ప్రముఖ టూవీలర్ ఆటోమొబైల్ సంస్థ హీరో మోటోకార్ప్ కంపెనీ పోర్ట్‌ఫోలియోలోని పలు బైక్స్ ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఎంపిక చేసిన మోటార్‌సైకిళ్లపై ధరల పెంపు ఉండనుంది. హీరో స్ప్లెండర్ ప్లస్ , హెచ్‌ఎఫ్ డీలక్స్ , గ్లామర్ , సూపర్ స్ప్లెండర్ , ఎక్స్‌పల్స్ 200 , ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ , ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ , హెచ్‌ఎఫ్ 100 బైక్స్ ధరలు భారీగా పెరిగాయి. హీరో ఎక్స్ పల్స్ 200టీ, హీరో స్ప్లెండర్ iSmart, హీరో X పల్స్ 200 స్టాండర్డ్ వేరియంట్, హీరో ప్యాషన్ ప్రో బైక్ ధరల్లో ఎలాంటి పెరుగుదల లేదు.
వివిధ బైక్స్‌పై పెరిగిన ధరల జాబితా ఇదే..
► హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ సింగిల్ డిస్క్ వేరియంట్ ధర రూ. 500 మేర(రూ. 1,12,110), స్టెల్త్ ఎడిషన్ వేరియంట్ ధర రూ. 1000(రూ. 1,17,660) వరకు పెరిగింది.
► హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ స్టాండర్డ్ ఎడిషన్ బైక్‌పై రూ. 2000 పెరగగా...ఈ బైక్ ఇప్పుడు రూ. 1,30,614కు రానుంది.
► హీరో HF 100 స్టాండర్డ్ ఎడిషన్‌పై రూ. 420 మేర పెరిగింది.
► ఆయా వేరియంట్లను బట్టి హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ ధర రూ. 790 నుంచి రూ. 1,910 మేర పెరిగాయి.
► హీరో HF డీలక్స్ బైక్ ఆయా వేరియంట్లపై రూ. 750 నుంచి రూ. 1,420 మేర పెరిగాయి.
► హీరో గ్లామర్ బైక్ ధరలు రూ. 600 నుంచి రూ. 1, 800 వరకు పెరిగాయి.
► హీరో సూపర్ స్ప్లెండర్ డ్రమ్ వేరియంట్ బైక్‌పై రూ. 1,500 మేర, డిస్క్ వేరియంట్‌పై రూ. 2000 మేర పెరిగాయి.
► హీరో X పల్స్ 200 4వీ వేరియంట్ ధర రూ. 2, 200 వరకు పెరిగింది.
చదవండి: చిన్న ఎలక్ట్రిక్ వాహనాన్ని లాంచ్ చేయనున్న ఎంజీ మోటార్స్..! ధర ఎంతంటే..?
Comments
Please login to add a commentAdd a comment