద్రాన్ని టెరాఫిర్మా నెలకొల్పనుంది. 2023-24 ఆర్థిక సంవత్సరం రెండవ భాగంలో ఈ యూనిట్లో కార్యకలాపాలు మొద లు కానున్నాయి. 43 దేశాల్లో విస్తరించిన హీరో మోటాకార్ప్నకు భారత్‌లో ఆరు, కొలంబియా, బంగ్లాదేశ్‌లో ఒక్కొక్క తయారీ కేంద్రం ఉంది. -
ఎలక్ట్రిక్ వాహనాలు: హీరో మోటోకు భారీ ఊరట
సాక్షి, ముంబై: దేశంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్స్‌కు భారీ ఊరట లభించింది. హీరో ట్రేడ్ మార్క్ వివాదంపై విజయం సాధించింది. తన ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించడానికి 'హీరో' ట్రేడ్‌మార్క్‌ను ఉపయోగించుకోవచ్చని ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. ఈ కేసు తుది పరిశీలన చేసిన తర్వాత ట్రైబ్యునల్ తన నిర్ణయాన్ని ప్రకటించిందని హీరో మోటోకార్ప్ పేర్కొంది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ వాదనలను ట్రైబ్యునల్ తోసిపుచ్చింది. ఈమేరకు హీరో గురువారం నాటి రెగ్యులేటరీ ఫైలింగ్ ద్వారా సమాచారమిచ్చింది. ట్రేడ్ మార్క్ వినియోగానికి సంబంధించి భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, రిటైర్డ్ న్యాయమూర్తులు ఇందు మల్హోత్రా, ఇందర్మీత్ కౌర్ నేతృత్వంలోని ట్రైబ్యునల్ అనుకూలంగా తీర్పునిచ్చిందని హీరో మోటో తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాలు, ఏథెర్ ఎనర్జీ వ్యాపారంపై హీరో మోటో కార్ప్ 400 కోట్ల పెట్టుబడులు, గత 10 ఏళ్లలో హీరో బ్రాండ్ గుడ్ విల్, రిపుటేషన్ బిల్డింగ్‌పై దాదాపు రూ. 7వేల కోట్ల వెచ్చించిన విషయాన్ని ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఉద్ఘాటించిందని కంపెనీ పేర్కొంది. అయితే హీరో ఎలక్ట్రిక్ ప్రమోషన్ కోసం నవీన్ ముంజాల్ గ్రూప్ రూ.65 కోట్లు పెట్టుబడి పెట్టిందట. 'హీరో' బ్రాండ్‌పై తమకే ప్రత్యేక యాజమాన్య హక్కులు ఉన్నాయని పేర్కొంటూ హీరో మోటోకార్ప్ ఛైర్మన్ పవన్ ముంజాల్‌తో న్యాయ పోరాటం చేస్తున్నారు నవీన్ ముంజాల్. ఈ క్రమంలోనే హీరో బ్రాండ్ నేమ్‌తో హీరో మోటో కార్ప్ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను వ్యతిరేకిస్తూ హీరో ఎలక్ట్రిక్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించింది. నవీన్ ముంజాల్ నేతృత్వంలోని హీరో ఎలక్ట్రిక్ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించిన ధర్మాసనం తాజా తీర్పునిచ్చింది. కాగా జూలైలో ఎలక్ట్రిక్ వాహనాలను ఆవిష్కరించాలనుక్ను హీరో మోటో కార్ప్ ఈ సంవత్సరం పండుగ సీజన్‌కు దీన్ని వాయిదా వేసింది. -
హైటెక్ ఫీచర్లతో హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ విడుదల చేసింది. ధర ఢిల్లీ ఎక్స్‌షోరూంలో రూ.72,900 ఉంది. 97.2 సీసీ ఇంజన్, పేటెంటెడ్ ఐ3ఎస్ టెక్నాలజీ, బ్లూటూత్ కనెక్టివిటీతో పూర్తి డిజిటల్ మీటర్, కాల్, ఎస్ఎంఎస్ అలర్ట్, రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్, లో ఫ్యూయల్ ఇండికేటర్, ఇంటిగ్రేటెడ్ యూఎస్బీ చార్జర్, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్, స్టాప్–స్టార్ట్ సిస్టమ్, ఎల్ఈడీ హై ఇంటెన్సిటీ పొజిషన్ ల్యాంప్, ప్రత్యేక గ్రాఫిక్స్‌తో ఇది రూపుదిద్దుకుంది. అయిదేళ్ల వారంటీ ఉంది. చదవండి: ఇంత ధర అంటే కష్టం బాస్.. పైగా ప్రమాదాలు కూడానూ.. -
టూవీలర్ కొనుగోలుదారులకు షాకింగ్ న్యూస్..!
ప్రముఖ టూవీలర్ ఆటోమొబైల్ సంస్థ హీరో మోటోకార్ప్ కంపెనీ పోర్ట్‌ఫోలియోలోని పలు బైక్స్ ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఎంపిక చేసిన మోటార్‌సైకిళ్లపై ధరల పెంపు ఉండనుంది. హీరో స్ప్లెండర్ ప్లస్ , హెచ్ఎఫ్ డీలక్స్ , గ్లామర్ , సూపర్ స్ప్లెండర్ , ఎక్స్‌పల్స్ 200 , ఎక్స్ట్రీమ్ 160ఆర్ , ఎక్స్ట్రీమ్ 200ఎస్ , హెచ్ఎఫ్ 100 బైక్స్ ధరలు భారీగా పెరిగాయి. హీరో ఎక్స్ పల్స్ 200టీ, హీరో స్ప్లెండర్ iSmart, హీరో X పల్స్ 200 స్టాండర్డ్ వేరియంట్, హీరో ప్యాషన్ ప్రో బైక్ ధరల్లో ఎలాంటి పెరుగుదల లేదు. వివిధ బైక్స్‌పై పెరిగిన ధరల జాబితా ఇదే.. ► హీరో ఎక్స్ట్రీమ్ 160ఆర్ సింగిల్ డిస్క్ వేరియంట్ ధర రూ. 500 మేర(రూ. 1,12,110), స్టెల్త్ ఎడిషన్ వేరియంట్ ధర రూ. 1000(రూ. 1,17,660) వరకు పెరిగింది. ► హీరో ఎక్స్ట్రీమ్ 200ఎస్ స్టాండర్డ్ ఎడిషన్ బైక్‌పై రూ. 2000 పెరగగా...ఈ బైక్ ఇప్పుడు రూ. 1,30,614కు రానుంది. ► హీరో HF 100 స్టాండర్డ్ ఎడిషన్‌పై రూ. 420 మేర పెరిగింది. ► ఆయా వేరియంట్లను బట్టి హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ ధర రూ. 790 నుంచి రూ. 1,910 మేర పెరిగాయి. ► హీరో HF డీలక్స్ బైక్ ఆయా వేరియంట్లపై రూ. 750 నుంచి రూ. 1,420 మేర పెరిగాయి. ► హీరో గ్లామర్ బైక్ ధరలు రూ. 600 నుంచి రూ. 1, 800 వరకు పెరిగాయి. ► హీరో సూపర్ స్ప్లెండర్ డ్రమ్ వేరియంట్ బైక్‌పై రూ. 1,500 మేర, డిస్క్ వేరియంట్‌పై రూ. 2000 మేర పెరిగాయి. ► హీరో X పల్స్ 200 4వీ వేరియంట్ ధర రూ. 2, 200 వరకు పెరిగింది. చదవండి: చిన్న ఎలక్ట్రిక్ వాహనాన్ని లాంచ్ చేయనున్న ఎంజీ మోటార్స్..! ధర ఎంతంటే..? -
హీరో మోటోకార్ప్‌పై ఐటీ దాడులు..కీలక విషయాలు వెల్లడి..!
ప్రముఖ టూవీలర్ దిగ్గజం హీరో మోటోకార్ప్‌పై ఐటీ శాఖ దాడులను జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో పలు డాక్యుమెంట్లను ఐటీ శాఖ స్వాధీనం చేసుకుంది. హీరో మోటోకార్ప్, కంపెనీ ఎండీ పవన్ ముంజల్ పలు నిబంధనలను ఉల్లంఘించినట్లు ఐటీ శాఖ గుర్తించింది. బోగస్ ఖర్చులు.. ఢిల్లీ ఎన్‌సిఆర్‌లోని పలు ప్రదేశాలలో మార్చి 23 నుంచి మార్చి 26 వరకు హీరో మోటోకార్ప్, సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పవన్ ముంజాల్‌పై ఆదాయపు శాఖ సోదాలను నిర్వహించింది. 40 కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఐటీ దాడులు జరిగాయి. సోదాల్లో భాగంగా సంస్థ కార్యకలాపాలకు సంబంధించి హార్డ్ కాపీ డాక్యుమెంట్లు, డిజిటల్ డేటా రూపంలో పెద్ద సంఖ్యలో నేరారోపణలకు సాక్షాలను ఐటీ శాఖ స్వాధీనం చేసుకుంది. ఈ దాడుల్లో హీరో మోటోకార్ప్ సంస్థ సుమారు రూ. 1000 కోట్లకు పైగా బోగస్ ఖర్చులను చేసినట్లు ఐటీ శాఖ గుర్తించింది. చట్టం ఉల్లంఘన..! ఐటీ చట్టంలోని సెక్షన్ 269 ఎస్ఎస్ను పవన్ ముంజల్ ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. గతంలో ముంజల్ ఛత్తర్‌పూర్‌లో ఫామ్‌హౌస్‌ను కొనుగోలు చేశాడు. పన్ను ఆదా కోసం ఫామ్‌హౌస్ కొనుగోలుపై మార్కెట్ ధరను తారుమారు చేసి, సుమారు రూ. 100 కోట్ల కంటే ఎక్కువ నగదు చెల్లించడానికి నల్లధనాన్ని ఉపయోగించాడని సమాచారం. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 269ఎస్ఎస్ ప్రకారం స్థిరాస్థి లావాదేవీల్లో రూ.20వేలు అంతకంటే ఎక్కువ నగదు రూపంలో స్వీకరిస్తే శిక్షను విధిస్తారు. ఐటీ శాఖ పలు కీలక విషయాలను బహిర్గతం చేయడంతో హీరో మోటోకార్ప్ షేర్లు సుమారు 8 శాతం మేర తగ్గాయి. చదవండి: టాక్స్ పేయర్లకు అలర్ట్..! ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్..! -
రికార్డు స్థాయిలో విదేశాలకు హీరో ద్విచక్ర వాహనాల ఎగుమతులు
ద్విచక్ర వాహనాల ఎగుమతుల పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ 2021లో కొత్త రికార్డు సృష్టించింది. 2021 ఏడాది కాలంలో భారతీయ, ప్రపంచ ఆటోమోటివ్ పరిశ్రమకు సవాళ్లు ఎదురైనప్పటికి హీరో మోటోకార్ప్ అత్యధిక సంఖ్యలో 2.89 లక్షల యూనిట్లను విదేశాలకు ఎగుమతి చేసింది. ఏ సంవత్సరంలో నమోదు చేయని విధంగా భారత్‌తో సహా, ఇతర దేశాల్లో అత్యధిక విక్రయాలను నమోదు చేసింది. హీరో మోటోకార్ప్ గత సంవత్సరంలో ఆసియా, ఆఫ్రికా, దక్షిణ & మధ్య అమెరికా, కరేబియన్ ప్రాంతంలో తన మార్కెట్ విస్తరించింది. ఈ మార్కెట్ విస్తరణ వల్ల భారతదేశం వెలుపల మార్కెట్లలో అమ్మకాల పరంగా 71 శాతం పెరుగుదలను నమోదు చేసింది. 2020లో విదేశీ మార్కెట్లలో 1.69 లక్షల యూనిట్లతో పోలిస్తే ఈ సంఖ్య (2.89 లక్షల యూనిట్లు) చాలా ఎక్కువ. కానీ, హీరో మోటోకార్ప్ తన పనితీరుతో సంతృప్తిగా లేదు. "ప్రస్తుతం ఉన్న కోవిడ్-19 మహమ్మారి కారణంగా గ్లోబల్ లాజిస్టిక్స్, సప్లై ఛైయిన్ లో ఉన్న అడ్డంకులను దృష్టిలో ఉంచుకొని ఈ క్యాలెండర్ సంవత్సరంలో ప్రపంచ మార్కెట్లలో విక్రయాలు ప్రణాళికలకు అనుగుణంగా ఉన్నాయి" అని సంజయ్ భాన్, హెడ్ - గ్లోబల్ బిజినెస్, హీరో మోటోకార్ప్ అన్నారు. "2025 నాటికి గ్లోబల్ బిజినెస్ అమ్మకాల వాటా కంపెనీ మొత్తం వాటాలో 15% చేరుకోవడానికి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు" తెలిపారు. హీరో మోటోకార్ప్ ప్రస్తుతం 42 దేశాలకు ద్విచక్ర వాహనాలను ఎగుమతి చేస్తుంది. భారత్‌తో సహా గ్లోబల్ మార్కెట్లలో ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేసేందుకు హీరో మోటోకార్ప్ ప్రణాళికలను రచిస్తోందని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ ఏడాది మార్చి నెలలో తన మొదటి ఎలక్ట్రిక్ వెహికల్ (EV)ని ఆవిష్కరించడానికి సిద్ధమవుతోంది. ఈ వాహనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరులోని కంపెనీ తయారీ కేంద్రంలో ఉత్పత్తి కానున్నట్లు తెలుస్తోంది. డిసెంబరులో, హీరో మోటోకార్ప్ దేశీయ మార్కెట్లో 3,94,773 యూనిట్లను విక్రయించింది. (చదవండి: భారత మార్కెట్లలో కియా మోటార్స్ ప్రభంజనం..!) -
హీరో మోటోకార్ప్ నుంచి తొలి ఎలక్ట్రిక్ వాహనం..! లాంచ్ ఎప్పడంటే...?
ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్‌సైకిల్స్, స్కూటర్ల తయారీదారు హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ బాట పట్టనుంది. లేట్‌గా వచ్చిన లేటెస్ట్గా ఎలక్ట్రిక్ వాహనాలను తయారుచేసేందుకు హీరో మోటో కార్ప్ సన్నద్ధమైంది. లాంచ్ ఎప్పుడంటే..! భారత్‌తో సహా గ్లోబల్ మార్కెట్లలో ఎలక్ట్రిక్ వాహనాలను తెచ్చేందుకు హీరో మోటోకార్ప్ ప్రణాళికలను రచిస్తోందని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ ఏడాది మార్చి నెలలో తన మొదటి ఎలక్ట్రిక్ వెహికల్ (EV)ని ఆవిష్కరించడానికి సిద్ధమవుతోంది. ఈ వాహనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరులోని కంపెనీ తయారీ కేంద్రంలో ఉత్పత్తి కానున్నట్లు తెలుస్తోంది. 2021లో భారీ సేల్స్...! 2021లో క్యాలెండర్ ఇయర్లో హీరో మోటోకార్ప్ అమ్మకాల్లో దుమ్మురేపింది. ఏ సంవత్సరంలో నమోదుచేయని విధంగా భారత్‌తో సహా, ఇతర దేశాల్లో అత్యధిక విక్రయాలను నమోదు చేసింది. క్యాలెండర్ ఇయర్ 2021 (జనవరి-డిసెంబర్)లో ఆసియా, ఆఫ్రికా, మధ్య అమెరికా, కరేబియన్లలో విస్తరించి దాని మార్కెట్లలో కంపెనీ 2.89 లక్షల యూనిట్ల మోటార్‌సైకిళ్లు, స్కూటర్లను విక్రయించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. చదవండి: భారత్‌లో తక్కువ ధరకే లభిస్తోన్న ఎలక్ట్రిక్ కార్స్ ఇవే..! -
టూవీలర్ కొనుగోలుదారులకు మరోసారి భారీ షాక్..!
వచ్చే ఏడాది నుంచి కార్ల ధరలను పెంచుతూ దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 2022 నుంచి కార్లతో పాటుగా టూవీలర్ వాహనాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీని కారణం భారత్‌లోని రెండో అతిపెద్ద టూవీలర్ వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తీసుకున్న తాజా నిర్ణయమే. భారీగా పెరగనున్న ధరలు..! వచ్చే ఏడాది జనవరి 4 నుంచి హీరో మోటోకార్ప్‌కు చెందిన మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ఎక్స్-షోరూమ్ ధరలను పెంచే యోచనలో కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది. ధరల పెంపుపై కంపెనీ గురువారం రోజున స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. క్రమంగా పెరుగుతున్న ముడిసరుకుల ధరల ప్రభావాన్ని పాక్షికంగా ఆఫ్సెట్ చేయడానికి ధరల పెంపు అనివార్యమని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. సుమారు రూ. 2000 వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయా హీరో మోటోకార్ప్ బైక్స్ మోడల్‌ను బట్టి కూడా ధరలు పెరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో కూడా..! పండుగ సీజన్ సందర్బంగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో సుమారు రూ. 3000 వేలకు పైగా టూవీలర్ వాహనాల ధరలను హీరో మోటోకార్ప్ పెంచింది. కాగా ఇప్పటికే ప్రముఖ స్పోర్ట్స్ బైక్ సంస్థ కవాసికి ధరలను పెంచుతూ ప్రకటించింది. చదవండి: స్పోర్ట్స్ బైక్ లవర్స్‌కి షాక్ ! భారీగా బైకుల ధరలు పెంచిన ప్రముఖ కంపెనీ -
మరో గిన్నిస్ వరల్డ్ రికార్డును నమోదుచేసిన హీరో మోటోకార్ప్...!
భారత అతి పెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ.. హీరో మోటోకార్ప్ ఇంటర్నేషనల్ జీరో ఎమిషన్స్(ఉద్గారాలు) దినోత్సవాన్ని పురస్కరించుకుని గిన్నిస్ వరల్డ్ రికార్డును నమోదుచేసింది. 'లార్జెస్ట్ ఆన్లైన్ఫోటో ఆల్భమ్’ పేరిట హీరో మోటోకార్ప్ ప్రపంచరికార్డును ఆవిష్కరించింది. కర్భన ఉద్గారాలను తగ్గించడం కోసం హీరో మోటోకార్ప్ తన వంతుగా ‘హీరో గ్రీన్ డ్రైవ్’ ద్వారా దేశవ్యాప్తంగా మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపట్టనుంది. చదవండి: టెస్లా ఎలక్ట్రిక్ కారుకి ఇండియాలో అడ్డం పడుతున్న ‘స్పీడ్ బ్రేకర్’ హీరో గ్రీన్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా సుమారు 1,37,775 మొక్కలను నాటే ఫోటోలతో ‘లార్జెస్ట్ ఆన్లైన్ఫోటో ఆల్భమ్’తో హీరో మోటార్‌కార్ప్ గిన్నిస్ వరల్డ్ రికార్డుకెక్కింది. కంపెనీ గిన్నిస్ వరల్డ్ రికార్డును నమోదుచేయడం ఇది రెండోసారి. ఈ సందర్భంగా హీరో మోటోకార్ప్ గ్లోబల్ ప్రొడక్ట్ ప్లానింగ్ అండ్ స్ట్రాటజీ హెడ్ మాలో లే మాసన్ మాట్లాడుతూ.. "100 మిలియన్ అమ్మకాల మైలురాయితో ఈ ఏడాది కంపెనీ మరింత ఉత్సాహంగా ప్రారంభమైందని తెలిపారు. అంతేకాకుండా ఒకే రోజులో లక్ష యూనిట్ల విక్రయాలను హీరో మోటోకార్ప్ జరిపినట్లు గుర్తుచేశారు. ‘హీరో గ్రీన్ డ్రైవ్’ కార్యక్రమంతో జీరో ఎమిషన్స్‌పై కంపెనీ కట్టుబడి ఉందని వెల్లడించారు. గత నెలలో 'అతిపెద్ద మోటార్‌సైకిల్ లోగో' సృష్టించినందుకుగాను హీరో మోటోకార్ప్ గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. ఈ అరుదైన ఫీట్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు హీరో మోటోకార్ప్ ప్లాంట్‌లో అతిపెద్ద మోటార్సైకిల్లోగోను సుమారు 1845 స్ప్లెండర్ ప్లస్ బైక్స్నుపయోగించి గిన్నిస్ రికార్డును ఆవిష్కరించింది. చదవండి: జేమ్స్‌బాండ్-007 భాగస్వామ్యంతో స్పెషల్ ఎడిషన్ బైక్..! -
ఒక్క రోజులో లక్ష స్కూటర్ల విక్రయం
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన పరిశ్రమలో మార్కెట్ లీడర్ హీరో మోటోకార్ప్ గత వారం 10వ వార్షికోత్సవం సందర్భంగా ఒక్క రోజు లక్ష యూనిట్లకు పైగా రిటైల్ చేసినట్లు తెలిపింది. ఆగస్టు 9నతో మా ప్రయాణం పదేళ్లు పూర్తి చేసుకుందని.. హీరో మోటోకార్ప్‌లో ఇదొక మైలురాయి అని కంపెనీ సేల్స్ హెడ్ నవీన్ చౌహాన్ తెలిపారు. దేశీయ, గ్లోబల్ మార్కెట్లలో పండుగలు లేని సమయంలో కూడా కస్టమర్లు ఈ స్థాయిలో ఒకే రోజు రికార్డ్ స్థాయిలో కొనుగోళ్లు జరపడం ఇదే ప్రథమమని చెప్పారు. కొత్తగా విడుదల చేసిన మాస్ట్రో ఎడ్జ్ 125, డెస్టినీ, ప్లెజర్ 110 స్కూటర్లకు అధిక డిమాండ్‌తో పాటు ఇతర బైక్స్లు రోజు వారీ సగటు కంటే రెట్టింపు అమ్మకాలు జరిపాయని తెలిపారు. చదవండి : సాఫ్ట్వేర్ సంస్థ (24)7.ఏఐ భారీ నియామకాలు -
అమ్మకాల్లో సరికొత్త రికార్డు సృష్టించిన హీరో మోటోకార్ప్..!
ప్రముఖ బైక్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ అమ్మకాల్లో రికార్డు సృష్టించింది. ఒకేరోజు (ఆగస్టు 9) ఏకంగా లక్ష యూనిట్ల బైక్‌లను రిటైల్ అమ్మకాలను జరిపింది. ఈ అరుదైన రికార్డు హీరో మోటోకార్ప్ కంపెనీ పదవ వార్షికోత్సవం జరగడం విశేషం. పండుగ సీజన్ లేని సమయంలో భారత్‌తో పాటు ఇతర దేశాల్లో హీరో బైక్‌లు రికార్డుస్థాయిలో రిటైల్ అమ్మకాలు జరిగినట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన హీరో మోటార్స్ అమ్మకాల్లో ఎంట్రీ, డీలక్స్, ప్రీమియం బైక్‌ల సెగ్మెంట్లకు వీపరీతమైన డిమాండ్ కారణంగా రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయని కంపెనీ వెల్లడించింది. హీరో మోటోకార్ప్ కొత్తగా ప్రారంభించిన మాస్ట్రో ఎడ్జ్ 125, డెస్టినీ, ప్లెజర్ 110 తో సహా, తన స్కూటర్ల శ్రేణికి విపరీతమైన డిమాండ్‌తో ఆగస్టు 9న జరిగిన స్కూటర్ల అమ్మకాల్లో రోజువారీ సగటు కంటే రెట్టింపు అమ్మకాలు జరిగాయని కంపెనీ పేర్కొంది. ఈ వాహనాలతో పాటుగా ఇటీవల ప్రారంభించిన గ్లామర్ ఎక్స్‌టెక్, స్ప్లెండర్ మాట్టే గోల్డ్, ఎక్స్ట్రీమ్ 160ఆర్ బైక్‌లను కూడా కస్టమర్లు గణనీయంగా కొనుగోలు చేశారని హీరో మోటోకార్ప్ తెలిపింది. హీరో మోటోకార్ఫ్ 10 సంవత్సరాల ప్రయాణంలో ఈ అమ్మకాలు ఒక మైలురాయిగా నిలుస్తోందని హీరో మోటోకార్ప్ సేల్స్ & ఆఫ్-సేల్స్ హెడ్ నవీన్ చౌహాన్ అన్నారు. పండుగ సీజన్ లేని కాలంలో రికార్డు స్థాయిలో లక్ష హీరో బైక్‌ల రిటైల్ అమ్మకాలు జరిపిన కస్టమర్లకు అభినందనలను అందించారు. కస్టమర్లు తమపై చూపిన విశ్వాసానికి కృతజ్ఞతలను తెలిపారు. -
హీరో మోటోకార్ప్ దూకుడు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021-22) తొలి త్రైమాసికంలో ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1 (ఏప్రిల్-జూన్)లో నికర లాభం నాలుగు రెట్లు పైగా ఎగసి రూ. 256 కోట్లను తాకింది. గతేడాది(2020-21) ఇదే కాలంలో రూ.58 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2,969 కోట్ల నుంచి రూ.5,508 కోట్లకు జంప్‌చేసింది. ఇక స్టాండెలోన్ నికర లాభం రూ. 61 కోట్ల నుంచి రూ. 865 కోట్లకు దూసుకెళ్లింది. ఈ కాలంలో 10.25 లక్షల వాహనాలను విక్రయించింది. హీరో మోటో షేరు ఎన్ఎస్ఈలో దాదాపు యథధాతధంగారూ. 2,788 వద్ద ముగిసింది. -
సరికొత్త ఫీచర్లతో హీరో మాస్ట్రో ఎడ్జ్ 125...!
ప్రముఖ మోటార్‌సైకిళ్ల తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ దేశవ్యాప్తంగా తన 125సీసీ మోడళ్లను పెంచాలని యోచిస్తోంది. ఇటీవల గ్లామర్ బైక్‌కు అప్డేట్ తెచ్చిన కొన్ని రోజులకే స్కూటీ డివిజన్లో మాస్ట్రో ఎడ్జ్ 125ను అప్డేట్ చేస్తూ సరికొత్త ఫీచర్లతో మాస్ట్రో ఎడ్జ్ 125 బైక్‌ను హీరో మోటార్ కార్ప్ రిలీజ్ చేసింది. ఈ బైక్‌ను సరికొత్తగా రెండు రకాల కలర్ వేరియంట్లతో మార్కెట్లోకి లాంచ్ చేసింది. కస్లమర్లకు ప్రిస్మాటిక్ ఎల్లో, ప్రిస్మాటిక్ పర్పుల్ కలర్ వేరియంట్స్ రూపంలో న్యూ మాస్ట్రో ఎడ్జ్ కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. న్యూ మాస్ట్రో ఎడ్జ్ 125 బైక్ బ్లూటూత్ కనెక్టివిటీని, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, టర్న్-బై- టర్న్ నావిగేషన్, డిజిటల్ స్పీడో మీటర్, కాల్ ఆలర్ట్‌తో రానుంది. మాస్ట్రో ఎడ్జ్ 125 డ్రమ్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 72,250, డిస్క్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 76,500, కనెక్టెడ్ వేరియంట్ ఎక్స్ షో రూమ్ ధర రూ. 79,750గా నిర్ణయించారు. ఈ ధరలు ఢిల్లీ నగరంలో అందుబాటులో ఉంటాయి. మాస్ట్రో ఎడ్జ్ 125 'ఎక్స్సెన్స్ టెక్నాలజీ'తో 124.6 సిసి బిఎస్ 6 కంప్లైంట్ ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ మోటారుతో రానుంది. ఇంజన్ 9బీహెచ్పీ సామర్థ్యంతో 7,000 ఆర్‌పీఎమ్‌ను అందిస్తోంది. 5,500 ఆర్పీఎమ్ వద్ద గరిష్టంగా 10.4ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తోంది.టీవీఎస్ ఎన్‌టార్క్ 125, సుజుకి యాక్సెస్ 125, హోండా గ్రాజియా 125 అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 125 బైక్‌లకు పోటిగా నిలవనుంది. -
గ్లామర్ ఎక్స్ టెక్ బైక్ ను లాంచ్ చేసిన హీరో మోటోకార్ప్
ప్రముఖ మోటార్ సైకిల్ తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ నేడు(జూలై 20) తన గ్లామర్ ఎక్స్ టెక్ బైక్ ను లాంఛ్ చేసింది. హీరో గ్లామర్ ఎక్స్ టెక్ బైక్ రెండు విభిన్న ఆప్షన్ లలో లభిస్తుంది. ఒకటి డ్రమ్ వేరియంట్ అయితే, మరొకటి డిస్క్ వేరియంట్. డ్రమ్ వేరియంట్ ₹78,900కు, డిస్క్ వేరియంట్ ₹.83,700(ఎక్స్ షోరూమ్, హైదరాబాద్) ధరకు కొనుగోలుకు అందుబాటులో ఉంది. 125 సీసీ కమ్యూటర్ మోటార్ సైకిల్ అనేక ఫీచర్లతో వచ్చింది. దీనిలో బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్, ఇంటిగ్రేటెడ్ యుఎస్ బి ఛార్జర్, సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్, బ్యాంక్ యాంగిల్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్ గేర్ పొజిషన్ ఇండికేటర్, రియల్ టైమ్ మైలేజీ వంటి సమాచారాన్ని చూపిస్తుంది. గ్లామర్ ఎక్స్ టెక్ లో హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్ సస్పెన్షన్, ఫ్రంట్ 240 మీ.మీ డిస్క్ బ్రేకులు, వెడల్పియర్ రియర్ టైర్, 180 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. డిజైన్ పరంగా హీరో గ్లామర్ ఎక్స్ టెక్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ తో వస్తుంది. హీరో గ్లామర్ ఎక్స్ టెక్ బైక్ 125 సీసీ బీఎస్-వీఐ ఎక్స్ సెన్స్ ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 7,500 ఆర్ పీఎమ్ వద్ద 10.7 బిహెచ్ పీ పవర్ ని, 6,000 ఆర్ పీఎమ్ వద్ద 10.6 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. -
బాబోయ్ పెట్రోల్.. భవిష్యత్తు హైపర్ ఛార్జర్లదే
వెబ్‌డెస్క్ : పెరుగుతున్న పెట్రోల్ ధరలు సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. పైకి వెళ్లడమే తప్ప కిందికి రానంట్ను ఫ్యూయల్ ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. దీంతో పెట్రోలు పోయించాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంటోంది. మరోవైపు అనేక కంపెనీలు ఎలక్ట్రికల్ వెహికల్స్ (ఈవీ)కి అనుగుణంగా ఛార్జింగ్ స్టేషన్లను అందుబాబులోకి తెస్తున్నాయి. ఈవీ ఛార్జింగ్ పాయింట్లు పెట్రోల్ బంకులకు ప్రత్యామ్నయం కానున్నాయా? ఛార్జింగ్ సమస్య పెట్రోమంటతో ఉక్కిరిబిక్కిరవుతున్న సామాన్యులు పెట్రోల్ బండ్లకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ)కి మారుదామంటే, వాటి ఛార్జింగ్ అంశం సమస్యగా మారింది. ఈవీ వెహికల్స్‌కి ప్రభుత్వం నుంచి పన్ను రాయితీ, ఇతర ప్రోత్సహకాలు లభిస్తున్నా ఛార్జింగ్ అనేదే ప్రధాన సమస్యగా మారింది. ఇప్పుడీ సమస్యకు చెక్ పెట్టేందుకు ఆటోమొబైల్ సంస్థలే స్వయంగా ముందుకు వస్తున్నాయి. టీవీఎస్ ఎంఓయూ ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం సంస్థ టీవీఎస్ కొత్త ఐడియాతో ముందుకు వచ్చింది. ఎంపిక చేసిన నగరాల్లో సొంతంగా ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఒకటైన కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్‌తో అవగాహన ఒప్పందం చేసుకుంది ఈ మేరకు 2020 మార్చి నాటికి దేశంలోని 20 నగరాల్లో ఈవీ వెహికల్స్ ఛార్జింగ్ నెట్వర్క్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ పేరుతో 2020లోనే ఈవీ వెహికల్ని టీవీఎస్ మార్కెట్లోకి తెచ్చింది. అయితే ఛార్జింగ్ నెట్వర్క్ సమస్య కారణంగా కేవలం ఢిల్లీ, బెంగళూరు నగరాలకే పరిమితమైంది. ఓలా టార్గెట్ లక్ష ఛార్జింగ్ పాయింట్లు క్యాబ్ సర్వీసులు అందిస్తున్న ఓలా సైతం హైపర్ ఛార్జింగ్ స్టేషన్లపై దృష్టి పెట్టింది. భారీ ఎత్తున ఓలా స్కూటర్లను ఈ కంపెనీ తయారు చేస్తోంది. దీంతో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రాబోయే రోజుల్లో 400 నగరాల్లో లక్షలకు పైగా హైపర్ ఛార్జింగ్ నెట్‌వర్క్‌లను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇళ్లు, పబ్లిక్ ప్లేసేస్‌తో పాటు ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో ఈ ఛార్జింగ్ పాయింట్లు అందుబాటులో ఉంటాయి. తొలి విడతలో వంద నగరాల్లో ఐదు వేల ఛార్జింగ్ పాయింట్లు నిర్మిస్తామని ప్రకటించింది. మరోవైపు ఛార్జింగ్ సమస్య పరిష్కారానికి హీరో సంస్థ ఏకంగా రూ. 10,000 కోట్ల రూపాయలను రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్పై ఖర్చు చేస్తోంది. అంతేకాకుండా బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీపై తైవాన్‌కి చెందిన గోగోరో సంస్థతో ఒప్పందం కూడా చేసుకుంది చదవండి: ఎలక్ట్రిక్ వాహనాలకు రాయితీలు చదవండి:Petrol, diesel prices: పెట్రో బాంబు, రికార్డు ధర -
హీరో మోటోకార్ప్ ప్రియులకు తీపికబురు
దేశీయ ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి అడుగుపెట్టినట్లు పేర్కొంది. వచ్చే ఏడాది హీరో సంస్థకు చెందిన ఒక ఎలక్ట్రిక్ మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు కంపెనీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఎలక్ట్రిక్ వెహికల్(ఈవి) కోసం కంపెనీ తన స్వంత టెక్నాలజీతో ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి జైపూర్(రాజస్థాన్), స్టీఫన్స్కిర్చేన్ (జర్మనీ) ఆర్ అండ్ డీ కేంద్రాల సేవలను వినియోగించుకొనున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా, బ్యాటరీ స్వాపింగ్(బ్యాటరీ ఇచ్చి ఛార్జైన బ్యాటరీ తీసుకోవడం) ప్లాట్‌ఫామ్‌ను భారత్‌కు తీసుకొచ్చేందుకు తైవాన్‌కు చెందిన గోగోరో ఇంక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొంది. హీరో-బ్రాండ్ పేరు మీద మార్కెట్లోకి ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకురావడానికి రెండు సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. 2022 నాటికి ఎలక్ట్రిక్ వాహనాన్ని తీసుకురానున్నట్లు నిరంజన్ గుప్తా వెల్లడించారు. అది మా స్వంత ఉత్పత్తి లేదా గోగోరో సహకారంతో అయిన కావొచ్చని పేర్కొన్నారు. ఈ వాహనాలు వచ్చే ఏడాదిలో ఎప్పుడైన రావొచ్చు అని తెలిపారు. ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఇప్పటికే బెంగళూరుకు చెందిన ఈవీ స్టార్టప్ ఈథర్ ఎనర్జీలో పెట్టుబడులు పెట్టింది. ఈథర్ ఎనర్జీకి చెందిన పలు మోడళ్లు ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. చదవండి: సింగిల్ చార్జ్ తో 240 కి.మీ ప్రయాణించనున్న ఎలక్ట్రిక్ స్కూటర్ -
సంతోష్ ముంజల్ కన్నుమూత
ముంబై: ప్రముఖ బైక్ తయారీ సంస్థ హీరో గ్రూపు వ్యవస్థాపకుడు స్వర్గియ బ్రిజ్మోహన్ లాల్ ముంజల్ భార్య సంతోష్ ముంజల్(92) తుది శ్వాస విడిచారు. శుక్రవారం ఆమె మరణించినట్లు ముంజల్ కుటుంబ సభ్యులు వెల్లడించారు. 1947లో బ్రిజ్మోహన్ లాల్‌తో ఆమె వివాహం జరిగింది. 1953లో హీరో సంస్థ స్థాపించిన నాటి నుంచి ఆమె బ్రిజ్‌మోహన్‌కు మద్దతుగా నిలిచారు. ప్రస్తుతం ఆమె కుమారులు సుమన్ ముంజల్ రాక్‌మ్యాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా, పవన్ ముంజల్ హీరో మోటోకార్ప్ ఎండీ, సీఈఓగా, సునీల్ ముంజల్ హీరో ఎంటర్ప్రైజెస్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆమెకు గీతా ఆనంద్ అనే కూతురు కూడా ఉన్నారు. -
బైక్ ధరలను పెంచేసిన హీరో మోటో
సాక్షి,ముంబై: దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ బైక్ లవర్స్‌కి షాకిచ్చింది. వచ్చే నెలనుంచి తన మోటార్ సైకిళ్ల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులరీత్యా తమ అన్ని మోడళ్ల బైక్‌లు, స్కూటర్ల ధరలను పెంచాల్సి వస్తోందని ప్రకటించింది. సవరించిన ధరలు అన్ని షోరూంలలో 2021 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తాయని ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారంలో సంస్థ వెల్లడించింది. (మారుతి కార్ల ధరలకు రెక్కలు) వినియోగదారుల మీద తక్కువ భారం పడేలా, తమ ఖర్చులను తగ్గించుకునే కార్యక్రమాన్ని వేగవంతం చేసినట్టు హీర మోటో తెలిపింది. అయితే ధరల పెరుగుదల పరిమాణంపై కంపెనీ నిర్దిష్ట వివరాలు ఇవ్వలేదు. కానీ, ఈ పెరుగుదల రూ .2500 వరకు ఉంటుందని, మోడల్, నిర్దిష్ట మార్కెట్ ఆధారంగా ఉంటుందని హీరో తెలిపింది. కాగా అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇన్పుట్ ఖర్చుల భారం నేపథ్యంలో అన్నిమోడళ్ల కార్ల ధరలను పెంచుతున్నట్టు మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
హీరో మోటో బైక్స్‌పై భారీ డిస్కౌంట్
సాక్షి, ముంబై: దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ భారీ తగ్గింపును ఆఫర్ చేస్తోంది. హీరో బీఎస్-4 ద్విచక్రవాహనాలపై 15 వేల రూపాయల తగ్గింపును ప్రకటించింది. పలు మోటారు సైకిళ్లపై రూ.10వేలు, స్కూటర్లపై రూ.15 వేల డిస్కౌంట్లను అందిస్తున్నట్లు హీరో మోటో కార్ప్ బుధవారం తెలిపింది. లాక్డౌన్ కారణంగా షోరూమ్‌లు మూసివేసిన కారణంగా స్టాక్‌ను క్లియర్ చేసుకునే క్రమంలో ఆన్లైన్ కొనుగోళ్లపై ఈ డిస్కౌంట్లను అందించనుంది. హీరో మోటోకార్ప్ సుమారు రూ. 600 కోట్ల విలువైన 1.5 లక్షల యూనిట్ల బీఎస్-4 వాహనాలను కలిగి ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ అంచనా ప్రకారం భారతదేశ మంతటా వివిధ డీలర్ల వద్ద కనీసం 7లక్షల అమ్ముడుపోని ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. ఈ వాహనాల విలువ రూ .3,850 కోట్లు. 2020 ఏప్రిల్ 1 నుండి బీఎస్-4 వాహనాల విక్రయాలను, రిజిస్టేషన్లను సుప్రీంకోర్టు 2018లో నిషేధించింది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అమలవుతున్న 21 రోజుల లాక్ డౌన్ కారణంగా బీఎస్-4 వాహనాల విక్రయాలపై సుప్రీంకోర్టు భారీ ఊరట కల్పించింది. ఆంక్షలు ఎత్తివేసిన తరువాత మరో 10 రోజులు విక్రయించడానికి సుప్రీంకోర్టు మార్చి 27న అనుమతించిన సంగతి తెలిసిందే. -
హీరో మోటో లాభాలు భేష్
సాక్షి, ముంబై: అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరోమోటో కార్ప్ ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్ త్రైమాసికంలో బలమైన ఫలితాలను ప్రకటించింది. దీంతో శుక్రవారం నాటి ట్రేడింగ్ హీరో మోటో షేరు 3 శాతానికిపైగా లాభాలతో హీరోగా నిలిచింది. అంచనాలకు మించి 2020 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో 14.5 శాతం నికర లాభం పెరిగి 880 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది 769 కోట్ల రూపాయలు. గత ఆర్థిక సంవత్సరం (2018-19) క్యూ3లో 17శాతం పుంజుకుని రూ.773 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ క్యూ3లో రూ.905 కోట్లకు పెరిగిందని ఫలితాల సందర్భంగా కంపెనీ వెల్లడించింది. అయితే మొత్తం అమ్మకాలు 17,98,905 యూనిట్ల నుంచి 14.34 శాతం తగ్గి 15,40,876 యూనిట్లకు చేరుకుంది. కార్యకలాపాల ఆదాయం 11 శాతం తగ్గి రూ .6,997 కోట్లకు చేరిందని హీరో మోటొకార్ప్ సీఎఫ్ఓ నిరంజన్ గుప్తా వెల్లడించారు. ఈ త్రైమాసికంలో ఇబిట్టా 6 శాతం తగ్గి రూ.1,105 కోట్ల నుంచి రూ.1,039 కోట్లకు చేరింది, ఇబిట్టా మార్జిన్లు 80 బీపీఎస్ పాయింట్లు పెరిగి 14.8 శాతానికి పెరిగింది. అలాగే రూ. 2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.65 డివిడెండ్(3,250 శాతం) ఇవ్వనున్నామని తెలిపారు. -
హీరో వాహనాలు మరింత ప్రియం
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ తమ వాహనాల రేట్లను రూ. 900 దాకా పెంచనున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 3 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. పెరుగుతున్న ముడివస్తువుల రేట్లు, రూపాయి మారకం పతనం ప్రభావాలను ఎదుర్కొనేందుకు రేట్లను పెంచాల్సి వస్తోందని సంస్థ తెలిపింది. మోడల్, మార్కెట్‌ను బట్టి రేట్ల పెంపు రూ. 900 దాకా ఉంటుందని వివరించింది. కంపెనీ గత నెలలో కూడా రూ. 500 దాకా రేట్లను పెంచింది. హీరో మోటోకార్ప్ ప్రస్తుతం రూ. 40,000 నుంచి రూ. 1 లక్ష దాకా ఖరీదు చేసే స్కూటర్స్, బైక్‌లను విక్రయిస్తోంది. బుధవారం హీరో మోటోకార్ప్ షేరు ధర స్వల్పంగా క్షీణించి రూ. 3,104.50 వద్ద ముగిసింది. -
హీరో మోటో వాహన ధరల పెంపు
సాక్షి, ముంబై : ప్రపంచ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ లిమిటెడ్ ఫెస్టివ్ సీజన్లో వినియోగదారులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. సంస్థకు చెందిన అన్ని మోటార్ సైకిల్స్, స్కూటర్ల ధరలను పెంచుతున్నట్టు బుధవారం ప్రకటించింది. దేశీయ కరెన్సీ విలువ క్షీణత, కమోడిటీ వస్తువల ధర పెరుగుదల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఈ పెంపు అక్టోబర్ 3వ తేదీని అమల్లోకి రానున్నట్టు తెలిపింది. 900 రూపాయల దాకా ఈ పెంపు ఉంటుందని, ఆయా మార్కెట్లు, మోడళ్ళ ఆధారంగా సవరించిన ధరలు అమల్లో ఉంటాయని తెలిపింది. -
‘హీరో’కు నాలా పన్ను మినహాయింపు
ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ ప్రైవేటు లిమిటెడ్‌పై ప్రభుత్వం రాయితీల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఆ పరిశ్రమకు కేటాయించిన భూమికి నాలా పన్ను నుంచి మినహాయంపును ఇస్తూ గురువారం రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి జేసీ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం మాదన్నపాలెంలో ద్విచక్ర వాహనాల పరిశ్రమ ఏర్పాటుకు హీరో మోటో కార్ప్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థకు 632.96 ఎకరాల భూమిని కేటాయించిన విషయం విదితమే. అక్కడ పరిశ్రమను ఏర్పాటుచేయాలంటే.. ఆ భూమిని వ్యవసాయ విభాగం నుంచి వ్యవసాయేతర విభాగం కిందకు మార్పిడి చేయాలి. ఇందుకు నాలా రూపంలో ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి. ఆ పన్ను నుంచి ‘హీరో’ సంస్థకు ప్రభుత్వం మినహాయింపును ఇచ్చింది. -
8,400 దాటేసిన నిఫ్టీ
క్యూ3లో జపాన్ ఆర్థిక వ్యవస్థ ఊహించని రీతిలో మాంద్యంలోకి జారుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంట్ బలహీనపడింది. దీంతో జపాన్ మొదలు ఆసియా, యూరప్ మార్కెట్లు నష్టాలతో వెనుకంజ వేశాయి. దేశీయంగానూ ఈ ప్రభావం పడటంతో మార్కెట్లు తొలుత నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 100 పాయింట్లకుపైగా క్షీణించి 27,921 వద్ద కనిష్టాన్ని తాకింది. అయితే అక్టోబర్ నెలలో దిగుమతుల భారం బాగా తగ్గి వాణిజ్యలోటు మరింత కట్టడికావడంతో మిడ్ సెషన్ నుంచీ సెంటిమెంట్ మెరుగైంది. ప్రధానంగా చమురు దిగుమతుల బిల్లు క్షీణించడం ఇన్వెస్టర్లకు జోష్‌నిచ్చిందని విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి నష్టాల నుంచి కోలుకున్న సెన్సెక్స్ 28,206 పాయింట్ల గరిష్టానికి చేరింది. చివరికి 131 పాయింట్ల లాభంతో 28,178 వద్ద స్థిరపడింది. ఇవి సరికొత్త రికార్డులుకాగా, ఎన్ఎస్ఈ ప్రధాన సూచీ నిఫ్టీ కూడా 41 పాయింట్లు పుంజుకుని 8,431 వద్ద ముగిసింది. అంతకుముందు ఇంట్రాడేలో 8,438ను చేరింది. మార్కెట్ చరిత్రలోనే ఇవి సరికొత్త గరిష్టాలుకావడం గమనార్హం. ఎస్బీఐ జోరు క్యూ2లో ప్రోత్సాహక ఫలితాల కారణంగా ఎస్బీఐ 5.5% జంప్‌చేసింది. రూ. 2,940 వద్ద ముగిసింది. ఇది ఏడాది గరిష్టంకాగా, 4% ఎగసిన టాటా మోటార్స్ రూ. 545 వద్ద కొత్త గరిష్టాన్ని తాకింది. ఈ బాటలో హీరోమోటో, ఎన్టీపీసీ, రిలయన్స్ సైతం 2-1.5% మధ్య పురోగమించాయి. అయితే మరోవైపు ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు 1%పైగా నష్టపోయాయి. ఎఫ్ఐఐలు రూ. 656 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. చిన్న షేర్లు ఓకే మార్కెట్‌ను మించుతూ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 1% స్థాయిలో బలపడ్డాయి. బీఎస్ఈ-500లో గతి, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, బజాజ్ ఫైనాన్స్, కల్పతరు పవర్, అనంత్‌రాజ్, ఎన్సీసీ, ఎల్జీ ఎక్విప్మెంట్స్, స్టెరిలైట్ టెక్, వీగా ర్డ్, పీఎఫ్సీ 18-8% మధ్య దూసుకెళ్లాయి.