న్యూఢిల్లీలో సరికొత్త రికార్డులు
రూ.71,840కి బంగారం అప్
వెండి కూడా కొండపైకి...
కేజీ రూ.84,500
న్యూఢిల్లీ: పసిడి పరుగు వరుసగా రెండవ రోజూ కొనసాగింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో సోమవారం రూ.350 పెరిగి, రూ.71,700కు చేరిన 10 గ్రాముల ధర, మంగళవారం మరో రూ.140 జతచేసుకుని రూ.71,840 రికార్డు హైకి చేరింది. ఇక వెండి ధర కూడా సరికొత్త రికార్డులు చూసింది. కేజీ ధర ఒకేరోజు రూ.500 పెరిగి రూ.84,500కు చేరింది. సోమవారం వెండి ధర మొదటిసారి రూ.84,000కు చేరిన సంగతి తెలిసిందే.
కారణాలు ఇవీ..
అమెరికా ఫెడ్ వడ్డీరేట్లు తగ్గించవచ్చన్న అంచనాలు, ఈజీ మనీ, ద్రవ్యోల్బణం భయాలు, సెంట్రల్ బ్యాంక్‌ల కొనుగోళ్లు, భౌగోళిక ఉద్రిక్తతలు పసిడి, వెండి పరుగునకు కారణమవుతున్నాయి. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు ఈ మెటల్స్ సురక్షితమైనవిగా పరిగణిస్తున్నారు. దేశీయంగా రూపాయి బలహీన ధోరణి కూడా బులిష్ ధోరణికి దోహదపడుతోంది.
ఫ్యూచర్స్ మార్కెట్‌లో మెరుపులు...
అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో పసిడి ఔన్స్ (31.1గ్రాములు) ధర మంగళవారం జూన్ కాంట్రాక్ట్ సరికొత్త రికార్డు 2,384 డాలర్లకు ఎగసింది. ఈ వార్త రాసే రాత్రి 9 గంటల సమయంలో క్రితం ముగింపుతో పోలి్చతే 16 డాలర్ల పెరుగుదలతో 2,368 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక దేశీయ ఫ్యూచర్స్ ఎంసీఎస్‌లో పసిడి జూన్ కాంట్రాక్ట్ ధర క్రితం ముగింపుతో పోల్చితే రూ.523 పెరిగి రూ.71,435 రికార్డు స్థాయిల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో రూ.71,739ని సైతం తాకింది. వెండి విషయానికివ వస్తే, క్రియాశీలక మే కాంట్రాక్ట్ ధర క్రితం ముగింపుతో పోలి్చతే రూ.366 ఎగసి రూ. 82,241 సరికొత్త రికార్డుల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో రూ.83,000 దాటింది.
Comments
Please login to add a commentAdd a comment